Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Stock Market Rally On Today closing
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 22,210 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 66 పాయింట్లు దిగజారి 73,038 వద్దకు చేరింది.సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, భారతీఎయిర్‌టెల్‌, ఎం అండ్‌ ఎం, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎల్‌ అండ్‌ టీ, విప్రో, ఎస్‌బీఐ, టాటా ‍స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌యూఎల్‌, నెస్లే, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, మారుతీసుజుకీ, ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Us Issues Fresh Guidelines For H-1b Visa Holders Who Laid Off
లేఆఫ్స్‌కు గురయ్యారా?.. హెచ్‌1- బీ వీసాలో కొత్త నిబంధనలు

అగ్రరాజ్యం అమెరికా హెచ్‌-1 బీ వీసాలో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందనే అంచనాలు,పలు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ సంక్షోభం, ప్రాజెక్ట్‌ల కొరత, చాపకింద నీరులా ఏఐ వినియోగంతో ప్రపంచ వ్యాప్తంగా చోటోమోటా స్టార్టప్స్‌ నుంచి బడబడా టెక్‌ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికాలో ఉంటూ లేఆఫ్స్‌కు గురైన హె-1బీ వీసా దారుల కోసం యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌ (యూఎస్‌సీఐఎస్‌)కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది.ఫలితంగా లేఆఫ్స్‌ గురైన విదేశీయులు 60 రోజుల గ్రేస్‌ పిరయడ్‌ కంటే ఎక్కువ రోజులు అమెరికాలో నివసించేందుకు అవకాశం కలగనుంది. కొత్త నిబంధనల ప్రకారం.. గ్రేస్‌ పిరయడ్‌లో నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ స్టేటస్‌ మార్చుకునేందుకు అప్లయ్‌ చేసుకోవచ్చు.స్టేటస్‌ అప్లికేషన్‌ను అడ్జెస్ట్‌మెంట్‌ చేయాలని కోరుతూ ఫైల్‌ చేయొచ్చు. ఉద్యోగులు ఏడాది పాటు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD)అర్హత పొందేలా ధరఖాస్తు ఫైల్‌ చేసుకోవచ్చు. దీంతో పలు హెచ్‌1-బీ వీసాలో కొత్త మార్పులు చేస్తూ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.

china govt may buy unsold homes to help property market
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!

రియల్‌ ఎస్టేట్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా.. పరిస్థితిని గట్టెక్కించడానికి కీలక ఆలోచన చేస్తోంది. దేశంలోని స్థానిక ప్రభుత్వాలతో కలిసి లక్షల కొద్దీ అమ్ముడుపోని ఇళ్లను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోందని బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది.ప్రాథమిక ప్రణాళికపై స్టేట్ కౌన్సిల్ పలు ప్రావిన్సులు, ప్రభుత్వ సంస్థల నుంచి అభిప్రాయాన్ని కోరుతోంది. రాష్ట్ర నిధుల సహాయంతో అదనపు హౌసింగ్ ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి చైనా ఇప్పటికే అనేక పైలట్ ప్రోగ్రామ్‌లతో ప్రయోగాలు చేసింది. అమ్ముడుపోని ఇళ్లను ప్రభుత్వాలు కొనుగోలు చేసే తాజా ప్రణాళికను అతిపెద్ద ప్రయత్నంగా భావిస్తున్నారు.ప్రణాళికలో భాగంగా కష్టాల్లో ఉన్న డెవలపర్‌ల నుంచి అమ్ముడుపోని ఇళ్లను అమ్మించేందుకు ప్రభుత్వ సంస్థలు సహాయం చేస్తాయి. బ్యాంకుల రుణాల ద్వారా భారీ తగ్గింపులతో ఆ ఇళ్లను కొనుగోలుదారులకు అందిస్తాయి. ప్రణాళిక, దాని సాధ్యాసాధ్యాల వివరాలను అధికారులు ఇంకా చర్చిస్తున్నారు. చైనా ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయంపై ముందుకు వెళ్లాలనుకుంటే అది ఖరారు కావడానికి కొన్ని నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై చైనా గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించలేదు.ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో చైనాలో గృహాల విక్రయాలు దాదాపు 47 శాతం క్షీణించాయి. అమ్ముడుపోని ఇళ్ల జాబితా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఈ రంగంలోని దాదాపు అర కోటి మంది నిరుద్యోగం బారినపడే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని తగ్గించడానికి కొత్త విధానాలను అన్వేషిస్తామని ఏప్రిల్ 30న పాలక కమ్యూనిస్ట్ పార్టీ హామీ ఇచ్చిన తర్వాత పెట్టుబడిదారులు ప్రభుత్వ తదుపరి కదలికల కోసం ఎదురుచూస్తున్నారు.

YouTube blocked 32 video links of a protest song in Hong Kong
32 వీడియో లింకులను బ్లాక్‌ చేసిన యూట్యూబ్‌!

ప్రముఖ ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్ నిషేధిత కంటెంట్‌గా భావించే 32 వీడియో లింకులను బ్లాక్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. హాంకాంగ్‌ కోర్టు నిర్ణయానికి లోబడి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.చైనా-హాంకాంగ్‌ మధ్య కొన్నేళ్లుగా రాజకీయ, బౌగోళిక సమస్య కొనసాగుతోంది. హాంకాంగ్‌లో ప్రత్యేకపాలన ఉంటుంది. అక్కడి ప్రభుత్వాన్ని చైనాకు అనుకూలంగా ఉండే వారికి కట్టబెడుతారు. దాంతో స్థానిక ప్రజలనుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. అందులో భాగంగా 2019లో ‘గ్లోరీ టు హాంకాంగ్’ అనే నిరసన గీతం ప్రాచుర్యంలోకి వచ్చంది. దీన్ని నిషేధించాలని కోరుతూ హాంకాంగ్‌ అప్పీల్ కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ గీతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారడంతో దాన్ని తొలగించాలని తాజాగా కోర్టు ఆదేశించింది. ఫలితంగా పాటకు సంబంధించిన 32 వీడియో లింకులను తొలగిస్తున్నట్లు యూట్యూబ్‌ ప్రకటించింది. చైనా నుంచి హాంకాంగ్‌ విభజనను కోరుకుంటున్న అసమ్మతివాదులు ఆ పాటను ఉపయోగించుకోవచ్చని న్యాయమూర్తులు హెచ్చరించారు.ఇదీ చదవండి: టీవీ రిమోట్‌ పనిచేయడం లేదా..? చిట్కా మీ కోసమే..కోర్టు నిర్ణయంతో నిరాశ చెందినట్లు యూట్యూబ్‌ చెప్పింది. అయినప్పటికీ ఆ తీర్పును పాటిస్తామని స్పష్టం చేసింది. బుధవారం నుంచి ఇకపై యూట్యూబ్‌లో ఆ గీతం కోసం సెర్చ్‌చేస్తే ‘కోర్టు ఆర్డర్‌ వల్ల ఇందుకు సంబంధించిన కంటెంట్‌ దేశీయ డొమైన్‌లో నిషేధించడమైంది’ అనే పాప్‌అప్‌ మెసేజ్‌ వస్తుందని చెప్పింది. ఆన​్‌లైన్‌లో స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించానుకునేవారిని కట్టడి చేయడం సరికాదని, ఈ వ్యవహారానికి సంబంధించి ఇతర వర్గాలకు అప్పీల్ చేస్తామని తెలిపింది. ఇప్పటికే మానవ హక్కుల సంస్థలతో తమ భావాలను పంచుకున్నట్లు కంపెనీ పేర్కొంది.

Facebook Instagram down for many users globally
ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా డౌన్‌.. యూజర్ల గగ్గోలు

ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు ఫేస్‌బుక్‌ (Facebook), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) స్తంభించాయి. అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. మెటా యాజమాన్యంలోని ఈ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూజర్లకు పని చేయలేదు.ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్ల నుంచి 18,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌డెటెక్టర్ డేటా చెబుతోంది. వీరిలో 59 శాతం మంది యాప్‌ని యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలను ఎదుర్కొన్నారు. 34 శాతం మంది సర్వర్ కనెక్షన్ సమస్యలు, 7 శాతం మంది లాగిన్ చేయడంలో సమస్యలు ఎదుర్కొన్నారు.యూజర్లతోపాటు ఇతర మూలాల ద్వారా పరిస్థితిని తెలుసుకుని డౌన్‌డెటెక్టర్ అంతరాయాలను ట్రాక్ చేస్తుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొంతమంది యూజర్లు ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో అసహనం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ మానిటరింగ్ గ్రూప్ నెట్‌బ్లాక్స్ రెండు సామాజిక వెబ్‌సైట్‌లు (ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌) ప్రస్తుతం 'అంతర్జాతీయ అంతరాయాలను' ఎదుర్కొంటున్నాయని ఒక పోస్ట్‌లో పేర్కొంది.

You can find out how full or empty a battery is with a simple test and follow some rules to longlife
టీవీ రిమోట్‌ పనిచేయడం లేదా..? చిట్కా మీ కోసమే..

టీవీ రిమోట్‌..గోడగడియారం..పిల్లల ఆటబొమ్మలు..వంటి బ్యాటరీ ఉన్న వస్తువులు కొన్నిరోజుల తర్వాత పనిచేయకపోవడం గమనిస్తుంటాం. వాటిలో ఏదైనా సాంకేతిక సమస్యా..? లేదా బ్యాటరీ పాడైందా..అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. సాంకేతిక సమస్య తలెత్తితే రిపేర్‌ సెంటర్‌కు తీసుకెళ్తాం. కానీ బ్యాటరీ సమస్య వల్ల పనిచేయకపోతే ఎలా నిర్ధారించుకోవాలనే అంశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.బ్యాటరీని పరీక్షించండిలా..కొత్త బ్యాటరీని సుమారు 20 సెంటీమీటర్ల(8 ఇంచులు) ఎత్తు నుంచి గట్టి ఉపరితలంపై నిటారుగా జారవిడిచినపుడు అది బౌన్స్‌ అవ్వదు. ఉపరితలాన్ని తాకినచోటే కిందపడడం గమనిస్తాం. కొత్త ఆల్కలీన్‌ బ్యాటరీల్లో రసాయన శక్తిని విద్యుత్‌శక్తిగా మార్చే జెల్‌ వంటి పదార్థం సమృద్ధిగా ఉంటుంది. అది పైనుంచి విసిరిన బలాన్ని నిరోదిస్తుంది. దాంతో బౌన్స్‌ అవ్వదు. అదే అప్పటికే వాడిన బ్యాటరీలో ఆ జెల్‌ పదార్థం అంతా అయిపోతుంది. కాబట్టి ఆ జెల్‌ ఉన్న ప్రాంతమంతా గట్టిగా మారుతుంది. దాంతో పాత బ్యాటరీను పైనుంచి విసిరినపుడు కొంత బౌన్స్‌ అవుతుంది. అలాజరిగితే అందులో సమస్య ఉన్నట్లు నిర్ధారణకు రావచ్చు. ఈ సాధారణ పరీక్షతో పనిచేయని ఎలక్ట్రానిక్‌ పరికరంలో బ్యాటరీను మారిస్తే సరిపోతుంది.ఇదీ చదవండి: వినియోగంలోకి రానున్న క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ఎ‍క్కువకాలం రావాలంటే..చిన్నపిల్లల ఆటవస్తువులు వంటి పరికరాలు ఉపయోగించనపుడు వెంటనే వాటిని స్విచ్ ఆఫ్ చేయాలి. స్టాండ్‌బై మోడ్‌లో కూడా కొన్ని పరికరాలకు ఎనర్జీ అవసరమవుతుంది. దాంతో బ్యాటరీ డిశ్చార్జ్‌ అవుతుంది. కాబట్టి వాడిన తర్వాత వెంటనే స్విచ్‌ఆఫ్‌ చేయాలి.పరికరాలను ఎక్కువకాలం ఉపయోగించకుంటే అందులోనుంచి బ్యాటరీలను పూర్తిగా తొలగించాలి. అందువల్ల ఎనర్జీ నష్టాన్ని నివారించవచ్చు.అధిక లేదా తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో బ్యాటరీలను నిల్వ చేయరాదు. ఉష్ణోగ్రతల్లోని వ్యత్యాసం వల్ల బ్యాటరీ రసాయన ప్రక్రియలో తేడాలేర్పడుతాయి. వాతావరణంలోని భారీ ఉష్ణోగ్రతల వల్ల జెల్‌ సామర్థ్యం దెబ్బతింటుంది.పాత బ్యాటరీలను, కొత్తవాటిని కలిపి ఒకేచోట నిల్వచేయకూడదు. ఏదైనా పరికరంలో రెండు బ్యాటరీలు వేయాల్సివస్తే పాత బ్యాటరీ, కొత్త బ్యాటరీను కలిపి వాడకూడదు. దాంతో పాత దానివల్ల కొత్తది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీలనుబట్టి కూడా సామర్థ్యాల్లో తేడాలుంటాయి. వోల్టేజ్‌స్థాయుల్లోనూ వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఒకే రకమైన బ్యాటరీలను ఉపయోగించడం మేలు.

gold price today rate may 15
4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!

అక్షయ తృతీయ తర్వాత తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ మోత మోగించాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 15) గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగింది. ప్రస్తుతం రూ.67,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.430 పెరిగి రూ. 73,250 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ధరలుదేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.430 ఎగిసి రూ.73,400 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,150లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.430 పెరిగి రూ.73,250 లకు చేరుకుంది.ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,150 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.430 పెరిగి రూ.73,250 లకు ఎగిసింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 పెరిగి రూ.67,250ల​కు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.380 ఎగిసి రూ.73,360 లను తాకింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు పెరిగాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.91,000లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Many calculations will be done at a time with the help of quantum computing
ఏకకాలంలో ఎన్నోపనులు..!

ఒకేసమయంలో రెండు పనులు చేయడం సాధ్యమా.. అని అడిగితే చాలా కష్టమని చెబుతాం. కానీ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో క్యూబిట్స్‌ ఏకకాలంలో చాలా పనులు చేయగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.నిత్యం టెక్నాలజీలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అన్నిరంగాల్లో అందరికంటే ముందుండాలనే భావనతో వేగంగా పనిచేయాలనుకుంటున్నారు. అందుకు తగ్గుట్టు ప్రముఖ కంపెనీలు సాంకేతిక పరికరాలు తయారుచేస్తున్నాయి. వాటిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీను వాడే పరికరాలకు సమీప భవిష్యత్తులో గిరాకీ ఏర్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.ఈ ఏడాదిలో డేటా అనలిటిక్స్‌, కృత్రిమ మేధ రంగాలను క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ గణనీయంగా మలుపు తిప్పగలదని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మానవ పురోగమనాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం వాడుతున్న కంప్యూటింగ్‌ టెక్నాలజీ కంటే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఎన్నోరెట్లు సమర్థంగా, వేగంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఎలా పనిచేస్తుందంటే..ఇది ఎంటాంజిల్‌మెంట్‌, సూపర్‌పొజిషన్స్‌ అనే అంశాల మూలంగా ఒకే సమయంలో వేలసంఖ్యలో గణనలు చేయగలదు. సంప్రదాయ కంప్యూటర్లు బైనరీ బిట్స్‌..అంటే 0 లేదా 1 రూపంలో సమాచారాన్ని నిల్వ చేసుకుంటాయి. దాన్ని విశ్లేషిస్తాయి. అదే క్వాంటమ్‌ కంప్యూటర్లు క్యూబిట్స్‌ సాయంతో పనిచేస్తాయి. ఇవి 1, 0.. లేదా ఒకే సమయంలో రెండు రూపాల్లోనూ ఉండొచ్చు. అంటే ఒక పని పూర్తి కాకుండానే మరో పనిని మొదలు పెడుతాయి. ఒకే సమయంలో రెండు పనులనూ చేస్తాయి.ఇదీ చదవండి: 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..క్వాంటమ్‌ రేణువులు ఎంటాంజిల్‌మెంట్‌ అనే విచిత్రమైన ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. ఎంటాంజిల్‌ అయినప్పుడు అవి ఎంత దూరంలో ఉన్నా ఒకదాంతో మరోటి అనుసంధానమవుతాయి. అదీ లక్షలాది మైళ్ల దూరంలో ఉన్నాసరే ఎంటాంజిల్‌ అవుతాయి. ఈ ప్రక్రియలో క్యూబిట్ల సంఖ్యను పెంచితే క్వాంటమ్‌ పరికరాల సామర్థ్యం అనూహ్యంగా పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పరిజ్ఞానం ప్రయోగశాలలను దాటుకొని వాడకానికి దగ్గరవుతోంది. మందుల ఆవిష్కరణ, క్రిప్టోగ్రఫీ, వాతావరణ శాస్త్రం, పదార్థ విజ్ఞానం వంటి ఎన్నో రంగాల్లో ఇది సంచలన మార్పులకు కారణం కాగలదని భావిస్తున్నారు.

Stock Market Rally On Today Opening
గ్రీన్‌లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ 44 పాయింట్లు లాభపడి 22,262కు చేరింది. సెన్సెక్స్‌ 88 పాయింట్లు పెరిగి 73,185 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.02 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 82.86 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.44 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లోకి వెళ్లాయి. ఎస్‌ అండ్‌ పీ 0.48 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.75 శాతం పుంజుకుంది.టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 1.26 శాతంగా నమోదైంది. గడచిన 13 నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఫుడ్‌ ఆరి్టకల్స్‌లో పాటు, విద్యుత్, క్రూడ్‌ పెట్రోలియం, సహజ వాయువు, కొన్ని తయారీ ఉత్పత్తుల ధరలూ పెరిగినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సూచీ వరుసగా రెండు నెలల నుంచి పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరిలో 0.20% ఉన్న డబ్ల్యూపీఐ, మార్చిలో 0.53 శాతానికి ఎగసింది. గత 2023 ఏప్రిల్‌లో సూచీ 0.79 శాతం పెరిగింది. యూరోజోన్‌ మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, అమెరికా రిటైల్‌ ద్రవ్యోల్బణ అంచనాలు (బుధవారం), విడుదల కానున్నాయి. జపాన్‌ క్యూ1 జీడీపీ, మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, ఈసీబీ ఆర్థిక స్థిరత్వ సమీక్ష, అమెరికా పారిశ్రామికోత్పత్తి, ఎగుమతి, దిగుమతుల డేటా(గురువారం) వెల్లడి కానున్నాయి. చైనా ఏప్రిల్‌ రిటైల్‌ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి, నిరుద్యోగ రేటు, యూరోజోన్‌ ఏప్రిల్‌ ద్రవ్యోల్బణ శుక్రవారం వెల్లడి కానున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

IndiGo discussions with ATR Embraer and Airbus to acquire at least 100 smaller planes
100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..

ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలందించేలా ఇండిగో సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దానికోసం మూడు విమాన తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది.ఇండిగో సంస్థ ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. స్థానికంగా ప్రయాణికులకు రవాణా సేవలందించి లాభాలు పొందాలని యోచిస్తోంది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. అయితే వీటి తయారీకి ఏటీఆర్‌, ఎంబ్రాయిర్‌, ఎయిర్‌బస్‌ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా 50 విమానాలకు ఆర్డరు పెట్టి, తర్వాత మరో 50 విమానాలు కొనుగోలు చేయాలనుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండిగో 45 ఏటీఆర్‌-72 విమానాలను నడుపుతోంది. అందులో ప్రతి విమానంలో 78 సీట్లు ఉంటాయి. ఈ ఏడాదిలో మరో 5 కొత్త విమానాలు కంపెనీలో చేరనున్నాయి.ఇదీ చదవండి: తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్‌ జ్యూస్‌ ఫ్యూచర్లపై ‍ప్రభావంఏటీఆర్‌తోపాటు ఎయిర్‌బస్ ఏ220, ఎంబ్రేయర్ ఈ-175 రకం విమానాలను కంపెనీ పరిశీలిస్తోంది. ఇటీవల అంతర్జాతీయ మార్గాలను చేరుకునేందుకు వీలుగా ఏప్రిల్‌లో 30 ఎయిర్‌బస్ ఏ350-900 విమానాల కోసం ఆర్డర్‌ చేసింది.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 90800.00 90800.00 100.00
Gold 22K 10gm 66740.00 66740.00 -10.00
Gold 24k 10 gm 72810.00 72810.00 -10.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement