Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Many calculations will be done at a time with the help of quantum computing
ఏకకాలంలో ఎన్నోపనులు..!

ఒకేసమయంలో రెండు పనులు చేయడం సాధ్యమా.. అని అడిగితే చాలా కష్టమని చెబుతాం. కానీ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో క్యూబిట్స్‌ ఏకకాలంలో చాలా పనులు చేయగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.నిత్యం టెక్నాలజీలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అన్నిరంగాల్లో అందరికంటే ముందుండాలనే భావనతో వేగంగా పనిచేయాలనుకుంటున్నారు. అందుకు తగ్గుట్టు ప్రముఖ కంపెనీలు సాంకేతిక పరికరాలు తయారుచేస్తున్నాయి. వాటిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీను వాడే పరికరాలకు సమీప భవిష్యత్తులో గిరాకీ ఏర్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.ఈ ఏడాదిలో డేటా అనలిటిక్స్‌, కృత్రిమ మేధ రంగాలను క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ గణనీయంగా మలుపు తిప్పగలదని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మానవ పురోగమనాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం వాడుతున్న కంప్యూటింగ్‌ టెక్నాలజీ కంటే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఎన్నోరెట్లు సమర్థంగా, వేగంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఎలా పనిచేస్తుందంటే..ఇది ఎంటాంజిల్‌మెంట్‌, సూపర్‌పొజిషన్స్‌ అనే అంశాల మూలంగా ఒకే సమయంలో వేలసంఖ్యలో గణనలు చేయగలదు. సంప్రదాయ కంప్యూటర్లు బైనరీ బిట్స్‌..అంటే 0 లేదా 1 రూపంలో సమాచారాన్ని నిల్వ చేసుకుంటాయి. దాన్ని విశ్లేషిస్తాయి. అదే క్వాంటమ్‌ కంప్యూటర్లు క్యూబిట్స్‌ సాయంతో పనిచేస్తాయి. ఇవి 1, 0.. లేదా ఒకే సమయంలో రెండు రూపాల్లోనూ ఉండొచ్చు. అంటే ఒక పని పూర్తి కాకుండానే మరో పనిని మొదలు పెడుతాయి. ఒకే సమయంలో రెండు పనులనూ చేస్తాయి.ఇదీ చదవండి: 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..క్వాంటమ్‌ రేణువులు ఎంటాంజిల్‌మెంట్‌ అనే విచిత్రమైన ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. ఎంటాంజిల్‌ అయినప్పుడు అవి ఎంత దూరంలో ఉన్నా ఒకదాంతో మరోటి అనుసంధానమవుతాయి. అదీ లక్షలాది మైళ్ల దూరంలో ఉన్నాసరే ఎంటాంజిల్‌ అవుతాయి. ఈ ప్రక్రియలో క్యూబిట్ల సంఖ్యను పెంచితే క్వాంటమ్‌ పరికరాల సామర్థ్యం అనూహ్యంగా పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పరిజ్ఞానం ప్రయోగశాలలను దాటుకొని వాడకానికి దగ్గరవుతోంది. మందుల ఆవిష్కరణ, క్రిప్టోగ్రఫీ, వాతావరణ శాస్త్రం, పదార్థ విజ్ఞానం వంటి ఎన్నో రంగాల్లో ఇది సంచలన మార్పులకు కారణం కాగలదని భావిస్తున్నారు.

Stock Market Rally On Today Opening
గ్రీన్‌లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ 44 పాయింట్లు లాభపడి 22,262కు చేరింది. సెన్సెక్స్‌ 88 పాయింట్లు పెరిగి 73,185 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.02 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 82.86 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.44 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లోకి వెళ్లాయి. ఎస్‌ అండ్‌ పీ 0.48 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.75 శాతం పుంజుకుంది.టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 1.26 శాతంగా నమోదైంది. గడచిన 13 నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఫుడ్‌ ఆరి్టకల్స్‌లో పాటు, విద్యుత్, క్రూడ్‌ పెట్రోలియం, సహజ వాయువు, కొన్ని తయారీ ఉత్పత్తుల ధరలూ పెరిగినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సూచీ వరుసగా రెండు నెలల నుంచి పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరిలో 0.20% ఉన్న డబ్ల్యూపీఐ, మార్చిలో 0.53 శాతానికి ఎగసింది. గత 2023 ఏప్రిల్‌లో సూచీ 0.79 శాతం పెరిగింది. యూరోజోన్‌ మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, అమెరికా రిటైల్‌ ద్రవ్యోల్బణ అంచనాలు (బుధవారం), విడుదల కానున్నాయి. జపాన్‌ క్యూ1 జీడీపీ, మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, ఈసీబీ ఆర్థిక స్థిరత్వ సమీక్ష, అమెరికా పారిశ్రామికోత్పత్తి, ఎగుమతి, దిగుమతుల డేటా(గురువారం) వెల్లడి కానున్నాయి. చైనా ఏప్రిల్‌ రిటైల్‌ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి, నిరుద్యోగ రేటు, యూరోజోన్‌ ఏప్రిల్‌ ద్రవ్యోల్బణ శుక్రవారం వెల్లడి కానున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

IndiGo discussions with ATR Embraer and Airbus to acquire at least 100 smaller planes
100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..

ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలందించేలా ఇండిగో సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దానికోసం మూడు విమాన తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది.ఇండిగో సంస్థ ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. స్థానికంగా ప్రయాణికులకు రవాణా సేవలందించి లాభాలు పొందాలని యోచిస్తోంది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. అయితే వీటి తయారీకి ఏటీఆర్‌, ఎంబ్రాయిర్‌, ఎయిర్‌బస్‌ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా 50 విమానాలకు ఆర్డరు పెట్టి, తర్వాత మరో 50 విమానాలు కొనుగోలు చేయాలనుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండిగో 45 ఏటీఆర్‌-72 విమానాలను నడుపుతోంది. అందులో ప్రతి విమానంలో 78 సీట్లు ఉంటాయి. ఈ ఏడాదిలో మరో 5 కొత్త విమానాలు కంపెనీలో చేరనున్నాయి.ఇదీ చదవండి: తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్‌ జ్యూస్‌ ఫ్యూచర్లపై ‍ప్రభావంఏటీఆర్‌తోపాటు ఎయిర్‌బస్ ఏ220, ఎంబ్రేయర్ ఈ-175 రకం విమానాలను కంపెనీ పరిశీలిస్తోంది. ఇటీవల అంతర్జాతీయ మార్గాలను చేరుకునేందుకు వీలుగా ఏప్రిల్‌లో 30 ఎయిర్‌బస్ ఏ350-900 విమానాల కోసం ఆర్డర్‌ చేసింది.

OpenAI Co founder Ilya Sutskever Leaving Company
పదేళ్ల తర్వాత.. చాట్‌జీపీటీ కంపెనీ కోఫౌండర్‌ సంచలన నిర్ణయం!

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రగామిగా పేరొందిన ఓపెన్‌ఏఐ (OpenAI) సహ వ్యవస్థాపకుడు ఇల్యా సుట్స్‌కేవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని స్థాపించిన ఇన్నేళ్లకు సంస్థను వీడుతున్నట్లు తాజాగా ప్రకటించారు."దాదాపు ఒక దశాబ్దం తర్వాత, నేను ఓపెన్‌ఏఐ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను" అని సుట్స్‌కేవర్ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ఒక పోస్ట్‌లో చెప్పారు. ఇతర కోఫౌండర్లు సామ్‌ ఆల్ట్‌మన్‌, గ్రెగ్‌ బ్రాక్‌మన్‌, సీటీవో మిరా మురాతి, జాకబ్‌ పచోకీల నాయకత్వంలో కంపెనీ మరింత పురోగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే తాను మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు.ఓపెన్‌ఏఐ అనేది ఇటీవల చాలా పాపులర్ అయిన చాట్‌బాట్ ‘చాట్ జీపీటీ’ నిర్వహణ సంస్థ. మైక్రోసాఫ్ట్ మద్దతు గల ఈ కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ.. ఓపెన్‌ఏఐ కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం సుట్స్‌కేవర్ అని, ఆయన లేకుంటే సంస్థ ఇలా ఉండేది కాదని పేర్కొన్నారు. జాకుబ్ పచోకీ కంపెనీకి కొత్త చీఫ్ సైంటిస్ట్ అవుతారని చెప్పారు. పచోకి గతంలో ఓపెన్‌ పరిశోధన డైరెక్టర్‌గా పనిచేశారు. GPT-4, ఓపెన్‌ఏఐ ఫైవ్ అభివృద్ధికి నాయకత్వం వహించారు.After almost a decade, I have made the decision to leave OpenAI. The company’s trajectory has been nothing short of miraculous, and I’m confident that OpenAI will build AGI that is both safe and beneficial under the leadership of @sama, @gdb, @miramurati and now, under the…— Ilya Sutskever (@ilyasut) May 14, 2024

inance minister nirmala sitharaman warns retail investors of fo risks urges stricter regulations
ఎఫ్‌అండ్‌వోతో జర జాగ్రత్త

ముంబై: రిస్క్ లతో కూడుకున్న ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్న నేపథ్యంలో దీనిపై తగిన విధంగా పర్యవేక్షణ ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో భవిష్యత్తులో మార్కెట్లతో పాటు ఇన్వెస్టర్ల సెంటిమెంటు, కుటుంబాల పొదుపునకు సవాళ్లు తలెత్తగలవని ఆమె హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఆ నిధులకు రక్షణ కల్పించడం తమ లక్ష్యమని బీఎస్‌ఈ నిర్వహించిన వికసిత్‌ భారత్‌ 2047 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. ఎఫ్‌అండ్‌వోలో ట్రేడింగ్‌ కారణంగా ప్రతి పది మంది రిటైల్‌ ఇన్వెస్టర్లలో తొమ్మిది మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారన్న సెబీ అధ్యయనం నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Wholesale Inflation Rises To 13 Month High Of one point two six percent In April
ఆహార ధరల తీవ్రత

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 1.26 శాతంగా నమోదైంది. గడచిన 13 నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఫుడ్‌ ఆరి్టకల్స్‌లో పాటు, విద్యుత్, క్రూడ్‌ పెట్రోలియం, సహజ వాయువు, కొన్ని తయారీ ఉత్పత్తుల ధరలూ పెరిగినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సూచీ వరుసగా రెండు నెలల నుంచి పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరిలో 0.20% ఉన్న డబ్ల్యూపీఐ, మార్చిలో 0.53 శాతానికి ఎగసింది. గత 2023 ఏప్రిల్‌లో సూచీ 0.79 శాతం పెరిగింది. అధికారిక గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ⇒ ఫుడ్‌ ఆర్టికల్స్‌ ధరలు మార్చిలో 6.88 శాతం పెరిగితే, ఏప్రిల్‌లో 7.74 శాతం ఎగశాయి. ఇదే కాలంలో కూరగాయల ధరలు 19.52 శాతం నుంచి 23.60 శాతానికి ఎగశాయి. ఆలూ ధరలు 52.96 శాతం నుంచి 71.97 శాతానికి పెరిగాయి. ఇక ఉల్లి ధరలు మార్చిలో 56.99% పెరిగితే, ఏప్రిల్‌లో 59.75 % ఎగశాయి. ⇒ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ బాస్కెట్‌ విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 1.38 శాతంగా ఉంది. మార్చిలో ఈ విభాగంలో అసలు పెరుగుదల లేకపోగా మైనస్‌ 0.77 శాతంగా (క్షీణత) నమోదైంది. ⇒సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మాత్రం ఏప్రిల్‌లో పెరక్కపోగా, 0.42 శాతం క్షీణించింది. అయితే మార్చిలో ఈ క్షీణ రేటు 0.85 శాతం ఉండడం గమనార్హం.

Tesla To Cut Over 600 jobs
మరో 600 జాబ్స్‌కి గండం!

Tesla Layoffs: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లాలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పని చేస్తున్న దాదాపు 10 శాతం మంది సిబ్బందిని తొలగించిన టెస్లా.. తాజాగా మరింత మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది.టెస్లా సోమవారం ప్రభుత్వ ఏజెన్సీలకు ఇచ్చిన నోటీసు ప్రకారం, కాలిఫోర్నియాలో అదనంగా 601 ​​మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించిన గ్లోబల్ ఉద్యోగ కోతల్లో భాగంగా కాలిఫోర్నియా, టెక్సాస్‌లలో 6,020 మందిని తొలగించనున్నట్లు గత నెలలో తెలిపింది.టెస్లా కార్ల విక్రయాలు ఇటీవల కాలంలో భారీగా పడిపోయాయి. మరోవైపు ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ భారీగా పెరిగింది. దీంతో టెస్లా కంపెనీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విక్రయాలు పెంచడం కోసం ధరలను తగ్గించింది. త్వరలో అందుబాటు ధరలో కొత్త కార్లను తీసుకురానున్నట్లు టెస్లా తెలిపింది. మరోవైపు ఖర్చులను తగ్గించేందుకు పెద్ద ఎత్తున తమ కంపెనీలను ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 శాతం మంది సిబ్బందిని తొలగించింది.

Global Consortium Planning By 76 Per Cent Stake In Haldiram Snacks Food
హల్దీరామ్స్‌పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్‌

న్యూఢిల్లీ: 1937లో ఓ చిన్న షాప్‌గా ప్రారంభమైన హల్దీరామ్స్‌.. ఇప‍్పుడు దేశంలో అతిపెద్ద స్నాక్స్‌ తయారు చేసే సంస్థగా అవతరించింది. అయితే ఇప్పుడు కంపెనీలో సింహభాగం వాటాను కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ ఆధ్వర్యంలో గ్లోబుల్‌ కన్సార్టీయం బ్లాక్‌స్టోన్‌ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది.గత వారం హల్దీరామ్స్‌ స్నాక్స్‌ ఫుడ్‌ విభాగంలో 76 శాతం వాటాను ఈ‍క్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌, అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అధారిటీ (ఏడీఏఐ), సింగపూర్‌ జీఐసీలు బిడ్డింగ్‌లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ బిడ్డింగ్‌పై హల్దీరామ్స్‌, గ్లోబుల్‌ కన్సార్టీయంలో అధికారంగా వెల్లడించాల్సి ఉంది.కాగా ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌ ప్యాకేజీ ఫుడ్‌ బిజినెస్‌పై కన్నేసింది. స్నాక్స్‌ తయారు చేసే హల్దీరామ్స్‌ కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపాయి. అయితే, హల్దీరామ్స్‌ వాల్యుయేషన్‌ అధికంగా పేర్కొంటుండడంపై టాటా గ్రూప్‌ అనాసక్తి వ్యక్తం చేస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Cbi Arrest On Dheeraj Wadhawan
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్‌.. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ధీరజ్ వాధావన్ అరెస్ట్‌

రూ. 34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ డైరెక్టర్‌ ధీరజ్‌ వాధవాన్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. వాధవాన్‌ను సోమవారం సాయంత్రం ముంబైలో అదుపులోకి తీసుకున్నామని, మంగళవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు సీబీఐ అధికారులు ధృవీకరించారు. బ్యాంకులను రూ.34,615 కోట్ల మేర మోసం చేసిన కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మాజీ ప‍్రమోటర్లపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 17 బ్యాంకుల కన్సార్టియంలను మోసం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీబీఐ అధికారులు డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు ధీరజ్ వాధవాన్, కపిల్ వాధవాన్‌లపై కేసులు నమోదు చేశారు. ఎస్‌ బ్యాంక్ అవినీతి కేసులో అరెస్ట్‌ ఈ కేసుకు సంబంధించి 2022లో ధీరజ్‌ను సీబీఐ చార్జిషీట్‌లో చేర్చింది. ఎస్‌ బ్యాంక్ అవినీతి కేసులో వాధావాన్‌ను గతంలో సీబీఐ అరెస్ట్‌ చేస్తే బెయిల్‌పై విడుదలైనట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ లోన్‌ కుంభకోణంగా వాధావాన్‌ అరెస్ట్‌పై 17 బ్యాంకుల కన్సార్టియంను రూ.34,000 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐ డీహెచ్‌ఎఫ్‌ఎల్ కేసు నమోదు చేసిందని, ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ లోన్‌ కుంభకోణంగా నిలిచిందని సీబీఐ అధికారులు పేర్కొన్నారునేరపూరిత కుట్రకుయూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను మోసం చేయడానికి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డైరెక్టర్లు కపిల్ వాధావన్, ధీరజ్ వాధవన్ ఇతర నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఈ కుట్రలో భాగంగా వాధవాన్‌లు రూ. 42,871.42 కోట్ల భారీ రుణాలను మంజూరు చేసేందుకు కన్సార్టియం బ్యాంకులను ప్రేరేపించారని ఏజెన్సీ తెలిపింది.నిందితులు డీహెచ్‌ఎఫ్‌ఎల్ లెక్కల్ని తారుమారు చేసింది. ఆ నిధుల్ని వినియోగించడం, దుర్వినియోగం చేశారు. కన్సార్టియం బ్యాంకుల చట్టబద్ధంగా బకాయిలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని సీబీఐ అధికారులు వెల్లడించారు.

Going To Be Biggest Loser About Vivek Wadhwa On Elon Musk
త్వరలో మస్క్‌కు ముప్పు.. భారత్‌ సంతతి సీఈవో సంచలన వ్యాఖ్యలు

టెస్లా సీఈవో ఎలోన్‌ మస్క్‌ త‍్వరలో భారీ నష్టాల్ని చవిచూడనున్నారంటూ భారత సంతతి ఆంత్రప్రెన్యూర్‌ వివేక్ వాధ్వా హెచ్చరించారు. ఇటీవల టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ భారత్‌లో కాదని చైనాతో సంత్సంబంధాలు నెరపడంపై ఎక్స్‌ వేదికగా వివేక్‌ వాధ్వా మస్క్‌ను ప్రశ్నించారు.తన ఈవీ కార్యకలాపాల కోసం భారత్‌ను కాదని చైనాని ఎంచుకోవడం మస్క్ భారీ మొత్తంలో నష్టపోనున్నారని వివేక్‌ వాధ్వా అన్నారు. చైనాలో ప్రమాదం అంచున వ్యాపారాలపై మస్క్‌కు మెయిల్‌ చేసినట్లు వెల్లడించారు. చైనా మస్క్‌ను గుడ్డిగా దోచుకుంటుందని నేను అతనిని ముందే హెచ్చరించాను. కార్ల తయారీని చైనా నుంచి భారత్‌కు తరలించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ రష్యా యూరప్ ఆసియా స్టడీస్ డైరెక్టర్ థెరిసా ఫాలన్ పోస్ట్‌ను వివేక్‌ వాధ్వా ఉటంకించారు. థెరిసా ఫాలన్‌ తన పోస్ట్‌లో అమెరికా, యూరోపియన్ ఆటోమేకర్స్ చైనాలో ఎందుకు విఫలమవుతున్నారు. స్వల్ప కాలిక లాభాల కోసం టెక్, మేనేజ్‌మెంట్ టెక్నిక్‌ అంశాల్ని అక్కడ అమలు చేయడం ద్వారా చైనా ఎలాంటి ప్రయోజనాల్ని పొందుతుందని నివేదించారు. వాటి ద్వారా కార్ల తయారీ సంస్థలు ఎలా నష్టపోతున్నారని వివరించారు. ఆ అంశాన్ని ప్రధానంగా చర్చించిన వాధ్వా మస్క్‌ గురించి పై విధంగా వ్యాఖ్యానించారు.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 90800.00 90800.00 100.00
Gold 22K 10gm 66740.00 66740.00 -10.00
Gold 24k 10 gm 72810.00 72810.00 -10.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement