News


కళ్లజోళ్లకూ ఆన్‌లైనే..

Friday 28th July 2017
startups_main1501265150.png-6118

  •  రూ.250కే ఫ్రేములు, లెన్స్‌
  •  దేశ, విదేశాల నుంచి బ్రాండెడ్‌ ఉత్పత్తుల దిగుమతి
  •  ప్రస్తుతం అబిడ్స్‌లో స్టోర్‌; వారం రోజుల్లో కూకట్‌పల్లిలో కూడా..

ఇంజినీరింగ్‌ చదివే సమయంలో ప్రాజెక్ట్‌ వర్క్‌లో భాగంగా సందర్శించిన అరవింద్‌ ఐ కేర్‌.. ఏకంగా కంపెనీ ప్రారంభానికి పునాది వేసింది. కళ్లజోళ్ల విభాగంలో వ్యాపార అవకాశాలను తెలియజేసింది. ఈ ఉపోద్ఘాతమంతా హైదరాబాదీ స్టార్టప్‌ లెన్స్‌ఫిట్‌.కామ్‌ గురించి! మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ వంశీ సీమకుర్తి మాటల్లోనే..
ప్రాజెక్ట్‌ వర్క్‌ కంపెనీ ప్రారంభానికి పునాది వేసిందంటే ఎవరూ నమ్మరు. కానీ, ఇది నిజం. – గీతం వర్సిటీలో ఇంజినీరింగ్‌ చదివే సమయంలో జాగృతి యాత్రలో భాగంగా అరవింద్‌ ఐ కేర్‌ను వెళ్లా. అక్కడ గడిపిన సమయం నన్ను మార్చింది. ఐ కేర్‌లో ఉన్న వ్యాపార అవకాశాల గురించి తెలిసింది. నిజం చెప్పాలంటే మన దగ్గర ఆన్‌లైన్‌లో కళ్లజోళ్ల ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఉన్నా.. కొన్ని సంస్థలే ఉండటంతో ధరల్లో, నాణ్యతలో పెద్ద తేడా లేదనిపించింది. దీనికి పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో అభిలాష్‌తో కలిసి ఈ ఏడాది ప్రారంభంలో లెన్స్‌ఫిట్‌.కామ్‌ను ప్రారంభించాం.
ఫ్రేము, లెన్స్‌ కలిపి రూ.250..
లెన్స్‌ఫిట్‌ వెబ్‌సైట్, యాప్స్‌ అభివృద్ధి, మార్కెటింగ్‌ ఇతరత్రా వాటికి రూ.5 లక్షల పెట్టుబడులు పెట్టాం. ఇప్పటికే ఈ విభాగంలో కంపెనీలున్నా మా ప్రత్యేకత ఏంటంటే.. కళ్లజోళ్ల ఫ్రేము, లెన్స్‌ కలిపి రూ.250కు అందించడమే. నాణ్యతలో ఏమాత్రం తగ్గకుండా. లెన్స్‌ఫిట్‌లో కళ్లజోళ్ల ఫ్రేములు, సన్‌గ్లాసులు, కాంటాక్ట్‌ లెన్స్‌లు, కళ్లజోళ్ల బాక్స్‌లు, స్క్రూడైవర్‌ సెట్లు, కీచెయిన్ల వంటి ఇతరత్రా ఉత్పత్తులుంటాయి. ఆయా ఉత్పత్తులు పెద్దలవి, పిల్లలవి, అన్ని రంగుల్లోనూ లభ్యమవుతాయి.
విదేశాల నుంచి దిగుమతి..
ఫ్రేములను, లెన్స్‌లను మన దేశంతో పాటూ చైనా, ఇటలీ, అమెరికా, జపాన్, కొరియా నుంచి ఫ్రేములు, లెన్స్‌లను దిగుమతి చేసుకున్నాం. టామ్‌ వాలెన్‌టైన్, ఆల్కాన్, అక్యూవ్యూ, ఫ్రెష్‌లుక్, బౌష్‌ అండ్‌ ల్యాంబ్, చార్లె రిచ్‌మండ్, కిడ్డో, వైల్డ్‌స్పిరిట్‌ వంటి బ్రాండ్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం మా వద్ద 2,000 రకాల ఫ్రేములు, లెన్స్‌లున్నాయి. ఫ్రేములను, లెన్స్‌లను పెద్ద మొత్తంలో ఒకేసారి కొనుగోలు చేస్తాం. ఇటీవలే టెక్‌ మహీంద్రాలో మార్కెటింగ్‌ క్యాంపెయిన్‌ నిర్వహించాం. ఒకేరోజు 50కి పైగా ఆర్డర్లొచ్చాయి.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ కొనుగోలు..
లెన్స్‌ఫిట్‌ ఉత్పత్తులను 2 రకాలుగా కొనుగోలు చేయవచ్చు. వెబ్‌సైట్, ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యాప్స్‌ ఉన్నాయి. ఆఫ్‌లైన్‌లో అయితే అబిడ్స్‌లో ఫ్రాంచైజీ విధానంలో స్టోర్‌ ఉంది. వారం రోజుల్లో కూకట్‌పల్లిలోని సుజన ఫోరం మాల్‌లో మరో స్టోర్‌ను ప్రారంభించనున్నాం. ప్రస్తుతం 400 మంది రిజిస్టర్‌ కస్టమర్లున్నారు. వచ్చిన ఆర్డర్లను ఫ్రేములు, లెన్స్‌ల ప్రకారం అబిడ్స్‌లోని తయారీ కేంద్రంలో బిగిస్తాం. కళ్లజోళ్ల ఫ్రేములు, లెన్స్‌ల బిగింపు సరిగా లేకపోయినా.. ఎలాంటి పొరపాట్లు జరిగినా రిటర్న్‌ తీసుకొని కొత్త ఉత్పత్తులను అందిస్తాం. ఆర్డర్లను డెలివరీ చేసేందుకు ఫస్ట్‌ ఫ్లయిట్, ఫెడెక్స్, డెల్హివరీ, బ్లూడార్ట్‌ వంటి కొరియర్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. 3–4 రోజుల్లో డెలివరీ పూర్తి చేస్తాం.You may be interested

‘స్మార్ట్‌’గా పంటల నిర్వహణ

Friday 28th July 2017

 సెల్‌ఫోన్‌లో పంటలు, తోటలు, నర్సరీ నిర్వహణ, సేకరణ సేవలు  వ్యవసాయ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిన స్టాంప్‌ ఐటీ  క్రాప్‌ టెరైన్‌తో పంటల నిర్వహణ వేగవంతం వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగం అంటే.. విత్తనాల సేకరణ గురించో లేక నాట్లు ఎప్పుడో నాటాలో లేక వాతావరణ సూచనలకో పరిమితమవుతాయని మనకు తెలుసు! కానీ, రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పురుడు పోసుకున్న స్టాంప్‌ ఐటీ...  ఏకంగా పంటలు, తోటలు, నర్సరీల నిర్వహణ ఎలా చేయాలో

17 శాతం పెరిగిన ఎన్‌ఐఐటీ

Friday 28th July 2017

ముంబై:- సాఫ్ట్‌వేర్‌ శిక్షణా సంస్థ ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌ షేరు శుక్రవారం బీఎస్‌ఈలో ఇంట్రాడేలో 17శాతం లాభపడింది. ఈ యేడాది ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(క్యూ1)లో ఆశించిన స్థాయిలో ఫలితాల ప్రకటించడం షేరు లాభపడటానికి ప్రధాన కారణమైంది. కన్సాలిడేట్‌ ప్రతిపాదికన ప్రకటించిన క్యూ1లో ఎన్‌ఐఐటీ రూ10.04 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం గతేడాది రూ.209.9 కోట్లు నమోదు కాగా, ఈ యేడాది రూ.210కోట్లుగా నమోదు చేసింది. ఈ ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఐఐటీ

Most from this category