Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock Market Rally On Today Closing
బేర్‌ పంజా.. రెడ్‌లో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 55 పాయింట్లు నష్టపోయి 22,588 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 188 పాయింట్లు దిగజారి 74,482 వద్దకు చేరింది.సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ సుజుకీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.టెక్‌మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, ఎల్‌ అండ్‌ టీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, టైటాన్‌ నెస్లే కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Though rise of UPI payments in India 5.51 percent increase in average atm withdrawals
పెరుగుతున్న క్యాష్‌ విత్‌డ్రాలు!

భారత్‌లో యూపీఐ చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ గతేడాది ఏటీఎంల నుంచి చేసే నగదు ఉపసంహరణలు 5.51 శాతం పెరిగినట్లు తాజాగా సీఎంఎస్‌ నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వృద్ధి రేటు 9 శాతం పెరుగుతుందని అంచనాలు వెలువడుతున్నా ఆ మేరకు నగదు ఉపసంహరణ మాత్రం పెరగడంలేదని నివేదిక ద్వారా తెలిసింది.2022-23 ఆర్థిక సంవత్సరంలో చేసిన నగదు ఉపసంహరణల కంటే 2023-24లో చేసిన నెలవారీ విత్‌డ్రాలు సగటున 7.23 శాతం ఎక్కువగా ఉన్నాయి. గతేడాదిలో మెట్రోనగరాల్లో విత్‌డ్రా చేసిన సగటు నగదు అంతకుముందు ఏడాదికంటే 10.37 శాతం పెరిగింది. సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో 3.94 శాతం పెరుగుదల కనిపించింది.భారత్‌లో గతేడాది ఏటీఎంల ద్వారా అధికంగా డబ్బు తీసుకున్న ఉత్తరాది ప్రాంతాల్లో దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటక ప్రజలు అధికంగా డబ్బు విత్‌డ్రా చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి 49 శాతం ఏటీఎంలు మెట్రోపాలిటన్, పట్టణ ప్రాంతాల్లో ఉండగా, 51 శాతం ఏటీఎంలు సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.ఇదీచదవండి: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను సగానికి తగ్గించిన ప్రభుత్వ సంస్థప్రైవేట్ రంగ బ్యాంకులకు సంబంధించి 64 శాతం ఏటీఎంలు మెట్రోపాలిటన్, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. 36 శాతం ఏటీఎంలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిసింది.

Volkswagen Tayron Debuts At Beijing Motor Show
బీజింగ్ మోటార్ షోలో అడుగుపెట్టిన ఫోక్స్‌వ్యాగన్ కారు ఇదే..

బీజింగ్ మోటార్ షో 2024లో సరికొత్త 'ఫోక్స్‌వ్యాగన్ టైరాన్' అధికారికంగా వెల్లడైంది. చైనా మార్కెట్లో విక్రయానికి రానున్న ఈ కొత్త కారు 5 సీటర్ టైగన్ ఎల్ ప్రో పేరుతో విక్రయానికి రానుంది. ఇది 2025 నాటికి దేశీయ మార్కెట్లో 7 సీటర్ రూపంలో అడుగుపెట్టనుంది.ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ చూడటానికి చాలా వరకు టైగన్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఇది ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, పెద్ద గ్లాస్‌హౌస్‌ వంటి వాటిని పొందుతుంది. ఇది దాని ఇతర మోడల్స్ కంటే కూడా కొంత పొడవుగా ఉంటుంది. ఇది సెంటర్ కన్సోల్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్రైవ్ సెలెక్టర్ కోసం రోటరీ డయల్, రెండు కప్‌హోల్డర్‌లతో మంచి లేఅవుట్‌ను పొందుతుంది. వీటితో పాటు 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ADAS ఫీచర్స్ కూడా ఉన్నాయి.ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ రెండు ట్యూన్‌లలో లభిస్తుంది. బేస్ మోడల్ 184 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాప్ వేరియంట్ 217 హార్స్ పవర్, 350 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ గ్లోబల్ మోడల్ అని సీఈఓ థామస్ షాఫర్ వెల్లడించారు. చైనా తరువాత జపాన్, ఆ తరువాత మెక్సికోలో తయారవుతుంది. 2025లో భారతీయ తీరాలను చేరే అవకాశం ఉందని సమాచారం. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన తరువాత జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Microsoft Invest 1.7 billion Dollars in Indonesia to initiate cloud and building data centers
రూ.14వేలకోట్లతో డేటా సెంటర్లు ప్రారంభం.. ఎక్కడంటే..

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఇండోనేషియా ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడానికి 1.7 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటాంచారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌తో కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో కీలక మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. మంగళవారం సత్యనాదెళ్ల ఆర్చిపెలాగో సంస్థ అధ్యక్షుడు జాన్‌ఫ్లడ్‌తో సమావేశం తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.ఇండోనేషియా ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. దాదాపు 28 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ఏఐ డేటా సెంటర్‌ల ఏర్పాటుకు డిమాండ్‌ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దాంతో కంపెనీ ఈ చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇండోనేషియా పర్యటనలో భాగంగా సత్యనాదెళ్ల జకార్తా అధ్యక్షుడు జోకో విడోడోతో చర్చలు జరిపారు.ఈ సందర్భంగా సత్య మాట్లాడారు. ‘ఇండోనేషియాలో దాదాపు 1.7 బిలియన్‌ డాలర్లతో డేటా సెంటర్లు, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. తరువాతి తరం ఏఐ మౌలిక సదుపాయాలు భవిషత్తులో ఎంతో ఉపయోగపడనున్నాయి. ఇండోనేషియాలోని ప్రతి సంస్థ లార్జ్‌ ఏఐను సద్వినియోగం చేసుకోవాలి. సమీప భవిష్యత్తులో సంస్థ వేలమందికి ఏఐ శిక్షణ ఇవ్వబోతుంది. 2025 నాటికి ఏషియా ప్రాంతంలో దాదాపు 2.5 మిలియన్ల మందికి ఇందులో శిక్షణ ఇవ్వబోతున్నాం’ అని అన్నారు.ఇదీ చదవండి:  టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలుగ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ కెర్నీ చేసిన పరిశోధనలో 2030 నాటికి ఆగ్నేయాసియా జీడీపీలో ఏఐ ద్వారా 1 ట్రిలియన్‌ డాలర్లు సమకూరుతాయని అంచనా వేసింది. యాపిల్‌ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ దేశంలో తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు యాపిల్ దృష్టి సారిస్తోందని టిమ్‌ చెప్పారు.

World Tallest Residential Tower Sky Mansions Details
ప్రపంచంలో ఎత్తైన రెసిడెన్షియల్.. ఫిదా చేస్తున్న వీడియో

దుబాయ్‌ అనగానే చాలామందికి ప్రపంచంలో ఎత్తైన భవనంగా కీర్తి గడిస్తున్న 'బుర్జ్ ఖలీఫా' గుర్తొస్తుంది. అయితే త్వరలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ అందుబాటులోకి రానుంది. నగరంలోని మెరీనా జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఈ రెసిడెన్షియల్ మొత్తం 122 అంతస్తులుగా నిర్మించనున్నారు.'సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్' పేరుతో నిర్మిస్తున్న ఈ భవనం 517 మీటర్లు లేదా 1696 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన రెసిడెన్షియల్‌గా.. న్యూయార్క్ నగరంలోని 'సెంట్రల్ పార్క్ టవర్' (474 మీటర్లు లేదా 1550 అడుగులు) కంటే చాలా పొడవుగా ఉంటుంది.సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్‌ను వుడ్స్ బాగోట్ అండ్ డబ్ల్యుఎస్పీ మిడిల్ ఈస్ట్ రూపొందించారు. ఇది గుండ్రంగా మెరుస్తున్న టవర్ మాదిరిగా ఉంటుంది. బాల్కనీలను, టెర్రస్ వంటి వాటిని కలుపుతూ చివరి బిందువు మాదిరిగా పూర్తయ్యి ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్ మొత్తం మిచెల్ & ఈడెస్ పూర్తి చేస్తుంది. కాబట్టి ఇందులో అరబ్ యువరాజుకు సరిపోయే హై-ఎండ్ యాక్సెసరీస్, మెటీరియల్‌లను ఉపయోగించినట్లు సమాచారం.సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్‌లో అత్యాధునిక ఫిట్‌నెస్ సౌకర్యాలు ఫంక్షనల్ జిమ్‌లు, వర్చువల్ సైక్లింగ్, బాక్సింగ్ స్టూడియోలు, ఇన్ఫినిటీ పూల్, ఐస్ బాత్‌లు, సాల్ట్ రూమ్, బయో, సౌండ్ హీలింగ్ రూమ్, మసాజ్ సూట్‌లు, ఇండోర్ అండ్ అవుట్‌డోర్ సినిమాస్ వంటి ఎన్నో ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి.సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్ దుబాయ్ మెరీనాకు కొంత చరిత్ర కూడా ఉంది. ఇది 2007లో పెంటోమినియం టవర్‌గా ప్రారంభమైంది. తరువాత ఆనతి కాలంలోనే ప్రపంచ ఆర్ధిక సంక్షోభం కారణంగా నిర్మాణం నిలిచిపోయింది. ఇటీవలే సెలెక్ట్ గ్రూప్ అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని 100 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం నిర్మాణం 25 శాతం పూర్తయింది. ఇది 2028 చివరి నాటికి పూర్తవుతుందని సమాచారం.

OTT subscription rate reduced to 50 percentage of BSNL
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను సగానికి తగ్గించిన ప్రభుత్వ సంస్థ

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉన్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. దాదాపు చాలా టెలికాం కంపెనీలు ప్రత్యేకంగా ఓటీటీ సేవలందిస్తున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ఓటీటీని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తమ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్లకు అందించే సినిమాప్లస్‌ ఓటీటీ ప్యాకేజీ ప్రారంభ ధరను సంస్థ తగ్గించింది.ఈ ప్రారంభ ప్యాక్‌ ధర గతంలో నెలకు రూ.99గా ఉండేది. దాన్ని రూ.49కు తగ్గిస్తూ కంపెనీ ఇటీవల ప్రకటించింది. ఇందులో లయన్స్‌గేట్‌, షెమరూమీ, హంగామా, ఎపిక్‌ ఆన్‌ ఓటీటీల్లోని కంటెంట్‌ను వీక్షించవచ్చు. దీంతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో రెండు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెలకు రూ.199 సబ్‌స్క్రిప్షన్‌తో జీ5, సోనీలివ్‌, యప్‌టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్‌తో కూడిన ఫుల్‌ ప్యాక్ ఓటీటీ ప్యాకేజీ అందిస్తోంది.ఇదీ చదవండి:  టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలునెలకు రూ.249 చెల్లిస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీమియం ప్లాన్‌కు అప్‌గ్రేడ్‌ కావచ్చని సంస్థ తెలిపింది. ఇందులో జీ5, సోనీ లివ్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌, యప్‌టీవీ, లయన్స్‌గేట్‌, షెమరూమీ, హంగామా, వంటి ఓటీటీలను ఫ్రీగా చేసేయొచ్చు. 

Today Gold and Silver Price 30 April 2024
బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఉలుకూ.. పలుకూ లేకుండా అన్నట్లు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66550 (22 క్యారెట్స్), రూ.72600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 300 నుంచి రూ. 330 వరకు తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66700 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 72750 రూపాయల వద్దే ఉంది. నిన్న రూ.300, రూ.330 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు ఏ మాత్రం పెరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి.దేశంలోని ఇతర నగరాలలో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 67400 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 73530 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం రూ. 100 తగ్గింది. కాబట్టి ఈ రోజు (ఏప్రిల్ 30) ఒక కేజీ వెండి ధర 83900 రూపాయల వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేదు.

10,000 freshers to be hired during this year, says HCLTech CEO Vijayakumar
టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలు

టెక్‌ కంపెనీలు జనరేటివ్‌ ఏఐపై దూకుడుగా పనిచేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో వీటిలో అపార అవకాశాలున్నట్లు గుర్తించి ఆదిశగా ముందుకుసాగుతున్నాయి. తాజాగా జనరేటివ్‌ ఏఐలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సీఈఓ విజయ్‌ కుమార్‌ తెలిపారు. మార్చి త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.కృత్రిమమేధ రంగంలో కంపెనీ చాలా మందికి శిక్షణ ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికే సుమారు 25,000 మందికి శిక్షణ ఇవ్వగా, మరో 50,000 మందికి ఈ ఏడాదిలో ట్రెయినింగ్‌ పూర్తి చేస్తామన్నారు. గడిచిన త్రైమాసికంలో కొత్తగా 2700 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపారు. 2024-25లో పరిస్థితులను బట్టి నియామకాలుంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగిగే కనీసం 10,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామన్నారు. భవిష్యత్తులో ఏదైనా మార్పులు ఏదురైతే నియామకాల సంఖ్యలోనూ తేడాలుండవచ్చని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఏఐ టూల్స్‌ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థకంపనీ మార్చి త్రైమాసికంలో ఆదాయ వృద్ధి రేటు 5.4%గా నమోదైంది. టెక్‌ కంపెనీలకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలపై క్లౌడ్‌, జనరేటివ్‌ఏఐ ప్రాజెక్టులు పెరుగుతాయని విజయ్‌ అంచనా వేశారు. అయితే ఆర్థిక సేవల విభాగంలో మాత్రం కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చన్నారు. రానున్న రోజుల్లో జనరేటివ్‌ ఏఐ ఆధారిత సైబర్‌ భద్రత, డేటా, క్లౌడ్‌ ఇమిగ్రేషన్‌, ప్రైవేటు ఏఐ స్టాక్‌ల నిర్మాణం తదితర విభాగాల్లో ఆర్డర్లు పెరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

Stock Market Rally On Today Opening
గ్రీన్‌లో ఓపెన్‌ అయిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 22,670కు చేరింది. సెన్సెక్స్‌ 57 పాయింట్లు దిగజారి 74,751 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.6 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 88 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.32 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.35 శాతం ఎగబాకింది.అంచనాలకు మించి క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటనతో బ్యాంకులు, ఫైనాన్స్‌ రంగాల షేర్లలో భారీ కొనుగోళ్లు నెలకొన్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు కలిసొచ్చాయి. క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం, ఇరాన్‌–ఇజ్రాయెల్‌ ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత వంటి అంశాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మే 1న సెలవు కావడంతో, మార్కెట్లు ఈవారం 4 రోజులే పనిచేయనున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

IVMA announced that Krishna Ella chairman of Bharat Biotech will be the new president
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డా.కృష్ణ ఎల్లా ఎంపిక

కోవాక్సిన్‌ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా ఇండియన్‌ వ్యాక్సిన్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐవీఎంఏ) అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగనున్నారు.ఈ పదవిలో ఇప్పటి వరకు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ అదార్‌ పూనావాలా ఉన్నారు. ఐవీఎంఏ ఉపాధ్యక్షురాలిగా బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల, కోశాధికారిగా భారత్‌ బయోటెక్‌ సీఎఫ్‌ఓ టి.శ్రీనివాస్‌లను ఎన్నుకున్నారు. ఐవీఎంఏ డైరెక్టర్‌ జనరల్‌గా డాక్టర్‌ హర్షవర్థన్‌ కొనసాగుతారు.ఇదీ చదవండి: ఏఐ టూల్స్‌ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థఅందరికీ అవసరమయ్యే టీకాలు అందించడమే ఐవీఎంఏ ప్రధాన లక్ష్యమని డాక్టర్‌ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ ప్రమాణాలకు అనుగుణంగా దేశంలో టీకాల తయారీ సంస్థలు సిద్ధం కావాలన్నారు. ఆఫ్రికా వంటి దేశాలకు టీకా అవసరాలు అధిమన్నారు. టీకా తయారీలో వస్తున్న అంకుర సంస్థలకు సరైన ప్రోత్సాహకాలు అందించాలన్నారు.

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 65.70 75.20

Egg & Chicken Price

Title Price Quantity
Egg 100.00 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement