Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Every India Child Must Read This Book Says Infosys Narayana Murthy
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

"మేఘాలయ నుంచి కన్యాకుమారి వరకు, శ్రీనగర్ నుంచి జామ్‌నగర్" వరకు భారతదేశంలోని ప్రతి పిల్లవాడు చదవాల్సిన పుస్తకాలలో ఒకటి ఉందని ఇన్ఫోసిస్ 'నారాయణమూర్తి' ఇటీవల పేర్కొన్నారు. పాల్ జీ.హెవిట్ రాసిన "కాన్సెప్టువల్ ఫిజిక్స్" అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని ఆయన సూచించారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ప్రస్తుతం 'కాన్సెప్టువల్ ఫిజిక్స్' చదువుతున్నట్లు పేర్కొన్నారు. పాల్ హెవిట్ అనే హైస్కూల్ టీచర్ ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో హైస్కూల్ విద్యార్థులకు ఫిజిక్స్ ఎలా బోధించాలో వెల్లడించారని నారాయణమూర్తి చెప్పారు. దీనిని భారతదేశంలోని అన్ని భాషల్లోకి అనువదించడానికి రచయిత అనుమతిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు.'కాన్సెప్చువల్ ఫిజిక్స్' మొదటిసారిగా 1971లో ప్రచురించారు. ఇందులో క్లాసికల్ మెకానిక్స్ నుంచి ఆధునిక భౌతికశాస్త్రం వరకు సారూప్యతలు, సూత్రాల చిత్రాలతో వెల్లడించారు. ఇది పాఠకులను ఎంతగానో ఆకర్షిస్తుందని నారాయణ మూర్తి అన్నారు.

Rishi Sunak, Wife Akshata Murty Wealth Soars
అంతకంతకూ పెరిగిపోతున్న ఆస్తులు.. రిచ్‌లిస్ట్‌లో రిషి సునాక్‌ దంపతులు

ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా యూకే ప్రధాని రిషి సునాక్‌, ఆయన భార్య అక్షతా మూర్తి వ్యక్తిగత సందప అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రిషిసునాక్‌ దంపతుల వ్యక్తిగత ఆస్తి 120 మిలియన్‌ యూరోలకు పెరిగింది. ‘సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌’ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆ వార్షిక నివేదికలో రిషి సునాక్‌ దంపతుల ఆస్తుల వివరాల్ని వెల్లడించింది. అయితే యూకేలో ఆర్ధిక అనిశ్చితి నెలకొన్న వారి ఆస్తులు పెరిగిపోతుండడం గమనార్హం.ఇన్ఫోసిస్‌లో2023లో రిషి సునాక్‌ దంపతుల సంపద 529 యూరోల నుంచి 651 మిలియన్‌ యూరోలకు చేరింది. ఈ మొత్తం సంపద పెరుగుదల ఇన్ఫోసిస్‌లోని వాటానే కారణమని సమాచారం. ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తి వాటా విలువ 55.3 బిలియన్‌ యూరోలు. ఆమె షేర్ల విలువ 108.8 మిలియన్‌ యూరోలకు పెరగ్గా.. ఏడాది కాలానికి ఆ విలువ 590 యూరోలకు చేరింది. కింగ్ చార్లెస్ సంపదఇదిలా ఉండగా, కింగ్ చార్లెస్ సంపద ఏడాది కాలంలో పెరిగిందని, 600 మిలియన్‌ యూరోల నుండి 610 మిలియన్‌ యూరోలకు పెరిగినట్లు సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌ నివేదించింది. అదే సమయంలో బ్రిటీష్ బిలియనీర్ల సంఖ్య తగ్గిపోయిందని ఈ నివేదిక హైలెట్‌ చేసింది. తగ్గిపోతున్న బిలియనీర్లు2022లో బిలియనీర్ల గరిష్ట సంఖ్య 177 కాగా.. ఈ ఏడాది 165కి పడిపోయింది. ఈ క్షీణతకు కారణం కొంతమంది బిలియనీర్లు అధిక రుణ రేట్లు కారణంగా వారి సంపద మంచులా కరిగిపోగా.. మరికొందరు దేశం విడిచిపెట్టారని బ్రిస్టల్ లైవ్ నివేదించింది .యూకేలోనూ భారతీయుల హవాబ్రిటన్‌లోని 350 మంది కుబేరులు ఉండగా.. ఆ కుటుంబాల మొత్తం సంపద 795.36 బిలియన్లుగా ఉందని తాజా గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం యూకే బిలియనీర్ల జాబితాలో హిందుజా గ్రూప్‌ అధినేత గోపీచంద్ హిందూజా, అతని కుటుంబం నిలిచింది. హిందూజా కుటుంబం సంపద ఈ ఏడాది 35 బిలియన్‌ యూరోల నుండి 37.2 బిలియన్‌ యూరోలకు పెరిగింది.

Twitter Domain Name Change As A X
ట్విటర్‌ రీ బ్రాండింగ్‌పై మస్క్‌ ట్వీట్‌

ట్విటర్‌ పూర్తిగా ఎక్స్‌.కామ్‌గా రీబ్రాండ్‌ అయ్యింది. ఎక్స్‌.కామ్‌లో పలు కార్యకలాపాలు ట్విటర్‌ పేరు మీదే జరిగేవి. అయితే ఇప్పుడు పూర్తి ఎక్స్‌.కామ్‌ నుంచే జరుగుతున్నాయని ఆ సంస్థ అధినేత ఎలోన్‌ మస్క్‌ శుక్రవారం తెలిపారు.ఎలోన్‌ మస్క్‌ 2022 చివరిలో 44 బిలియన్ల డాలర్లు వెచ్చించి ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల అనంతరం గత ఏడాది జులైలో ట్విటర్‌ను ఎక్స్‌. కామ్‌గా రీ బ్రాండ్‌ చేస్తున్నట్లు మస్క్‌ వెల్లడించారు. అయితే నిన్నటి వరకు ట్విటర్‌ లోగో, బ్రాండింగ్‌ మారింది. కానీ డొమైన్‌ పేరు ట్విటర్‌గా కొనసాగుతూ వచ్చింది. తాజాగా ట్విటర్‌.కామ్‌ డొమైన్‌ స్థానంలో ఇప్పుడు ఎక్స్‌.కామ్‌ వచ్చి చేరినట్లు మస్క్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. పోస్ట్‌ పోస్ట్ చేయడం, లైక్ చేయడం, బుక్‌మార్క్ చేయడం లేదా రీట్వీట్ చేసేందుకు గాను యూజర్లు కొద్ది మొత్తంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుందని గత నెలలో మస్క్ ప్రకటించారు. ఆ మొత్తం సబ్‌స్క్రిప్షన్‌ ఏడాదికి రూ.100లోపు ఉంటుందని అంచనా. ప్రస్తుతానికి ఈ సబ్‌స్క్రిప్షన్‌ పద్దతి న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో పరీక్షిస్తున్నారు. త్వరలో దీనిని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేసేందుకు మస్క్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. 2,500 కంటే ఎక్కువమంది ఫాలోవర్స్‌ కలిగి ఉన్న యూజర్‌ అకౌంట్‌లు ఎక్స్‌.కామ్‌లో ప్రీమియం ఫీచర్లను ఉచితంగా అందిస్తున్నట్లు మస్క్‌ ప్రకటించారు. 5000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉన్న అకౌంట్లకు ప్రీమియం ప్లస్‌ ఉచితంగా లభిస్తుంది అని మస్క్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Elon Musk claims aliens have never visited Earth
ఏలియన్స్‌ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్‌ ఏమన్నారంటే?

ఏలియన్స్‌.. ఎప్పుడైనా.. ఎవరికైనా ఇంట్రెస్ట్‌ కలిగించే టాపిక్‌. ఎలియన్స్‌ ఉన్నాయా..? లేవా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నే..! అయితే.. ఇప్పుడు ఇదే విషయంపై స్పందించారు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌. ఎలియన్స్‌ లేవని తేల్చేశారు. ఏలియన్స్‌ నిజంగానే ఉన్నాయా..? అవి భూమ్మిదకు వచ్చాయా..? అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే UFOలు ఏలియన్స్‌వేనా..? ఇవి ప్రశ్నలు కాదు..! కొన్ని దశాబ్దాలుగా అందరినీ వేధిస్తున్న అనుమానాలు..! ఏలియన్స్‌ ఉన్నాయని.. మనుషులతో కాంటాక్ట్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఏదో ఒక సమయంలో కచ్చితంగా భూమిపైకి వస్తాయని నమ్మేవారు కొందరైతే.. అసలు ఏలియన్సే లేవని ఈజీగా కొట్టిపారేసేవారు మరికొందరు. ఇప్పుడు ఈ సెకండ్‌ లిస్ట్‌లోకి యాడ్‌ అయ్యారు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌. ఏలియన్స్‌ ఉన్నాయనేందుకు అసలు ఆధారాలే లేవని తేల్చిపారేశారు.ఎలాన్‌ మస్క్‌..! ఈ జనరేషన్‌కు పరిచయం అవసరం లేని పేరు..! తన మాటలు.. తన చేతలు.. తన ప్రయోగాలు.. అన్ని సెన్సేషనే..! ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎలాన్‌ మస్క్‌.. కొత్త ప్రయోగాలు చేస్తూ.. కొత్త కొత్త టెక్నాలజీలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టును చేపడుతూనే ఉంటారు. ఈ టెక్నాలజీలో కచ్చితంగా తన మార్క్‌ను చూపించిన ఘనత ఎలాన్‌ మస్క్‌కే దక్కింది. టెస్లా పేరుతో తయారు చేసిన కార్లు ఎంత పెద్ద హిట్టో.. మనిషి బ్రెయిన్‌లో చిప్‌ పెట్టేందుకు చేసిన ప్రయోగమూ అంతే సెన్సేషన్‌గా నిలిచింది. ఇదొక్కటే కాదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..! స్పేస్‌ ఎక్స్‌ పేరుతో శాటిలైట్‌లు లాంచ్‌ చేసినా.. సోషల్‌ మీడియా సెన్సేషన్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసి ఎక్స్‌ అని పేరు మార్చినా అది.. ఎలాన్‌ మస్క్‌కే సాధ్యం.అలాంటి ఇలాన్‌ మస్క్‌.. ఏలియన్స్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి.. ఏలియన్స్‌ లేవని మస్క్‌ తేల్చిపారేశారు. ఏలియన్స్‌ ఉనికిపై తనకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. HOW TO SAVE THE HUMANS పేరుతో జరిగిన డిబేట్‌లో పాల్గొన్న మస్క్‌.. ఏలియన్స్‌ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్‌ అనే జీవులు ఏవీ భూమిపై కాలు పెట్టలేదని తేల్చేశారు. కక్షలో స్పేస్‌ ఎక్స్‌కు చెందిన వేలాది బ్రాడ్‌ బ్యాండ్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లు ఉన్నాయని.. కానీ ఎప్పుడూ ఏలియన్స్‌ ఉనికి కనిపించలేదని తన వాదనలు వినిపించారు. అయితే.. ఎవరైనా ఆధారాలు చూపిస్తే మాత్రం ఏలియన్స్‌పై ప్రయోగాలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అయితే.. ఆషామాషీగా కాకుండా.. సీరియస్‌ ఆధారాలతోనే రావాలని చెప్పారు. కానీ.. ఎవరూ అలాంటి ఆధారాలు తీసుకురాలేరని.. ఏలియన్స్‌ ఉనికే లేదని చెప్పేశారు.మరి నిజంగానే ఏలియన్స్‌ లేవా..? లేక మనషులకు దూరంగా ఉన్నాయా..? ఏలియన్స్‌ ఉంటే.. ఎప్పటికైనా భూమిపైకి వచ్చి మనుషులకు కనిపిస్తాయా..? ఎలన్‌ మస్క్‌ అవన్నీ ఉత్తమాటలే అని కొట్టిపారేసినా మిలియన్‌ డాలర్‌ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి..!

Stock Market Rally On Today Closing
లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 22,464 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 249 పాయింట్లు పుంజుకుని 73,917 వద్ద ముగిసింది.సెన్సెక్స్‌ 30 సూచీలో ఎం అండ్‌ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, మారుతీసుజుకీ, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.టీసీఎస్‌, నెస్లే, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌యూఎల్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, భారతీఎయిర్‌టెల్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Mahindra & Mahindra To Invest Rs 12000 Crore In Its EV Unit
రూ.12000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన మహీంద్రా: ఎందుకో తెలుసా?

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే అనేక కంపెనీలు ఈ విభాగంలో భారీ పెట్టుబడులను పెట్టి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ తరుణంలో దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' ఏకంగా రూ. 12000 కోట్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది.కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పెట్టుబడిన పెట్టింది. 2027 నాటికి మహీంద్రా ఆరు బ్యాటరీతో నడిచే స్పోర్ట్ యుటిలిటీ వాహనాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల అభివృద్దికి వేలకోట్ల పెట్టుబడి పెట్టడంతో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్స్ భారీగా పెరిగాయి.UK ఆధారిత కంపెనీ బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ (BII) 1,200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా, Temasek మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ (MEAL) లో 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. అంగీకరించిన కాలక్రమం ప్రకారం మిగిలిన రూ.900 కోట్లను టెమాసెక్ పెట్టుబడి పెడుతుందని కంపెనీ తెలిపింది.

Global Super Rich Club Has 15 Members Over 100 Billion Dollars
బ్లూం బెర్గ్‌ గ్లోబల్‌ సూపర్‌ రిచ్‌ క్లబ్‌లో భారతీయ కుబేరులు

ప్రపంచ దేశాల్లోని ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా 15 మంది కుభేరులు 100 బిలియన్ డాలర్ల సందపతో వరల్డ్‌ సూపర్‌ రిచ్‌ క్లబ్‌లో చేరినట్లు తెలుస్తోంది. బ్లూంబెర్గ్‌ నివేదిక ప్రకారం..ద్రవ్యోల్బణం, స్టాక్‌ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితిని అధిగమించి ఈ ఏడాది 15 మంది ఉన్న నికర విలువ 13 శాతం పెరిగి 2.2 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. వెరసి ప్రపంచంలోనే 500 మంది వద్ద ఉన్న సంపదలో దాదాపు నాలుగింట ఒకవంతు వీరివద్దే ఉంది. 15 మంది ఇంతకు ముందు 100 బిలియన్ డాలర్లు దాటినప్పటికీ, వారందరూ ఒకే సమయంలో ఆమొత్తానికి చేరుకోవడం ఇదే మొదటి సారి. ఇక వారిలో కాస్మోటిక్స్‌ దిగ్గజం ‘లో రియాల్‌’ సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్‌ బెటెన్‌కోర్ట్‌ మేయర్స్‌, డెల్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ మైఖేల్ డెల్, మెక్సికన్ బిలియనీర్ కార్లోస్ స్లిమ్‌లు మొదటి ఐదునెలల్లో ఈ అరుదైన ఘనతను సాధించారు. 1998 నుంచి తమ కంపెనీ గత ఏడాది డిసెంబర్‌లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిందంటూ బెటెన్‌కోర్ట్ మేయర్స్ తెలిపింది. ఆ తర్వాతే 100 బిలియన్ల సంపదను దాటారు. దీంతో బ్లూంబెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ జాబితాలో 100 బిలియన్ల నికర సంపదను దాటిన 15 మందిలో ఒకరుగా నిలిచారు. 14 స్థానంలో కొనసాగుతున్నారు.ఆ తర్వాత టెక్నాలజీ,ఏఐ విభాగాల్లో అనూహ్యమైన డిమాండ్‌ కారణంగా డెట్‌ టెక్నాలజీస్‌ షేర్లు లాభాలతో పరుగులు తీశాయి. ఫలితంగా డెల్ సంపద 100 బిలియన్ల మార్కును ఇటీవలే దాటింది. ఇప్పుడు 113 బిలియన్ల సంపదతో బ్లూమ్‌బెర్గ్ సంపద సూచికలో 11వ స్థానంలో ఉన్నారు.లాటిన్ అమెరికాలో అత్యంత ధనవంతుడు కార్లోస్ స్లిమ్ 13వ స్థానం, ఎల్‌వీఎంహెచ్‌ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు తొలి స్థానం, అమెజాన్‌ బాస్‌ జెఫ్‌ బెజోస్‌ రెండవ స్థానం, ఎలాన్‌ మస్క్‌ 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఎలైట్‌ గ్రూప్‌లోకి భారత్‌ నుంచి ముఖేష్‌ అంబానీ గౌతమ్‌ అదానీ సైతం చోటు దక్కించుకోవడం గమనార్హం.

LocalCircles group revealed widespread use of deceptive practices by online insurance platforms
పాలసీదారులను మోసం చేస్తున్న బీమా ప్లాట్‌ఫామ్‌లు

