Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

USAID India Mission Director Veena Reddy Visit Hyderabad
హైదరాబాద్‌లో యూఎస్ఏఐడీ ఇండియా డైరెక్టర్

యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) ఇండియా మిషన్ డైరెక్టర్ 'వీణా రెడ్డి' హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ క్వాల్‌కమ్ ఇండియాకు సంబంధించిన ఓఆర్ఏఎన్ రీసెర్చ్ ల్యాబ్‌లను సందర్శించారు. ఇక్కడ టెలికమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎలా ముందుకు సాగుతుందో గమనించారు.యూఎస్ఏఐడీ 5జీ అండ్ ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌లతో సహా కొత్త వైర్‌లెస్ టెక్నాలజీలను పరీక్షించడంలో భారతీయ టెలికమ్యూనికేషన్ కంపెనీలకు కొన్ని సంస్థలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది టెలికమ్యూనికేషన్ హార్డ్‌వేర్ అమెరికన్ సరఫరాదారు అయిన 'క్వాల్‌కమ్ టెక్నాలజీ'.క్వాల్కమ్ టెక్నాలజీ సహకారంతో.. భారతీయ టెలికామ్ రంగం కొత్త ఆవిష్కరణలకు పునాది వేస్తుంది, తద్వారా అనేక గ్లోబల్ అప్లికేషన్‌ల పరిష్కారాలు సాధ్యమవుతాయి. ఈ సందర్భంగా వీణా రెడ్డి మాట్లాడుతూ.. జీ20 లీడర్స్ సమ్మిట్ సందర్భంగా చెప్పినట్లుగానే యునైటెడ్ స్టేట్స్, భారతదేశంలో విశ్వసనీయ టెలిక‌మ్యూనికేష‌న్స్‌ వృద్ధి చెందుతాయని అన్నారు.డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక శ్రేయస్సును పెంచడమే ప్రధాన లక్ష్యం. భారతదేశంలో సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైర్‌లెస్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లకు మెరుగుపరచడానికి మేము ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యం కలిగి ఉన్నామని వీణా రెడ్డి పేర్కొన్నారు.

PhonePe Partners With LankaPay Details
భారతీయ పర్యాటకులకు శుభవార్త.. ఇక ఆ దేశంలో 'ఫోన్ పే' సేవలు

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) సేవలు విస్తరణ చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలుదేశాల్లో అందుబాటులో ఉన్న 'ఫోన్ పే' ఇప్పుడు తాజాగా 'లంకాపే'తో చేతులు కలిపింది. ఇది భారతీయ పర్యాటకులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి.శ్రీలంకకు వెళ్లే భారతీయులు ఇకపై ఫోన్ పే యాప్‌తో లంకాపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ పే చేయవచ్చు. ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో భారతీయ పర్యాటకులు శ్రీలంకకు వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా డబ్బు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.ఇప్పటికే ఫోన్ పే సేవలు సింగపూర్, నేపాల్ వంటి దేశాల్లో అమలులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా శ్రీలంక దేశంలో కూడా అందుబాటులోకి వచ్చేసింది.శ్రీలంకలో ప్రారంభమైన ఫోన్ పే సేవల సందర్భంగా.. లంకాపే సీఈఓ చన్నా డి సిల్వా మాట్లాడుతూ, భారతీయ పర్యాటకులు, బిజినెస్‌ ప్రయాణీకులకు శ్రీలంక పర్యటన సమయంలో చెల్లింపు అనుభవాన్ని మెరుగుపరిచే దిశలో ఇది కీలక అడుగు అన్నారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ శ్రీలంక గవర్నర్‌ నందలాల్‌ వీరసింగ్‌ స్పందిస్తూ.. పోటీతత్వాన్ని, శ్రీలంక వ్యాపారులకు ప్రయోజనాలను పెంపొందించడానికి చాలా ఉపయోగకరంగా ఉండదని అన్నారు. ఈ కార్యక్రమానికి బ్యాంకింగ్ అండ్ టూరిజం రంగాల ప్రతినిధులు, వ్యాపార సంఘాల ప్రతినిధులతో సహా శ్రీలంకకు చెందిన ముఖ్య వాటాదారులు హాజరయ్యారు.

Mahindra XUV 3XO Bookings Crossed 50000 in 60 Minutes
బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్.. మార్కెట్లో మహీంద్రా కారు సంచలనం

గత నెల చివరలో దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మహీంద్రా XUV 3XO కారు బుకింగ్స్ బుధవారం (మే 15) ప్రారంభయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 10 నిమిషాల్లో మహీంద్రా కొత్త కారు 27000 బుకింగ్స్ పొందింది. అదే విధంగా 60 నిమిషాల్లో 50000 బుకింగ్స్ పొందింది.మహీంద్రా కంపెనీ ఇప్పటికే 10000 కార్లను (XUV 3XO) ఉత్పత్తి చేసినట్లు సమాచారం. కాబట్టి డెలివరీలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారు మొత్తం 9 వేరియంట్లలో విడుదలైంది. XUV 3XO ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు.తొమ్మిది వేరియంట్లు, ఎనిమిది కలర్ ఆప్షన్లలో లాంచ్ అయిన ఈ కొత్త కారు మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు, లెవల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.Crossing milestones even before it hits the roads. A big thank you to all our customers who have made this possible. Be a part of our journey, book now: https://t.co/P7UUnkoyxv#XUV3XO    #EverythingYouWantAndMore #The3XFactor pic.twitter.com/HMNylKisa1— Mahindra XUV 3XO (@MahindraXUV3XO) May 15, 2024

Motorola Edge 50 Fusion Launch in India Price and Details
మోటోరోలా కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?

దేశీయ మార్కెట్లో మోటోరోలా కంపెనీ తన 'ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త ఫోన్ ధరలు, ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.భారతీయ విపహ్లవు లాంచ్ అయిన కొత్త మోటోరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ ప్రారంభ ధర రూ. 22999 (8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్), 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24999. ఈ మొబైల్ మే 22 నుంచి మోటోరోలా.ఇన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో ప్రముఖ రిటైల్ స్టోర్‌లో కూడా విక్రయానికి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు ఈఎంఐ లావాదేవీలతో రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు.మోటోరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ వేగన్ లెదర్ ముగింపుతో హాట్ పింక్,మార్ష్‌మల్లౌ బ్లూ కలర్‌వేస్‌లో మాత్రమే కాకుండా.. పాలీమిథైల్ మెథాక్రిలేట్ (PMMA) ముగింపుతో ఫారెస్ట్ బ్లూ కలర్ ఎంపికలో కూడా అందుబాటులో ఉంటుంది.లేటెస్ట్ మోటోరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ 6.7 ఇంచెస్ ఫుల్ HD+ (1,0800x2,400 పిక్సెల్‌లు) pOLED కర్వ్డ్ డిస్‌ప్లే పొందుతుంది. ఇది క్వాల్‌కామ్‌ 4ఎన్‌ఎం స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌2 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ మొబైల్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి 68 వాట్‌ టర్బోపవర్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం ఐపీ68 రేటింగ్ పొందుతుంది.కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇది 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై-6, బ్లూటూత్‌ 5.2, జీపీఎస్‌, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. బయోమెట్రిక్‌ కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ వంటివి ఇందులో లభిస్తాయి.

Stock Market Rally On Today Closing
పుంజుకున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 194 పాయింట్లు లాభపడి 22,394 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 649 పాయింట్లు పుంజుకుని 73,636 వద్ద ముగిసింది.సెన్సెక్స్‌ 30 సూచీలో ఎం అండ్‌ ఎం, టెక్‌ మహీంద్రా, భారతీఎయిర్‌ఎల్‌, ఇన్ఫోసిస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, నెస్లే కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Jet Airways founder Naresh Goyal's wife Anita Goyal dies of cancer
క్యాన్సర్‌తో నరేష్‌ గోయల్‌ భార్య కన్నుమూత

జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ క్యాన్సర్‌తో పోరాడుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. ఆమె 2015 నుంచి సంస్థలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.అనితా గోయల్‌ కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా గురువారం ఉదయం ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనిత 1979లో మార్కెటింగ్ అనలిస్ట్‌గా కంపెనీలో చేరారు. ఆమె మార్కెటింగ్ అండ్‌ సేల్స్ హెడ్‌గా ఎదిగిన తర్వాత నరేష్‌ గోయల్‌తో పరిచయం ఏర్పడింది. వారు కలిసిన తొమ్మిదేళ్ల తర్వాత వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.మనీలాండరింగ్‌ కేసులో 2023లో జైలుకెళ్లిన ఆమె భర్త నరేష్‌గోయల్‌కు వైద్యకారణాల వల్ల బాంబే హైకోర్టు సోమవారం బెయిల్‌ ఇచ్చింది. భర్త జైల్లోనుంచి బయటకు వచ్చిన కొద్దిరోజులకే భార్య మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది.

Vineet Nayyar Tech Mahindra Former Chief Dies
టెక్ మహీంద్రా మాజీ చీఫ్ వినీత్ నయ్యర్ కన్నుమూత

టెక్ మహీంద్రా లిమిటెడ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ (85) కన్నుమూశారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారు. వినీత్ నయ్యర్ మృతిపై పలువురు ప్రముఖలు తమ సంతాపాన్ని తెలియజేశారు."భారత్‌ ఈరోజు అత్యుత్తమ నాయకుడిని కోల్పోయింది" అని టెక్ మహీంద్రా మాజీ సీఈవో సీపీ గుర్నానీ నయ్యర్ మరణానికి సంతాపాన్ని తెలియజ్తేస్తూ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్ట్ చేశారు.మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా నయ్యర్ మృతికి ‘ఎక్స్‌’ పోస్ట్‌లో సంతాపం తెలిపారు. "భారతీయ వ్యాపార రంగంలో వినీత్ అతి పెద్ద వ్యక్తి" అని పేర్కొన్నారు. టెక్ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ‘ఎక్స్‌’లో వినీత్‌ మృతికి సంతాపం వ్యక్తం చేసింది.1939లో జన్మించిన నయ్యర్ మసాచుసెట్స్‌లోని విలియమ్స్ కళాశాల నుంచి డెవలప్‌మెంట్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఐఏఎస్‌ అధికారిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన 40 ఏళ్ల కెరీర్‌లో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ కార్పొరేట్ రంగాల్లో పనిచేశారు. పదేళ్లకుపైగా ప్రపంచ బ్యాంకులో పనిచేసిన ఆయన పలు కీలక పదవులను నిర్వహించారు. 2009లో కుప్పకూలిన కంప్యూటర్ సేవల సంస్థ సత్యం పునరుద్ధరణలో నయ్యర్ కీలక పాత్ర పోషించారు.It saddens me to share the news of the passing of Vineet Nayyar this morning.Vineet was a larger than life figure in the Indian Business landscape. A distinguished IAS officer, who then served with the World Bank, he became the first Chairman of GAILHe then made a hugely… pic.twitter.com/ZLlfzNXJ2K— anand mahindra (@anandmahindra) May 16, 2024

investers should know stock market fundamentals
కొత్త ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాల్సినవి..

స్టాక్‌మార్కెట్‌లో కొత్తగా పెట్టుబడి పెట్టేవారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మార్కెట్‌లో నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని పదాలకు సరైన అర్థం తెలుసుకోకపోతే డబ్బు నష్టపోవాల్సి ఉంటుంది. కంపెనీలు తమ వ్యాపారాలు నిర్వహించాలంటే ఉబ్బు అవసరం అవుతుంది. ప్రమోటర్లు ఇన్వెస్ట్‌ చేసిన డబ్బు సంస్థ అవసరాలకు సరిపోదు. దాంతో సంస్థలో కొంత షేర్‌ను ఇన్వెస్టర్లకు ఇచ్చి దానివల్ల సమకూరే డబ్బుతో వ్యాపారం చేస్తాయి. కంపెనీలు సంపాదించే లాభంలో వారికి వాటా ఇస్తుంటాయి. ఈ క్రమంలో కొత్తగా మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసినవారు, ఇకపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు తెలుసుకోవాల్సిన కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.సెబీసెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) భారతీయ స్టాక్‌ మార్కెట్‌ను పర్యవేక్షిస్తోంది. కంపెనీలు, పెట్టుబడిదారులు, వ్యాపారులు, బ్రోకర్లు చేసే లావాదేవీలు, కార్యకలాపాలపై నిఘా వేయడానికి ఈ రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేశారు.డీమ్యాట్‌ అకౌంట్‌డీమ్యాట్‌ లేదా డీమెటీరియలైజ్డ్‌ ఖాతా, ఎలక్ట్రానిక్‌ ఫార్మాట్‌లో కస్టమర్‌ షేర్లు, ఇతర సెక్యూరిటీలను కలిగి ఉండే సాధనం. డీమ్యాట్‌ ఖాతా ద్వారా కంపెనీ షేర్లను కొనడం లేదా విక్రయించడం లాంటివి చేయొచ్చు. భారత్‌లో షేర్ మార్కెట్ లావాదేవీల కోసం డీమ్యాట్‌ ఖాతా తప్పనిసరిగా ఉండాలి.స్టాక్‌ స్ప్లిట్‌కంపెనీ షేరు ధర భారీగా పెరిగినా, ప్రైస్‌ టు ఎర్నింగ్‌ నిష్పత్తి ఎక్కువగా ఉన్నట్లు భావించినా ప్రస్తుత షేరును బహుళ షేర్లుగా విభజిస్తారు. ఉదాహరణకు ఒక కంపెనీ 1:2 స్టాక్‌ స్ప్లిట్‌ను ప్రకటిస్తే ప్రతి 1 షేరుకు పెట్టుబడిదారులు 2 అదనపు షేర్లు డీమ్యాట్‌లో చేరుతాయి.బుల్‌/బేర్‌ మార్కెట్‌బుల్‌ మార్కెట్‌లో కంపెనీల షేర్లను ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. దాంతో ఆ మార్కెట్‌లో షేర్‌ ధర పెరుగుతోంది. అయితే ఈ ట్రెండ్‌ చాలాకాలంపాటు కొనసాగుతుంటూ దాన్ని బుల్‌ మార్కెట్‌ అంటారు. ఇటీవల నెలకొన్న అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరత వల్ల మార్కెట్లు కుప్పకూలాయి. ఆ ట్రెండ్‌ కొంతకాలంపాటు సాగింది. దాన్ని బేర్‌ మార్కెట్‌ అంటాం.స్టాక్‌ బ్రోకర్‌కంపెనీలను సంప్రదించి నేరుగా షేర్లను కొనుగోలు చేసే ప్రక్రియ లేదు. కాబట్టి దీని కోసం స్టాక్‌ బ్రోకర్‌ అనే వ్యవస్థ ఉంది. ఈ స్టాక్‌బ్రోకర్లు తమ క్లయింట్స్‌ కోసం షేర్లను కొనుగోలు చేయడం, అమ్మడం చేస్తారు. ఉదాహరణకు జెరోధా, అప్‌స్టాక్స్‌, ఫయ్యర్స్‌.. వంటివి స్టాక్‌బ్రోకర్లుగా ఉన్నాయి.డివిడెండ్‌కంపెనీ త్రైమాసిక ఫలితాలు విడుదల చేసినపుడు లాభానష్టాలు ప్రకటిస్తాయి. లాభాలు ఆర్జించినప్పుడు దానిలో కొంత భాగాన్ని షేర్‌ హోల్డర్స్‌కు పంచుతాయి. కంపెనీలు పెట్టుబడిదారులకు స్వల్ప మొత్తంలో డివిడెండ్‌ను పంపిణీ చేస్తాయి. ఇది దీర్ఘకాలిక వాటాదారులకు ప్రధాన ఆదాయ వనరుగా మారుతుంది. డివిడెంట్‌ చెల్లింపులు నగదుగా, స్టాక్స్‌ లేదా వివిధ రూపాల్లో జారీ చేయొచ్చు.ప్రైమరీ మార్కెట్‌/ఐపీఓఒక కంపెనీ మొదటిసారి షేర్లను జారీచేసి మూలధనం సమకూర్చాలంటే ఐపీఓ ద్వారా మార్కెట్‌లో లిస్ట్‌ అవ్వాల్సి ఉంటుంది. ఈ షేర్ల జారీని ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) అంటారు. కంపెనీలకు ఇది ఒక ముఖ్యమైన దశ. ఐపీఓ ద్వారా ఒక సంస్థకు సంబంధించిన షేర్లను కొనుగోలు చేయొచ్చు. ఐపీఓ ద్వారా సేకరించిన నిధులు నేరుగా కంపెనీకి వెళ్తాయి. కంపెనీ పెరుగుదలకు, విస్తరణకు ఉపయోగపడతాయి.

adverse events in some participants who took Covaxin finds New study
కోవాగ్జిన్‌తోనూ సైడ్‌ ఎఫెక్ట్స్‌..

బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌పై ఆందోళనలు తగ్గేలోపే భారతీయ కంపెనీ తయారు చేసిన మరో కోవిడ్‌ వ్యాక్సిన్‌ ‘కోవ్యాక్సిన్‌’తోనూ సైడ్‌ ఎఫెక్ట్స్‌ తలెత్తినట్లు ఓ తాజా అధ్యయనం వెలువడింది.భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను తీసుకున్న కొంతమందిని బనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధక బృందం ఏడాదిపాటు పరిశీలించి అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు మూడింట ఒకవంతు మంది ప్రతికూల సంఘటనలను నివేదించారు. 635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలు మొత్తం 1,024 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో 304 (47.9 శాతం) మంది టీనేజర్లు, 124 మంది (42.6 శాతం) పెద్దలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎదుర్కొన్నట్లు నివేదించారు. 10.5 శాతం మందిలో చర్మ సమస్యలు, 10.2 శాతం మందిలో సాధారణ రుగ్మతలు, 4.7 శాతం మందిలో నాడీ సంబంధిత సమస్యలు, 4.6 శాతం మంది మహిళల్లో రుతుక్రమ సమస్యలు, 2.7 శాతం మందిలో కంటి సమస్యలు గుర్తించారు.సైడ్‌ ఎఫెక్ట్స్‌ వార్తల నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను వాణిజ్య కారణాలతో మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్న కొన్ని రోజులకే ఈ అధ్యయనం వెలువడటంతో కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలోనూ ఆందోళన మొదలైంది.

Microsoft Corp and LinkedIn jointly release 2024 Work Trend Index for AI effect in future
భవిష్యత్తులో ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుందంటే..

మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌, లింక్డ్‌ఇన్‌ సంయుక్తంగా వర్క్ ట్రెండ్ ఇండెక్స్‌-2024ను విడుదల చేశాయి. 31 దేశాల్లోని దాదాపు 31వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఫార్చున్‌ 500 కంపెనీల కస్టమర్లు కూడా ఇందులో భాగమైనట్లు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. భారత్‌లో 92 శాతం మంది ప్రొఫెషనల్స్ తమ పనిలో ఏఐని వాడుతున్నారని నివేదికలో తెలిపారు. 91 శాతం కంపెనీలు ఏఐను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు.గడిచిన ఏడాది కాలంలో ఉద్యోగాల కల్పనలో, నిత్యం చేస్తున్న పనిలో, నాయకత్వంలో కృత్రిమమేధ ప్రభావం ఎలాఉందో ఈ సర్వే ద్వారా తెలియజేశామని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. ‘గత ఆరునెలల్లో జనరేటివ్‌ ఏఐ వల్ల పనిలో ఉత్పాదక దాదాపు రెండింతలు పెరిగింది. ఉద్యోగాలకోసం వెతికే వారి ప్రొఫైల్‌లో ఏఐ నైపుణ్యాలు తోడైతే వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అవి లేనివారిని చాలా కంపెనీలు చేర్చుకోవడం లేదు. అయితే కొన్ని సంస్థలు ఏఐని అందిపుచ్చుకోవడంలో వెనకబడ్డామని భావిస్తున్నాయి. కొంతమంది ఉద్యోగులు తమ సొంత ఏఐ టూల్స్‌ను వాడుతున్నారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి దాన్ని పరిష్కరించాలంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో వారి వ్యాపారంపై ప్రభావం పడుతుంది. ఏఐ ఆర్థిక వ్యవస్థతోపాటు ఇప్పటికే చాలా రంగాలను మారుస్తుంది. వినియోగదారులకు అందించే ఉత్పత్తుల్లో నాణ్యత మెరుగుపరిచి యూజర్ల ఆసక్తులను ప్రోత్సహిస్తే 2030 నాటికి దాదాపు సగంకంటే ఎక్కువ లాభాలు పొందవచ్చని పీడబ్ల్యూసీ పరిశోధన విడుదల చేసింది. ఏఐ ప్రభావంతో 2030 నాటికి దక్షిణ యూరప్‌ జీడీపీ 11.5% వరకు పెరుగుతుంది. ఇది 700 బిలియన్‌ డాలర్లకు సమానం’ అని నివేదికలో తెలిపారు.కంపెనీ యాజమాన్యాలు, లేబర్ మార్కెట్‌కు సంబంధించి కృత్రిమమేధ ఏమేరకు ప్రభావం చూపుతుందో నివేదికలో తెలిపారు. ఈ వివరాలు కింద తెలియజేశాం.అధికశాతం ఉద్యోగులు తాము చేస్తున్న పనిలో ఏఐను వాడాలనుకుంటున్నారు. 75 శాతం వర్కర్లు ప్రస్తుతం పనిలో ఏఐను ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని వాడకంతో పనిలో వేగాన్ని పెంచడానికి కష్టపడుతున్నారు. ఏఐ తమ సమయాన్ని ఆదా చేస్తుందని, సృజనాత్మకతను పెంచుతుందని, ముఖ్యమైన పనిపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. 79 శాతం మంది తమ పనిలో ఏఐ కీలకంగా ఉంటుందని అంగీకరించినప్పటికీ, అందులో 60 శాతం మంది తమ కంపెనీలో కృత్రిమమేధ వినియోగానికి సంబంధించి సరైన ప్రణాళిక లేదని తెలిపారు. 78 శాతం మంది తమ పనిలో సొంత ఏఐటూల్స్‌ను వాడుతున్నారు. కానీ ఎలాంటి ప్రణాళిక, నియంత్రణ లేకుండా వాడుతున్న ఈ టూల్స్‌ వల్ల కంపెనీ డేటా ప్రమాదంలో పడుతుందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: త్వరలో అందరికీ ఉచితంగా జీపీటీ-4ఓ.. ప్రత్యేకతలివే..కృత్రిమమేధ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయం చాలా మందికి ఉన్నప్పటికీ, డేటా భిన్నమైన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఏఐ నైపుణ్యాలను నేర్చుకునే వారికి సైబర్‌ సెక్యూరిటీ, ఇంజినీరింగ్, క్రియేటివ్ డిజైన్..వంటి రంగాల్లో అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 46 శాతం మంది రాబోయే సంవత్సరంలో తాము చేస్తున్న ఉద్యోగం మారాలని చూస్తున్నారు. 66 శాతం కంపెనీలు ఏఐ నైపుణ్యాలు లేనివారిని నియమించుకోవడం లేదు. కోపైలట్‌, చాట్‌జీపీటీ వంటే ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. మొత్తం కంపెనీల్లో 39శాతం మాత్రమే వారి ఉద్యోగులకు ఏఐ శిక్షణ అందించాయి. కేవలం 25 శాతం కంపెనీలు మాత్రమే ఈ సంవత్సరం ఏఐ ట్రెయినింగ్‌ అందిస్తున్నాయి.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 90800.00 90800.00 100.00
Gold 22K 10gm 66740.00 66740.00 -10.00
Gold 24k 10 gm 72810.00 72810.00 -10.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement