Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Iran President Dies Impact on Oil Prices Gold Rates
ఇరాన్‌ అధ్యక్షుడి మృతి.. ఎగిసిన చమురు, బంగారం ధరలు!

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్‌బైజాన్ సరిహద్దు సమీపంలోని పర్వత ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ వార్తలు వెలువడిన వెంటనే చమురు ఎక్కువ ఉత్పత్తి చేసే మధ్యప్రాచ్య ప్రాంతంలో రాజకీయ అనిశ్చితి మధ్య బంగారం ఆల్-టైమ్ హైని తాకింది. ముడి చమురు ధరలు పెరిగిపోయాయి.బంగారం ధరలపై ప్రభావంఇరాన్ అధ్యక్షుడి మరణ వార్తల తర్వాత సోమవారం బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గ్లోబల్ అనిశ్చితుల మధ్య సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తారు. 0811 జీఎంటీ అంటే భారతీయ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1:41 గంటల సమయానికి స్పాట్‌ బంగారం ఔన్సు ధర 1 శాతం పెరిగి 2,438.44 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు సెషన్‌లో రికార్డు గరిష్ట స్థాయి 2,449.89 డాలర్లను తాకింది. యూఎస్‌ గోల్డ్ ఫ్యూచర్స్ 1.1 శాతం పెరిగి 2,442.60 డాలర్లకు చేరుకుంది. వెండి కూడా 11 సంవత్సరాల కంటే ఎక్కువ గరిష్ట స్థాయికి చేరుకుంది.ముడి చమురు ధరలుఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ క్రాష్ నివేదికలు వచ్చిన వెంటనే ప్రధాన చమరు ఉత్పత్తి దేశాలలో రాజకీయ అనిశ్చితి మధ్య అంతర్జాతీయ ముడి చమురు ధరలు సోమవారం లాభాలను పొడిగించాయి. ఆరోగ్యంతో సమస్యల కారణంగా సౌదీ అరేబియా యువరాజు జపాన్ పర్యటనను రద్దు చేసుకోవడం కూడా చమురు ధరల పెరుగుదలకు కారణమైనట్లుగా తెలుస్తోంది.భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12:02 గంటల సమయానికి బ్రెంట్ బ్యారెల్‌కు 41 సెంట్లు లేదా 0.5 శాతం పెరిగి 84.39 డాలర్లకు చేరుకుంది, అంతకుముందు 84.43 డాలర్లకి పెరిగింది. మే 10వ తేదీ తర్వాత ఇదే అత్యధికం.

india Economic and Commercial Relations with Israel and iran
ఇరాన్‌ అధ్యక్షుడు హఠాన్మరణం.. భారత్‌తో వాణిజ్యం ఎలా ఉందంటే..

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్(బెల్‌-212) ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ పరస్పరం ప్రతీకార దాడులు జరుపుకుంటున్న నేపథ్యంలో ఇరు దేశాలు భారత్‌తో జరుపుతున్న వాణిజ్యం ఏమేరకు ప్రభావం పడుతుందోననే ఆందోళనలు నెలకొంటున్నాయి. ఇప్పటివరకైతే రెండు దేశాలతో భారత్‌ మెరుగైన సంబంధాలను కలిగి ఉంది. ఏటా ఆయా దేశాలతో చేసే వాణిజ్యాన్ని పెంచుకుంటుంది. ప్రధానంగా వాటి నుంచి జరిపే దిగుమతులు, ఎగుమతులు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.2022-23లో 2.33 బిలియన్‌డాలర్ల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అది 21.7 శాతం అధికం. భారత్‌ నుంచి ఇరాన్‌కు చేసే ఎగుమతులు 1.66 బి.డాలర్లు(ముందు ఏడాదితో పోలిస్తే 14.34శాతం అధికం)గా ఉన్నాయి. ఇరాన్‌ నుంచి భారత్‌ చేసుకునే దిగుమతులు 672 మిలియన్‌ డాలర్లు(ముందు ఏడాదితో పోలిస్తే 45.05 శాతం)గా ఉన్నాయి.భారత్‌ నుంచి ఇరాన్‌ వెళ్తున్న వాటిలో ప్రధానంగా బాస్మతి బియ్యం, టీ పౌడర్‌, షుగర్‌, పండ్లు, ఫార్మా ఉత్పత్తులు, కూల్‌డ్రింక్స్‌, పప్పుదినుసులు ఉన్నాయి. ఇరాన్‌ నుంచి భారత్‌ దిగుమతి చేసుకునే వస్తువుల్లో మిథనాల్‌, పెట్రోలియం బిట్యుమెన్‌, యాపిల్స్‌, ప్రొపేన్‌, డ్రై డేట్స్‌, ఆర్గానిక్‌ కెమికల్స్‌, ఆల్మండ్స్‌ ఉన్నాయి.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్‌ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లుఇజ్రాయెల్‌తోనూ భారత్‌కు మెరుగైన సంబంధాలే ఉన్నాయి. ఇబ్రాయెల్‌కు భారత్‌ ఎగుమతుల్లో ప్రధానంగా ఆటోమేటివ్‌ డీజిల్‌, కెమికల్‌ ఉత్పత్తులు, ఎలక్ట్రికల్‌ వస్తువులు, ప్లాస్టిక్‌, టెక్స్ట్‌టైల్‌, మెటల్‌ ఉత్పత్తులు ఉన్నాయి ఫెర్టిలైజర్‌ ఉత్పత్తులు, రంగురాళ్లు, పెట్రోలియం ఆయిల్స్‌, డిఫెన్స్‌ పరికరాలను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది.

US Hikes Tariff on Chinese EV Full Details
జో బైడెన్ కీలక నిర్ణయం.. చైనా ఉత్పత్తులపై కఠిన ఆంక్షలు

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్.. వివిధ చైనీస్ దిగుమతులపై గణనీయమైన సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. చైనీస్ ఈవీలపై విధించే సుంకం ఈ ఏడాది 25 శాతం నుంచి 100 శాతానికి పెరగనుంది. బ్యాటరీలు, బ్యాటరీ భాగాలు, విడిభాగాలపైన విధించే ట్యాక్స్ 7.5 శాతం నుంచి 25 శాతానికి పెరగనున్నట్లు సమాచారం.అమెరికా తీసుకున్న ఒక్క నిర్ణయం 18 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై ప్రభావం చూపుతుంది. ఈ ట్యాక్స్ 2024 నుంచి మరో మూడు సంవత్సరాలు అమలులో ఉంటాయి. అమెరికాలో చవకైన ఉత్పత్తుల పెరుగుదలను నిరోధించడానికి బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.స్వదేశీ వస్తువుల వినియోగం పెరగటానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలోనే కొత్త ఆవిష్కరణ ఉత్పత్తి చాలా అవసరం. కాబట్టి అమెరికాలోనే కొత్త ఉత్పత్తుల తయారీ సాధ్యమవుతుందని చెబుతున్నారు.2025 నాటికి, సెమీకండక్టర్లపై ట్యాక్ రేటు కూడా 25 శాతం నుంచి 50 శాతానికి పెరుగుతుంది. లిథియం అయాన్ ఈవీ బ్యాటరీలపై సుంకం 2024లో 7.5 శాతం నుంచి 25 శాతానికి పెరుగుతుంది, నాన్ ఈవీ లిథియం అయాన్ బ్యాటరీలపై కూడా ఇదే పెరుగుదలను చూస్తుంది. బ్యాటరీ విడి భాగాల మీద ట్యాక్స్ కూడా 25 శాతానికి పెరుగుతుంది. మొత్తం మీద అమెరికా చైనా వస్తువుల మీద భారీ సుంకాలను విధిస్తూ కీలక ప్రకటనలు చేసింది.

Former Beauty Queen Loses money In Zelle Scam In US
‘జెల్లె స్కామ్‌’.. డబ్బులు పోగొట్టుకున్న అమెరికన్‌ బ్యూటీ

అమెరికన్‌ బ్యూటీ బ్రియానా సియాకా ‘జెల్లె స్కామ్‌’లో డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ స్కామ్‌ పట్ల అందరూ అప్రమత్తంగా హెచ్చరించారు. అసలేంటీ స్కామ్‌, డబ్బులు ఎలా పోగొట్టుకున్నది ఆమె వివరించారు.న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. యూఎస్‌లో మాజీ మిస్‌ న్యూయార్క్‌ అయిన బ్రియానా సియాకా టిక్‌టాక్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఇద్దరు యువకులు తన నుంచి 2,000 డాలర్లు (రూ. 1.66 లక్షలు) ఎలా లాక్కున్నారో వివరించారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న సియాకా, తాను మాడిసన్ స్క్వేర్ పార్క్‌లో కూర్చుని పాడ్‌కాస్ట్ వింటుండగా ఇద్దరు కుర్రాళ్లు తన వద్దకు వచ్చి తమ బాస్కెట్‌బాల్ జట్టు కోసం నిధులు సేకరిస్తున్నామని, తమకు సహాయం చేయాలని కోరారని చెప్పారు.తాను వారికి కొంత డబ్బు ఇవ్వడానికి అంగీకరించానని, కానీ తన వద్ద నగదు లేకపోవడంతో జెల్లె యాప్‌ ద్వారా చెల్లించేందుకు ఒప్పుకొన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తమ అకౌంట్‌ వివరాలు నమోదు చేసేందుకు తన ఫోన్‌ తీసుకున్నాడని, మరో కుర్రాడు తనను మాటల్లో పెట్టగా అతను తన అకౌంట్‌ నుంచి 2,000 డాలర్లు వారి ఖాతాకు మళ్లించుకున్నారని వివరించారు. న్యూయార్క్ పోలీసుల ప్రకారం, ఇది చాలా సాధారణమైన స్కామ్. దీని దుండగులు విరాళాల పేరుతో డబ్బును స్వాహా చేస్తారు."నేను ఆశ్చర్యపోయాను. ఈ అబ్బాయిలు చాలా మంచిగా, అమాయకంగా మాట్లాడితే వారు నిజంగానే తమ జట్టు కోసం విరాళాలు సేకరిస్తున్నారని అనుకున్నాను" అని సియాకా చెప్పారు. జెల్లె (Zelle) అనేది జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికాతో సహా ఏడు బ్యాంకుల యాజమాన్యంలోని పీర్-టు-పీర్ నెట్‌వర్క్. 2017లో ప్రారంభమైన జెల్లె అతిపెద్ద యూఎస్‌ పీర్-టు-పీర్ చెల్లింపుల నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఎదిగింది.

Google announced to release Android 15 beta 2 at the Google i/o 2024
ఆండ్రాయిడ్‌ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లు

ఆల్ఫాబెట్‌ ఇంక్‌ ఇటీవల నిర్వహించిన గూగుల్‌ I/O 2024 సదస్సులో ఆండ్రాయిడ్‌ 15 బీటా 2ను పీచర్లను ప్రకటించింది. ఈ ఫీచర్లు ఇప్పటికే పిక్సెల్‌ మొబైల్‌ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. పిక్సెల్‌ ఫోన్‌ను గూగుల్‌ ప్రత్యేకంగా తయారుచేస్తోంది. దాంతో కొత్త ఫీచర్లు తమ వినియోగదారులకు ఇప్పటికే అందుబాటులో ఉంచింది.గూగుల్‌ ప్రకటించిన ఈ ఫీచర్లను త్వరలో ఆండ్రాయిడ్‌ వాడుతున్న ఇతర కంపెనీ ఫోన్లలోనూ ప్రవేశపెట్టనున్నారు. డెవలపర్‌ ప్రివ్యూ లేదా బీటా వెర్షన్లలో పాల్గొంటున్న వారికి ఆటోమేటిక్‌గా బీటా 2 అప్‌డేట్‌ లభిస్తుందని కంపెనీ తెలిపింది.ఆండ్రాయిడ్‌ 15 బీటా 2లో కొన్ని ఫీచర్లు..ఆండ్రాయిడ్‌ 15 బీటా 2లో ప్రైవేట్‌ స్పేస్‌ సౌకర్యం అందిస్తున్నారు. దీనివల్ల ప్రత్యేక ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేసి కావాల్సిన యాప్‌లను విడిగా సేవ్‌ చేసుకోవచ్చు. ప్రొఫైల్‌ లాక్‌ చేసినప్పుడు అవి కనిపించవు.ప్రైవేట్‌ స్పేస్‌లోని యాప్‌లన్నీ లాంఛర్‌లోని ప్రత్యేక కంటైనర్‌లో ఉంటాయి. రీసెంట్ యాప్స్‌, నోటిఫికేషన్స్‌, సెటింగ్స్‌లోనూ కనిపించవు.ఫీచర్‌ యాప్‌ పెయిర్స్‌ అనే కొత్త ఫీచర్‌తో స్ప్లిట్‌ స్క్రీన్‌ మోడ్‌లో ఒకేసారి రెండు యాప్‌లను లాంఛ్‌ చేయొచ్చు. తరచూ ఉపయోగించే యాప్‌లను వెంటవెంటనే ఓపెన్‌ చేయొచ్చు.ఇదీ చదవండి: పాలసీదారులను మోసం చేస్తున్న బీమా ప్లాట్‌ఫామ్‌లుహెల్త్‌ కనెక్ట్‌ ఫీచర్‌లో స్కిన్‌ టెంపరేచర్‌, ట్రైనింగ్‌ ప్లాన్స్‌ అనే విభాగాలు చేర్చారు. దాంతో యూజర్లు తమ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంది.