ఆన్‌లైన్‌ బీమా ప్లాట్‌ఫామ్‌లు పాలసీ సమయంలో మోసపూరిత పద్ధతులను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు లోకల్‌సర్కిల్స్‌ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో 36వేల మంది పాలసీదారులు ఈ సర్వేలో పాల్గొన్నారని సంస్థ తెలిపింది. ఇందులో 66 శాతం మంది పురుషులు కాగా, 34 శాతం మంది మహిళలు ఉన్నట్లు చెప్పింది. 49% మంది టైర్ 1 సిటీ నుంచి, 24% మంది టైర్ 2 సిటీ, 27% మంది టైర్ 3, 4, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు సర్వేలో పాల్గొన్నట్లు లోకల్‌సర్కిల్స్‌ తెలియజేసింది.సర్వేలోని వివరాల ప్రకారం.. ఆన్‌లైన్ బీమాను కొనుగోలు చేసిన 61 శాతం మంది ‘సబ్‌స్క్రిప్షన్ ట్రాప్’లో పడుతున్నారు. తర్వాత తమ పాలసీని రద్దు చేసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. 86% బీమా ప్లాట్‌ఫారమ్‌లు తరచూ ‘నగ్గింగ్’ విధానాన్ని ఉపయోగిస్తున్నాయి. పాలసీని రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సరైన పరిష్కారం చూపకుండా సందేశాలతో సమాధానమిస్తున్నాయి. 57% మంది పాలసీదారుల నుంచి ఆన్‌లైన్‌ బీమా ప్లాట్‌ఫామ్‌లు అనవసరమైన వ్యక్తిగత వివరాలు కోరుతున్నాయి. ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి.‘జీవిత బీమా, ఆరోగ్య బీమా, మోటారు, ఆస్తి.. వంటి బీమా పాలసీలను అమ్మేప్పుడు పాలసీదారులకు ఏజెంట్లు పూర్తి వివరాలు తెలియజేయడం లేదు. తమ టార్గెట్లు చేరుకోవాలనే ప్రయత్నంలో ఎక్కువ ఇన్సెంటివ్‌ ఉన్నవాటికే ఏజెంట్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులోని పరిమితులు, నిబంధనలను చెప్పడంలేదు. పాలసీదారులు కూడా ఆ ‘టర్మ్స్‌ అండ్‌ కండిషన్‌’ పత్రాలను పూర్తిగా చదవకుండానే పూర్తిగా ఏజెంట్‌ను నమ్మి బీమా తీసుకుంటున్నారు. ఏదైనా ఒక పాలసీ పరిమిత కాలంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని వినియోగదారులకు తప్పుడు సమాచారం ఇస్తూ లేనిఅత్యవసరాన్ని సృష్టిస్తున్నారు’ అని లోకల్‌ సర్కిల్స్‌ తెలిపింది.ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీమా రెన్యువల్‌, రద్దుకు సంబంధించిన ఫిర్యాదులు అధికమవుతున్నాయని నివేదిక తెలిపింది. గత 9 నెలల్లో ఆన్‌లైన్ బీమా ప్లాట్‌ఫామ్‌లపై మిస్ సెల్లింగ్, మానిప్యులేటివ్ సెల్లింగ్ ఫిర్యాదులు ఎక్కువయ్యాయని సర్వే ద్వారా తెలిసింది.ఇదీ చదవండి: ట్రక్‌ట్యాక్సీను ఢీకొట్టిన 180 మంది ప్రయాణిస్తున్న విమానం!ఆన్‌లైన్‌ బీమా ప్లాట్‌ఫామ్‌లు పాటించకూడని 13 అంశాలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) గతేడాది నవంబర్‌లో నిషేధం విధించినట్లు నివేదిక తెలిపింది. అందులో ప్రధానంగా అత్యవసరాన్ని సృష్టించడం, వినియోగదారులకు పాలసీ లేదంటూ హేళన చేయడం, బలవంతంగా పాలసీని కట్టబెట్టడం, సబ్‌స్క్రిప్షన్ ట్రాప్, ప్లాన్‌ ధర తగ్గినట్లు చూపడం, అస్పష్టమైన ప్రకటనలు.. వంటి అంశాలపై నిషేధం విధించారు.

FAKE NEWS on Anant Ambani target netizens with crypto scam
అనంత్ అంబానీపై క్రిప్టో ముఠా ఫేక్ న్యూస్

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తనయుడు, రిలయన్స్‌ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్న అనంత్‌ అంబానీపై క్రిప్టోముఠా సోషల్‌ మీడియాలో ఫేక్‌ వార్తలు ప్రచారం చేస్తోంది. క్రిప్టో కరెన్సీతో అధిక లాభాలు వస్తాయని అనంత్‌ అంబానీ అంగీకరించినట్లు అమాయకులను మోసగిస్తూ ఆయన పేరును వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ క్రిప్టో కరెన్సీ ఏజెన్సీలను ప్రోత్సహిస్తూ వ్యాఖ్యలు చేసినట్లుగా, ఆయనపై బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు వేసినట్లుగా బీబీసీ పేరుతో క్లిక్‌బైట్‌ హెడ్డింగ్‌లతో క్రిప్టో ముఠా రూపొందించిన తప్పుడు కథనాలు ఇటీవల సోషల్‌ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబానీ తన సహాయకుడు "1X ఆల్రెక్స్ ప్లాట్‌ఫారమ్"ని ఉపయోగించి డబ్బు సంపాదించాడని చెప్పినట్లుగా ఓ కథనం పేర్కొంది. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తితో కూడా అంబానీ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయించారని, అతను వెంటనే లాభం పొందాడని పేర్కొంది. ఇవన్నీ తప్పుడు కథనాలే అని ఆయా వార్తా సంస్థలు ధ్రువీకరించాయి. నెటిజన్లను తప్పుదోవ పట్టించి క్రిప్టో కరెన్సీ ద్వారా మోసగించేందుకే క్రిప్టో ముఠాలు ఇలా చేసినట్లు తెలుస్తోంది.

Hospitality Industry To Create 200000 Jobs In Next 12-18 Months
ఈ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు

కోవిడ్ మహమ్మారి కారణంగా హాస్పిటాలిటీ పరిశ్రమ తీవ్ర ఎదురుదెబ్బను ఎదుర్కొంది. ఫలితంగా భారీగా తొలగింపులు జరిగాయి. అయితే ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలువడం, ప్రయాణాలు తిరిగి పుంజుకోవడంతో హోటల్స్‌ వ్యాపారంలో డిమాండ్‌ మళ్లీ పెరిగింది. దీంతో విస్తరణ ప్రణాళికలకు, గణనీయమైన నియామకాలకు దారితీసింది.రానున్న 18 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలుహోటళ్ల వ్యాపారం, హాలిడే ప్రయాణాలలో వృద్ధిని పొందేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆతిథ్య సంస్థలు తమ కార్యకలాపాలను దూకుడుగా విస్తరిస్తున్నాయి. టీమ్స్‌లీజ్‌ సర్వీసెస్‌ అంచనాల ప్రకారం.. హోటల్, రెస్టారెంట్, పర్యాటక రంగం రాబోయే 12-18 నెలల్లో సుమారు 2 లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ ఉద్యోగ అవకాశాలలో దాదాపు సగం హోటల్ పరిశ్రమలోనే ఉంటాయని ఎకమిక్‌ టైమ్స్‌ నివేదించింది.దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుదలను సూచిస్తున్న అంచనాలతో, హోటల్ పరిశ్రమ గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉంది. ఫార్చ్యూన్ హోటల్స్ ప్రతిష్టాత్మకమైన విస్తరణ ప్రణాళికల ద్వారా నియామకంలో 8-10 శాతం పెరుగుదలను అంచనా వేస్తోంది. ఇక లెమన్ ట్రీ తమ ఆర్థిక సంవత్సర లక్ష్యాలకు మద్దతుగా వేలాది మందిని నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.డిమాండ్ వీరికే..ఫ్రంట్ డెస్క్ ఏజెంట్లు, గెస్ట్‌ రిలేషన్స్‌ మేనేజర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది డిమాండ్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే మెయింటెనెన్స్ టెక్నీషియన్లు, చెఫ్‌లు వంటి నిపుణులకు కూడా అధిక డిమాండ్‌ ఉంది. ఆతిథ్య రంగంలోని అన్ని విభాగాల్లోనూ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్‌లో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు మ్యాన్‌పవర్ ఏజెన్సీలు నివేదించాయి. సేల్స్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, టెక్నికల్ ఉద్యోగాలు, మానవ వనరులు ప్రత్యేకించి పరిశ్రమలో విస్తృత ఆధారిత పునరుద్ధరణను సూచిస్తున్నాయి.ఇక్రా ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో హోటల్ పరిశ్రమ 7-9 శాతం స్థిరమైన ఆదాయ వృద్ధిని సాధిస్తుందని అంచనా. ఇది ఈ రంగం స్థితిస్థాపకత, పునరుద్ధరణ పథాన్ని నొక్కి చెబుతోంది. సాంప్రదాయ హోటల్ ఆపరేటర్లు మాత్రమే కాకుండా, ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లు కూడా హైరింగ్‌లో స్పీడ్‌ పెంచనున్నాయి.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 92500.00 92500.00 0.00
Gold 22K 10gm 67600.00 67600.00 -250.00
Gold 24k 10 gm 73750.00 73750.00 -270.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement