News


రవాణా... రయ్‌..రయ్‌

Saturday 22nd June 2019
startups_main1561177522.png-26490

  •  15 లాజిస్టిక్‌ సంస్థలతో షిప్‌రాకెట్‌ ఒప్పందం
  • 1.5 లక్షల మంది విక్రయదారుల నమోదు
  • ఏటా 10 లక్షల డెలివరీ; రూ.348 కోట్ల జీఎంవీ
  • త్వరలోనే పోస్టల్‌ విభాగంతో ఒప్పందం 
  • ‘స్టార్టప్‌ డైరీ’తో కో–ఫౌండర్‌ సాహిల్‌ గోయల్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రిటైలర్, హోల్‌సేలర్ అనే తేడా లేదు ప్రతి ఒక్కరూ తమ వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లోకి విస్తరించాలని భావిస్తున్నారు. మెట్రో నగరాల్లో అయితే ఓకే.. ఎందుకంటే అందుబాటులో లాజిస్టిక్‌ కంపెనీ సేవలుంటాయి కాబట్టి! మరి, గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపారస్తులు ఈ–కామర్స్‌లోకి ఎంట్రీ ఇస్తే.. ఉత్పత్తుల పికప్, డెలివరీ ఎవరు చేయాలి? పోనీ, కొరియర్‌ సంస్థలేమైనా చేస్తాయా అంటే ఆర్డర్లు బల్క్‌లో ఉంటే తప్ప దగ్గరికి రావు. ఇదీ ఇప్పటివరకు గ్రామీణ వ్యాపారస్తుల సమస్య. దీనికి పరిష్కారం చూపిస్తోంది షిప్‌రాకెట్‌. చిన్న, పెద్ద ఆర్డర్‌ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కటీ డెలివరీ చేయడమే దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు షిప్‌రాకెట్‌ కో–ఫౌండర్‌ సాహిల్‌ గోయల్‌ మాటల్లోనే..
15 సంస్థలతో ఒప్పందం...
ప్రస్తుతం అరామెక్స్, ఈకామ్‌ ఎక్స్‌ప్రెస్, బ్లూడార్ట్, డెల్హివరీ, గటీ, ఫెడెక్స్, డీహెచ్‌ఎల్, ప్రొఫిషనల్‌ వంటి 15కి పైగా కొరియర్‌ సంస్థలతో ఒప్పందం ఉంది. దేశంలోని 26 వేల పిన్‌కోడ్స్‌లో, 220 దేశాల్లో డెలివరీ సేవలందిస్తున్నాం. ప్రస్తుతం షిప్‌రాకెట్‌లో 1.5 లక్షల మంది విక్రయదారులు నమోదయ్యారు. ప్రతి ఉత్పత్తి మీద అమ్మకందారు నుంచి కమీషన్‌ ఉంటుంది. డొమెస్టిక్‌ షిప్పింగ్‌ చార్జీలు 500 గ్రాములకు ప్రారంభ ధర రూ.27, ఇంటర్నేషనల్‌లో రూ.110.
10 లక్షల డెలివరీలు; రూ.348 కోట్ల జీఎంవీ..
గతేడాది మా ఒప్పంద లాజిస్టిక్‌ సంస్థలకు రూ.348 కోట్ల (50 మిలియన్‌ డాలర్లు) గ్రాస్‌ మర్చండేజ్‌ వ్యాల్యూ (జీఎంవీ) వ్యాపారాన్ని చేసిచ్చాం. ఈ ఏడాది 800 మిలియన్‌ డాలర్ల జీఎంవీని లక్ష్యించాం. ప్రస్తుతం ఏడాదికి 10 లక్షల ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాం. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 20 శాతం వరకుంటుంది. కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి ఎక్కువ వ్యాపారం ఉంటుంది. 2020 నాటికి ఏటా 30 లక్షల డెలివరీలను లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి నెలా ఆదాయం 15 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం.
సొంతంగా ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌...
రిమోట్‌ ప్రాంతాల్లోనూ డెలివరీ సేవలందించేందుకు భారత తపాలా శాఖతో ఒప్పందం చేసుకోనున్నాం. దీని తర్వాత సొంతంగా ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. రెండేళ్లలో ఆయా సేవలు అందుబాటులోకి వస్తాయి. 2020 నాటికి ఆఫ్రికా, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోకి విస్తరించాలని లక్ష్యించాం. ఇప్పటివరకు 14 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించాం. బెర్ట్‌లెస్‌మన్‌ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్, నిర్వాణా డిజిటల్‌ ఇండియా, బీనెక్ట్స్‌ సంస్థలు ఈ పెట్టుబడులు పెట్టాయని గోయల్‌ తెలిపారు. You may be interested

కెనడా కంపెనీ చేతికి మహీంద్రా ఏఎమ్‌సీలో 49 శాతం వాటా

Saturday 22nd June 2019

డీల్‌ విలువ 3.5 కోట్ల డాలర్లు  ముంబై: మహీంద్రా ఫైనాన్స్‌ కంపెనీ తన అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో 49 శాతం వాటాను కెనడా కంపెనీకి విక్రయించింది. మహీంద్రా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో 49 శాతం వాటాను కెనడాకు చెందిన మ్యాన్‌యులైఫ్‌ కంపెనీ 3.5 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిందని మహీంద్రా ఫైనాన్స్‌ తెలిపింది.  అలాగే మహీంద్రా ట్రస్టీ కంపెనీలో 49 శాతం వాటాను 10 క్షల డాలర్లకు కొనుగోలు చేసిందని వివరించింది.

ఓపెన్‌ ఆఫర్‌ నుంచి మినహాయింపునివ్వాలి

Saturday 22nd June 2019

స్లాట్స్‌పై హామీ కావాలి జెట్‌ టేకోవర్‌కు ఎతిహాద్‌ డిమాండ్లు ముంబై: రుణ సంక్షోభంతో మూతబడిన జెట్‌ ఎయిర్‌వేస్‌ను టేకోవర్ చేయాలంటే ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపునివ్వాలని, ఎయిర్‌పోర్టులలో స్లాట్స్‌పై హామీ ఇవ్వాలని ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ డిమాండ్ చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ వెల్లడించింది. అయితే, ఆయా మినహాయింపులపై హామీ ఇచ్చేందుకు తమకు అధికారాలేమీ లేవని పేర్కొంది.  జెట్ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్న నేపథ్యంలో గతేడాది కాలంగా సముచిత పరిష్కార

Most from this category