News


సుప్రీం కొరడా...అయినా ఎయిర్‌టెల్‌ కొత్త హై! ఎందుకు?

Friday 14th February 2020
Markets_main1581663527.png-31791

ఏజీఆర్‌ కేసు నేపథ్యంలో షేరు హైజంప్‌  
కుప్పకూలిన వొడాఫోన్‌ ఐడియా షేరు
ఎయిర్‌టెల్‌ షేరు 3 నెలల్లో 45 శాతం ర్యాలీ 

ఇటీవల జోరు చూపుతున్న మొబైల్‌ రంగ దేశీ దిగ్గజం భారత్‌ ఎయిర్‌టెల్‌ షేరు మరోసారి దూకుడు చూపుతోంది. ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో ఉదయం 11.30 ప్రాంతంలో 5 శాతం జంప్‌చేయడం ద్వారా రూ. 564ను అధిగమించింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా..  ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 4 శాతం పెరిగి రూ. 560 వద్ద ట్రేడవుతోంది. ఏజీఆర్‌ బకాయిల విషయంలో టెలికం కంపెనీలకు తాజాగా షాక్‌ తగిలింది. బకాయిలను చెల్లించమని ఆదేశాలు జారీచేసినప్పటికీ పెడచెవిన పెట్టడంతో కోర్టు ధిక్కరణకింద భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో వచ్చే నెల 16న చేపట్టనున్న తదుపరి విచారణకు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కంపెనీల ఎండీలతోపాటు డైరెక్టర్లను హాజరుకావలసిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ అంశంలో సంబంధిత టెలికం శాఖ(డాట్‌) అధికారిని సైతం కోర్టు తప్పుపట్టినట్లు తెలుస్తోంది. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపునకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను జారీ చేయవలసిందిగా అభ్యర్థిస్తూ టెలికం కంపెనీలు వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా తాజా ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. పూర్తి వివరాలు వెల్లడికావలసి ఉంది. కాగా.. సుప్రీం కోర్టు ఆదేశాల కారణంగా ప్రత్యర్థి కంపెనీ వొడాఫోన్‌ ఐడియా కౌంటర్లో అమ్మకాలు వెల్తువెత్తగా ఎయిర్‌టెల్‌ బలపడటం గమనార్హం! ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియా షేరు 12 శాతం దిగజారి రూ. 3.95 వద్ద ట్రేడవుతోంది.

ఎందుకంటే?
ఓవైపు ప్రత్యర్థి కంపెనీ వొడాఫోన్‌ ఐడియా షేరు సరికొత్త కనిష్టాలకు తగ్గుతున్నప్పటికీ ఎయిర్‌టెల్‌ కౌంటర్లో ర్యాలీ నమోదవుతూ వస్తోంది.  పేరుకుపోయిన ఏజీఆర్‌ బకాయిలు, పెరుగుతున్న నష్టాలు వంటి అంశాలతో వొడాఫోన్‌ ఐడియా డీలాపడగా.. దక్షిణాఫ్రికా కార్యకలాపాలు బలపడటం, ఏజీఆర్‌ బకాయిల చెల్లింపునకు వీలుగా ఇప్పటికే 3 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించడం వంటి అంశాలు ఎయిర్‌టెల్‌ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నష్టాలను బాగా తగ్గించుకోవడం కూడా ఈ కౌంటర్‌లో సానుకూల సెంటిమెంటుకు దోహదం చేసినట్లు తెలియజేశారు. వెరసి ఎయిర్‌టెల్‌ షేరు గత మూడు నెలల్లో 45 శాతంపైగా లాభపడింది. 2019 నవంబర్‌ 7న రూ. 372 వద్ద కదిలిన ఎయిర్‌టెల్‌ షేరు తాజాగా రూ. 564కు చేరింది. తద్వారా సరికొత్త గరిష్టాన్ని తాకింది. 

వొడాఫోన్‌ ఎఫెక్ట్‌
వడ్డీలు, పెనాల్టీలుసహా ఏజీఆర్‌ బకాయిల భారం రూ. 53,000 కోట్లకు చేరడంతో వొడాఫోన్‌ ఐడియా ప్రభుత్వాన్ని కలుగజేసుకోమంటూ అభ్యర్ధించింది. పెనాల్టీలు, వడ్డీలను మినహాయించడంతోపాటు.. అసలు(ప్రిన్సిపల్‌)ను చెల్లించేందుకు 10ఏళ్ల గడువు ఇవ్వవలసిందిగా కోరింది. లేదంటే కార్యకలాపాల నిలిపివేత పరిస్థితులు తలెత్తవచ్చంటూ వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో తాజాగా వెలువడిన సుప్రీం కోర్టు ఆదేశాలు వొడాఫోన్‌ ఐడియా ఆశలపై నీళ్లు చల్లాయని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఒకవేళ వొడాఫోన్‌ ఐడియా కార్యకలాపాలు మందగిస్తే.. ప్రత్యర్ధి సంస్థలు రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ లబ్ది పొందే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఇవి పరోక్షంగా ఎయిర్‌టెల్‌కు షేరుకి హుషారునిస్తున్నట్లు తెలియజేశాయి.You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 473 పాయింట్లు పతనం

Friday 14th February 2020

ఏజీఆర్ చెల్లింపుల విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో టెలికాం కంపెనీలకు ఎక్స్‌పోజర్స్‌గా ఉన్న బ్యాంకింగ్‌ రంగ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో తీవ్రనష్టాన్ని చవిచూశాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు ఉదయం 31,281.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  ఏజీఆర్‌ బకాయిల చెల్లింపునకు సంబంధించి న్యూ షెడ్యూల్‌ను జారీ చేయవలసిందిగా అభ్యర్థిస్తూ టెలికం కంపెనీలు వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.

ఇంట్రాడే గరిష్టం నుంచి సెన్సెక్స్‌ 519 పాయింట్లు క్రాష్‌

Friday 14th February 2020

ఏజీఆర్‌ చెల్లింపుల అంశంపై మరోసారి సుప్రీం తలుపు తట్టడం కోర్టు తీవ్ర అగ్రహం మార్కెట్‌లో అనూహ్య అమ్మకాలు  బ్యాంక్‌ షేర్ల భారీ పతనం  ఏజీఆర్‌ చెల్లింపుల విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన టెలికాం కంపెనీలకు చుక్కెదురు కావడంతో మార్కెట్లో అనూహ్య అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(41702) నుంచి 519 పాయింట్లను, నిఫ్టీ  ఇంట్రాడే హై(12,246.70) నుంచి 148 పాయింట్లను కోల్పోయాయి. ఒక్క ఐటీ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు

Most from this category