News


ట్రావెల్‌ టికెట్ల కోసం జియోబస్‌ (స్టార్టప్‌ డైరీ)

Saturday 29th June 2019
startups_main1561781449.png-26675

  • బస్, విమాన టికెట్లతో పాటు హోటల్స్, క్యాబ్స్‌
  •  నెలకు 8 వేల టికెట్లు; రూ.5 లక్షల ఆదాయం
  •  ఏడాదిలో యుటిలిటీ బిల్స్, నగదు బదిలీ సేవల్లోకి
  • ‘స్టార్టప్‌ డైరీ’తో ఫౌండర్‌ మురళీ కృష్ణ

హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: బస్, రైలు, విమాన టికెట్ల బుకింగ్‌ సేవల్లోకి మరో తెలుగు కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ‘జియోబస్‌.ఇన్‌’ ప్రయాణ టికెట్లతో పాటు హోటల్స్, క్యాబ్స్‌ బుకింగ్స్, హాలిడే ప్యాకేజెస్, రీచార్జ్‌ వంటి ఇతర సేవలను కూడా అందిస్తుంది. ప్రతి టికెట్‌ బుకింగ్‌పై 5 శాతం రాయితీ అందిస్తున్నట్లు కంపెనీ ఫౌండర్‌ మురళీ కృష్ణ బండారుపల్లి ‘స్టార్టప్‌ డైరీ’తో చెప్పారు. మరిన్ని వివరాలివీ..

మాది గుంటూరు జిల్లా పెదనందిపాడు. ఎంసీఏ పూర్తయ్యాక.. హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరా. సెలవు రోజుల్లో ఇంటికెళ్లిన ప్రతిసారీ బస్, ట్రెయిన్‌ టికెట్స్‌ కోసం నేను పడ్డ శ్రమే.. జియోబస్‌.ఇన్‌కు పునాది వేసింది. నాతో పాటూ మరొక పది మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగం కల్పించొచ్చనే ఉద్దేశంతో రూ.12 లక్షల పెట్టుబడితో జియోబస్‌.ఇన్‌ను ప్రారంభించాం.
టికెట్లు, హోటల్స్, రీచార్జ్‌లు...
ప్రస్తుతం బస్సు, విమాన టికెట్లు, హోటల్స్, క్యాబ్‌ బుకింగ్స్, హాలిడే ప్యాకేజెస్, రీచార్జ్‌ సేవలను అందిస్తున్నాం. బస్‌ టికెట్ల విభాగంలో 150 మంది ఏజెంట్లు, 300 మంది బస్‌ ఆపరేటర్లు నమోదయ్యారు. ఈట్రావోస్, రెడ్‌బస్, అభిబస్, టికెట్‌గూస్‌లతో, క్యాబ్స్‌ కోసం క్లియర్‌కార్‌ రెంట్, సవారీ, మోజియోలతో ఒప్పందం చేసుకున్నాం. రీచార్జ్‌ కోసం సైబర్‌ప్లాట్, భీమ్‌కో, ఇన్‌స్టాంట్‌ పేలతో, హోటల్‌ గదుల కోసం ఓయో, ఎక్స్‌ఎంఎల్‌ రూమ్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. జెట్, స్సైస్‌ జెట్, ఇండిగో వంటి అన్ని విమానయాన సంస్థల టికెట్లు బుకింగ్‌ చేసుకోవచ్చు.
హాలిడే ప్యాకేజెస్‌ ప్రత్యేకం...
హాలిడే ప్యాకేజెస్‌లో శ్రీశైలం, తిరుపతి ఉన్నాయి. ప్రయాణ టికెట్లు, భోజన వసతి ఏర్పాట్లతో పాటూ దైవ దర్శనం కూడా కంపెనీయే అందిస్తుంది. నెల రోజుల్లో శ్రీశైలం, కాళహస్తి ప్రాంతాలను కూడా చేర్చనున్నాం. వచ్చే ఏడాది కాలంలో ప్రభుత్వ రవాణా టికెట్ల బుకింగ్స్‌తో పాటూ యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, నగదు బదిలీ, ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ సేవలను కూడా ప్రారంభింస్తాం.
నెలకు 8 వేల బుకింగ్స్‌...
ప్రస్తుతం నెలకు 8 వేల టికెట్లు బుకింగ్‌ అవుతున్నాయి. వీటిల్లో బస్, హోటల్స్‌ బుకింగ్స్‌ వాటా 60 శాతం వరకుంటాయి. షిరిడీ, తిరుపతి, విజయవాడ రూట్లలో ఎక్కువ టికెట్లు బుకింగ్స్‌ అవుతున్నాయి. గత నెలలో రూ.5 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. త్వరలోనే మార్కెటింగ్‌ కోసం రూ.15 లక్షల నిధులను సమీకరించనున్నాం. ఆస్ట్రేలియాలోని పలువురు స్నేహితులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. You may be interested

జీవితకాల గరిష్టస్థాయికి ఫారెక్స్ నిల్వలు

Saturday 29th June 2019

  426.416 బిలియన్ డాలర్లకు చేరిక వచ్చే 10నెలల దిగుమతులకు ఢోకాలేని స్థాయి ముంబై: విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) జీవితకాల గరిష్టస్థాయికి చేరాయి. ఆర్‌బీఐ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈఏడాది జూన్‌ 21తో ముగిసిన వారంలో ఏకంగా 4.215 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 426.416 బిలియన్ డాలర్లకు ఎగశాయి. గణనీయంగా పెరిగిన విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు, రూపాయి మారకం విలువ స్థిరంగా ఉండడం వంటి సానుకూల అంశాలు ఇందుకు సహకరించాయి.

ఎస్‌బీఐ ఎగవేతదారులు వీరే...

Saturday 29th June 2019

పది బడా ఉద్దేశపూర్వక డిఫాల్టర్ల వివరాల వెల్లడి ముంబై: ప్రభుత్వరంగంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ, ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన పది పెద్ద ఖాతాదారుల వివరాలను వెల్లడించింది. ఇందులో ఫార్మా కంపెనీలు, జెమ్స్‌, జ్యుయలరీ సంస్థలు, విద్యుత్‌ రంగ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలతోపాటు, వీటికి సంబంధించి కొంత మంది డైరెక్టర్లను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించింది. ఈ పది ఖాతాల నుంచి ఎస్‌బీఐకి రూ.1,500 కోట్ల మేర రుణాలు వసూలు కావాల్సి ఉంది.

Most from this category