Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Ola Moves Microsoft To Krutrim, Loss Of Rs 100 Crore For Microsoft In India
అజ్యూర్‌కు ఓలా గుడ్‌బై.. మైక్రోసాఫ్ట్‌కు 100 కోట్ల నష్టం?

ప్రముఖ దేశీయ క్యాబ్‌ సర్వీస్‌ దిగ్గజం ఓలా..మైక్రోసాఫ్ట్‌ మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ సర్వీస్‌ అజ్యూర్‌కు స్వస్తి పలికిన విషయం తెలిసిందే. ఓలా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మైక్రోసాఫ్ట్‌ ఇండియాకు దాదాపూ రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందనే అంచనాలు నెలకొన్నాయి.ఇటీవల ఓలా సీఈవో భవీష్‌ అగర్వాల్‌ మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డిన్‌ ఏఐలో బాట్‌లో తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. భవీష్‌ అగర్వాల్‌ ఎవరు? అని సెర్చ్‌ చేశారు. దీనికి బాట్‌ అతడు/ ఆయన ఉండాల్సిన చోటు వారు/ వాళ్లు ఉండడం చూసి.. అనే సమాధానం ఇచ్చింది. అంతే ఈ సమాధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్‌ లింక్డిన్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. తమ నిబంధనలకు విరుద్దం అంటూ ఆ పోస్ట్‌ను లింక్డిన్‌ డిలీట్‌ చేసింది. లింక్డిన్‌ పోస్ట్‌ తన పోస్ట్‌ డిలీట్‌ చేయడంతో లింక్డిన్‌ మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్‌పై భవిష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారంలోగా మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌ క్లౌట్‌ కంప్యూటింగ్‌ సేవలకు స్వస్తి పలకాలని తమ కంపెనీ నిర్ణయించినట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డిన్‌ తీరు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఫలితంగా మైక్రోసాఫ్ట్‌ వందల కోట్లలో నష్టం వాటిల్లనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

Today Gold Rate In India
దేశంలో బంగారం ధరలు.. తగ్గాయా? పెరిగాయా?

దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,360 వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయిహైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందివిజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందివిశాఖ పట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందిబెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందిచెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,640గా ఉంది.ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందిఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,510గా ఉంది.కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉంది.

World Needs Indian Leadership Says Japanese Ceo
‘భళా భారత్‌’.. జపాన్‌ కంపెనీ సీఈఓ ప్రశంసల వర్షం

భారత్‌ సంస్కృతి, సంప్రదాయాలకు జపాన్‌ టెక్‌ కంపెనీ కోఫౌండర్‌ ఫిదా అయ్యారు. భారత్‌ భళా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే సత్తా ఈ దేశానికే ఉందంటూ లింక్డిన్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.టెక్ జపాన్ కంపెనీ కోఫౌండర్‌, సీఈఓ నౌటకా నిషియామా.. తన వ్యాపార కార్యకలాపాల్ని భారత్‌లో విస్తరించాలని భావించారు. ఇందుకోసం ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల్ని అర్ధం చేసుకునేందుకు గత నెలలో సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరుకు వచ్చారు.ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఈ నేపథ్యంలో భారత్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. ఈ రోజు ప్రపంచం నివసించడానికి అస్తవ్యస్తమైన ప్రదేశంగా ఉందని అన్నారు. అయితే అనేక విషయాల్లో అపార అనుభవం ఉన్న భారత్‌ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఉందన్నారు. ఆశ్చర్యపోయా‘ప్రపంచానికి భారతీయ నాయకత్వం అవసరం. నేను భారతదేశానికి వచ్చి నెలరోజులైంది. దేశంలోని విలువల వైవిధ్యాన్ని చూసి మరోసారి ఆశ్చర్యపోయాను’ అని లింక్డిన్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌లు.. వివిధ మతాలు, జాతులు, విలువలతో కూడిన పెద్ద దేశంగా ఉన్నప్పటికీ భారతదేశం ఒకే దేశం కావడం ఒక అద్భుతం. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ల విజయాల్ని ఉదహరించారు. భారత్‌ పోటీ, సహకారం రెండింటినీ మూర్తీభవించిందని.. ప్రపంచ సంస్థలో నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నిషియామా అన్నారు. వ్యాపార రంగంలో, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల రెండవ తరం అమెరికన్లు కాదు. వారు ఇక్కడే (భారత్‌) జన్మించారు. ఇక్కడే చదువుకున్నారు. ఆపై గ్రాడ్యుయేట్ కోసం అమెరికాకు వెళ్లారు. వాళ్లే టెక్‌ రంగాల్ని శాసిస్తున్నారంటూ భారత్‌ను కొనియాడుతూ పోస్ట్‌ చేశారు. నౌటకా నిషియామా పోస్ట్‌పై నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Anand Mahindra Share Electric Flying Taxi
భారతదేశపు మొదటి 'ఫ్లైయింగ్ టాక్సీ' - ఆనంద్ మహీంద్రా ట్వీట్

గత కొన్ని సంవత్సరాలు ఎగిరే కార్లు వస్తాయని వింటూనే ఉన్నాము. ఇటీవల ఆనంద్ మహీంద్రా దేశంలో అడుగు పెట్టనున్న మొదటి ఎలక్ట్రిక్ ట్యాక్సీను పరిచయం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎప్లాన్ (Eplane) అనే స్టార్టప్ కంపెనీ ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ టాక్సీని అభివృద్ధి చేసింది. దీనికి గత సంవత్సరమే ఏవియేషన్ సెక్టార్ రెగ్యులేటర్ డీజీసీఏ నుంచి అనుమతి లభించింది. దీంతో ఈ కంపెనీ భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ విమానాల తయారు చేసే కంపెనీగా అవతరిస్తుంది.ఈ కంపెనీకి చెందిన ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీని ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేస్తూ.. వచ్చే ఏడాది లోపల మద్రాస్ ఐఐటీ ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.The eplane company. A company being incubated at IIT Madras to build a flying electric taxi by sometime next year…IIT Madras has become one of the WORLD’s most exciting and active incubators. Thanks to them and the rapidly growing number of ambitious incubators throughout… pic.twitter.com/Ijb9Rd2MAH— anand mahindra (@anandmahindra) May 10, 2024

iVoomi JeetX ZE electric scooter launched at Rs 80,000
మార్కెట్‌లో కొత్త ఈవీ బైక్‌.. ధర ఎంతంటే?

దేశీయ ఆటోమొబైల్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. వాహనదారులు పెట్రోల్‌, డీజిల్‌ ఆధారిత వాహనాలకు స్వస్తిచెబుతున్నారు. ధర కాస్త ఎక్కువే అయినా ఈవీ వెహికల్స్‌ కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ తరుణంలో పూణే ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ iVoomi కొత్త ఎలక్ట్రిక్‌ స్కూట్‌ మార్కెట్‌కు పరిచయం చేసింది. JeetX ZE పేరుతో విడుదల చేసిన బైక్‌ ధర రూ. 80,000 (ఎక్స్-షోరూమ్) ధర ఉండగా... దీని రేంజ్‌ 170 కిమీల పరిధిని వరకు ఉంది.మూడు విభిన్న వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ నార్డో గ్రే, అల్ట్రా రెడ్, అర్బన్ గ్రీన్ ఇలా ఎనిమిది రకాల రంగుల్లో JeetX ZE 2.1 కిలోవాట్ల పీక్ పవర్ కోసం రేట్ బీఎల్‌డీసీ మోటార్‌కు కనెక్ట్ చేసిన 3 కిలోవాట్ గంటల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. గంటకు గరిష్టంగా 57 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్‌ చేయొచ్చు. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 5.5 గంటల సమయం పడుతుంది. 2.5 గంటల కంటే తక్కువ సమయంలో 50 శాతం ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు.

Indian Luxury Homes Claim Larger Share Of Sales
ధరెంతైనా.. ఖరీదైన ఇళ్లను ఎగబడి కొనుగోలు చేస్తున్న భారతీయులు

భారతీయలు లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ గ్రూప్ నివేదిక ప్రకారం.. మన దేశంలో విక్రయించే లగ్జరీ గృహాల వాటా గత ఐదేళ్లలో మూడు రెట్లు పెరిగింది.శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం విలాసవంతమైన గృహాల విలువ కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉన్నట్లు తెలింది. భారత్‌లోని తొలి ప్రధాన ఏడు నగరాల్లో ఈ ఏడాది జనవరి- మార్చి (మొదటి త్రైమాసికం)లో విక్రయించిన రెసిడెన్షియల్‌ యూనిట్లు 21 శాతంగా ఉన్నాయి. 2019లో ఇదే కాలానికి 7శాతం మాత్రమే విక్రయించినట్లు నివేదిక హైలెట్‌ చేసింది. బలమైన ఆర్థిక వృద్ధి, ప్రవాస భారతీయుల నుండి డిమాండ్ కారణంగా భారత్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఊపందుకుంది. వెరసి ఈ ఏడాది ప్రారంభంలో డీఎల్‌ఎఫ్‌ కంపెనీ న్యూఢిల్లీకి సమీపంలో 1,100 కంటే ఎక్కువ గృహాలు నిర్మాణాన్ని ప్రారంభించక ముందే మూడు రోజుల్లో అమ్ముడయ్యాయి. వీటిలో అధిక భాగం ఎన్‌ఆర్‌ఐలు కొనుగోలు చేశారు. బడ్జెట్‌ ధరలో లభ్యమయ్యే ఇళ్లు అదే కాలంలో అమ్మకాల వాటా 37శాతం నుండి 18శాతానికి క్షీణించాయి. మధ్య శ్రేణి, ప్రీమియం హౌసింగ్ సెగ్మెంట్‌లో 4 మిలియన్ నుంచి 15 మిలియన్ మధ్య ధర కలిగిన గృహాలు దాదాపు 59 శాతం వాటాతో అత్యధికంగా అమ్ముడు పోయినట్లు అనరాక్‌ నివేదిక హైలెట్‌ చేసింది.

OpenAI And Apple Deal For ChatGPT Features in iPhone
ఐఫోన్‌లో చాట్‌జీపీటీ ఫీచర్స్!.. ఓపెన్ఏఐతో యాపిల్ చర్చ

ఇప్పటికే పలు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ఫీచర్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో దిగ్గజ ఐఫోన్‌ తయారీ సంస్థ 'యాపిల్' తన మొబైల్‌లో స్టార్టప్ టెక్నాలజీని ఉపయోగించడానికి ఓపెన్ఏఐతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.రాబోయే యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 18లో చాట్‌జీపీటీ ఫీచర్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ ఓపెన్ఏఐతో జత కట్టినట్లు సమాచారం. రెండు కంపెనీల మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెల్లడి కావాల్సి ఉంది.ఒప్పందం కుదిరిన తరువాత ఈ టెక్నాలజీ సెప్టెంబర్ 2024లో ప్రారంభమవుతుందని సమాచారం. ఇప్పటికే యాపిల్ కంపెనీ జెమినీ చాట్‌బాట్‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ చర్చలు ఇంకా పూర్తికాక ముందే.. యాపిల్ కంపెనీ ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉంది.యాపిల్ కంపెనీ జూన్‌లో నిర్వహించనున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్పిరెన్స్‌‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. గత సంవత్సరం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా చాట్‌జీపీటీ వినియోగాన్ని గురించి ప్రస్తావించారు. ఇందులో అనేక సమస్యలను క్రమబద్ధీకరించవలసి అవసరం ఉందని, దీనివల్ల ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయని ఆయన ప్రస్తావించారు.

Brazil the leading orange juice exporter anticipates worst harvest in 36 years due to heat wave
తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్‌ జ్యూస్‌ ఫ్యూచర్లపై ‍ప్రభావం

ప్రపంచంలో నారింజ పండ్ల దిగుబడి తగ్గుతుంది. ఆరెంజ్‌ జ్యూస్‌లో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న బ్రెజిల్‌లో ఈ ఏడాది భారీగా పంటనష్టం జరిగింది. గత 36 ఏళ్లలో ఎప్పుడూలేని విధంగా ఈసారి ఏర్పడిన వేడిగాలులతో తీవ్రంగా పంటనష్టం వాటిల్లినట్లు పరిశోదనా బృందం ఫండెసిట్రస్ తెలిపింది.ఏటా ఏప్రిల్‌ ప్రారంభం నుంచి ఆరెంజ్‌ పండ్ల సీజన్‌ మొదలవుతుంది. బ్రెజిల్‌లో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 232.4 మిలియన్ బాక్సుల ఆరెంజ్‌ పండ్ల ఉత్పత్తి జరిగినట్లు ఫండెసిట్రస్ నివేదిక తెలిపింది. ఇందులో ఒక్కో బాక్స్‌ బరువు 90 పౌండ్లు(40.8 కిలోలు) ఉంటుంది. ఈసారి నమోదైన ఉత్పత్తి గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 24 శాతం క్షీణించింది.ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్‌లు రిజస్టరైన ఐసీఈ ఫ్యూచర్స్‌ యూఎస్‌లో ఈ ఏడాది 26 శాతం లాభపడింది. గడిచిన మూడు నెలల వ్యవధిలో ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్‌లు అత్యధికంగా 5 శాతం పెరిగాయి. హీట్‌వేవ్‌ కారణంగా ఉత్పత్తి తగ్గడంతో భవిష్యత్తులో ఆశించిన ఫలితాలు రావని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతేడాది సెప్టెంబరు-నవంబర్ మధ్య ఆరెంజ్‌ పంట సాగుకు సిద్ధమైతే ఈ సమయం వరకు సమృద్ధిగా పంట చేతికి వచ్చేది. కానీ వేడిగాలుల వల్ల పంటకాలం ఆలస్యమైంది. దాంతో సరైన దిగుబడి రాదని నివేదిక చెబుతుంది. ప్రపంచ వ్యాప్తంగా నారింజ రసం సరఫరాలో బ్రెజిల్‌ మొదటిస్థానంలో ఉంది. దేశం మొత్తం పానీయాల ఎగుమతుల్లో 70 శాతం వాటా ఆరెంజ్‌ జ్యూస్‌దే అవ్వడం గమనార్హం.

E-Auction sale notice to ind-barath thermal power ltd of MP Raghu Ramakrishnam Raju
రూ.947 కోట్ల మోసం.. త్వరలో బిల్డప్‌ బాబాయ్‌ ఆస్తుల వేలం.. ఎన్‌సీఎల్‌టీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌ కంపెనీ ఆస్తుల వేలం జరగబోతుంది. ఈమేరకు కంపెనీ స్థిరచరాస్తులను వేలం వేస్తున్నట్లు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ప్రకటించింది. నోటీసులో తెలిపిన వివరాల ప్రకారం..రూ.360 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేయనున్నారు.కంపెనీ బ్యాంకుల కన్సార్టియం వద్ద దాదాపు రూ.947 కోట్లు అప్పు చేసింది. దాన్ని తిరిగి తిరిగిచెల్లించకపోవడంతో నిరర్థక ఆస్తిగా మారింది. ఎలాగైనా ఆ డబ్బును రాబట్టుకునేందుకు బ్యాంకులు కేంద్రాన్ని ఆశ్రయించాయి. దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఆ కేసును సీబీఐకు అప్పగించింది. 2019లోనే ఈ కంపెనీ డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. బ్యాంక్రప్సీ బోర్డు(ఐబీబీఐ) ఆధ్వర్యంలో ఉన్న నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) తాజాగా ఆస్తులు వేలం వేయాలని నిర్ణయించింది. దాంతో కంపెనీ చేసిన అప్పులను కొద్ది మొత్తంలో తగ్గించవచ్చనే ఉద్దేశంతో ఎన్‌సీఎల్‌టీ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.సీబీఐ ఛార్జ్‌షీట్‌..రూ.947.70 కోట్ల రుణాల మోసానికి సంబంధించి రఘురామకృష్ణంరాజు, ఆయన కంపెనీ ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌తో పాటు మరో 15 మందిపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) 2019లో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇండ్-భారత్ రుణదాతల కన్సార్టియం నుంచి రూ.947 కోట్లు తీసుకుని చెల్లించకుండా మోసం చేస్తున్నట్లు సీబీఐ తెలిపింది. ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(పీఎఫ్‌సీ) రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌ఈసీ), ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్‌) నుంచి కంపెనీకు చెందిన తమిళనాడులోని టుటికోరిన్‌ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అప్పు చేసినట్లు చెప్పింది.ఇండ్ భారత్ పవర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్, ఆర్కే ఎనర్జీ (రామేశ్వరం), సిబా సీబేస్, ఇండ్ భారత్ పవర్ జెన్‌కామ్, ఇండ్ భారత్ ఎనర్జీ ఉత్కల్, ఇండ్ భారత్‌ పవర్ వంటి కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన మధుసూధన్ రెడ్డి పేరును కూడా సీబీఐ ఛార్జ్‌షీటులో పేర్కొంది. కంపెనీ కాంట్రాక్టర్లు సోకియో పవర్ ప్రైవేట్ లిమిటెడ్, వై.నాగార్జున రావు, సీఏలు ఎంఎస్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ జాబాద్‌తో పాటు కంపెనీ భాగస్వామ్యంలో ఉన్న టిఆర్ చద్దా అండ్ కంపెనీ, ఇండ్ భారత్ గ్రూప్‌కు చెందిన సి.వేణును నిందితులుగా చేర్చారు.ఇదిలాఉండగా, ఐబీబీఐ-ఎన్‌సీఎల్‌టీ ఆధ్వర్యంలో ఆస్తుల వేలానికి వెళ్తున్న కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా తమ బినామీల ద్వారా తిరిగి వాటిని దక్కించుకునే ప్రమాదం ఉంది. ముందుగా అప్పుచేసి కొనుగోలు చేసిన ఆస్తుల విలువతో పోలిస్తే ఆక్షన్‌లో దక్కించుకున్న వాటికి వ్యత్యాసం ఉంటుంది. దాంతో భారీగా లాభపడవచ్చని కొన్ని కంపెనీలు దురుద్దేశంతోనే దివాలా ప్రక్రియకు నమోదు చేసుకుంటాయి. రాజకీయమైనా, వ్యాపారమైనా సమర్థంగా నిర్వహించే సత్తా ఉంటేనే విజయం సాధిస్తారు. రాజకీయ ప్రచారంలో భాగంగా నీతులు చెబుతున్న రఘురామ వాటిని పాటించడేమో. బ్యాంకులకు అప్పులు కట్టకుండా ఎగనామం పెడితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలను మోసం చేసినట్లే. ఈ విషయాన్ని ప్రజలు గమనించరని భావిస్తున్నాడేమో పాపం. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో ప్రజలు తనకు సరైన గుణపాఠం చెబుతారని తెలుస్తుంది.ఇదీ చదవండి: గోల్డ్‌ఫైనాన్స్‌ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?ఆంద్రప్రదేశ్‌ రాజకీయాల్లో బిల్డప్‌బాబాయ్‌గా పేరున్న రఘురామకృష్ణరాజుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దిల్లీ, మహారాష్ట్రల్లో 19 కేసులు నమోదయ్యాయి. ఆయనపై దిల్లీలో సీబీఐ కేసులు కూడా ఉన్నాయి.ఇండ్‌ భారత్‌ పవర్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ కంపెనీ డైరెక్టర్‌గా ఉండి ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించడం, రూ.25 కోట్ల చెల్లింపులు చేయకపోవడానికి సంబంధించి మహారాష్ట్రలోని థానేలో ఆర్థిక నేరాల విభాగం 2022 జనవరి 27న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దీనికి సంబంధించి హైదరాబాద్‌ కోర్టులో రెండు కేసులు, ముంబై కోర్టులో ఒక కేసు కొనసాగుతున్నాయి.

gold price today rate may 11 Akshaya Tritiya
అలా ముగిసిందో లేదో.. ఇలా తగ్గింది!

దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ సందడి ముగిసింది. పండుగ రోజున భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చిన బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. పసిడి ధర ఈరోజు (మే 11) 10 గ్రాములకు రూ.330 మేర తగ్గింది.హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గింది. ప్రస్తుతం రూ.67,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.330 తగ్గి రూ. 73,360 లకు దిగొచ్చింది.ఇతర ప్రధాన నగరాల్లో..దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.330 దిగొచ్చి రూ.73,510 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,250 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.330 క్షీణించి రూ.73,360 వద్దకు తగ్గింది.బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,250 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.330 తగ్గి రూ.73,360లకు దిగొచ్చింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 తగ్గి రూ.67,500 ల​కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.210 తగ్గి రూ.73,640 లకు దిగొచ్చింది.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఈరోజు రూ.700 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.87,000లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 1 Kg 88700.00 200.00
Gold 22K 10gm 66150.00 -100.00
Gold 24k 10 gm 72160.00 -100.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement