News


పిల్లలకు ‘న్యూట్రీట్‌లైఫ్‌’

Saturday 18th August 2018
startups_main1534565663.png-19403

♦ చక్కని పోషకాలతో హోమ్‌ఫుడ్‌
♦ క్యాన్సర్, డయాబెటిక్, ఊబకాయులకూ ప్రత్యేక ఆహారం
♦ ప్రస్తుతం ఏపీలో 3 స్టోర్లు; నెల రోజుల్లో హైదరాబాద్‌లో
♦ ‘స్టార్టప్‌ డైరీ’తో న్యూట్రీట్‌లైఫ్‌ ఫౌండర్‌ జ్యోతి
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గర్భవతి అని తెలియగానే ఏ స్త్రీ అయినా ముందు సంతోషిస్తుంది. ఆ తర్వాత పండంటి బిడ్డ పుట్టాలని దేవుణ్ణి  ప్రార్థిస్తుంది. విజయవాడకు చెందిన జ్యోతి విషయంలోనూ అంతే! సెరలాక్, ఫారెక్స్‌ వంటి ఎన్నో రకాల పిల్లల ఆహార ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నా.. తనకు ఏదో అసంతృప్తి!. ఒకవైపు 9 నెలలు కడుపులో బిడ్డను మోస్తూ.. మరోవైపు పుట్టబోయే బిడ్డకు ఇవ్వాల్సిన పౌష్టికాహారం మీద పరిశోధన చేసింది. దాని ఫలితమే పిల్లల న్యూట్రీషన్‌ ఫుడ్‌ స్టార్టప్‌ ‘న్యూట్రీట్‌లైఫ్‌.కామ్‌’! మరిన్ని వివరాలు ఫౌండర్‌ జ్యోతి పప్పు మాటల్లోనే...
‘‘మాది విజయవాడ. చెన్నైలోని శ్రీరామచంద్ర యూనివర్సిటీ నుంచి ఎంఫార్మసీ పూర్తయింది. చదువైపోగానే పెళ్లవటంతో జాబ్‌ చేయడానికి వీలు కాలేదు. ప్రెగ్నెన్సీ అని తెలిశాక.. పుట్టబోయే బిడ్డకు ఎలాంటి బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలా అని ఆలోచించేదాన్ని. సెరలాక్, ఫారెక్స్‌లు పెడదామంటే ఆ చిన్న ఊళ్లో దొరకవేమో అని భయమేసేది. చదివిన చదువు కూడా ఎంఫార్మసీలో పీడియాట్రిషన్‌ కావటంతో సొంతంగా ఇంట్లో తయారు చేస్తే పోలే అనిపించింది!!. తెలిసిన అమ్మమ్మలు, తాతమ్మలతో దీనిపైనే చర్చించి.. డ్రై ఫ్రూట్స్, పప్పు దినుసులు, ఇతరత్రా సుగంధ ద్రవ్యాలతో ఉగ్గులాంటి మిశ్రమాన్ని తయారు చేసి మా అబ్బాయికి పెట్టేదాన్ని. ఆ మిశ్రమం వల్లో లేక మా జీన్స్‌ వల్లో తెలియదు గానీ మా అబ్బాయి ఇతర పిల్లల కంటే చురుగ్గా.. ఆరోగ్యంగా ఉండేవాడు. ఇది గమనించిన బంధువులు, స్నేహితులు మాకూ ఆ మిశ్రమాన్ని తయారు చేయమని అడిగేవాళ్లు. ఈ క్రమంలోనే న్రూట్రీట్‌లైఫ్‌.కామ్‌ స్టార్టప్‌కు బీజం పడింది. రూ.30 వేల ఖర్చుతో 2016లో విజయవాడ కేంద్రంగా దీన్ని ప్రారంభించా.
8 నెలల పిల్లలకు ఆహారం..
ప్రస్తుతం 12 రకాల ఆహార ఉత్పత్తులున్నాయి. 8 నెలల పిల్లల నుంచి ఉంటాయి. ఉక్కిరి, ఏజ్‌డ్‌ రైస్, క్యాజువల్‌ సెరల్, ఇన్‌స్టాంట్‌ పోహా, జిగిరీ మిక్స్, డ్రై ఫ్రూట్స్‌ హల్వా మిశ్రమం వంటివి ఉంటాయి. ఇంకా గర్భవతులకు, క్యాన్సర్, డయాబెటిక్, ఒబెసిటీ పేషెంట్లకు ప్రత్యేకమైన ఆహార ఉత్పత్తులున్నాయి. వీటి ప్రారంభ ధర 200 గ్రాములకు రూ.250. ప్రతి ఉత్పత్తిపై ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆమోదం ఉంటుంది. ఏడాదిలో మరో 6 ఉత్పత్తులను విడుదల చేస్తాం.
ఆఫ్‌లైన్‌లోనూ స్టోర్లు..
ఆయా ఉత్పత్తులను కాజు, బాదం, పిస్తా వంటి డ్రైఫూట్స్‌తో పాటూ కందిపప్పు, పెసర పప్పు వంటి పప్పు దినుసులతో తయారు చేస్తాం. వీటిని సేంద్రీయ వ్యవసాయ రైతుల నుంచి సేకరిస్తాం. డ్రై ఫ్రూట్స్‌ను గుజరాత్‌ నుంచి తెప్పిస్తాం. ఆన్‌లైన్‌తో పాటూ ఆఫ్‌లైన్‌లో రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నంలో స్టోర్లున్నాయి. నెల రోజుల్లో హైదరాబాద్‌లో స్టోర్‌ను ప్రారంభించనున్నాం. న్యూట్రీట్‌లైఫ్‌తో పాటూ అమెజాన్, గిస్కా, నేచురల్‌ మంత్ర, షాప్‌ హెల్తీ, వైరల్‌ ఇండియన్‌ డెయిరీ వంటి ఆన్‌లైన్‌ సంస్థల్లోనూ కొనుగోలు చేయవచ్చు.
నెలకు రూ.2 లక్షల ఆదాయం..
ఆన్‌లైన్‌ డెలివరీకి స్థానిక కొరియర్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఆర్డర్‌ వచ్చాకే ఉత్పత్తులను తయారు చేస్తాం. అందుకే డెలివరీకి 10 రోజుల సమయం పడుతుంది. ఉత్పత్తుల నిల్వ కాలం 6 నెలలు. ఇప్పటివరకు 6 వేల మంది మా ఉత్పత్తులను వినియోగించారు. ప్రస్తుతం నెలకు 100 ఆర్డర్లొస్తున్నాయి. ప్రతి ఉత్పత్తిపై 18–20 శాతం మార్జిన్‌ ఉంటుంది. నెలకు రూ.2 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. వచ్చే ఏడాది కాలంలో నెలకు 200 ఆర్డర్లు, రూ.6 లక్షల ఆదాయం చేరుకోవాలని లక్ష్యించాం. స్నేహితులు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని జ్యోతి వివరించారు.
 

 You may be interested

ఈ గృహాలు కొందరికే!

Saturday 18th August 2018

  సాక్షి, హైదరాబాద్‌: ఇల్లు కొనేముందు! ప్రాజెక్ట్‌ ఎక్కడుందో వెళ్లి కళ్లారా చూస్తాం. సూల్క్, ఆసుపత్రి, నిత్యావసరాలకు దగ్గరగా ఉంటే ఓకే అనుకొని ధర విషయంలో బేరమాడతాం. అదీ పూర్తయ్యాక.. నిర్మాణంలో నాణ్యత, గృహ ప్రవేశం గురించి ఆరా తీస్తాం! కానీ, బై ఇన్విటేషన్‌ ఓన్లీ (బీఐఓ)– అల్ట్రా లగ్జరీ గృహాల విషయంలో ఇవేవీ ఉండవు. ఈ గృహాలను కొనడం సంగతి తర్వాత కనీసం ప్రాజెక్ట్‌ చూడాలంటేనే ఆహ్వాన ప్రతం ఉండాల్సిందే! బీఐఓ ప్రాజెక్ట్‌ల

సేఫ్‌క్రాప్‌ హోల్డింగ్స్‌ చేతికి ‘సార్ట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌’

Saturday 18th August 2018

చెన్నై: ప్రైవేటు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ ‘స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ చేతులు మారుతోంది. సేఫ్‌క్రాప్‌ హోల్డింగ్స్‌తోపాటు వెస్ట్‌బ్రిడ్జ్‌ ఏఐఎఫ్‌, ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ జున్‌జున్‌వాలా, మ్యాడిసన్‌ క్యాపిటల్‌ నేతృత్వంలోని కన్సార్షియం కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఒప్పందం కుదర్చుకున్నాయి. ఎంత మొత్తానికి అన్న సమచారం వెల్లడించలేదు. స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో స్టార్ హెల్త్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఐసీఐఐసీ వెంచర్‌ ఫండ్స్‌, టాటా క్యాపిటల్‌, అపిస్‌ పార్ట్‌నర్స్‌ ప్రస్తుతం వాటాదారులుగా

Most from this category