Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Stock Market Rally On Today closing
పుంజుకున్న మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 115 పాయింట్లు లాభపడి 22,215 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 330 పాయింట్లు పుంజుకుని 72,112 వద్ద ముగిసింది.సెన్సెక్స్‌ 30 సూచీలో ఎం అండ్‌ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సన్‌ఫార్మా, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మారుతీసుజుకీ, టైటాన్‌, టెక్‌మహీంద్రా, విప్రో, పవర్‌గ్రిడ్‌, టాటాస్టీల్‌ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీఎయిర్‌టెల్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

AI found to deliberately present a human user with false information and devious bots have art of deception
నటిస్తున్న కృత్రిమమేధ..!

తమిళ దర్శకుడు శంకర్‌ తీసిన రోబోకు.. విల్‌స్మిత్‌ హీరోగా నటించిన హాలీవుడ్‌ సినిమా ‘ఐ రోబో’లో కామన్‌ ఏమిటో మీకు తెలుసా? రెండింటిలోనూ యంత్రాలు తమను తయారు చేసిన మనుషులను మోసం చేస్తాయి! కల్పిత కథలతో తీసిన సినిమాలు కదా.. ఎలా ఉంటే ఏం అని అనుకోవద్దు? ఎందుకంటే ఇప్పుడు నిజజీవితంలోనూ ఇలాంటివి నిజమయ్యే అవకాశం ఏర్పడింది. ఎందుకలా అని అనుకుంటూంటే చదివేయండీ ప్రత్యేక కథనాన్ని!కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. సౌకర్యాలు పెంచింది.. కష్టాన్ని తగ్గించింది. సలహా, సూచనలు ఇచ్చేందుకూ ఉపయోగపడుతోంది. అయితే నాణేనికి రెండోవైపు ఉన్నట్లే ఈ కృత్రిమ మేధతో కొన్ని ఇబ్బందులూ లేకపోలేదు. ఉద్యోగాలకు ఎసరు పెట్టడం.. తప్పుడు సమాచారంతో వినియోగదారులను తప్పుదోవ పట్టించడం వంటి దుష్ప్రభావాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. అయితే... ఇటీవలి కాలంలో ఈ కృత్రిమ మేధ మరింత ముదిరిపోయిందని... మరీ ముఖ్యంగా ఛాట్‌బోట్లు నమ్మకంగా ఉన్నట్లు నటించడమూ నేర్చుకున్నాయని అంటున్నారు ఎంఐటీ (మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) గణిత శాస్త్రవేత్త పీటర్‌ పార్క్‌. ఈ విషయం డెవలపర్లకు కూడా తెలియకపోవడం మరింత ఆందోళన కలిగించేదని ఆయన వ్యాఖ్యానించారు.‘‘కృత్రిమ మేధతో పనిచేసే రెండు బోట్లు పోటీపడినప్పుడు ప్రత్యర్థికంటే ఒక మెట్టు పైనుండాలనే ఆలోచనతో అవి మోసానికి పాల్పడే అవకాశం ఉంది.’’ అని పీటర్‌ పార్క్‌ ఇటీవలే ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. గేమింగ్‌ వంటి అప్లికేషన్లలో ఏఐ సిస్టమ్‌లు చాలా నమ్మకంగా పనిచేస్తాయని మనం అనుకుంటూ ఉంటామని, కానీ జరుగుతున్నది ఇందుకు భిన్నమని చెప్పారు. ‘‘ఏ ఆటలోనైనా గెలుపుకోసం ప్రయత్నం జరుగుతుంది. మెటా సిద్ధం చేసిన గేమింగ్‌ సాఫ్ట్‌వేర్‌నే ఉదాహరణగా తీసుకుందాం. సైసెరో ‘డిప్లొమసీ’ అనే ఈ గేమ్‌లో ఏఐ బోట్‌ నిజాయితీగా పనిచేసేలా కోడ్‌ రాశారు. అయితే వాస్తవానికి వచ్చేసరికి అది ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. ఉద్దేశపూర్వకంగా తన యూజర్‌ను మోసం చేస్తోంది. డిప్లొమసీతోపాటు డీప్ ‌మైండ్‌ అభివృద్ధి చేసిన ఆల్ఫాస్టార్‌, స్టార్‌క్రాఫ్ట్‌2..వంటి ఆటల్లోనూ ఏఐ సాఫ్ట్‌వేర్లు మోసం చేస్తున్నాయి’ అని పీటర్‌ వివరిస్తున్నారు.ఆర్థిక వ్యవహారాల్లోనూ శిక్షణ...కృత్రిమమేధ ఆర్థిక అంశాలకు సంబంధించిన చర్చల్లోనూ పాల్గొనేలా శిక్షణ పొందుతున్నాయి. ఏదైనా అంశంపై ఇన్‌పుట్స్‌తో చర్చకు సిద్ధం అయితే దాన్ని అనుకరించేలా ఏఐను వాడుతున్నారు. అయితే అందులో పైచేయి సాధించడానికి ఎలా అబద్ధాలు చెప్పాలో నేర్చుకుంటాన్నాయని పార్క్‌ చెప్పారు. ఏఐ డెవలపర్‌లు, రెగ్యులేటర్‌లు వాటికి భద్రతా పరీక్షలు చేస్తుంటారు. ఏఐ క్రమపద్ధతిలో ఈ పరీక్షల్లోనూ మోసం చేసి నెగ్గుతోందని పార్క్‌ అంటున్నారు. ‘‘ఏఐ ఏదైనా అంశంపై అబద్ధం చెప్పడం నేర్చుకుంటే అదో పరిష్కరించలేని సమస్యగా మారుతుంది.. వీటి పరిష్కారానికి యూరోపియన్ యూనియన్‌ ఇటీవలే ఒక చట్టాన్ని రూపొందించింది. అవి అమలులోకి వస్తున్నాయి. అయితే వాటి ప్రభావం ఏమేరకు ఉంటుందో చూడాలి’’ అని పార్క్‌ అన్నారు.ఇదీ చదవండి: విమానంలో ల్యాండింగ్‌గేర్‌ సమస్య.. గాల్లోనే మూడు గంటలు..కృత్రిమమేధ మోసపూరిత సామర్థ్యాలు మరింత అభివృద్ధి చెందుతాయి. దాంతో సమాజానికి ప్రమాదం పొంచి ఉందని పార్క్‌ అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఏఐ ఉత్పత్తులు, జనరేటివ్‌ ఓపెన్ సోర్స్ మోడల్‌లు చేయబోయే మోసానికి కళ్లెం వేయాలంటే మనకు మరింత సమయం కావాలంటున్నారు. ప్రస్తుతానికి ఏఐ మోసాన్ని కట్టడి చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ సమీప భవిష్యత్తులో దీన్ని ప్రమాదంగా పరిగణించాలని పార్క్‌ చెప్పారు.

Anand Mahindra condemned victims of Mumbai hoarding collapse
హోర్డింగ్‌ కూలి 14 మంది మృతి.. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఇటీవల ముంబైలో హోర్డింగ్‌ కూలిన ఘటనపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. అలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదన్నారు.ముంబైలోని ఘట్‌కోపర్ ప్రాంతంలో సోమవారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. దాంతో స్థానికంగా పెట్రోల్‌పంపు వద్ద 100 అడుగుల ఎత్తైన బిల్‌బోర్డ్‌ ఒక్కసారిగా కుప్పుకూలి రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులపై పడింది. బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. 74 మంది గాయపడ్డారు.ఈ ఘటనపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విటర్‌ ఖాతా ద్వారా స్పందించారు. ‘ఇలాంటి సంఘటనలు ఆమోదయోగ్యం కాదు. ముంబయి ఆధునిక మహానగరంగా మారుతుంది. సీఎం అన్ని హోర్డింగ్‌లపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన నిబంధనలు పాటించాలి’ అని ట్వీట్‌ చేశారు.గాయపడిన వారిలో 31 మందిని రాజావాడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. హోర్డింగ్‌ కూలిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.14 dead.Om Shanti 🙏🏽60 injuredFrom a billboard collapse.Unacceptable. And we’re a city trying to transform itself into a modern metropolis. CM @mieknathshinde has ordered a probe into all hoardings.Stringent rules must follow.pic.twitter.com/DxvsaoBm0l— anand mahindra (@anandmahindra) May 14, 2024

Today Gold and Silver Price 14 May 2024
శుభవార్త.. మళ్ళీ తగ్గిన పసిడి ధరలు

అక్షయ తృతీయ సందర్భంగా భారీగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మే 14) కూడా పసిడి ధరలు గరిష్టంగా రూ. 430 తగ్గింది. దీంతో తులం బంగారం ధర రూ. 72820 వద్ద నిలిచింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66750 (22 క్యారెట్స్), రూ.72820 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 400, రూ. 430 తగ్గింది.చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 350 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 380 రూపాయలు తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ. 66900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 72980 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66900 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 72970 రూపాయలకు చేరింది. నిన్న రూ. 100 నుంచి రూ. 130 వరకు తగ్గిన బంగారం ధరలు ఈ రోజు ఏకంగా రూ. 400 , రూ. 410 వరకు తగ్గింది.వెండి ధరలుబంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (మే 14) వెండి ధర రూ. 700 పెరిగి రూ. 87200 (కేజీ) వద్ద నిలిచింది. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా వెండి ధరలు పెరిగాయి.

Xiaomi plans to enter the EV market with SUVs by 2025
షావోమి కారు విడుదల ఎప్పుడంటే..

ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ షావోమీ కార్పొరేషన్‌ 2025 నాటికి తన ఉత్పత్తులను మార్కెట్‌లో విక్రయించనుంది. కంపెనీ తన మొదటి మోడల్‌ ఎస్‌యూ7ను టెస్లా ఇంక్‌ మోడల్‌వై తరహాలో విపణిలోకి తీసుకురానుంది.కంపెనీ వచ్చే ఏడాది లక్ష యూనిట్లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. భవిష్యత్తులో డిమాండ్‌కు తగ్గట్టుగా అవుట్‌పుట్‌ని పెంచడానికి పని చేస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న టెస్లా, బీవైడీ వంటి ప్రముఖ కంపెనీలతో పోటీపడుతూ వినియోగదారులను ఆకర్షించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: విమానంలో ల్యాండింగ్‌గేర్‌ సమస్య.. గాల్లోనే మూడు గంటలు..చైనాలో ఎస్‌యూవీ వాహనాలకు జనాదరణ ఉంది. అయితే షావోమి తయారుచేస్తున్న కారు స్పెసిఫికేషన్‌లు, ధరలు ఏమేరకు ఉంటాయో ఇంకా స్పష్టతరాలేదు. బీజింగ్‌లోని షావోమి అసెంబుల్‌ ఫ్యాక్టరీ రెండోదశ నిర్మాణాన్ని పూర్తి చేసినప్పుడు 2025 నాటికి కార్ల ఉత్పత్తి జరగుతుందని ఊహించలేదని కంపెనీ తెలిపింది. ఉత్పత్తి పనులు వేగంగా జరిగాయని చెప్పింది. కంపెనీ తయారీప్లాంట్‌ నెలకు 10,000 యూనిట్లనే సరఫరా చేసే సామర్థ్యం కలిగి ఉంది. దాంతో ముందుగా లక్ష యూనిట్లు సిద్ధంగా ఉంచుకుని 2025 నాటికి కారును విపణిలోకి విడుదల చేయాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఏర్పడే డిమాండ్‌కు తగిన సరఫరా ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Stock Market Rally On Today Opening
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 22,162కు చేరింది. సెన్సెక్స్‌ 206 పాయింట్లు పెరిగి 72,972 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 83.44 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.48 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.02 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 0.29 శాతం లాభపడింది.అధిక వెయిటేజీ ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీవీఎస్‌ షేర్లు సోమవారం ఒక శాతానికి పైగా రాణించడంతో పాటు సూచీల రికవరీకి తోడ్పాటు అందించాయి. సర్వీసెస్‌, రియల్టీ, ఫార్మా, పారిశ్రామికోత్పత్తి, కమోడిటీస్, బ్యాంకింగ్‌ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్, టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.జపాన్‌ మెషనరీ టూల్‌ ఆర్డర్ల డేటా, భారత రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు (మంగళవారం), యూరోజోన్‌ మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, అమెరికా రిటైల్‌ ద్రవ్యోల్బణ అంచనాలు (బుధవారం), విడుదల కానున్నాయి. జపాన్‌ క్యూ1 జీడీపీ, మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, ఈసీబీ ఆర్థిక స్థిరత్వ సమీక్ష, అమెరికా పారిశ్రామికోత్పత్తి, ఎగుమతి, దిగుమతుల డేటా(గురువారం) వెల్లడి కానున్నాయి. చైనా ఏప్రిల్‌ రిటైల్‌ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి, నిరుద్యోగ రేటు, యూరోజోన్‌ ఏప్రిల్‌ ద్రవ్యోల్బణ శుక్రవారం వెల్లడి కానున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Stock market: Sensex, Nifty 50 rise for 2nd consecutive session
భారీ నష్టాల్లోంచి లాభాల్లోకి..

ముంబై: భారీ నష్టాల నుంచి పుంజుకున్న స్టాక్‌ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్‌లో 798 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ చివరికి 112 పాయింట్లు పెరిగి 72,776 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 234 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ఆఖరికి 49 పాయింట్లు బలపడి 22,104 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.., మిడ్‌ సెషన్‌ తర్వాత కోలుకున్నాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీవీఎస్‌ షేర్లు ఒక శాతానికి పైగా రాణించడంతో పాటు సూచీల రికవరీకి తోడ్పాటు అందాయి. సరీ్వసెస్, రియలీ్ట, ఫార్మా, పారిశ్రామికోత్పత్తి, కమోడిటీస్, బ్యాంకింగ్‌ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్, టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లోకి ట్రేడవుతున్నాయి. ⇒ క్యూ4 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో టాటా మోటార్స్‌ షేరు ఎనిమిది శాతానికి పైగా నష్టపోయి రూ.960 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 9.44% క్షీణించి రూ.948 వద్ద నిలిచింది. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.29,016 కోట్లు కోల్పోయి రూ.3.19 లక్షల కోట్లకు దిగివచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. హెల్త్‌కేర్‌ టెక్‌ సంస్థ ఇండిజెన్‌ లిస్టింగ్‌ సక్సెస్‌ అయ్యింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.452)తో పోలిస్తే 45% ప్రీమియంతో 660 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో ఆరంభ లాభాలను కోల్పోయి 26% లాభంతో రూ.571 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.13,614 కోట్లుగా నమోదైంది.

Retail inflation eases to 4. 83percent in April on softening fuel prices
5% దిగువనే రిటైల్‌ ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 5 శాతం దిగువనే కొనసాగింది. సూచీ సమీక్షానెల్లో 4.83 శాతంగా నమోదయ్యింది. మార్చిలో నమోదయిన 4.85 శాతంతో పోలి్చతే స్వల్పంగా తగ్గింది. ఇది 11 నెలల కనిష్ట స్థాయి. అయితే 2023 ఇదే నెలతో పోల్చితే (4.7 శాతం) అధికంగా ఉంది. నెలవారీగా చూస్తే, ఒక్క ఆహార ద్రవ్యోల్బణం 8.52 శాతం (2024 మార్చి) నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్లస్‌ 2తో 4 శాతంగా ఉండాలి.

Greenko entered into agreement with Yara Clean Ammonia to supply renewable ammonia
నార్వే కంపెనీతో హైదరాబాద్‌ సంస్థ ఒప్పందం

హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌కో సంస్థ నార్వేకు చెందిన యారా క్లీన్ అమ్మోనియా పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద అమ్మోనియా పంపిణీదారుగా ఉన్న యారాక్లీన్‌ కంపెనీకు గ్రీన్‌కో పునరుత్పాదక అమ్మోనియాను సరఫరా చేయనుంది.ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో గ్రీన్‌కో సంస్థ అమ్మోనియా ఉత్పత్తి చేస్తోంది. ఈప్లాంట్‌ ప్రారంభం నుంచి కంపెనీ పునరుత్పాదక అమ్మోనియాను తయారు చేస్తోంది. దానికి సంబంధించిన పూర్తి కార్యకలాపాలు ఏఎం గ్రీన్‌ విభాగం పర్యవేక్షిస్తుంది. దాంతో టర్మ్‌షీట్‌పై ఏఎంగ్రీన్‌ సంతకం చేసింది.ఈ ఒప్పందంతో ఏంఎంగ్రీన్ ఫేజ్‌1 కేంద్రం ఉత్పత్తి చేస్తున్న పునరుత్పాదక అమ్మోనియా దాదాపు 50 శాతం యారాక్లీన్‌కే సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్ 2027 నాటికి 24 గంటలు కార్బన్ లేని కారకాల నుంచి అమ్మోనియాను తయారుచేయనుంది. ఏఎంగ్రీన్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి మాట్లాడుతూ..‘యారా క్లీన్ సంస్థ ఎరువుల తయారీ కంపెనీలకు, షిప్పింగ్, పవర్ ఇండస్ట్రీస్‌, ఇతర పరిశ్రమలకు పునరుత్పాదక అమ్మోనియా సరఫరా చేస్తోంది. అందులో గ్రీన్‌కో భాగమవ్వడం సంతోషకరం’ అని అన్నారు.యారా క్లీన్‌ అమ్మోనియా సీఈఓ హన్స్ ఒలావ్ రేన్ మాట్లాడుతూ..‘ఏఎంగ్రీన్ కాకినాడ ప్రాజెక్ట్‌లో తయారుచేస్తున్న పునరుత్పాదక అమ్మోనియాతో కంపెనీ పోర్ట్‌ఫోలియో విస్తరిస్తోంది. ఎరువుల ఉత్పత్తి, హైడ్రోజన్‌ ఎనర్జీలో ఉద్గారాలను తగ్గించడం, షిప్పింగ్ ఇంధనం, పవర్ పరిశ్రమల్లో హానికర ఉద్గారాలను తగ్గించేందుకు ఈ క్లీన్‌ అమ్మోనియా ఉపయోగపడుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

Stock Market Rally On Today closing
లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 48 పాయింట్లు లాభపడి 22,107 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 111 పాయింట్లు పుంజుకుని 72,776 వద్ద ముగిసింది.సెన్సెక్స్‌ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ఫార్మా, ఎల్‌ అండ్‌ టీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌యూఎల్‌ కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి.టాటా మోటార్స్‌, టైటాన్‌, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, నెస్లే, ఎం అండ్‌ ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ, టెక్‌మహీంద్రా, మారుతీసుజుకీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 1 Kg 88700.00 200.00
Gold 22K 10gm 66150.00 -100.00
Gold 24k 10 gm 72160.00 -100.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement