News


నష్టాల్లో ముగిసిన ఏడీఆర్‌లు

Saturday 9th November 2019
Markets_main1573293108.png-29477

అమెరికాలో మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌కు చెందిన అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌)లు శుక్రవారం రాత్రి నష్టాలతో ముగిశాయి.  అత్యధికంగా ఇన్ఫోసిన్‌ ఏడీఆర్‌ 3.50 నష్టపోయి 9.68డాలరు వద్ద స్థిరపడింది. ఇదే షేరు శుక్రవారం ఇక్కడ 1.64 శాతం నష్టంతో రూ.708.30 వద్ద ముగిసింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ 1.14శాతం పతనమై 39.90డాలర్ల వద్ద, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.46శాతం నష్టపోయి 61.81వద్ద ముగిశాయి. టాటా మోటర్స్‌ ఏడీఆర్‌ 2.15శాతం క్షీణించి 11.86 వద్ద స్థిరపడింది. వేదాంత ఏడీఆర్‌ 3.5 శాతంపైగా క్షీణించి 8.76 డాలర్ల వద్ద ముగిసింది. మరోవైపు ఒక్క ఐసీఐసీఐ ఏడీఆర్‌ మాత్రం 2.26శాతం లాభంతో 13.58 డాలర్ల వద్ద స్థిరపడింది. 

రికార్డుస్థాయిలో ముగిసిన అమెరికా సూచీలు:- 
అమెరికా స్టాక్‌ సూచీలు శుక్రవారం సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి పాక్షిక ఒప్పందం కుదిరే అంచనాలతో గురువారం రికార్డు ర్యాలీ శుక్రవారం కొనసాగించాయి. దశలవారీగా టారిఫ్‌ల ఉపసంహరణకు చైనా ప్రభుత్వం సైతం అంగీకరించిన సంగతి తెలిసిందే. ఫలితంగా డోజోన్స్‌ 6 పాయింట్ల(0.02 శాతం) నామమాత్ర లాభంతో 27,681 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 8 పాయింట్లు(0.3 శాతం) బలపడి 3,093 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ సైతం 40 పాయింట్లు(0.5 శాతం) ఎగసి 8,475 వద్ద నిలిచింది. వార్షిక ప్రాతిపదికన కార్పోరేట్‌ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గచూపారని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 



You may be interested

అయోధ్య తీర్పు మార్కెట్లకు సానుకూలం: విశ్లేషకులు

Saturday 9th November 2019

అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు శనీవారం తీర్పిచ్చింది. వివాదంలో ఉన్న మొత్తం 2.77 ఎకరాల భూమిని రామమందిరం నిర్మణానికే కేటాయించాలని, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని తేల్చింది. కాగా సుమారుగా వందేళ్ల నుంచి నలుగుతున్న వివాదం కొలిక్కి రావడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్లకు మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పుతో దేశంలోని ప్రధాన రాజకీయ, విధాన పరమైన అనిశ్చితి ముగిసిందని అన్నారు. దీంతో ఇండియాపై విదేశీ ఇన్వెస్టర్ల

ఆందోళనలు తగ్గడంతోనే మార్కెట్‌ ర్యాలీ

Saturday 9th November 2019

-బీఎన్‌పీ పారిబా ఎండీ మనిషి రాయ్‌చౌదరి ‘అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాలపై ఆందోళనలు తగ్గుతున్నాయి. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేయడం చూస్తున్నాం. ఇది ఇంకో రెండుమూడు నెలల వరకూ కొనసాగవచ్చు’ అని బీఎన్‌పీ పారిబా ఎండీ, ఈక్విటీ రిసెర్చ్‌ హెడ్‌ మనిషి రాయ్‌చౌదరి ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. ఆర్థిక వ్యవస్థ మెరుగుదల లేకుండానే షేర్లు పెరుగుతున్నాయ్‌... అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు గత నెల రోజులలో మంచి ర్యాలీ చేశాయి.

Most from this category