News


అమెజాన్‌ సేవలకు అంతరాయం

Wednesday 25th March 2020
news_main1585114424.png-32666

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న కారణంగా తక్కువ ప్రాధాన్యత కలిగిన ఉత్పత్తుల పంపిణీని ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా నిలిపివేసింది. గృహ అవసరాలకు అవసరమైన అధిక ప్రాధాన్యత కలిగిన ఉత్పత్తులను మాత్రమే డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు హ్యాండ్‌ శానిటైజర్లు, పరిశుభ్రతకు అవసరమైన వస్తువులతో పాటు పలు ప్యాకేజీ ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకుల సరఫరా చేస్తోంది. ఇందుకు అనుగుణంగా సప్లై చైన్‌ నిర్వహణలో మార్పులు చేసినట్లు పేర్కొంది. తక్కువ ప్రాధాన్యత ‍క్యాటగిరీకి చెందిన ప్రొడెక్టులను తమ ఫ్లాట్‌ఫాం నుంచి డిజేబుల్‌ చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికే ఈ తరహా వస్తువులను ఆర్డర్‌ చేసుకున్న వారు రద్దు చేసుకుంటే తమ డబ్బును వెనక్కి ఇస్తున్నట్లు వివరించింది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఇదే తరహా నిర్ణయాన్ని ప్రకటించింది. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉన్న కారణంగా అత్యవసర వస్తువులను సైతం అందించలేకపోతున్నట్లు వెల్లడించింది. You may be interested

ఉద్యోగులను తొలగించొద్దు.. వేతనాల్లో కోత పెట్టొద్దు

Wednesday 25th March 2020

పరిశ్రమలకు నిపుణుల సూచన న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర స్థాయిలో ఆర్థిక మందగమనం ముప్పు నేపథ్యంలో కంపెనీలు మానవీయ కోణంలో నడవాలని, ఉద్యోగులను తొలగించడం లేదా వేతనాలను కోత విధించడం చేయరాదని నిపుణులు సూచించారు. ఇప్పటికే లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నో రంగాల్లో,  ముఖ్యంగా తయారీ పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడడం వల్ల, వాటిల్లో పనిచేస్తున్న రోజువారీ వేతన కార్మికులకు ఉపాధి కోల్పోయిన పరిస్థితులు నెలకొన్నాయి. తమ ఉద్యోగుల భద్రతకు

మరిన్ని కంపెనీల ప్లాంట్ల మూసివేత

Wednesday 25th March 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతోన్న నేపథ్యంలో పలు టైర్ల కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ఈ నెలాఖరు వరకు ఉత్పత్తిని నిలిపివేసినట్లు అపోలో టైర్స్‌ మంగళవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. కేరళ, గుజరాత్, చెన్నై రాష్ట్రాల్లోని ప్లాంట్లలో మార్చి 31 వరకు కార్యకలాపాలను నిలుపుచేసినట్లు ప్రకటించింది. మరో టైర్ల ఉత్పత్తి సంస్థ సియట్‌ తమ ఉత్పత్తి కేంద్రాలను తాత్కాలికంగా

Most from this category