News


28000 పాయింట్లపైకి బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 12th September 2019
Markets_main1568263716.png-28329

ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీ అండగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 28000 పాయింట్ల పైకి ఎగిసింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 27,870.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలోనే ప్రైవేట్‌రంగ షేర్లకు డిమాండ్‌ ఏర్పడటంతో ఇండెక్స్‌ 1శాతం(286 పాయింట్లు) పెరిగి 28,062.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం:10:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(27,776.20)తో పోలిస్తే 0.93శాతం లాభంతో 28,033.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌ 3శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.50శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫెడరల్‌ బ్యాంక్‌ 1.50శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్, పీఎస్‌బీ బ్యాంక్‌ షేర్లు 0.10శాతం నుంచి 0.50శాతం పెరిగాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో ఆర్‌బీఎల్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌ 1శాతం, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ అరశాతం నష్టపోయింది. 



You may be interested

పెరిగిన చమురు

Thursday 12th September 2019

యుఎస్‌-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌ సరళతరం అవ్వడంతోపాటు, యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే తగ్గడంతో గురువారం ట్రేడింగ్‌లో చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.7 శాతం పెరిగి బారెల్‌ 61.22 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌ 0.7 శాతం పెరిగి బారెల్‌ 56.16 డాలర్లకు చేరుకుంది.    యుఎస్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని యాంటీ క్యాన్సర్‌ డ్రగ్స్‌పై తాజాగా విధించిన సుంకాలను చైనా మినహాయించింది. అదే విధంగా చైనా

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 12th September 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్:- ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా 3.5శాతం వాటాను విక్రయించడానికి బోర్డు అనుమతినిచ్చింది. ఆల్కేమ్‌ ల్యా‍బ్స్:- ఇటీవల సెయింట్‌లూయిస్‌లోని ప్లాంట్‌ను తనిఖీ చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ లోపాలు గుర్తించి ఫారమ్ ‌483ను జారీ చేసింది. సీజీ పవర్‌:- కంపెనీ దర్యాప్తులో భాగంగా ఛైర్మన్‌ తొలగించడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరించడం‍తో వర్కింగ్‌ క్యాపిటల్‌ సమీకరించడంలో విఫలమైంది. అదానీ పవర్‌:- తన తిరోడా ప్లాంట్ కోసం

Most from this category