News


విజిల్‌తో కంపెనీలకు రవాణా సేవలు

Saturday 27th July 2019
startups_main1564203636.png-27353

  • విజిల్‌ డ్రైవ్‌లో ఉద్యోగుల రవాణా, టెక్నాలజీ సేవలు
  • రోజుకు 2,500 ట్రిప్స్‌; 12 వేల మంది వినియోగం
  • ఏడాదిలో రూ.70 కోట్ల నిధుల సమీకరణ పూర్తి
  • ‘స్టార్టప్‌ డైరీ’తో ఫౌండర్‌ అండ్‌ సీఈఓ రాకేశ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఉద్యోగుల ట్రాన్స్‌పోర్టేషన్‌ కంపెనీలకు పెద్ద సవాలే. వ్యాపార కార్యకలాపాల కంటే ఎక్కువగా ఉద్యోగుల రవాణా సేవల నిర్వహణ కష్టం. ఎంప్లాయిస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ థర్డ్‌ పార్టీకి ఇద్దామంటే? వాహనాలు మాత్రమే ఉంటే సరిపోదు. టెక్నాలజీ, నిర్వహణ కూడా అవసరమే. సొంత వాహనాలు, డ్రైవర్లు, ఏఐ ఆధారిత ట్రాన్స్‌పోర్ట్‌ టెక్నాలజీ మూడు విభాగాలను నిర్వహణ చేసే స్టార్టపే విజిల్‌ డ్రైవ్‌! మరిన్ని వివరాలు కంపెనీ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ రాకేశ్‌ మున్ననూరు ‘స్టార్టప్‌ డైరీ’కి వివరించారు.
‘‘మాది కరీంనగర్‌ జిల్లా. నోయిడాలో బీటెక్‌ పూర్తయ్యాక.. టాప్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చింది. జాబ్‌లో చేరితే లాక్‌ అయిపోతానని వచ్చిన ఆఫర్‌ను వదిలేసి.. ఇంటికొచ్చేశా. బీటెక్‌ చేస్తూనే చాలా స్టార్టప్స్‌కు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, నిర్వహణ, ఇన్వెస్ట్‌మెంట్స్‌ అప్రూవల్స్‌ తదితర విభాగాల్లో పనిచేశా. ఈ అనుభవంతో సొంతంగా స్టార్టప్‌ పెట్టాలని నిర్ణయించుకొని 2016 ఏప్రిల్‌లో హైదరాబాద్‌ కేంద్రంగా విజిల్‌ డ్రైవ్‌.కామ్‌ను ప్రారంభించాం. డ్రైవర్లను అద్దెకిచ్చే సేవలతో ప్రారంభమైన విజిల్‌ డ్రైవ్‌.. ప్రస్తుతం కార్పొరేట్‌ కంపెనీలకు క్యాబ్స్, టెక్నాలజీ సేవలందించే కంపెనీగా ఎదిగింది.
28 కంపెనీలు; 12 వేల మంది...
ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో సేవలందిస్తున్నాం. ఏడీపీ, ఇన్వెస్కో, ఐటీసీ హోటల్స్, రెయిన్‌బో ఆసుపత్రి, ఎల్‌ అండ్‌ టీ వంటి 28 కంపెనీలు, 12 వేల మంది ఉద్యోగులు కస్టమర్లుగా ఉన్నారు. ప్రస్తుతం 700 కాబ్స్‌ ఉన్నాయి. ఇందులో 20 శాతం సొంతానివి. విజిల్‌ ఫ్లీట్‌లో 4–7 సీట్ల వాహనాలు, విజిల్‌ షటిల్‌లో వింగర్స్, మినీ బస్‌లు, విజిల్‌ 360 డిగ్రీస్‌లో వాహనాలతో పాటూ టెక్నాలజీ సేవలు కూడా ఉంటాయి. ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్సీ (ఏఐ), బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ ఉంటుంది. వచ్చే ఏడాది కాలంలో 1,500 క్యాబ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం రోజుకు క్యాబ్స్‌ 2,500 ట్రిప్పులు, లక్ష కి.మీ. వరకు తిరుగుతున్నాయి.
రూ.15 కోట్ల ఆదాయం లక్ష్యం...
నెల ప్యాకేజ్, ట్రిప్‌ వారీగా ఆదాయం ఉంటుంది. ధరలు నెల ప్యాకేజీ రూ.30 వేల నుంచి రూ.50 వేలు, ట్రిప్‌కు అయితే రూ.350 నుంచి రూ.1,000కు చార్జీలుంటాయి. డ్రైవర్‌ కం ఓనర్‌ క్యాబ్‌ ఆదాయంలో విజిల్‌ డ్రైవ్‌కు 20 శాతం కమీషన్‌ ఉంటుంది. గతేడాది రూ.8 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. 2019–20లో రూ.15 కోట్ల రెవిన్యూను లక్ష్యించాం. ఈ ఏడాది ముగింపు నాటికి పుణేలో సేవలను ప్రారంభించనున్నాం. 2020 నాటికి విశాఖపట్నం, ముంబై, ఢిల్లీలోకి ఎంట్రీ ఇస్తాం.
రూ.70 కోట్ల నిధుల సమీకరణ...
ప్రస్తుతం విజిల్‌ డ్రైవ్‌లో 62 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో ఈ సంఖ్యను 150కి చేర్చుతాం. ప్రస్తుతం ఉద్యోగుల ట్రాన్స్‌పోర్టేషన్‌ కోసం ఫోర్డ్స్‌ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయి. నెల రోజుల్లో ఎంవోయూ పూర్తవుతుంది. దీంతో ముంబై, కోల్‌కత్తా వంటి ఇతర నగరాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టే. ఏడాది కాలంలో క్లయింట్ల సంఖ్యను 50కి చేర్చుతాం. ‘‘ఇప్పటికే మా కంపెనీలో కొలిజియం గ్రూప్‌ రూ.5 కోట్ల పెట్టుబడులు పెట్టింది. త్వరలోనే రూ.70  కోట్ల నిధుల సమీకరించనున్నాం. అమెరికాకు చెందిన పలు ఇన్వెస్ట్‌మెంట్‌ నెట్‌వర్క్స్‌తో చర్చలు జరుగుతున్నాయి’’ అని రాకేశ్‌ వివరించారు.

  • విజిల్‌ డ్రైవ్‌ లోగో
  • ఫౌండర్‌ అండ్‌ సీఈఓ రాకేశ్‌



You may be interested

గరిష్ఠ స్థాయికి ‘వినియోగదారుల ఫైనాన్సింగ్‌ బూమ్‌’

Saturday 27th July 2019

భారత ఆర్థిక వ్యవస్థలో మందగమనం, వినియోగ సంబంధిత రంగాలపై దీని ప్రభావం అంతర్జాతీయ పెట్టుబడిదారులను అతి జాగ్రత్త పరులను చేసిందని జెఫెరీస్, ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ వుడ్ తన వారంతపు ఇన్వెస్టర్‌ నోట్‌ గ్రీడ్‌ అండ్‌ ఫియర్‌లో పేర్కొన్నారు. భారతదేశంలో ‘వినియోగదారుల ఫైనాన్సింగ్ బూమ్’ గరిష్ట స్థాయికి చేరుకుందని హెచ్చరించారు. ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ జూన్‌ త్రైమాసిక ఫలితాలలో ఈ బ్యాంక్‌ రుణ వృద్ధి రేటు 3.3 శాతం

మరిన్ని విమానాశ్రయాల ప్రైవేటీకరణ

Saturday 27th July 2019

రెండో దశలో 20-25 ఎయిర్‌పోర్టులపై దృష్టి ఏఏఐ చైర్మన్ గురుప్రసాద్ వెల్లడి న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరిన్ని విమానాశ్రయాలను ప్రైవేటీకరించడంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించగా రెండో విడతలో మరో 20-25 ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరించాలని భావిస్తోంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్ గురుప్రసాద్ మహాపాత్ర శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఏటా 15 లక్షల మంది పైగా విమాన ప్రయాణీకులు ఉండే ఈ

Most from this category