News


పావుగంటలో పాకెట్‌ మనీ!!

Saturday 8th June 2019
startups_main1559978943.png-26175

  • ఆధార్, స్టూడెంట్‌ ఐడీ సమర్పిస్తే చాలు
  • విద్యార్థులకు రుణాలివ్వటమే ఎంపాకెట్‌ ప్రత్యేకత
  • 5 లక్షల మంది యూజర్లు; ఏటా రూ.500 కోట్ల పంపిణీ
  • త్వరలోనే కొత్త ఉద్యోగులకు పర్సనల్‌ లోన్స్‌
  • ‘స్టార్టప్‌ డైరీ’తో ఎంపాకెట్‌ ఫౌండర్‌ గౌరవ్‌ జలాన్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఉద్యోగస్తులో లేదా వ్యాపారస్తులో... అది కూడా సిబిల్‌ స్కోర్‌ సరిగా ఉన్నవాళ్లకు మాత్రమే బ్యాంకులు క్రెడిట్‌ కార్డులు అందిస్తుంటాయి. మరి, చదువుకునే విద్యార్థులు లేదా అప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరిన యువత పరిస్థితేంటి? దీనికి పరిష్కారమే ఎంపాకెట్‌! కేవలం స్టూడెంట్స్‌కు పాకెట్‌ మనీ, యంగ్‌ ప్రొఫిషనల్స్‌కు పర్సనల్‌ లోన్స్‌ ఇవ్వటమే దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలను ఎంపాకెట్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ గౌరవ్‌ జలాన్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే...
వడ్డీ నెలకు 3 శాతం..
‘‘ఎంపాకెట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని.. స్టూడెంట్‌ పేరు, చిరునామా, స్టూడెంట్‌ ఐడీ కార్డు, ఆధార్‌ వంటి వివరాలు సమర్పించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. వెరిఫికేషన్‌ పూర్తయిన 15 నిమిషాల తర్వాత లోన్‌ పొందవచ్చు. అర్హత పొందిన రుణం నేరుగా మీ బ్యాంక్‌ అకౌంట్‌కు లేదా పేటీఎం వాలెట్‌కు వస్తుంది. రూ.500 నుంచి రూ.10 వేల వరకు రుణాన్ని తీసుకునే వీలుంది. ఈ సొమ్మును తిరిగి మూడు నెలల్లోగా చెల్లించేయాలి. వడ్డీ నెలకు 3 శాతం.
ఏటా రూ.500 కోట్ల రుణాలు...
ఎంపాకెట్‌లో స్నేహితులను యాడ్‌ చేస్తుంటే రివార్డు రూపంలో ఎం–కాయిన్స్‌ కూడా పొందవచ్చు. ప్రస్తుతం మాకు 5 లక్షల మంది కస్టమర్లున్నారు. ఇందులో 5 శాతం హైదరాబాద్‌ నుంచి ఉంటారు. ఏటా రూ.500 కోట్ల రుణాలందిస్తున్నాం. గత నెలలో రూ.40 కోట్లను పంపిణీ చేశాం. ఏటా ఐదు రెట్ల ఆదాయ వృద్ధిని నమోదు చేస్తున్నాం. వచ్చే రెండేళ్లలో ఏటా రూ.2,500 కోట్లు రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యించాం.
ఉద్యోగులకు పర్సనల్‌ లోన్స్‌...
ప్రస్తుతం మా కంపెనీలో 200 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో ఈ సంఖ్యను వెయ్యికి చేరుస్తాం. ఇటీవలే అమెరికాకు చెందిన వీసీ విలేజ్‌ క్యాపిటల్‌ నుంచి మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించాం. కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువత కోసం పర్సనల్‌ లోన్స్‌ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. 6 నెలల్లో సేవలను ప్రారంభించనున్నాం’’ అని గౌరవ్‌ తెలిపారు. You may be interested

విద్యార్థుల వసతి మార్కెట్‌లోకి రూ.700 కోట్లు

Saturday 8th June 2019

50 బిలియన్‌ డాలర్లను ఆకర్షించే సత్తా ఉంది నైట్‌ఫ్రాంక్‌ సంస్థ నివేదికలో అంచనా న్యూఢిల్లీ: దేశంలో విద్యార్థుల వసతుల (స్టూడెంట్‌ హాస్టల్‌) మార్కెట్‌ గతేడాది 100 మిలియన్‌ డాలర్ల (రూ.700కోట్లు) నిధులను ఆకర్షించినట్టు నైట్‌ఫ్రాంక్‌ సంస్థ తెలిపింది. ప్రస్తుత డిమాండ్‌, సరఫరా మధ్య అంతరాన్ని తొలగించేందుకు గాను ఈ విభాగానికి 50 బిలియన్‌ డాలర్ల (రూ.3.5 లక్షల కోట్లు) పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం ఉందని పేర్కొంది. ‘‘దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల పరిధిలో 3.4

ఏడు రోజుల్లో చెల్లింపులు: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

Saturday 8th June 2019

అన్ని చర్యలు తీసుకుంటామన్న కంపెనీ  నిధుల సమస్యకు నిదర్శనం డీహెచ్‌ఎఫ్‌ఎల్‌: ఫిచ్‌ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై మరింత ఒత్తిడి: యూటీఐ ఎమ్‌ఎఫ్‌ న్యూఢిల్లీ: నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల(ఎన్‌సీడీ)పై వడ్డీ, అసలు చెల్లింపుల్లో విఫలమైన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ, ఏడు రోజుల గ్రేస్‌ పీరియడ్‌లో అన్ని చెల్లింపులు సకాలంలో పూర్తి చేస్తామని, భవిష్యత్తుల్లో చెల్లింపుల్లో విఫలం కాబోమని పేర్కొంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా జారీ చేసిన నాన్‌ కన్వర్టబుల్‌  డిబెంచర్లు(ఎన్‌సీడీ)కు వడ్డీ చెల్లింపుల్లో జాప్యం జరిగిందని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ అంగీకరించింది. అయితే

Most from this category