News


ప్రకటనలు చూస్తే డబ్బులు వస్తాయి.

Saturday 15th June 2019
startups_main1560573083.png-26307

  • కాల్‌ పూర్తవగానే యాడ్‌ వీడియో డిస్‌ప్లే
  • పూర్తిగా చూస్తే డిజిటల్‌ వాలెట్‌లో మనీ
  • సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన క్విక్‌యాడ్స్‌
  • ప్రస్తుతం 1.6 లక్షల యూజర్లు; 74 కంపెనీల కస్టమర్లు
  • ‘స్టార్టప్‌ డైరీ’తో క్విక్‌ యాడ్స్‌ సీఈఓ సుమంత్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రకటనలు చూస్తే మనకేం వస్తుంది? కొత్త ఉత్పత్తులు లేక ఆఫర్ల గురించి తెలుస్తుంది. అంతే కదా!!. కానీ, యాడ్‌ చూస్తే చాలు మన జేబులోకి డబ్బులొస్తే? ఇది అక్షరాలా నిజం. క్విక్‌యాడ్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఇది సాధ్యమే. ప్రకటనల రంగంలో సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది హైదరాబాదీ స్టార్టప్‌ క్విక్‌యాడ్స్‌. మరిన్ని వివరాలు సీఈఓ సుమంత్‌ రాగిరెడ్డి మాటల్లోనే..
‘‘యూజర్లు తమ ఫోన్లలో క్విక్‌యాడ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. చాలా మంది మా యాప్‌లో అడ్వర్టయిజ్‌మెంట్స్‌ ప్రసారమవుతాయని అనుకుంటారు. కానీ అది తప్పు యాప్‌లో ఏమీ ఉండదు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న మొబైల్స్‌లో యూజర్లు ఫోన్‌ మాట్లాడడం పూర్తవగానే యాడ్‌ వీడియో వస్తుంది అంతే! దీన్ని పూర్తిగా చూస్తే.. యూజర్లకు డిజిటల్‌ వాలెట్‌లోకి డబ్బులొస్తాయి. నెలకు 200–800 వరకు ఆదాయం వస్తుంది. 
1.6 లక్షల యూజర్లు; 74 మంది క్లయింట్లు..
ప్రస్తుతం మాకు 1.6 లక్షల మంది యూజర్లతో పాటు, 74 కంపెనీలు క్లయింట్స్‌గా ఉన్నాయి. గీతమ్‌, కేఎల్‌, విజ్ఞాన్‌ యూనివర్సిటీలు, ప్రైడ్‌ హోండా, జేఎస్‌ఆర్‌ గ్రూప్, శ్రీ తారక జువెల్లర్స్‌ వంటి కంపెనీలు జాబితాలో ఉన్నాయి. త్వరలోనే కేఎఫ్‌సీ, బీఎస్‌ఎన్‌ఎల్, ఎస్‌బీఐలతో ఒప్పందం చేసుకోనున్నాం. 10, 20, 30 సెకన్ల నిడివి గల యాడ్‌ వీడియోలుంటాయి. ధరలు రూ.5 వేల నుంచి రూ.12 లక్షల వరకూ ఉంటాయి.
రూ.6 కోట్ల ఆదాయం...
193 దేశాల్లో 3 రకాల సాఫ్ట్‌వేర్‌ పేటెంట్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాం. ప్రస్తుతానికి ఇండియన్‌ పేటెంట్, కాపీరైట్స్‌ హక్కులు వచ్చాయి. ఇప్పటివరకు రూ.52 లక్షల ఆదాయం వచ్చింది. 4 నెలల్లో ఏపీ, మహారాష్ట్ర, అస్సాంలకు విస్తరించనున్నాం. ఆగస్టు నుంచి నైజీరియా, కెన్యా దేశాల్లో సేవలను ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది కాలంలో కార్పొరేట్‌లో 50, లోకల్‌లో 5 వేల కంపెనీలకు, 6–7 లక్షల యూజర్లకు చేరుకోవాలని, రూ.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యించాం.
రూ.1.5 లక్షలకు ఫ్రాంచైజీ...
ప్రస్తుతానికి యూజర్లకు క్విక్‌ యాడ్‌ డిజిటల్‌ వాలెట్‌లో మనీని జమ చేస్తున్నాం. వీటిని యూజర్‌ కావాలంటే రీచార్జ్‌లు, మూవీ టికెట్స్‌ తదితరాలకు వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో ఈ సొమ్ముతో యూజర్‌ పేరు మీద బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించాం. యూజర్‌ బీమా ప్రీమియం ఈ సొమ్ముతో కంపెనీయే చెల్లిస్తుంది. ఇప్పటివరకు రూ.1.2 కోట్ల పెట్టుబడి పెట్టాం. నాలుగున్నర నెలల్లో బ్రేక్‌ ఈవెన్‌కు వస్తాం. క్విక్‌యాడ్స్‌ ఫ్రాంచైజీలు ఇస్తున్నాం. రూ.1.5 లక్షల చార్జీ. ఇప్పటివరకు తెలంగాణలో 25 ఫ్రాంచైజీలు ఇచ్చాం. అడ్వర్టయిజ్‌మెంట్‌ మెటీరియల్స్, సాఫ్ట్‌వేర్, టెక్నికల్‌ సపోర్ట్‌ అంతా కంపెనీదే’’ అని సుమంత్‌ తెలిపారు. 



You may be interested

అమెరికా దిగుమతులపై సుంకాలు

Saturday 15th June 2019

29 ఉత్పత్తులపై టారిఫ్‌ల వడ్డన ఈ నెల 16 నుంచి అమల్లోకి భారత్‌కు అదనంగా 217 మిలియన్ డాలర్ల ఆదాయం న్యూఢిల్లీ: భారత్‌ నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం తదితర ఉత్పత్తులపై అమెరికా భారీగా సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ప్రతిగా అమెరికన్ దిగుమతులపై కూడా టారిఫ్‌ల వడ్డనకు రంగం సిద్ధమైంది. జూన్ 16 నుంచి అమెరికా నుంచి దిగుమతయ్యే 29 ఉత్పత్తులపై అదనంగా కస్టమ్స్ సుంకాలు విధించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటిదాకా దీన్ని వాయిదా

లీజుకు షి‘కారు’!!

Saturday 15th June 2019

డౌన్‌ పేమెంట్‌ లేకుండానే చేతికి కారు హ్యుందాయ్‌ క్రెటాకు నెలకు రూ.17,640 చాలు అదే స్కోడా సూపర్బ్‌ అయితే రూ.19,856 ఫియట్‌, జీప్‌ మోడళ్లను అందిస్తున్న ఎఫ్‌సీఏ ఇండియా లీజు మోడల్‌ అమలు చేస్తున్న కార్ల కంపెనీలు అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త వ్యూహం నిర్వహణ బాదరబందీలు కూడా మనకుండవు పరిస్థితిని గమనిస్తున్నామన్న మారుతీ, టాటా హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:  డౌన్‌ పేమెంటేమీ లేకుండా నచ్చిన కారు చేతికొస్తే..!! అదీ నిర్వహణ, బీమా వంటి ఖర్చులు లేకుండా జస్ట్‌ నెలవారీ అద్దెతో!!. చాలామందికి ఇది

Most from this category