News


బంధన్‌ బ్యాంక్‌ లాభం రూ.731 కోట్లు

Wednesday 15th January 2020
news_main1579060232.png-30939

  • గత క్యూ3లో రూ.331 కోట్ల నికర లాభం 
  • ఈ క్యూ3లో ఆదాయం రూ.3,075 కోట్లు 

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో భారీగా పెరిగింది. గత క్యూ3లో రూ.331 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.731 కోట్లకు పెరిగిందని బంధన్‌ బ్యాంక్‌ వెల్లడించింది. మొత్తం ఆదాయం రూ.1,884 కోట్ల నుంచి రూ.3,075 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  బంధన్‌ బ్యాంక్‌లో గృహ్‌ ఫైనాన్స్ విలీనం గత ఏడాది అక్టోబర్‌ 17 నుంచి అమల్లోకి వచ్చినందున గత క్యూ3, ఈ క్యూ3 ఫలితాలను పోల్చడానికి లేదని బంధన్‌ బ్యాంక్‌ వివరించింది. ఆర్థిక ఫలితాలకు సంబంధించి ఇతర వివరాలు.....


గత క్యూ3లో 2.41 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 1.93 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు మాత్రం 0.70 శాతం నుంచి 0.81 శాతానికి పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం గత క్యూ3లో రూ.1,124 కోట్లుగా ఉండగా, ఈ క్యూ3లో రూ.1,541 కోట్లకు ఎగసింది. సూక్ష్మ రుణాల పోర్ట్‌ఫోలియోకు సంబంధించి అదనంగా రూ.200 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. 



You may be interested

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాభం రూ.1,300 కోట్లు

Wednesday 15th January 2020

32 శాతం వృద్ధి  రూ.9,074 కోట్లకు మొత్తం ఆదాయం  క్షీణించిన రుణ నాణ్యత  (అప్‌డేటెడ్‌...) న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.1,300 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.985 కోట్లు)తో పోల్చితే 32 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.7,232 కోట్ల నుంచి రూ.9,074 కోట్లకు పెరిగిందని వివరించింది. కేటాయింపులు అధికంగా ఉన్నా,

ఆర్‌కామ్‌ ఆస్తులు జియో, యూవీఏఆర్‌సీకే..!

Wednesday 15th January 2020

టాప్‌ బిడ్డర్లుగా నిలిచిన సంస్థలు న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ఆస్తులకు నిర్వహించిన వేలంలో టాప్‌ బిడ్డర్లుగా రిలయన్స్‌ జియో, యూవీఏఆర్‌సీ నిలిచాయి. ఆర్‌కామ్‌కు సంబంధించి స్పెక్ట్రమ్‌, రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులు, డేటా కేంద్రాలకు రూ.16,000 కోట్లను కోట్‌ చేసి అత్యధిక బిడ్డర్‌గా యూవీఏఆర్‌సీ నిలిచినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఆర్‌కామ్‌కు చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ మొబైల్‌ టవర్‌, ఫైబర్‌ ఆస్తులకు

Most from this category