Not As A Good Man But Says Infosys Narayana Murthy
మంచి వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదు!.. కానీ..

టెక్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి'. ప్రారంభం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. నేడు కోట్ల సంపదకు నాయకుడైన ఈయన ఎంతోమందికి ఆదరప్రాయం. ఖచ్చితమైన సిద్ధాంతాలను పాటించే మూర్తి.. తాను మంచి వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదని ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.నాయకుడిగా నేను మొదటి నేర్చుకున్న విషయం న్యాయమైన వ్యక్తిగా ఉండాలనుకోవడం. ప్రతి లావాదేవీలో న్యాయంగా ఉండటం చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి నేను మంచి వ్యక్తిగా కాకూండా.. న్యాయమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నానని అన్నారు.1981లో ఎన్ఆర్ నారాయణ మూర్తి పూణేలో ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. అప్పటి నుంచి కంపెనీ ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ.. ముందుకు సాగుతోంది. ఇప్పటికి కూడా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు.ప్రతి విద్యార్ధి చదవాల్సిన పుస్తకంఇదిలా ఉండగా.. ఇటీవల ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దేశంలో ప్రతి విద్యార్ధి తప్పకుండా.. పాల్ జీ.హెవిట్ రాసిన "కాన్సెప్టువల్ ఫిజిక్స్" (Conceptual Physics) అనే పుస్తకాన్ని చదవాలని సూచించారు. ఇందులో హైస్కూల్ విద్యార్థులకు ఫిజిక్స్ ఎలా బోధించాలో వెల్లడించారని నారాయణమూర్తి చెప్పారు. దీనిని భారతదేశంలోని అన్ని భాషల్లోకి అనువదించడానికి రచయిత అనుమతిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు.

A facility to borrow against the policy if funds are required
బీమా పాలసీ.. అత్యవసర నిధి!

ఉన్నట్టుండి నిధుల అవసరం ఏర్పడిందా..? వ్యక్తిగత రుణానికి తక్కువ క్రెడిట్‌ స్కోర్‌ అడ్డు పడుతోందా? లేదంటే వ్యక్తిగత రుణంపై అధిక వడ్డీ రేటు చూసి వెనుకాడుతున్నారా..? ఇలాంటి సందర్భాల్లో బీమా పాలసీయే మిమ్మల్ని ఆదుకుంటుంది. అదెలా అంటారా? ఎండోమెంట్‌ బీమా ప్లాన్లపై బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. పైగా పర్సనల్‌ లోన్‌తో పోలిస్తే వడ్డీ రేటు తక్కువే.డబ్బులు అవసరం పడితే బీమా పాలసీని సరెండ్‌ చేసే వారూ ఉన్నారు. ఇలా ఇన్సూరెన్స్‌ పాలసీని సరెండర్‌ చేయడానికి బదులు, దానిపై రుణం తీసుకుని అవసరం గట్టెక్కడమే మంచి మార్గం అవుతుంది. దీనివల్ల బీమా రక్షణను ఎప్పటి మాదిరే కొనసాగించుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందన్నది తెలియజేసే కథనమే ఇది. రుణ సదుపాయం అన్ని రకాల బీమా పాలసీలపై వస్తుందనుకుంటే పొరపాటు. కేవలం కొన్ని రకాల పాలసీలకే ఇది పరిమితం. ‘‘పొదుపుతో కూడిన సంప్రదాయ బీమా పాలసీ (ఎండోమెంట్, మనీ బ్యాక్‌ ప్లాన్లు) కలిగి ఉన్నవారు వాటిపై పలు రకాల ఆర్థిక అవసరాల కోసం రుణాన్ని పొందొచ్చు’’అని ఏజెస్‌ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో విఘ్నేష్‌ సహానే తెలిపారు. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లు కేవలం మరణ పరిహారాన్నే అందిస్తాయని, ఎలాంటి రాబడి హామీ ఉండదు కనుక వాటిపై రుణం పొందలేరని స్పష్టం చేశారు. యూనిట్‌ లింక్డ్‌ ప్లాన్ల (యులిప్‌)లోనూ రాబడులు మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి కనుక వాటిపైనా రుణ సదుపాయం ఉండదని తెలిపారు. ఎక్కడ తీసుకోవచ్చు? పాలసీ మంజూరు చేసిన జీవిత బీమా కంపెనీ నుంచే రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. నేడు చాలా బీమా సంస్థలు పాలసీలపై రుణాలను కూడా ఇస్తున్నాయి. అలాగే, బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు ఈ తరహా రుణాలను ఆఫర్‌ చేస్తుంటాయి. అయితే, బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల కంటే పాలసీ మంజూరు చేసిన బీమా సంస్థను సంప్రదించడమే మెరుగైన మార్గమని నిపుణులు అంటున్నారు. ‘‘ఇన్సూరెన్స్‌ కంపెనీతో పోలిస్తే బ్యాంక్‌లు బీమా ప్లాన్లపై తక్కువ రుణ మొత్తాన్ని ఆఫర్‌ చేస్తాయి. అదే మాదిరి బీమా సంస్థలతో పోలిస్తే బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలపై కొంచెం అధిక రేటును వసూలు చేస్తుంటాయి’’అని సెబీ నమోదిత ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ ‘ప్లాన్‌ ఆర్‌’ వ్యవస్థాపకుడు అజయ్‌ ప్రుతి తెలిపారు. బ్యాంక్‌లు సాధారణంగా బీమా పాలసీపై రుణాన్ని నేరుగా కాకుండా.. కరెంట్‌ అకౌంట్‌పై ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం కింద అందిస్తుంటాయి. ‘‘తరచుగా నిధుల అవసరం ఏర్పడేవారు ఇలా కరెంట్‌ అకౌంట్‌పై (సెక్యూరిటీ కింద బీమా పాలసీ జమ చేసి) ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చని పైసా బజార్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ సహిల్‌ అరోరా సూచించారు. చౌక రుణం ‘‘బీమా పాలసీలపై రుణ రేటు చాలా తక్కువగా ఉండడాన్ని గమనించొచ్చు. సాధారణంగా వీటిపై 9–9.5 శాతం వార్షిక వడ్డీ రేటును వసూలు చేస్తుంటారు. అదే వ్యక్తిగత రుణాలు (పర్సనల్‌ లోన్‌) అయితే 12 శాతం అంతకంటే ఎక్కువే ఉంటుంది’’అని బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రాజేష్‌ కృష్ణన్‌ తెలిపారు. ఇక బీమా పాలసీలపై రుణం ఎంతొస్తుందంటే.. రుణం తీసుకునే నాటికి ఉన్న స్వా«దీనపు విలువ (సరెండర్‌ వ్యాల్యూ)లో 90 శాతం వరకు. బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణం మంజూరునకు సాధారణంగా నాలుగు నుంచి ఏడు రోజులు పడుతుంది. అదే బీమా సంస్థల నుంచి రుణం మూడు రోజుల్లోనే పొందొచ్చు. కొన్ని బీమా సంస్థలు ఇంతకంటే వేగంగా ఆన్‌లైన్‌లోనే పాలసీలపై రుణాలను మంజూరు చేస్తున్నాయి. ‘‘జీవిత బీమా పాలసీలపై రుణం దరఖాస్తు మదింపు, రుణం మంజూరు చాలా వేగంగా ఉంటుంది. బీమా సంస్థ నుంచే రుణం తీసుకునేట్టు అయితే ఎలాంటి అదనపు తనిఖీలు, పరిశీలనలు అవసరం పడవు’’అని రాజేష్‌ కృష్ణన్‌ వివరించారు.బీమా పాలసీపై రుణం తీసుకోవడం ఎంతో సౌకర్యమైనదిగా పాలసీఎక్స్‌ సీఈవో నావల్‌ గోయల్‌ సైతం అంగీకరించారు. ‘‘దరఖాస్తు చేసుకోవడం ఎంతో సులభం. తక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న వారు సైతం పాలసీపై రుణానికి అర్హులే. ఎందుకంటే పాలసీపై రుణం జారీకి క్రెడిట్‌ స్కోర్‌ తనిఖీలు అవసరం పడవు’’అని కృష్ణన్‌ తెలిపారు. ఈ రుణం తిరిగి చెల్లింపు నిబంధనలు కూడా సులభమే. ‘‘రుణం చెల్లించడం వీలు కానప్పుడు కేవలం రుణంపై వడ్డీ వరకే చెల్లించొచ్చు. అసలు రుణాన్ని ఎప్పుడైనా తిరిగి తీర్చివేయవచ్చు’’అని ప్రుతి వివరించారు. ఎంత వీలైతే అంత అసలు రుణంలో చెల్లించుకుంటూ వెళ్లడం కూడా మంచి ఆలోచనే. దీనివల్ల ప్రతి నెలా చెల్లించే వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. అత్యవసర నిధి బీమా పాలసీ అత్యవసర నిధిగానూ అక్కరకొస్తుంది. ప్రతి కుటుంబానికి విధిగా అత్యవసర నిధి ఉండాలి. అనుకోని పరిణామాలతో నెలవారీ వచ్చే ఆదాయం ఆగిపోతే? చేస్తున్న ఉద్యోగం ఊడిపోతే..? అక్కడి నుంచి తిరిగి ఉపాధి లభించేంత వరకు కుటుంబ అవసరాలను తీర్చేందుకు అత్యవసర నిధి ఉపయోగపడుతుంది. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది అవసరాలను తీర్చేంత అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. అయితే, ప్రతి ఒక్కరికీ ఇంత మొత్తం అత్యవసర నిధి కింద ఏర్పాటుకు వెసులుబాటు ఉండకపోవచ్చు. ఇలాంటి వారు ఎండోమెంట్‌ లేదా మనీబ్యాక్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను అత్యవసర నిధి కింద ఉపయోగించుకోవచ్చు. తిరిగి ఉపాధి ఏర్పడి, ఆదాయం చేతికి అందేంత వరకు పాలసీపై రుణంతో అవసరాలను గట్టెక్కొచ్చు. ఆ తర్వాత క్రమంగా ఆరు నెలల్లోపు పాలసీపై రుణాన్ని తీర్చివేయడం మంచి ఆలోచన అవుతుంది. పాలసీ సరెండర్‌ అంటే? ఎండోమెంట్‌ లేదా మనీ బ్యాక్‌ బీమా ప్లాన్‌ వద్దనుకునే వారు దాన్ని సరెండర్‌ చేసుకోవచ్చు. అంటే గడువు ముగియకుండానే పాలసీని వెనక్కిచ్చేయడం. పాలసీ తీసుకున్న తర్వాత ఎంత కాలానికి సరెండర్‌ చేస్తున్నారనే దాని ఆధారంగా దానిపై ఎంతొస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. ఈ సరెండర్‌ వ్యాల్యూ (స్వా«దీనపు విలువ) విషయంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) 2024 ఏప్రిల్‌ 1 నుంచి నూతన నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ప్రకారం బీమా పాలసీ తీసుకున్న మూడేళ్లలోపు సరెండర్‌ చేస్తే చేతికి చాలా తక్కువే వస్తుంది. అంటే అప్పటికి కట్టిన ప్రీమియంలో సగం కూడా రాదు. అదే పాలసీ తీసుకున్న తర్వాత నాలుగేళ్ల నుంచి ఏడేళ్లలోపు సరెండర్‌ చేస్తే అధిక విలువ పాలసీదారుకు దక్కుతుంది. నిజానికి ఎండోమెంట్, మనీబ్యాక్‌ పాలసీల్లో 20–30 ఏళ్లపాటు కొనసాగినప్పుడే ప్రతిఫలం కనిపిస్తుంది. ఇంతకంటే తక్కువ కాలవ్యవధిపై వచ్చే ప్రయోజనం అంతగా ఉండదు. అందుకని నిధుల అవసరం ఏర్పడితే బీమా ప్లాన్‌ను సరెండర్‌ చేయడానికి బదులు.. దానిపై రుణం పొందడమే మెరుగైనది అవుతుంది. మళ్లీ నిధుల వెసులుబాటు వచ్చిన వెంటనే తీసుకున్న రుణాన్ని తీర్చివేయాలి. ఆరంభంలో తక్కువే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్న కొత్తలో దీనిపై వచ్చే రుణం చాలా స్వల్పం. ఇందులో ఉన్న ప్రతికూలత ఇదే. క్యాష్‌ వ్యాల్యూ లేదా సరెండర్‌ వ్యాల్యూ గణనీయంగా పెరిగేందుకు కొన్నేళ్లు పడుతుంది. అప్పుడే చెప్పుకోతగ్గ మేర రుణం దీనిపై వస్తుంది. ఇక ఎండోమెంట్‌ లేదా మనీ బ్యాంక్‌ పాలసీలపై దీర్ఘకాలంలో వచ్చే రాబడి 5–6 శాతం మేర ఉంటుంది. దీనిపై రుణం తీసుకుంటే, నికరంగా అందుకునే రాబడి ప్రయోజనం మరింత తగ్గిపోతుందని గుర్తు పెట్టుకోవాలి. తిరిగి చెల్లించలేకపోతే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలపై ఉన్న మరో అనుకూలత ఏమిటంటే.. రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనా అది క్రెడిట్‌ స్కోర్‌ను ప్రభావితం చేయబోదని కృష్ణన్‌ తెలిపారు. రుణంలో అసలు, వడ్డీ, చార్జీలు అన్నింటినీ పాలసీ సరెండర్‌ వ్యాల్యూ నుంచి బీమా సంస్థలు సర్దుబాటు చేసుకుంటాయని సహిల్‌ అరోరా తెలిపారు. రుణం చెల్లించకుండా పాలసీదారు మరణించిన సందర్భాల్లో.. పరిహారం నుంచి రుణం, వడ్డీ, చార్జీలను మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థ నామినీ లేదా పాలసీదారు వారసులకు చెల్లిస్తుంది. రుణం తీర్చకుండానే పాలసీ గడువు ముగిసిపోయిందనుకుంటే.. అప్పుడు నికరంగా చెల్లించే మొత్తం నుంచి రుణాన్ని బీమా సంస్థ వసూలు చేసుకుంటుంది. ఒకవేళ రుణంపై వడ్డీ కూడా బకాయి పడితే.. అసలు, వడ్డీ మొత్తం సరెండర్‌ వ్యాల్యూని దాటిపోతుంటే అప్పుడు పాలసీని బీమా సంస్థ రద్దు చేస్తుంది. పాలసీపై రుణం తీసుకునే సమయంలోనే దానిపై బీమా సంస్థకు హక్కులు బదలాయిస్తున్నట్టు అంగీకారాన్ని తీసుకుంటాయి. రుణం సమంజసమేనా..? అసలు జీవిత బీమా ఎందుకు? ఆర్జించే వ్యక్తికి దురదృష్టవశాత్తూ ఏదైనా వాటిల్లితే అప్పుడు అతనిపై ఆధారపడిన కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడకూడదనే. తాను లేకపోయినా, తన కుటుంబ అవసరాలను తీర్చే లక్ష్యంతోనే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీని తీసుకుంటుంటారు. మరి అలాంటి సాధనంపై రుణం తీసుకుంటే, అసలు ప్రయోజనానికే భంగం కలగొచ్చని నిపుణుల భావన. అదెలా అంటే పాలసీపై రుణం తీసుకున్న తర్వాత సదరు పాలసీదారు అనుకోకుండా మరణం పాలైతే.. కుటుంబానికి దక్కే బీమా పరిహారం పెద్దగా ఉండకపోవచ్చు. దాంతో బీమా ఉద్దేశ్యం నెరవేరకుండా పోతుంది. అందుకని బంగారం, మ్యూచువల్‌ ఫండ్స్, ప్రాపర్టీ తదితర ఇతర సాధనాలపై రుణం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చని చెబుతుంటారు. కానీ, ఇక్కడ వాస్తవ అంశం ఏమిటంటే.. బంగారంపై రుణం తీసుకున్న తర్వాత సదరు వ్యక్తి మరణించినా కానీ, ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత కుటుంబంపైనే పడుతుంది. అందుకని ఏ సాధనంపై రుణం తీసుకున్నా పరిణామం ఒక్కటిగానే ఉంటుంది. అందుకుని దీనికి పరిష్కారం ఒకటి ఉంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఏదైనా అవసరం కోసం రుణం తీసుకుంటుంటే, వెంటనే అంత విలువకు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీని పెంచుకోవడం లేదంటే అదనపు కవరేజీతో టర్మ్‌ ప్లాన్‌ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల అనుకోనిది జరిగినా వచ్చే పరిహారంతో రుణాలను గట్టెక్కొచ్చు. ఇక దీర్ఘకాల అవసరాలకు కాకుండా స్వల్పకాల అవసరాలకే బీమాపై రుణానికి పరిమితం కావాలి. మూడు నుంచి ఆరు నెలలు మించకూడదు. ఎందుకంటే ఇంత తక్కువ కాలానికి చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా చాలా తక్కువే ఉంటుంది. కనుక ఒకవేళ పాలసీదారు మరణించినా కుటుంబం పెద్దగా నష్టపోయేది ఉండదు. బీమా సంస్థ తనకు రావాల్సినంత మేర మినహాయించుకుని, మిగిలినది చెల్లించేస్తుంది. ఎండోమెంట్‌ ప్లాన్‌ ఉన్న వారు విధిగా మెరుగైన కవరేజీతో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తప్పకుండా తీసుకోవాలి. అప్పుడు కుటుంబానికి మెరుగైన ఆర్థిక రక్షణ ఉంటుంది.

GST on online gaming: Full rollback of 28 percent tax unlikely
‘28 శాతం జీఎస్​టీ’, సుప్రీం వైపు.. గేమింగ్‌ కంపెనీల చూపు

ఆన్​లైన్ ​గేమింగ్​పై 28 శాతం జీఎస్​టీ విధించాలనే జీఎస్​టీ కౌన్సిల్ తన ​ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోదని తెలుస్తోంది.జీఎస్టీ కౌన్సిల్‌ గతేడాది ఆన్​లైన్​ గేమింగ్​, కాసినో, హార్స్ ​రేసింగ్​లపై 28 శాతం చొప్పున జీఎస్​టీ అమలు చేయాలని జీఎస్​టీ కౌన్సిల్​ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు 2022 నుంచి గతేడాది అక్టోబర్ నాటికి రూ. 1,12,332 కోట్ల జీఎస్టీ చెల్లించాలంటూ గేమింగ్‌ కంపెనీలకు మొత్తం 71 షోకాజ్ నోటీసులందించింది. అయితే దీనిపై గేమింగ్‌ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ తరుణంలో గేమింగ్‌ కంపెనీల సమస్యపై రివ్వ్యూ జరగనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జీఎస్టీ కౌన్సిల్‌ 28శాతం జీఎస్టీని ఉపసంహరించుకునే అవకాశం లేదు. గతంలో జారీ చేసిన నోటీసులపై కౌన్సిల్‌ పరిశీలించవచ్చు. ఎందుకంటే అనేక గేమింగ్‌ కంపెనీలు ఈ నోటీసులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమస్యపై చాలా రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ తీర్పు కోసం గేమింగ్‌ కంపెనీలు ఎదురుచూస్తున్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.

Sbi Looks For Chairman Dinesh Khara After Retirement
అదృష్టం ఎవరిని వరిస్తోంది.. ఎస్‌బీఐ ఛైర్మన్‌ పదవి కోసం పోటీ

ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ తదుపరి ఛైర్మన్‌ ఎవరు అనేది ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖరా ఈ ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు కొత్త ఎస్‌బీఐ చైర్మన్‌ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.పలు నివేదికల ప్రకారం.. ఎస్‌బీఐ ఛైర్మన్ పదవికి పేరును సిఫారసు చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వంలోని స్వయం ప్రతిపత్త సంస్థ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) మే 21న పాత్ర కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అదే రోజు తుది నిర్ణయం ప్రకటిస్తారు.దినేష్‌ ఖరా రిటైర్మెంట్‌ తర్వాత ఆయన భర్తీ చేసేందుకు ముగ్గురు ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్లు సీఎస్‌ శెట్టీ, అశ్విని కుమార్ తివారీ, వినయ్ ఎం టోన్సే పోటీపడుతున్నట్లు సమాచారం. మరి ఈ ముగ్గురిలో ఎవరికి ఎస్‌బీఐ ఛైర్మన్‌ పదవి వరిస్తుంది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

Rbi Governor Shaktikanta Das Cast His Vote
ప్రతి భారతీయుడికి ఓ గర్వకారణం.. ఎన్నికల పోలింగ్‌పై ఆర్‌బీఐ గవర్నర్‌

దేశంలో 5వ విడుత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో ముఖేష్‌ అంబానీ సోదరులు అనిల్‌ అంబానీ, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ముంబైలోని పెద్దార్ రోడ్డులోని యాక్టివిటీ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రానికి గవర్నర్ తన భార్య, కుమార్తెతో కలిసి వచ్చారు. ఓటు వేసిన అనంతరం..140 కోట్ల మంది ప్రజలు ఎన్నికల‍్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గర్వించదగ్గ తరుణం. ప్రతి భారతీయుడికి ఓ గర్వకారణం అని అన్నారు. ఆర్థిక విషయాల గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదని, జూన్ 7న తదుపరి ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశం వరకు వేచి చూడాల్సిందేనని అన్నారు. #WATCH | Industrialist Anil Ambani casts his vote at a polling booth in Mumbai, for the fifth phase of #LokSabhaElections2024 pic.twitter.com/2CpXIZ6I0l— ANI (@ANI) May 20, 2024 మనదేశానికి ఎంతో గర్వకారణమైన ఈ ఎన్నికల్లో దేశ పౌరులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని శక్తికాంత దాస్‌ విజ్ఞప్తి చేశారు. ఓటింగ్‌ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఎంతో కఠినమైన ఎన్నికల ప్రక్రియను సజావుగా జరిగేలా అహర్నిశలు శ్రమిస్తున్న భారత ఎన్నికల సంఘానికి, ఎన్నికల‍్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు.కాగా, దేశ వ్యాప్తంగా 5వ దశ లోక్ సభ ఎన్నికలకు ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజక వర్గాలకు (మే 20న)ఈ రోజు పోలింగ్‌ కొనసాగుతోంది.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 92500.00 92500.00 0.00
Gold 22K 10gm 67600.00 67600.00 -250.00
Gold 24k 10 gm 73750.00 73750.00 -270.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement