Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Scarlett Johansson Accused Open Ai
వివాదంలో చాట్‌జీపీటీ.. అడ్డంగా బుక్కైన సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌

ఓపెన్‌ ఏఐ సీఈఓ, చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్‌ ఆల‍్ట్‌మన్‌ అడ్డంగా దొరికిపోయారు. ఇక చేసిది లేక తన చాట్‌జీపీటీ స్కై వాయిస్‌ను నిలిపి వేశారు.యాపిల్‌ సిరి వాయిస్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌ తరహాలో చాట్‌ జీపీటీ యూజర్లకు వాయిస్‌ అసిస్టెంట్‌ సేవల్ని అందించేందుకు సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ పనిచేస్తున్నారు. స్కై వాయిస్‌ పేరుతో తెచ్చే ఈ ఫీచర్‌లో ప్రముఖుల వాయిస్‌ వినిపిస్తుంది. మీకు ఎవరి వాయిస్‌ కావాలనుకుంటారో.. దాన్ని సెలక్ట్‌ చేసుకుంటే చాట్‌ జీపీటీ సమాధానాల్ని టెక్ట్స్‌ కాకుండా వాయిస్‌లో రూపంలో అందిస్తుంది.నా అనుమతి లేకుండా నా వాయిస్‌ను దీన్ని డెవలప్‌ చేసే సమయంలో శామ్‌ ఆల్ట్‌మన్‌.. అద్భుత నటిగా, అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిమేల్ యాక్టర్‌గా, హాలీవుడ్‌లోని ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్‌ను వినియోగించారు. దీంతో తనని సంప్రదించకుండా తన వాయిస్‌ను కాపీ చేసి చాట్‌జీపీటీ స్కైవాయిస్‌లో ఎలా వినియోగిస్తారంటూ స్కార్లెట్‌ జాన్సన్‌.. ఓపెన్‌ ఏఐ సీఈఓపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదనిఆరోపణలపై శామ్‌ ఆల్ట్‌మన్‌ స్పందించారు. కంపెనీనీ ప్రశ్నార్థకంలో పడేసి చాట్‌జీపీటీ వాయిస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో స్కై సిస్టమ్ వాయిస్ స్కార్లెట్‌ జాన్సన్‌ది కాదని, వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదని తెలిపారు. స్కార్లెట్‌ జాన్సన్‌ ఏమన్నారంటే తన వాయిస్‌ను ఓపెన్‌ ఏఐ కాపీ చేయడంపై అవెంజర్‌ ముద్దుగమ్మ స్కార్లెట్‌ జాన్సన్‌ మాట్లాడుతూ.. ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ చాట్‌జీపీటీ వాయిస్‌ ఆప్షన్‌ కోసం గతేడాది సెప్టెంబర్‌లో నన్ను సంప్రదించారు.అయితే, ఆ ఆఫర్‌ను నేను తిరస్కరించా. అయినప్పటికీ ఆల్ట్‌మన్ తనలాగే వినిపించే 'చాట్‌జీపీటీ 4.0 సిస్టమ్' కోసం నా ప్రమేయం లేకుండా నా వాయిస్‌ని ఉపయోగించుకున్నారు’ అని ఆరోపించారు. జాన్సన్ ఆరోపణల్ని ఖండించిన ఓపెన్‌ఏఐ అయితే స్కార్లెట్‌ జాన్సన్‌ వ్యాఖ్యల్ని శామ్‌ ఆల్ట్‌మన్ ఖండించారు. చాట్‌జీపీటీ స్కై వాయిస్ స్కార్లెట్ జాన్సన్‌ వాయిస్‌ కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జాన్సన్‌ పట్ల ఉన్న గౌరవంతో మేం మా ప్రొడక్ట్‌లలో స్కై వాయిస్‌ ఉపయోగించడం నిలిపివేశాము. ఈ విషయంలో జాన్సన్‌కు తగిన విధంగా సమాచారం అందించకపోవడం క్షమాపణలు చెప్పారు.

Wipro More To Changes Under Ceo Srini Pallia
కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియా రాకతో ‘విప్రో’లో సీను మారింది

ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రోలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విప్రో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ పల్లియా.. రెండు నెలలు లోపే సంస్థ మాజీ సీఈఓ థియరీ డెలాపోర్టే సీఈఓగా పని చేసే సమయంలో పలు విభాగాల్లో ముఖ్యపాత్ర పోషించిన టాప్‌ మేనేజ్మెంట్‌ను ఇతర విభాగాలకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారు.విప్రోను ముందుకు నడిపించే తన నమ‍్మకస్తుల్ని అక్కున చేర్చుకుంటున్నారు పల్లియా. ఇందులో భాగంగా థియరీ డెలాపోర్టేకు నమ్మకస్తులైన ముగ్గురు టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌లు బదిలి చేశారు. ఇక విప్రో వ్యాపారం పుంజుకునేలా శ్రీనివాస్‌ పల్లియా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విప్రోలో ప్రముఖ పాత్ర పోషించే ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్, ఎంటర్‌ప్రైజ్ ఫ్యూచరింగ్, ఇంజనీరింగ్ ఎడ్జ్ అండ్‌ కన్సల్టింగ్‌ విభాగాల్లో మార్పులు చేశారు.సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎకోసిస్టమ్స్ & పార్ట్‌నర్‌షిప్‌ గ్లోబల్ హెడ్, జాసన్ ఐచెన్‌హోల్జ్ వ్యాపార కార్యకలాపాల గురించి ఇప్పుడు విప్రో ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ బిజినెస్ లైన్ హెడ్ జో డెబెకర్‌కి రిపోర్ట్‌ చేయాలి. ఐచెన్‌హోల్జ్ ఆగస్ట్ 2021లో విప్రోలో చేరగా, డెబెకర్ జనవరి 2022లో విప్రోలో బాధ్యతలు చేపట్టారు.విప్రో ఆసియా పసిపిక్‌, మిడిల్‌ ఈస్ట్‌ అండ్‌ ఆఫ్రికా (APMEA) స్ట్రాటజిక్ మార్కెట్ యూనిట్‌కు సీఈఓగా వినయ్ ఫిరాకే కొద్ది రోజుల క్రితం నియమించింది. ఆయన నియమాకం తర్వాత విప్రో కంపెనీ బెనెలక్స్, నార్డిక్ దేశాలు కార్యకలాపాలను కలిపి ఒకే ఉత్తర ఐరోపా ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది .ప్రస్తుత బెనెలక్స్ దేశ విప్రో మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్ కొత్త ఉత్తర ఐరోపా ప్రాంతానికి నాయకత్వం వహిస్తారని కంపెనీ తెలిపింది.దీంతో పాటు విప్రో ఉనికి ఎక్కువగా ఉన్న యూరోపియన్‌ దేశాల్లో తన వ్యాపారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు యూకే, ఐర్లాండ్‌, జర్మనీ, స్విట్జర్లాండ్, నార్డిక్స్, బెనెలక్స్, దక్షిణ ఐరోపాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తన డెలివరీ లొకేషన్లను ఏర్పాటు చేయనుంది.విప్రో ఇంజినీరింగ్ ఎడ్జ్‌లో, నోకియాతో ప్రైవేట్ వైర్‌లెస్ జాయింట్ సొల్యూషన్ కోసం విప్రో ఎంగేజ్‌మెంట్ లీడర్‌గా శ్రేయాస్ భోసలే నియమించింది.ఇలా విప్రో కంపెనీ తన యూనిట్‌లలో భారీ మార్పులు చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.

