News


ఇదిగో... మీ భూమి చరిత్ర!!

Saturday 13th July 2019
startups_main1562992525.png-27034

  •  ప్రాపర్టీ వివరాలన్నీ క్షణాల్లో ప్రత్యక్షం
  •  విలువ, రుణాలు, అనుమతులు కూడా...
  • ‘మైఓఎస్‌ ప్రాపర్టీ.కామ్‌’ ఘనత
  • హైదరాబాద్‌ సహా 12 నగరాల్లో సేవలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రాపర్టీ కొనాలన్నా, విక్రయించాలన్నా అంత తేలికేమీ కాదు. సవాలక్ష సందేహాలుంటాయి. మెట్రో నగరాల్లో అయితే మరీ ఎక్కువ!!. ఎంపిక చేసిన ప్రాపర్టీకి ఎలాంటి లీగల్‌ చిక్కులున్నాయో? వాస్తవానికి ఆయా ప్రాంతంలో ధర ఎంత ఉందో? ఒకవేళ కొన్నాక నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయో రావో..? బ్యాంక్‌ గృహ రుణం ఎంతవరకు ఇస్తుందో? .. ఇలా ప్రతి దశలోనూ సందేహాలే. వీటన్నింటికీ ముందే... అది కూడా చిటికెలో పరిష్కారం చూపిస్తే? అదే ‘మై ఓఎస్‌ ప్రాపర్టీ.కామ్‌’ (మేక్‌ యువర్‌ ఓన్‌ స్పేస్‌ ప్రాపర్టీ.కామ్‌) ఘనత. 
యాప్‌ రూపంలో ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న దీన్ని... హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీ ‘ఓల్యూబిల్లీస్‌ ప్రాపర్టీ’ అభివృద్ధి చేసింది. మైఓఎస్‌ ప్రాపర్టీ యాప్‌కు మెంటార్‌గా ఉన్న జేఎన్‌టీయూ స్కూల్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్డ్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ మెంబర్‌ డాక్టర్‌ డి. విజయ్‌ కిశోర్‌ తమ యాప్‌ గురించి ‘స్టార్టప్‌ డైరీ’కి వివరించారు. ఇప్పటివరకు యాప్‌ డెవలప్‌మెంట్‌ కోసం రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశామని, ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యాప్స్, వెబ్‌ అప్లికేషన్స్‌ మూడూ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...
12 నగరాల్లో జియో ట్యాగ్‌...
ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, కాన్పూర్, చెన్నై, బెంగళూరు, పుణే, ముంబై, అహ్మదాబాద్, సూరత్, జైపూర్‌ నగరాల్లో సేవలందిస్తున్నాం. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, మెట్రోపాలిటన్స్, కార్పొరేషన్లు, స్పెషల్‌ అథారిటీ తాలూకు బిల్డింగ్‌ రూల్స్, మాస్టర్‌ప్లాన్స్‌ను డెవలప్‌మెంట్‌ కంట్రోల్‌ రెగ్యులేషన్స్‌ (డీసీఆర్‌) సాంకేతిక పరిజ్ఞానంతో డీ–కోడింగ్‌ చేశాం. ఆయా ప్రాపర్టీలకు జియో ట్యాగింగ్‌ చేశాం. దీంతో ఆయా ప్రాపర్టీ రెసిడెన్షియల్‌ జోన్‌లో ఉందా? కమర్షియల్‌ జోన్‌లో ఉందా? ధర ఎంత? వంటి అన్ని వివరాలు సెలక్ట్‌ చేయగానే వచ్చేస్తాయి. 
ఎలా పనిచేస్తుందంటే..?
స్మార్ట్‌ఫోన్‌లో మైఓఎస్‌ ప్రాపర్టీ.కామ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. గూగుల్‌ లొకేషన్స్‌లో మన ప్రాపర్టీ తాలూకు లొకేషన్, హద్దులను, రోడ్లను మ్యాపింగ్‌ చేయాలి. అంతే!! క్షణాల్లో ప్రాపర్టీ త్రీడీ రూపంలో ప్రత్యక్షమవుతుంది. అంతేకాదు... ఆయా ప్రాంతంలో ప్రభుత్వం నుంచి ఎన్ని అంతస్తులకు పర్మిషన్‌ ఉంది? ప్రాపర్టీ విలువ ఎంత? వంటి అన్ని వివరాలు వచ్చేస్తాయి. వీటితో పాటూ ఆర్కిటెక్ట్, ప్లానర్స్, సివిల్, స్ట్రక్చరల్‌ ఇంజనీర్ల వివరాలు, న్యాయపరమైన సలహాల కోసం లీగల్‌ నిపుణులు, రుణాల కోసం ఆర్ధిక సంస్థలు, బ్యాంక్‌ల వివరాలు, అనుమతులకు సంబంధించిన ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలు... ఇలా అన్ని వివరాలూ వచ్చేస్తాయి.
ప్రవాసుల కోసం ల్యాండ్‌గార్డ్‌...
ప్రత్యేకంగా ప్రవాసులు (ఎన్నారైల) కోసం ల్యాండ్‌గార్డ్‌ అనే మరో ఫీచర్‌ను అభివృద్ధి చేశాం. ఇదేంటంటే? ప్రవాసులు మెట్రో నగరాల్లో స్థలాలు, ప్రాపర్టీలను కొంటుంటారు. ఆయా ప్రాపర్టీల్లో ఏం జరుగుతోంది? చుట్టుపక్కల ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతోంది? ఎవరైనా కబ్జా చేశారా? వంటి రకరకాల టెన్షన్స్‌ ఉంటాయి. ఇందుకోసం ల్యాండ్‌గార్డ్‌ ఫీచర్‌లో ప్రతి నెలా ప్రాపర్టీల ప్రత్యక్ష ఫొటోలు తీసి.. వాటిని జియో ట్యాగింగ్‌ చేసి సదరు ప్రాపర్టీ యజమానులకు పంపిస్తుంటాం. ప్రస్తుతం 1100 మంది ఎన్‌ఆర్‌ఐలు మా ల్యాండ్‌గార్డ్‌ సేవలను వినియోగించుకుంటున్నారు.
రూ.100 కోట్ల వ్యాపారం లక్ష్యం...
మైఓఎస్‌ ప్రాపర్టీ యాప్‌ మీద సుమారు 50 మంది నిపుణులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి సుమారు 10 లక్షల డౌన్‌లోడ్స్‌కు చేరుకుంటాం. వచ్చే ఏడాది కాలంలో వంద నగరాలకు, రూ.100 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నది మా లక్ష్యం.You may be interested

పెట్టుబడులకు బడ్జెట్‌ బూస్ట్‌

Saturday 13th July 2019

 రాజ్యసభలో నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: పెట్టుబడుల పురోగతి, ద్రవ్య స్థిరీకరణ వంటి ఉన్నత లక్ష్యాల సాధనకు అనుగుణంగా 2019-20 బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఆయా కీలక లక్ష్యాల్లో రాజీలేదని స్పష్టం చేశారు. బడ్జెట్‌పై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ, వచ్చే 10 సంవత్సరాల్లో ‘‘సమగ్ర అభివృద్ధి చర్యల’’ను బడ్జెట్‌ నిర్దేశిస్తున్నట్లు తెలిపారు. ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడమే భారత్‌ లక్ష్యమని తెలిపారు.

లాభాల్లోకి ట్రూజెట్‌!

Saturday 13th July 2019

గత అక్టోబరు నుంచి నిర్వహణ లాభాలు ప్రస్తుతం సంస్థ చేతిలో 5 విమానాలు  నవంబరు నాటికి ఈ సంఖ్య 10కి చేరుతుంది ఈశాన్యం సహా మరిన్ని ప్రాంతాలకు సర్వీసులు ‘అనుబంధ’ ఆదాయాలపైనా ఫోకస్‌ సీఎఫ్‌ఓ విశ్వనాథ్‌, ఎంఈఐఎల్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: విమానయాన రంగ కంపెనీలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో... తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్రూజెట్‌ మాతృ సంస్థ టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ మాత్రం తొలిసారి లాభాల్లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. 2018

Most from this category