News


అశోక్‌ లేలాండ్‌ లాభం 93 శాతం డౌన్‌

Saturday 9th November 2019
news_main1573271112.png-29469

గత క్యూ2లో రూ.528 కోట్ల నికర లాభం 
ఈ క్యూ2లో రూ.39 కోట్లే 

న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్‌ లేలాండ్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 93 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.528 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.39 కోట్లకు తగ్గిందని అశోక్‌ లేలాండ్‌ తెలిపింది. ఆదాయం రూ.7,621 కోట్ల నుంచి 48 శాతం తగ్గి రూ.3,939 కోట్లకు చేరిందని కంపెనీ చైర్మన్‌ ధీరజ్‌ జి. హిందుజా తెలిపారు. 

నిర్వహణ లాభ మార్జిన్‌ 5.8 శాతం...
వాహన పరిశ్రమ అమ్మకాలు ఈ క్యూ2లో 53 శాతం మేర తగ్గాయని ధీరజ్‌ హిందుజా పేర్కొన్నారు. ఈ క్యూ2లో తమ కంపెనీ అమ్మకాలు గణనీయంగానే తగ్గినప్పటికీ, 5.8 శాతం నిర్వహణ లాభ మార్జిన్‌ సాధించామని తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో తీసుకున్న వ్యయ నియంత్రణ పద్ధతులు మంచి ఫలితాలనిచ్చాయని, ఆ ప్రభావం ఈ క్యూ2 ఫలితాల్లో కనిపించిందని పేర్కొన్నారు. 

నిర్వహణ లాభం 72 శాతం డౌన్‌...
ఈ కంపెనీ మధ్య, భారీ తరహా వాణిజ్య వాహన విక్రయాలు 56 శాతం, తేలిక రకం వాణిజ్య వాహన అమ్మకాలు 11 శాతం చొప్పున తగ్గాయి. ఇక నిర్వహణ లాభం 72 శాతం తగ్గి రూ.229 కోట్లకు చేరగా, నిర్వహణ లాభ మార్జిన్‌ 5.1 శాతం తగ్గి 5.8 శాతానికి చేరింది. 



You may be interested

మూడిస్‌ ‘రేటింగ్‌’ షాక్‌

Saturday 9th November 2019

భారత క్రెడిట్‌ రేటింగ్‌ ‘నెగెటివ్‌’కు తగ్గింపు ఇప్పటి వరకు స్థిర రేటింగ్‌ సమీప కాలంలో వృద్ధి కోలుకోకపోవచ్చని అంచనాలు భారత్‌ మూలాలు పటిష్టమన్న కేంద్రం న్యూఢిల్లీ: భారత క్రెడిట్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ (దృక్పథాన్ని)ను ప్రతికూలానికి (నెగెటివ్‌) మారుస్తూ అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడిస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ షాకిచ్చింది. ఇప్పటి వరకు ఇది స్థిరం (స్టెబుల్‌)గా ఉంది. ఆర్థిక రంగ బలహీనతలను సరిదిద్దే విషయంలో భారత ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేకపోయినట్టు మూడిస్‌ పేర్కొంది. దీంతో సమస్యలు పెరిగాయని,

మహీంద్రాకు మందగమనం సెగ

Saturday 9th November 2019

78 శాతం తగ్గిన నికర లాభం  21 శాతం పడిపోయిన అమ్మకాలు  స్వల్పంగా మెరుగుపడిన మార్జిన్లు  ముంబై: మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసిక కాలంలో 78 శాతం తగ్గి రూ.368 కోట్లకు చేరింది. అమ్మకాలు బాగా పడిపోవడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. ఆదాయం 6 శాతం తగ్గి రూ.23,936 కోట్లకు తగ్గిందని పేర్కొంది. మార్కెట్‌ అంచనాలకు

Most from this category