Stock Market Rally On Today Opening
స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 22,470కు చేరింది. సెన్సెక్స్‌ 121 పాయింట్లు దిగజారి 73,899 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 104.6 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 83.66 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.44 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.09 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.65 శాతం పుంజుకుంది.‘అంతర్జాయతీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఇది దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఎన్నికల సంబంధిత పరిణామాల వార్తలు, కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఒడిదుడుకుల ట్రేడింగ్‌ కొనసాగొచ్చు. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 22,500 స్థాయిని నిలుకోగలిగితే జీవితకాల గరిష్టాన్ని (22,795) పరీక్షించవచ్చు. అమ్మకాలు నెలకొంటే 22,200 వద్ద మరో కీలక మద్దతు ఉంది’ అని నిపుణులు తెలిపారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Offers and reward points on bank credit cards
ప్రముఖ బ్యాంకుల క్రెడిట్‌ కార్డులపై ఆఫర్లు

భారత్‌లో క్రెడిట్‌ కార్డు యూజర్ల సంఖ్య పెరుగుతోంది. 2023 ఏప్రిల్‌ నాటికి 8.60 కోట్ల క్రెడిట్‌ కార్డులు వాడకంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024 ప్రారంభం నాటికి వీటి సంఖ్య 10 కోట్లకు చేరవచ్చని అంచనా. ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు వీటిని అందిస్తున్నాయి. అయితే కేవలం ఆర్థిక అవసరాలకే ఈ కార్డులను వాడుతుంటారు. బ్యాంకులు ఆయా కార్డులపై రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌, వోచర్‌లు, సర్‌ఛార్జ్‌ మినహాయింపులు.. వంటి ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తాయి. కానీ వీటికి సంబంధించి చాలామంది వినియోగదారులకు సరైన అవగాహన ఉండదు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కొన్ని బ్యాంకులు అందిస్తున్న క్రెడిట్‌ కార్డులపై ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.కొటక్‌ ఫార్చ్యూన్‌ గోల్డ్‌ క్రెడిట్‌ కార్డుఈ కార్డును బిజినెస్‌ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఇంధనం, టికెట్‌ బుకింగ్‌ మొదలైన వాటిపై ప్రాథమిక క్రెడిట్‌ కార్డు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ కార్డుతో ఒక సంవత్సరంలో రూ.1.50 లక్షలు ఖర్చు చేస్తే, నాలుగు పీవీఆర్‌ టికెట్లు లేదా రూ.750 వరకు క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చు. రూ.500-రూ.3,000 ఇంధన లావాదేవీలపై 1% సర్‌ఛార్జ్‌ మినహాయింపును పొందే అవకాశం ఉంది.అమెజాన్‌ పే-ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డుషాపింగ్‌ అవసరాలకు ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ఎక్కువగా వాడుతుంటారు. రోజువారీ కొనుగోళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రెడిట్‌ కార్డు ఉన్న కస్టమర్లు కలినరీ ట్రీట్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా భారత్‌లోని 2,500 కంటే ఎక్కువ రెస్టారెంట్స్‌లో డైనింగ్‌ బిల్లులపై 15% ఆదా చేసుకోవచ్చు. 1% ఇంధన సర్‌ఛార్జ్‌ మినహాయింపు పొందే అవకాశముంది. పొందిన రివార్డులపై పరిమితి, గడువు తేదీ లేదు. అమెజాన్‌లో రివార్డు పాయింట్లను రెడీమ్‌ చేసుకోవచ్చు. మీరు అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కలిగి ఉంటే అమెజాన్‌ ఇండియాలో కొనుగోళ్లపై 5% క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు.ఏయూ ఎల్‌ఐటీ క్రెడిట్‌ కార్డుఏయూ స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంక్‌ అందిస్తున్న ఈ కార్డు వల్ల దేశీయ, అంతర్జాతీయ ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ రిటైల్‌ లావాదేవీలపై 5X, 10X రివార్డు పాయింట్లను పొందొచ్చు. 90 రోజుల కాలవ్యవధిలో మూడుసార్లు 2-5% క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు. ఖర్చు చేసిన ప్రతి రూ.100కు 1 రివార్డు పాయింట్‌తో పాటు మీ రిటైల్‌ లావాదేవీల కోసం 2-5% క్యాష్‌బ్యాక్‌ను పొందడానికి అవకాశముంది. రూ.400-రూ.5000 మధ్య ఇంధన లావాదేవీలపై 1% ఇంధన సర్‌ఛార్జ్‌ మినహాయింపు పొందొచ్చు. ప్రతి 3 నెలలకు నాలుగు సార్లు విమానాశ్రయ లాంజ్‌లకు యాక్సెస్‌ పొందేవీలుంది.షాపర్స్‌ స్టాప్‌-హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుఈ కార్డుతో ప్రతి కొనుగోలుపై రివార్డ్స్‌ పొందొచ్చు. కార్డుదారులు షాపర్స్‌ స్టాప్‌ ప్రైవేట్‌ లేబుల్‌ బ్రాండ్‌లపై ఖర్చు చేసే ప్రతి రూ.150 కొనుగోలుపై 6 ఫస్ట్‌ సిటిజన్‌ పాయింట్లు వస్తాయి. రూ.500 విలువైన షాపర్స్‌ స్టాప్‌ వోచర్‌ను పొందొచ్చు. దీంతో షాపర్స్‌ స్టాప్‌ స్టోర్‌లో కనీసం రూ.3000 కొనుగోలు చేసినప్పుడు ఆ వోచర్‌ను రెడీమ్‌ చేసుకోవచ్చు. కార్డుపై ఒక సంవత్సరంలో రూ.2 లక్షలు ఖర్చు చేస్తే, 2000 ఫస్ట్‌ సిటిజన్‌ పాయింట్లను పొందే అవకాశం ఉంటుంది. రూ.400-5000 మధ్య ఇంధన లావాదేవీలపై 1% ఇంధన సర్‌ఛార్జ్‌ మినహాయింపు ఉంది.యాక్సిస్‌ బ్యాంక్‌ నియో క్రెడిట్‌ కార్డుఈ కార్డు ద్వారా చేసే అన్ని కొనుగోళ్లపై ఎడ్జ్‌ రివార్డ్‌ పాయింట్లను పొందడంతో పాటు పేటీఎం, మింత్ర, జొమాటో వంటి భాగస్వామ్య బ్రాండ్‌లపై రాయితీలు ఉంటాయి. బుక్‌మైషో ద్వారా సినిమా టిక్కెట్లు కొనుగోలు చేస్తే, 10% డిస్కౌంట్‌ లభిస్తుంది. ప్రతి రూ.200 ఖర్చుపై ఒక రివార్డు పాయింట్‌ పొందవచ్చు.

Low voter turnout not a worrying factor, say market experts
సానుకూల సంకేతాలు

ముంబై: ట్రేడింగ్‌ నాలుగు రోజులే జరిగే ఈ వారంలోనూ ఎన్నికల అప్రమత్తత కొనసాగే వీలుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. చివరి దశ కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు స్టాక్‌ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ ధరలూ ట్రేడింగ్‌ ప్రభావితం చూపొచ్చంటున్నారు. ఇక ప్రాథమిక మార్కెట్లో అవఫిస్‌ స్పేస్‌ సొల్యూషన్స్‌ ఐపీఓ బుధవారం ప్రారంభం కానుంది. ఇటీవల పబ్లిక్‌ ఇష్యూ పూర్తి చేసుకున్న గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు గురువారం ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. ‘‘అంతర్జాయతీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఇది దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఎన్నికల సంబంధిత పరిణామాల వార్తలు, కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఒడిదుడుకుల ట్రేడింగ్‌ కొనసాగొచ్చు. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 22,500 స్థాయిని నిలుకోగలిగితే జీవితకాల గరిష్టాన్ని (22,795) పరీక్షించవచ్చు. అమ్మకాలు నెలకొంటే 22,200 వద్ద మరో కీలక మద్దతు ఉంది’’ అని నిపుణులు తెలిపారు. ఇక ఈ వారంలో దాదాపు 200 కి పైగా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా యాజమాన్య వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. అమెరికా ఆర్థిక పరిణామాలు భారత్‌ మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి.

Indian pharma firms supplied 47percent of all generic prescriptions in US in 2022
యూఎస్‌ జెనరిక్స్‌ మార్కెట్లో భారత్‌ హవా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జెనరిక్‌ ఔషధ రంగంలో భారత కంపెనీల హవా కొనసాగుతోంది. 2022లో వైద్యుల సిఫార్సు మేరకు యూఎస్‌లో రోగులు వినియోగించిన మొత్తం జెనరిక్స్‌లో 47 శాతం భారతీయ కంపెనీలు సరఫరా చేశాయి. ఔషధాల పరిమాణం పరంగా భారత్‌ తొలి స్థానంలో నిలిచింది. ఇక్వియా నేషనల్‌ ప్రి్రస్కిప్షన్‌ ఆడిట్‌ ప్రకారం.. అందుబాటు ధరలో జెనరిక్‌ మందుల సరఫరాలో భారతీయ కంపెనీలు తమ సత్తా చాటుతున్నాయి. ప్రభుత్వ బీమా కార్యక్రమాలు, ప్రైవేట్‌ బీమా కంపెనీలు ఔషధాల కోసం చెల్లించిన మొత్తంలో.. భారతీయ ఫార్మా కంపెనీలు అందించిన మందులు సగానికంటే అధికంగా ఉండడం గమనార్హం. యూఎస్‌ సంస్థలు 30 శాతం వాటాతో రెండవ స్థానం సంపాదించాయి. మధ్యప్రాచ్య దేశాలు 11 శాతం, యూరప్‌ 5, కెనడా 3, చైనా 2, ఇతర దేశాల కంపెనీలు 2 శాతం జెనరిక్స్‌ సరఫరా చేశాయి. 50 శాతంపైగా మన కంపెనీలవే.. చికిత్సల పరంగా చూస్తే మానసిక రుగ్మతలకు వినియోగించిన మందుల్లో భారతీయ కంపెనీలు సరఫరా చేసినవి ఏకంగా 62 శాతం ఉన్నాయి. హైపర్‌టెన్షన్‌ 60 శాతం, లిపిడ్‌ రెగ్యులేటర్స్‌ 58, యాంటీ అల్సర్స్‌ 56, నరాల సంబంధ చికిత్సలకు 55 శాతం మందులు భారత్‌ నుంచి సరఫరా అయినవే కావడం విశేషం. మధుమేహ సంబంధ ఔషధాల్లో భారత్‌ వాటా 21 శాతంగా ఉంది. ఇక బయోసిమిలర్స్‌ సరఫరాలో మూడవ స్థానంలో ఉన్న భారత సంస్థల వాటా ప్రస్తుతం 15 శాతంగా ఉంది. యూఎస్‌ 56 శాతం, కొరియా 18, యూరప్‌ 11 శాతం బయోసిమిలర్స్‌ సరఫరా చేశాయి. మరో 1.3 ట్రిలియన్‌ డాలర్లు..భారతీయ కంపెనీలు సరఫరా చేసిన జెనరిక్‌ మందుల కారణంగా 2022లో యూఎస్‌ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ 219 బిలియన్‌ డాలర్ల మేర పొదుపు చేయగలిగింది. 2013 నుంచి 2022 మధ్య మొత్తం 1.3 ట్రిలియన్‌ డాలర్లు ఆదా అయ్యాయని ఇక్వియా నేషనల్‌ ప్రి్రస్కిప్షన్‌ ఆడిట్‌ నివేదిక పేర్కొంది. భారతీయ కంపెనీల నుండి వచ్చే జెనరిక్‌ ఔషధాలతో వచ్చే ఐదేళ్లలో అదనంగా 1.3 ట్రిలియన్‌ డాలర్ల పొదుపు అవుతుందని అంచనా. భారత్‌–యూఎస్‌ మధ్య బలమైన ఫార్మా వాణిజ్య భాగస్వామ్యం కోసం రెండు దేశాలు ఔషధ ముడిపదార్థాలకై విదేశీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఔషధ స్థితిస్థాపకతను సాధించాలని ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అలయన్స్‌ (ఐపీఏ) ఇటీవల కోరింది. ఔషధాల రంగంలో ఇరు దేశాలు కలిసి వచ్చి అగ్రిగేటర్‌గా మారాలి అని ఐపీఏ అభిప్రాయపడింది. 70 శాతం యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌ చైనా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి.

10 Percent Job Layoffs In Tesla
‘మళ్లీ తొలగింపులా?’, మస్క్‌ కఠిన నిర్ణయం..ఆందోళనలో ఉద్యోగులు

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ ఎలోన్‌ మస్క్‌ ఉద్యోగుల విషయంలో కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో 10 శాతం మంది వర్క్‌ ఫోర్స్‌ను తొలగించనున్నారనే ఊహాగానాలు ఆ సంస్థ ఉద్యోగుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఖర్చు తగ్గింపు, క్యూ1లో కంపెనీ పేలవమైన ప్రదర్శన, అనిశ్చితితో పాటు పలు అంశాలు లేఆఫ్స్‌కు కారణమని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఇప్పటికే కొంతమందిని తొలగించగా.. జూన్‌ నెల ముగిసే లోపు మరింత మందికి ఉద్వాసన పలకనుందని సమాచారం. దీనికి తోడు ఉద్యోగుల తొలగింపుకు పరోక్షంగా ఏఐ కారణమని తెలుస్తోంది. గత కొంత కాలంగా మస్క్‌ తన దృష్టిని ఈవీ వైపు కాకుండా ఏఐ, రోబోటిక్స్ వంటి టెక్నాలజీలకు సారించడం, ఈవీల తయారీ కంటే రోబోట్యాక్సీ వంటి ప్రాజెక్ట్‌లకు మస్క్ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే నైతికత క్షీణించిందని కొందరు ప్రస్తుత ఉద్యోగులు చెప్పారు.లేఆఫ్‌ల ముగింపుకు సంబంధించి మస్క్ నుండి స్పష్టమైన సూచన లేకపోవడం ఉద్యోగుల్లో ఆందోళనకు ఆజ్యం పోసింది. ఇక టెస్లా ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగులు సేల్స్‌, హెచ్‌ఆర్‌తో పాటు పలు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రభావితం కానున్నారు.

Indian Origin Businessman Gopichand Hinduja richest In UK
బ్రిటన్‌లో అత్యంత సంపన్నుడు భారతీయుడే..!

భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త గోపీచంద్ హిందూజా యూకేలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ‘ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్’ యూకేలోని 1,000 మంది సంపన్నులు లేదా కుటుంబాలతో వారి మొత్తం నెట్‌వర్త్‌ ప్రకారం జాబితా రూపొందించింది. ఈ జాబితాలో హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ హిందూజాను అగ్రస్థానంలో నిలిచారు.‘ది మిర్రర్’ ప్రకారం.. హిందుజా కుటుంబం ఆరు సంవత్సరాలుగా బ్రిటన్‌లో అత్యంత సంపన్నులుగా నిలుస్తూ వస్తోంది. ర్యాంకింగ్ ఆధారంగా హిందూజా నెట్‌వర్త్‌ అంతకు ముందు సంవత్సరంలోని 35 బిలియన్ పౌండ్‌ స్టెర్లింగ్స్‌ (సుమారు రూ. 3.7 లక్షల కోట్లు) నుంచి సుమారు 37.196 బిలియన్‌ పౌండ్‌ స్టెర్లింగ్స్‌కు (సుమారు రూ. 3.9 లక్షల కోట్లు) పెరిగింది.జీపీగా పిలిచే గోపీచంద్ హిందూజా భారత్‌లో 1940లో జన్మించారు. హిందూజా ఆటోమోటివ్ లిమిటెడ్ ఛైర్మన్ అయిన ఆయన గత సంవత్సరం తన సోదరుడు శ్రీచంద్ హిందూజా మరణించిన తరువాత తమ వ్యాపార సమూహానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. గోపీచంద్ 1959లో ముంబైలోని జై హింద్ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. దీంతోపాటు లండన్‌లోని రిచ్‌మండ్ కళాశాల నుంచి ఆర్థికశాస్త్రంలో గౌరవ డాక్టరేట్‌ను పొందారు. గోపీచంద్ తండ్రి, పరమానంద్ హిందూజా 1914లో హిందూజా ఫ్యామిలీ కంపెనీని స్థాపించారు.

Apple launched discount campaign offering upto 2300 yuan off select iPhone models
ఐఫోన్‌పై రూ.26వేలు డిస్కౌంట్‌.. ఎక్కడంటే..

యాపిల్‌ కంపెనీ చైనాలోని తన ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందిస్తుంది. చైనాలోని ఆన్‌లైన్‌ రిటైల్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ట్మాల్‌’ వెబ్‌సైట్‌లో యాపిల్‌ ఐఫోన్‌ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రచారాన్ని ప్రారంభించింది.ఎంపిక చేసిన ఐఫోన్‌ మోడళ్లపై 2,300 యువాన్ల (సుమారు రూ.26వేలు) వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు వెబ్‌సైట్‌లో ప్రకటనలు వెలిశాయి. ఈ ఆఫర్‌ మే 20 నుంచి 28 వరకు మాత్రమే ఉంటుందని ప్రచారం సాగుతోంది. హువాయ్‌ వంటి స్థానిక బ్రాండ్‌ల నుంచి యాపిల్‌కు గట్టిపోటీ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని వార్తా సంస్థలు కథనాల వెలువరించాయి. దాంతోపాటు యాపిల్‌ కొత్త మోడల్‌ లాంచ్‌ చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉన్నవాటికి ధర తగ్గిస్తుందనే వాదనలున్నాయి. ప్రస్తుతం యాపిల్‌ ఇస్తున్న డిస్కౌంట్‌ ఫిబ్రవరిలో ప్రకటించిన తగ్గింపు కంటే ఎక్కువగా ఉంది. అప్పుడు అత్యధికంగా 1,150 యువాన్లు మాత్రమే డిస్కౌంట్‌ ఇచ్చారు.చైనాలో ప్రముఖ హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ హువాయ్‌ గత నెలలో ‘పురా 70’ అనే మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇటీవల యాపిల్‌ ఐఫోన్‌ అమ్మకాలు తగ్గుతున్నాయి. చైనా అకాడమీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (సీఏఐసీటీ) డేటా ఆధారంగా మార్చిలో యాపిల్‌ ఎగుమతులు 12% పెరిగాయి. అయితే అమ్మకాలు మాత్రం 37% తగ్గాయి. దాంతో కంపెనీ భారీ రాయితీలు ఇస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Uber Gets Aggregator Licence to Operate Buses in Delhi Details
బస్ సర్వీస్ ప్రారభించనున్న ఉబర్.. మొదట ఆ నగరంలోనే..

ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ ఉబర్.. బస్సులను నడపడానికి సిద్ధమైంది. ప్రీమియం బస్ స్కీమ్ కింద ఈ సర్వీసు ప్రారభించనున్నట్లు సమాచారం. అయితే మొదట ఈ సేవను దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రారంభించనుంది.ఉబెర్‌కి బస్సులను నడపడానికి ఢిల్లీ రవాణా శాఖ అగ్రిగేటర్ లైసెన్స్ మంజూరు చేసింది. యాప్‌లో 'ఉబర్ షటిల్' ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రయాణికులు ఒక వారం ముందుగానే సీట్లను బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తరువాత లైవ్ లొకేషన్, రూట్‌ని ట్రాక్ చేయవచ్చు.ఉబర్ బస్సులో ఒకసారికి 19 నుంచి 50 మంది ప్రయాణికులు పయనించవచ్చు. రోజు వారీ ప్రయాణాలను కూడా ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ సర్వీసును మొదటి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పరీక్షించారు. ఇక త్వరలోనే ఈ సర్వీసును అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆ తరువాత కోల్‌కతాలో ప్రారంభించే అవకాశం ఉంది.బస్సు సర్వీస్ కోసం లైసెన్స్ పొందిన మొదటి కంపెనీగా ఉబెర్ అవతరించింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రజా రవాణా సేవలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉందని ఢిల్లీ ప్రభుత్వంలోని రవాణా శాఖ అధికారి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ సర్వీస్ ఇతర ప్రధాన నగరాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 92500.00 92500.00 0.00
Gold 22K 10gm 67600.00 67600.00 -250.00
Gold 24k 10 gm 73750.00 73750.00 -270.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement