Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Indian Pilot Gopi Thotakura Takes Space Tour On Blue Origin Flight
స్పేస్‌లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం

స్పేస్‌ టూరిజంలో అమెజాన్‌ అధినేత జెఫ్‌బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్‌ మరో అడుగు ముందుకు వేసింది. బ్లూ ఆరిజన్‌ సంస్థ టెక్సాస్‌ కేంద్రంగా అంతరిక్షం అంచు వరకు వెళ్లే మానవ రాకెట్‌ ప్రయోగాన్ని ప్రారంభించింది. బ్లూ ఆరిజన్‌ న్యూ షెపర్డ్‌ మిషన్‌ ఎన్‌ఎస్‌-25 మిషన్‌ను పశ్చిమ టెక్సాస్‌లోని లాంచ్ సైట్ వన్ నుండి మే 19న ఉదయం 8.30 (భారత్‌ కాలమాన ప్రకారం..సాయంత్రం 7.30) గంటలకు రాకెట్‌ బయలుదేరుతుంది. ఈ ఎన్‌ఎస్‌ -25 మెషిన్‌లో భారత్‌కు చెందిన గోపి తోటకూర సహా ఆరుగురు ప్రయాణిస్తున్నారు.కాగా, గోపి తోటకూరతో పాటు వెంచర్‌ క్యాపిలిస్ట్‌ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్‌ బిజినెస్‌మెన్ సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్‌ బిజినెస్‌మెన్ కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్‌ షాలర్‌, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్‌ ఎడ్‌ డ్వైట్‌.. ఈ స్పేస్ యాత్రకు వెళ్లారు.

Attero To Invest Over Rs 8 000 Crore Details
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?

ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, బ్యాటరీ రీసైక్లింగ్ కంపెనీ 'అటెరో' వచ్చే ఐదేళ్లలో సుమారు రూ. 8300 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ సీఈవో, కో ఫౌండర్ 'నితిన్ గుప్తా' తెలిపారు. ప్రస్తుతం కంపెనీ సంవత్సరానికి 1,44,000 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను(ఈ-వేస్ట్ ), 15,000 టన్నుల లిథియం అయాన్ బ్యాటరీని రీసైకిల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. రాబోయే రోజుల్లో ఈ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సంస్థ ఈ పెట్టుబడి పెట్టింది.సంస్థ ప్రతి ఏటా 100 శాతం వృద్ధి సాధిస్తోందని, ఈ క్రమంలోనే సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఐరోపా దేశంలో ఇప్పటికే తన కార్యకలాపాలనను ప్రారంభించింది. భారతదేశంలో మరొక గ్రీన్‌ఫీల్డ్ సౌకర్యాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. దీనికోసం ఆంధ్రప్రదేశ్ / జార్ఖండ్‌లో స్థలాన్ని కూడా ఖరారు చేసినట్లు సమాచారం.కంపెనీ తన ఉనికిని విస్తరించిన తరువాత రీసైక్లింగ్ కెపాసిటీ ఏడాదికి 50000 టన్నులకు చేరుతుంది. ప్రస్తుతానికి కంపెనీ రీసైక్లింగ్ సామర్థ్యం 415000 టన్నులు అని తెలుస్తోంది. కంపెనీ 2027 నాటికి దాదాపు రూ. 16500 కోట్ల ఆదాయం గడించాలని యోచిస్తోంది. 2023లో కంపెనీ ఆదాయం రూ. 285 కోట్లు, 2024లో రూ. 440 కోట్లు.అటెరోకు ప్రస్తుతం 25 శాతం మార్కెట్ వాటా అది. ఇది వచ్చే ఏడాదికి 35 శాతానికి పెరుగుతుంది. అయితే మార్కెట్ వాటా పరంగా కంపెనీ దాని ప్రత్యర్థుల కంటే 10 శాతం తక్కువగా ఉంటుందని సమాచారం. రాబోయే రోజుల్లో కంపెనీ గణనీయమైన వృద్ధి సాదిస్తుందని భావిస్తున్నట్లు నితిన్ గుప్తా పేర్కొన్నారు.

Mahindra To Launch 16 New Models In India By 2030 Details
2030 నాటికి 16 కొత్త కార్లు.. దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం

దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' భారతీయ మార్కెట్లో రాబోయే 6 సంవత్సరాల్లో ఏకంగా 16 కొత్త కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. 2030 నాటికి 9 ఫ్యూయెల్ కార్లు, 7 ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలని సంస్థ యోచిస్తోంది.కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేయడంతో పాటు తన వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి యోచిస్తోంది. దీనికోసం మహీంద్రా రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో 27,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. కంపెనీ ప్యాసింజర్ వాహనాలను మాత్రమే కాకుండా కమర్షియల్ వాహనాలను విడుదల చేస్తూ దేశీయ విఫణిలో, గ్లోబల్ మార్కెట్లో కూడా దూసుకెళ్తోంది.మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ (MEAL)లో కంపెనీ ఇప్పటికే రూ. 12,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడి ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి మాత్రమే కాకుండా.. మార్కెట్లో కంపెనీ ఉత్పత్తుల డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగించనుంది.ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ 10000 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సంఖ్య FY2026 నాటికి 18000 చేరే అవకాశం ఉంది. కాగా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి FY2025 చివరి త్రైమాసికం నుంచి ప్రారంభమవుతుందని సమాచారం.

Do You Know How Many Bank Accounts Should You Have
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఆర్‌బీఐ ఏం చెబుతోంది?

ఈ రోజుల్లో దాదాపు పుట్టిన బిడ్డ దగ్గర మొదలుకొని.. అందరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి. ఎక్కువ అకౌంట్స్ ఉంటే ఏమైనా సమస్య వస్తుందా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే ఓ సంస్థ నుంచి మరో సంస్థకు మారిన ప్రతిసారీ బ్యాంక్ అకౌంట్ కూడా మారుతుంది. ఇలా ఒక వ్యక్తికి కనీస నాలుగు లేదా ఐదు అకౌంట్స్ ఉంటాయి. ఉద్యోగులకు మాత్రమే కాకుండా రైతులకు, సాధారణ వ్యక్తులకు కూడా మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఒక వ్యక్తికి ఇన్ని అకౌంట్స్ మాత్రమే ఉండాలి అనే నిబంధన విధించలేదు. కాబట్టి ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయినా ఉండవచ్చు. అయితే ప్రతి ఖాతాలోనూ మినిమమ్ బ్యాలెన్స్ అనేది ఉంచాల్సి ఉంటుంది. మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా దాని కొంత మొత్తంలో ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. అయితే అన్ని బ్యాంకులు ఇలా ఫైన్ వేస్తాయని చెప్పలేము.

Tata Motors Group Hikes Investment To Rs 43,000 Crore
పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్‌ కీలక నిర్ణయం

టాటా మోటార్స్ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక సంవత్సరం 2025 (ఏప్రిల్‌ 1, 2024 నుంచి మార్చి 31, 2025)లో ఆటోమొబైల్‌ విభాగంలో సుమారు రూ.43వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది.ఆర్ధిక సంవత్సరం 2024లో టాటా గ్రూప్‌ మొత్తం దాదాపు రూ. 41,200 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడుల్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహనాల తయారీ, కొత్త టెక్నాలజీలకు గాను సుమారు రూ. 30,000 కోట్లు, టాటా మోటార్స్‌కు రూ. 8,000 కోట్లు పెట్టుబడులు పెట్టగా.. అందులో మిగిలిన మొత్తాన్ని ఇతర విభాగాలకు ఖర్చు చేసింది. అయితే ఈసారి ఆర్ధిక సంవత్సరం 2025లో మాత్రం పెట్టుబడల మొత్తాన్ని భారీగా పెంచనుందని సమాచారం. టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్‌ఓ పీబీ బాలాజీ ఓ సదస్సులో మాట్లాడుతూ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కోసం రూ. 35,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. అంతేకాదు దశల వారీగా ఉత్పత్తిని పెంచనున్నామని, అందుకే ఆర్ధిక సంవత్సరం 2025లో జేఎల్‌ఆర్‌ విభాగంపై పెట్టుబడులు ఆరుశాతం పెంచామన్నారు. ఇక తమ లక్ష్యాలకు అనుగుణంగా వచ్చే సంవత్సరం నాటికి తమ ఉత్పత్తుల్ని మార్కెట్‌కి పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

How To Naturals Ice Cream Founder Raghunandan Kamath Made A Rs 400 Crore Company
14 ఏళ్ల వయస్సులోనే కల.. ఎవరీ ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’

సంక్షోభంలో అవకాశాల్ని ఎలా సృష్టించుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే పీహెచ్‌డీలు చేయాల్సిన అవసరం లేదు. రోజూ వారి నిత్యం మన నిజ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశంలోనూ ఏదో ఒక బిజినెస్‌ ఐడియా ఉంటుంది. దాన్ని మనం గుర్తించాలి. సరైన సమయంలో దాన్ని ఒడిసిపట్టుకుంటే అవకాశాలు అనంతం. చేతిలో డిగ్రీ లేదు. జేబులో చిల్లిగవ్వలేదు. కానీ జీవితంలో ఏదైనా సాధించాలనే తపనతో నాడు 14ఏళ్ల వయస్సులో రైలెక్కి మంగళూరు నుంచి ముంబైకి వెళ్లిన రఘునందన్ కామత్ నేడు ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అవతరించారు. ఎవరీ రఘునందన్‌ కామత్‌. మామిడి పండ్ల వ్యాపారి కుటుంబంలోగత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ కామత్ అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళూరులోని ఓ కుగ్రామంలో మామిడి పండ్ల వ్యాపారి కుటుంబంలో జన్మించిన కామత్‌.. నేడు రూ.400 కోట్ల విలువైన నేచురల్స్ అనే ఐస్ క్రీం కంపెనీ అధిపతిగా పేరు గడించారు. ఆయన ప్రయాణం ఎలా సాగింది?శ్రమ నీ అయుధం అయితే ఐస్ క్రీం మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు సంపాదించిన రఘునందన్ శ్రీనివాస్ కామత్ చిన్న నాటి 14 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మామిడి పండ్ల వ్యాపారం చేసే తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నారు. చెట్టు మీద మామిడి పండ్లను కోయడం దగ్గర నుంచి అమ్మడం వరకు తెలుసుకున్నారు. అయితే, మామిడి పండ్ల వ్యాపారంలో మెళుకువలు తెలుసుకున్న కామత్‌కు బుర్ర నిండా ఆలోచనలే. శ్రమ నీ అయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని నమ్మే ఆయనకు ఐస్‌క్రీం బిజినెస్‌ చేయాలని కోరిక ఆ వయస్సులో బలంగా నాటుకుంది.రైలు ఎక్కి ముంబైకిఐస్‌క్రీం బిజినెస్‌ అంటే కృత్తిమ ఫ్లేవర్లు, లేదంటే పాలు, షుగర్,ఐస్‌తో చేయడం కాకుండా రకరకాల పండ‍్లతో ఐస్‌క్రీం తయారు చేసే వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా 1984లో మంగళూరు నుండి రైలు ఎక్కి ముంబైకి పయనమయ్యారు. అక్కడే ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న తన సోదరుడి వద్దకు వెళ్లారు. అదే రెస్టారెంట్‌లో కామత్‌ పనికి కుదిరారు. రోజులు గడుస్తున్నాయి. వ్యాపారలో మెళుకువలు నేర్చుకున్నారు.ఆలోచనలు మెదడును తొలిచేస్తుంటేమామిడి, అరటి పండు, పుచ్చకాయ ఇలా రకరకాల పండ్లతో ఐస్‌క్రీమ్‌లను ఎందుకు తయారు చేయకూడదు? అలా తయారు చేస్తే కస్టమర్లకు నచ్చుతుందో? లేదో? ఇలా రకరకలా ఆలోచనలు మెదడును తొలిచేస్తుంటే.. ఉండబట్టలేక పావు బాజీ ప్రధాన వంటకంగా, మరోవైపు పండ్లతో ఐస్‌క్రీమ్‌లను అమ్మడం ప్రారంభించారు. 12 రుచులతోఅలా రఘునందన్ శ్రీనివాస్ కామత్ ముంబై జుహు అనే ప్రాంతంలో తన తొలి ఐస్ క్రీమ్ పార్లర్‌ను కేవలం ఆరుగురు సిబ్బందితో, 12 రుచులతో ప్రారంభించాడు. అప్పట్లో, దీనిని తరచుగా కస్టమర్లు ఐస్ క్రీమ్ ఆఫ్ జుహు స్కీమ్ అని పిలిచేవారు.మూడు పువ్వులు ఆరు కాయలుగారోజులు గడుస్తున్నాయి. వ్యాపారం జోరందుకు. కామత్‌ ఐస్‌క్రీమ్‌కి మౌత్‌ పబ్లిసిటీ ఎక్కువైంది. 37ఏళ్లలో ఇంతింతై వటుడింతై అన్న చందగా ప్రస్తుతం, నేచురల్స్ ఐస్ క్రీమ్ 15 నగరాల్లో 165కి పైగా అవుట్‌లెట్‌లతో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది.

SBI Fails To Hand In ATM CCTV Footage, Told To Pay Man Who Loses Rs 80,000 Card Cloning Fraud In Delhi
ఎస్‌బీఐకి మొట్టికాయలు గట్టిగానే పడ్డాయిగా?

ఎస్‌బీఐకి కన్జ్యూమర్‌ కోర్టు మొట్టి కాయలు వేసింది. కస్టమర్‌ మోసపోయిన రూ.80వేల నగదును వెంటనే బ్యాంక్‌ చెల్లించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది.జూలై 4, 2015న ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రూర్కి నగర నివాసీ పార్థసారథి ముఖర్జీ ఎస్‌బీఐ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి నేరస్తులు న్యూఢిల్లీలోని ఎస్‌బీఐ బ్యాంక్‌ ఏటీఎంల నుంచి రూ.80,000 విత్‌డ్రా చేశారు. విత్‌ డ్రా అయినట్లు ముఖర్జీ ఫోన్‌కు మెసేజ్‌ వెళ్లింది. వెంటనే సదరు బ్యాంక్‌కు మెయిల్‌ పంపాడు. గుర్తుతెలియని వ్యక‍్తులు ఎస్‌బీఐ ఏటీఎం నుంచి ఒక్కొక్కరు రూ.10వేలు చొప్పున మొత్తం ఎనిమిది సార్లు విత్ డ్రా చేసినట్లు మెయిల్‌ ద్వారా సమాచారం అందించారు. తనకు న‍్యాయం చేయాలని కోరారు. వెంటనే ఉత్తరాఖండ్ కన్జ్యూమర్‌ కోర్టునూ ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో కన్జ్యూమర్‌ కోర్టు సమస్యను పరిష్కరించి, బాధితుడికి న్యాయం చేయాలని ఢిల్లీ ఎస్‌బీఐకు ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు ఆదేశాలతో స్థానిక పోలీసులు విచారణ చేపట్టేందుకు ఎస్‌బీఐ బ్యాంక్‌ను సీసీటీవీ పుటేజీ ఇవ్వాలని కోరారు. అందుకు ఎస్‌బీఐ అధికారులు తిరస్కరించారు. ఎస్‌బీఐ అధికారుల తీరుపై బాధితుడు కన్జ్యూమర్‌ కోర్టుకు తన గోడును వెళ్లబోసుకున్నాడు. అయితే, అగంతకులు విత్‌ డ్రాపై బ్యాంక్‌ సత్వరమే చర్యలు తీసుకుందని, తన బ్యాంక్‌ బ్రాంచ్‌తో పాటు ఇతర బ్యాంక్‌ బ్రాంచీలకు సమాచారం ఇచ్చామని బ్యాంక్‌ అధికారులు కన్జ్యూమర్‌ కోర్టుకు తెలిపారు. తమ (ఎస్‌బీఐ) సేవల్లో ఎలాంటి లోపాలు లేవని, బ్యాంక్‌ ఖాతాదారుడు అగంతకులకు కార్డ్‌ వివరాలు, బ్యాంక్‌ డీటెయిల్స్‌ అందించారని స్పష్టం చేసింది. ఎస్‌బీఐ బ్యాంక్‌ తీరును ప్రశ్నించిన కన్జ్యూమర్‌ కోర్టు బాధితుడు నష్టపోయిన రూ.80వేల మొత్తాన్ని చెల్లించాలని సూచించింది.వివాదాస్పద లావాదేవీలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ లేకపోవడంతో పోలీసు విచారణను ముగించలేమని రాష్ట్ర కమిషన్ గమనించింది. రికార్డులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా బ్యాంక్‌ సేవల్లో లోపాలు ఉన్నాయని భావించామనే, కాబట్టే ఈ తీర్పు ఇచ్చినట్లు ఉత్తరా ఖండ్‌ కన్జ్యూమర్‌ కోర్టు వెల్లడించింది.

Singapore Airlines To Reward 8 Months Of Salary As Bonus Employees
ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్!.. శుభవార్త చెప్పిన కంపెనీ

గత కొన్ని రోజులుగా దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియకుండా ఇప్పటికీ చాలామంది బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఈ తరుణంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ తన ఉద్యోగులకు ఎగిరి గంతేసే శుభవార్త ప్రకటించింది. ఇందులో భాగంగానే ఎనిమిది నెలల బోనస్‌ అందిస్తామని పేర్కొంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ రికార్డు స్థాయిలో 1.98 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు పేర్కొంది. ఏడాది పొడవునా విమాన ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగిన కారణంగా ఈ సంస్థ గొప్ప లాభాలను ఆర్జించింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ తమ సరిహద్దుల మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో ఎయిర్‌లైన్స్ లాభాలను గడించింది.ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా సింగపూర్ ఎయిర్‌లైన్స్.. 'స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్' పొందింది. ఈ అవార్డును ఈ ఎయిర్‌లైన్స్ గతంలో ఐదు సార్లు సొంతం చేసుకుంది. 23 ఏళ్ల చరిత్ర కలిగిం సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఆరు సార్లు ఈ అవార్డును దక్కించుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

Dr Reddys,sun Pharma And Aurobindo Pharma Are Recalling Products In Us Market
భారత్ ఫార్మా కంపెనీలకు అమెరికా కీలక ఆదేశాలు

భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సన్ ఫార్మా మరియు అరబిందో ఫార్మాకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) కీలక ఆదేశాలు జారీ చేసింది. తయారీ సమస్యల కారణంగా యూఎస్‌ మార్కెట్‌లో ఉన్న ఉత్పత్తులను రీకాల్‌ చేయాలని ఆదేశించింది. న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్‌లో ఉన్న డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ జావిగ్టర్ (Javygtor), సాప్రోప్టెరిన్ డైహైడ్రోక్లోరైడ్‌ను రీకాల్‌కు సిద్ధమైంది. సన్‌ ఫార్మా సైతం ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించే యాంఫోటెరిసిన్ బి లిపోసోమ్ రీకాల్ చేస్తున్నట్లు యూఎస్‌ఏఫ్‌డీఏ తెలిపింది.అదే విధంగా, అరబిందో ఫార్మా అమెరికన్ మార్కెట్‌లో ఆందోళనకు చికిత్స చేయడానికి ఉపయోగించే క్లోరాజెపేట్ డిపోటాషియం టాబ్లెట్‌లను (3.75 mg, 7.5 mg) రీకాల్ చేస్తోంది.

Elon Musk Launch Starlink In Indonesia
ఇండోనేషియాలో స్టార్‌లింక్ సర్వీస్.. 'మస్క్' నెక్స్ట్ ప్లాన్ అదేనా!

విశాలమైన ఇండోనేషియా ద్వీపసమూహంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్‌ను మెరుగుపరచాలనే లక్ష్యంతో టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్, ఇండోనేషియా హెల్త్ మినిష్టర్ 'బుడి గునాడి సాదికిన్' ఆదివారం స్పేస్‌ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభించారు.ఇలాన్ మస్క్ (Elon Musk), ప్రాంతీయ రాజధాని డెన్‌పసర్‌లోని ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో జరిగిన ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం ప్రైవేట్ జెట్ ద్వారా ఇండోనేషియా రిసార్ట్ ద్వీపం బాలికి చేరుకున్నారు.ఇండోనేషియాలో స్టార్‌లింక్ సర్వీస్ అందుబాటులోకి రావడం వల్ల దేశంలోని సుదూర ప్రాంతాల్లోని లక్షలాది మంది ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయడానికి సహాయపడుతుందని మస్క్ పేర్కొన్నారు. తక్కువ కనెక్టివిటీ ఉన్న ప్రదేశాలకు కనెక్టివిటీని తీసుకురావడానికి నేను చాలా సంతోషిస్తున్నానని అన్నారు. ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే ప్రజలు ఏమైనా నేర్చుకోవచ్చు.ఇండోనేషియా ప్రభుత్వం దేశంలోని గొప్ప నికెల్ వనరులను ఉపయోగించి ఈవీ రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటోంది. కాబట్టి టెస్లా ఆ దేశంలో తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉంది. ఇండోనేషియాలో టెస్లా తయారీ ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 92500.00 92500.00 0.00
Gold 22K 10gm 67600.00 67600.00 -250.00
Gold 24k 10 gm 73750.00 73750.00 -270.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement