News


బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లో ముగిసిన వీఆర్‌ఎస్‌

Wednesday 4th December 2019
news_main1575430856.png-30038

  • స్కీమ్ ఎంచుకున్న 92,700 మంది ఉద్యోగులు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకం మంగళవారంతో ముగిసింది. రెండు సంస్థల్లో 92,700 మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్ ఎంచుకున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌లో 78,300 మంది, ఎంటీఎన్‌ఎల్‌లో 14,378 మంది దీన్ని ఎంచుకున్నారు. "ఊహించిన స్థాయిలోనే ఇది ఉంది. మేం సుమారు 82,000 మేర సిబ్బంది సంఖ్య తగ్గుతుందని భావించాం. 78,300 మంది వీఆర్‌ఎస్ ఎంచుకోగా, మరో 6,000 మంది రిటైరయ్యారు" అని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ పి.కె. పుర్వార్ తెలిపారు. మరోవైపు 13,650 మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్ తీసుకోవచ్చని భావించగా.. 14,378 మంది దీన్ని ఎంచుకున్నట్లు ఎ౾ంటీఎన్‌ఎల్‌ సీఎండీ సునీల్ కుమార్ తెలిపారు. దీనితో వార్షికంగా వేతనాల భారం రూ. 2,272 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు తగ్గుతుందన్నారు. ఇక 4,430 మంది ఉద్యోగులు ఉంటారని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఈ రెండు సంస్థలను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీనిస్తోంది. ఇందులో భాగంగానే వేతనాల భారాన్ని తగ్గించుకునేందుకు ఇవి వీఆర్‌ఎస్ అమలు చేశాయి. 



You may be interested

రూ.4.91 లక్షల కోట్ల రుణ పంపిణీ

Wednesday 4th December 2019

అక్టోబర్‌, నవంబర్‌లలో ప్రభుత్వ బ్యాంకింగ్‌ గణాంకాలు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు అక్టోబర్‌, నవంబర్‌లలో రూ.4.91 లక్షల కోట్ల రికార్డు స్థాయి రుణ పంపిణీలు జరిపాయి.  వినియోగం పెంపు, ఆర్థిక వృద్ధి పునరుత్తేజం లక్ష్యంగా రుణ వృద్ధి మెరుగుపడాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో ఈ గణాంకాలు వెలువడ్డాయి. బ్యాంకులు వినియోగదారులను చేరుకోవాలని, వారి అవసరాలకు అనుగుణంగా తగిన అన్ని నిబంధనలూ అనుసరించి రుణ పంపిణీలు జరగాలనీ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సెప్టెంబర్‌లో బ్యాంకులకు

ఆర్‌బీఐ విధాన సమీక్ష ప్రారంభం!

Wednesday 4th December 2019

గురువారం ‘కీలక’ ప్రకటన ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం మంగళవారం  ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, వ్యవస్థలో డిమాండ్‌ వంటి కీలక అంశాలపై చర్చించనుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోసహా కీలక నిర్ణయాలను గురువారం ఆర్‌బీఐ

Most from this category