News


వాహన సర్వీసింగ్‌... ఇంటికే!!

Saturday 4th May 2019
startups_main1556957111.png-25525

  • డూయర్స్‌తో ఇంటి వద్దే బైక్, కార్‌ సేవలు
  •  200 వర్క్‌షాప్‌లు; 150 టెక్నీషియన్స్‌తో ఒప్పందం
  • 6 నెలల్లో విజయవాడ, వైజాగ్‌లో సేవలు షురూ
  • ‘సాక్షి’తో ఫౌండర్‌ మహేష్‌ షేట్కర్‌ వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మెట్రో నగరాల్లో కారు లేదా బైక్‌ సర్వీసింగ్‌ అంటే పెద్ద ప్రహసనం. ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీలో ఎలాగైతే ఆర్డర్‌ చేసుకుంటున్నామో.. అంతే సులువుగా వాహన సర్వీసింగ్‌ సేవలందిస్తే? జస్ట్‌.. సింపుల్‌! ఆర్డర్‌ బుక్‌ చేసిన 20 నిమిషాల్లో ఇంటి వద్దకే టెక్నీషన్‌ వచ్చి... బైక్, కార్‌ సర్వీసింగ్‌ చేసేస్తారు. ఇదే డూయర్స్‌ పని. మరిన్ని వివరాలు కంపెనీ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ మహేశ్‌ షేట్కర్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. 
‘‘బెంగళూరు, పుణె, హైదరాబాద్‌లో సేవలందిస్తున్నాం. వర్క్‌షాప్స్, టెక్నీషియన్స్, వాహన విడిభాగాల కోసం స్థానిక సర్వీసింగ్‌ సెంటర్లతో ఒప్పందం చేసుకున్నాం. 45 రోజులు వర్క్‌షాప్‌ నిర్వహించి, డిమాండ్‌ను పరిశీలించాక టెక్నీషియన్స్‌కు శిక్షణ ఇచ్చి డూయర్స్‌లో నమోదు చేస్తాం. ప్రస్తుతానికి మూడు నగరాల్లో కలిపి 200 వర్క్‌షాప్స్, 500 మంది టెక్నీషియన్స్‌ ఉన్నారు. వచ్చే ఏడాది కాలంలో వీటి సంఖ్యను 500కు చేరుస్తాం. ఆర్డర్‌ బుక్‌ కాగానే దగ్గర్లోని వర్క్‌షాప్‌కు అలర్ట్‌ వెళుతుంది. 20–40 నిమిషాల్లో టెక్నీషియన్‌ ఇంటికి చేరుకొని.. మైనర్‌ సర్వీసింగ్‌ అయితే అక్కడే పూర్తి చేస్తాడు. మేజర్‌ అయితే వర్క్‌షాప్‌కు తీసుకెళ్లి వాహన రిపోర్ట్, ఇన్వాయిస్‌ను కస్టమర్‌కు పంపిస్తాడు. ఒకే అయితే సర్వీసింగ్‌ ప్రారంభమవుతుంది.
నెలకు 8–10 వేల ఆర్డర్లు...
హోమ్‌ సర్వీసింగ్‌తో పాటూ బ్రేక్‌ డౌన్, టైర్ల మార్పు, పెయింటింగ్, రోడ్‌ సైడ్‌ అసిస్టెన్స్‌ వంటి సేవలనూ అందిస్తున్నాం. ప్రస్తుతానికి మూడు నగరాల్లో కలిపి నెలకు 8–10 వేల ఆర్డర్లు వస్తున్నాయి. వీటిలో 60 శాతం బైక్, 40 శాతం కార్‌ సర్వీసింగ్‌ ఆర్డర్లు. బైక్‌కు 4 గంటలు, కార్‌కు 7 గంటల సమయం పడుతుంది. ధరలు రూ.150 నుంచి లక్షన్నర వరకున్నాయి. ఆథరైజ్డ్‌ సర్వీసింగ్‌ సెంటర్‌తో పోలిస్తే 20–45 శాతం వరకు ధరలు తక్కువగా ఉంటాయి. ప్రతి నెలా ఆర్డర్లు, ఆదాయంలో 40 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం.
6 నెలల్లో విజయవాడ, వైజాగ్‌లో...
ప్రస్తుతం హైదరాబాద్‌లో 25 వర్క్‌షాప్స్, 150 మంది టెక్నీషియన్స్‌ ఉన్నారు. నెలకు వెయ్యి ఆర్డర్లు వస్తున్నాయి. 3 నెలల్లో చెన్నై, ముంబై, ఢిల్లీ, గుర్గావ్‌ నగరాలకు విస్తరించనున్నాం. 6 నెలల్లో 50 వర్క్‌షాప్స్‌తో విజయవాడ, విశాఖపట్నంలో సేవలు ప్రారంభిస్తాం. ప్రస్తుతం మా కంపెనీలో 25 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో ఈ సంఖ్యను మూడింతలు చేస్తాం. ఏడాదిలో నిధుల సమీకరణ పూర్తి చేసి.. ఇంటి వద్దకే పెట్రోల్, డీజిల్‌ సరఫరా సేవలను ప్రారంభిస్తాం’’ అని’ మహేష్‌ వివరించారు. You may be interested

సెంచురీ టెక్స్‌టైల్స్‌ లాభం రూ.228 కోట్లు

Saturday 4th May 2019

- ఒక్కో షేర్‌కు రూ.7.50 డివిడెండ్‌ న్యూఢిల్లీ: సెంచురీ టెక్స్‌టైల్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.228 కోట్ల నికర లాభం(స్డాండ్‌ అలోన్‌) సాధించింది. అంతకు మందటి ఆర్థిక సంవత్సరం (2017-18) ఇదే క్వార్టర్‌లో రూ. 109 కోట్ల  నికర లాభం ఆర్జించామని సెంచురీ టెక్స్‌టైల్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.993 కోట్ల నుంచి రూ.1,009 కోట్లకు పెరిగింది. గత క్యూ4లో మొత్తం వ్యయాలు

రాజమండ్రి ప్లాంటు రుణాలు తీరుతాయా?

Saturday 4th May 2019

జీఎంఆర్‌ గ్రూపు ప్రణాళికకు రుణదాతలు ఓకే రూ.2,353 కోట్ల రుణంలో షేర్లుగా రూ.941 కోట్లు  ప్రిఫరెన్స్‌ షేర్ల రూపంలో రుణదాతలకు కేటాయింపు మిగిలిన రూ.1412 కోట్లను 20 ఏళ్లలో చెల్లించేలా ప్లాను హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: రుణభారంతో కుంగిపోతున్న జీఎంఆర్‌ రాజమండ్రి ఎనర్జీ లిమిటెడ్‌ (జీఆర్‌ఈఎల్‌), అప్పుల ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా వెల్లడించింది. ఈ ప్రణాళికకు కంపెనీ రుణదాతలు ఆమోదం తెలిపారని పేర్కొంది. జీఎంఆర్‌ రాజమండ్రి ఎనర్జీకి

Most from this category