Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Patanjali soan papdi fails quality test company official 2 others sentenced jail
నాణ్యతలేని ‘పతంజలి సోన్‌పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా

యోగాగురు రామ్‌దేవ్‌ బాబాకు చెందిన ఆహార ఉత్పత్తుల సంస్థ పతంజలికి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లోని టెస్టింగ్ లాబొరేటరీలో పతంజలి ఆహార ఉత్పత్తి నాణ్యతా పరీక్షలో విఫలమవడంతో పితోర్‌ఘర్‌ చీఫ్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్‌తో సహా ముగ్గురికి జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించారు.వివరాల్లోకి వెళ్తే.. 2019లో ఉత్తరాఖండ్‌ పితోర్‌ఘర్‌లోని బెరినాగ్‌ ప్రధాన మార్కెట్‌లోని లీలా ధర్ పాఠక్ దుకాణంలో పతంజలి నవరత్న ఎలైచి సోన్ పాపిడి నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన తర్వాత, సోన్‌పాపిడి నమూనాలను సేకరించి డిస్ట్రిబ్యూటర్‌కు, పతంజలి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.నాణ్యత పరీక్షలో పతంజలి సోన్‌పాపిడి విఫలం కావడంతో రుద్రపూర్‌లోని టెస్టింగ్ లేబొరేటరీ.. రాష్ట్ర ఆహార భద్రతా విభాగానికి నోటీసు పంపింది. ఈ ఘటన తర్వాత దుకాణదారుడు లీలా ధర్ పాఠక్, డిస్ట్రిబ్యూటర్ అజయ్ జోషి, పతంజలి అసిస్టెంట్ మేనేజర్ అభిషేక్ కుమార్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ముగ్గురికి వరుసగా రూ. 5,000, రూ.10,000, రూ.25,000 చొప్పున జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించారు.

gold price today silver rate may 19
హడలెత్తించిన బంగారం, వెండి ధరలు నేడు ఇలా..

దేశవ్యాప్తంగా హడలెత్తించిన బంగారం, వెండి ధరలు ఈరోజు (మే 19) స్థిరంగా ఉన్నాయి. నిన్నటి రోజున తులం బంగారం రూ.880, వెండి కేజీకి ఏకంగా రూ.4000 పెరిగి కొనుగోలుదారులను హడలెత్తించాయి. ఈరోజు ధరలు స్థిరంగా కొనసాగడంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది.హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.68,400 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ. 74,620 వద్ద కొసాగుతున్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,550, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.74,770 వద్ద ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,400లుగా, 24 క్యారెట్ల స్వర్ణం రూ.74,620 లుగా ఉన్నాయి.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,500 వద్ద 24 క్యారెట్ల పసిడి రూ.74,730 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.68,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.74,620 వద్ద ఉంది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో క్రితం రోజున వెండి ధర కేజీకి రికార్డు స్థాయిలో రూ.4000 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,500 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Tata motors Becomes More Profitable Than TCS 1st Time In 10 Years
పదేళ్లలో ఫస్ట్‌టైమ్‌! టీసీఎస్‌ను మించిన మరో టాటా కంపెనీ..

టాటా గ్రూప్‌లోని కంపెనీలన్నింటిలో అత్యంత లాభదాయక కంపెనీగా ఉన్న దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)ను మరో టాటా కంపెనీ అధిగమించింది. ఇలా జరగడం గత పదేళ్లలో ఇదే తొలిసారి.2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.17,407 కోట్ల నికర లాభంతో టాటా మోటార్స్ టీసీఎస్‌ నికర లాభం రూ.12,434 కోట్లను అధిగమించింది. టాటా మోటార్స్ లాభం ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.5,407.79 కోట్లు ఉండగా ఈ ఏడాది ఏకంగా 221.89 శాతం పెరిగింది. మరోవైపు టీసీఎస్‌ నికర లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.11,392 కోట్ల నుంచి 9.1 శాతం వృద్ధిని సాధించింది.టాటా మోటర్స్‌ చివరిసారిగా 2014 జూన్ త్రైమాసికంలో టాటా గ్రూప్‌లో అత్యంత లాభదాయకమైన కంపెనీ స్థానాన్ని ఆక్రమించింది. అయితే గ్రూప్‌లోని మరో పెద్ద కంపెనీ టాటా 2024 క్యూ4 ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. టాటా మోటార్స్ టీసీఎస్‌ త్రైమాసిక లాభాలను అధిగమించినప్పటికీ , వార్షిక ప్రాతిపదికన టాటా గ్రూప్‌లో అత్యంత లాభదాయకమైన కంపెనీగా టీసీఎస్‌ కొనసాగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ మొత్తం లాభం రూ.45,908 కోట్లు కాగా టాటా మోటార్స్ మొత్తం లాభం రూ.31,399 కోట్లు.

Driving License new Rules will be implemented from June 1
డ్రైవింగ్ లైసెన్స్‌లో కొత్త రూల్స్.. జూన్ 1 నుంచే..

డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన నిబంధనలలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. జూన్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది.కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు మీరు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)లో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. బదులుగా ప్రైవేట్ సంస్థలు డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లను జారీ చేస్తాయి. ఈ కొత్త రూల్ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలుప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం కోసం కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. ఫోర్‌ వీలర్ ట్రైనింగ్‌ కోసమైతే అదనంగా 2 ఎకరాల స్థలం ఉండాలి.డ్రైవింగ్‌ పరీక్షల నిర్వహణ కోసం ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం తగిన సౌకర్యాలను కలిగి ఉండాలి.శిక్షకులకు కనీసం హై స్కూల్‌ డిప్లొమా అర్హత తప్పనిసరి. దీంతో కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మౌలిక అంశాలపై అవగాహన ఉండాలి.శిక్షణ సమయంలైట్ వెహికల్ శిక్షణ తప్పనిసరిగా 4 వారాల్లో పూర్తి చేయాలి (కనీసం 29 గంటలు). శిక్షణను రెండు విభాగాలుగా విభజించాలి. ఇందులో థియరీ విభాగం 8 గంటలు, ప్రాక్టికల్‌ 21 గంటలు ఉండాలి.హెవీ మోటారు వాహనాల కోసం 38 గంటల శిక్షణ ఉంటుంది. ఇందులో 8 గంటల థియరీ ఎడ్యుకేషన్, 31 గంటల ప్రాక్టికల్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ శిక్షణ 6 వారాల్లో పూర్తవుతుంది.

Naturals Ice Cream Founder Raghunandan Srinivas Kamath passes away
‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ కన్నుమూత

దేశంలోని అగ్రశ్రేణి ఐస్ క్రీమ్ బ్రాండ్లలో ఒకటైన నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ శ్రీనివాస్ కామత్ కన్నుమూశారు. 70 ఏళ్ల వయసులో శుక్రవారం సాయంత్రం ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ తుది శ్వాస విడిచారు.రఘునందన్ శ్రీనివాస్ కామత్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన.. ఎన్నో కష్టాలు పడి దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒకదానిని నిర్మించారు. కర్ణాటకలోని మంగళూరు తాలూకాలో ముల్కి అనే పట్టణంలో తన కెరీర్‌ను ప్రారంభించిన కామత్, నేచురల్స్ ఐస్‌క్రీమ్‌ను స్థాపించి ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందారు. నేడు దీని విలువ సుమారు రూ. 400 కోట్లు.రఘునందన్ శ్రీనివాస్ కామత్‌ తండ్రి పండ్ల వ్యాపారి. చిన్నతనంలో పండ్ల వ్యాపారంలో తన తండ్రికి సహాయం చేసేవాడు. అలా పండ్ల గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని పెంచుకున్న కామత్‌ 14 సంవత్సరాల వయస్సులో తన గ్రామాన్ని విడిచి ముంబైకి పయనమయ్యాడు. 1984లో కేవలం నలుగురు సిబ్బంది, కొన్ని ప్రాథమిక పదార్థాలతో ఐస్ క్రీం వ్యాపారాన్ని ప్రారంభించాడు. అలా నేచురల్స్ ఐస్‌క్రీమ్‌ పుట్టింది.

Amitabh Kant Says India Will Not Change Ev Policy According To Tesla
భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా

భారత్‌ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కంపెనీని బట్టి పాలసీని రూపొందించలేదని, అన్నీ ఈవీ కంపెనీలకు ఒకేరకమైన పాలసీ ఉంటుందంటూ నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అమితాబ్ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.భారత్ మార్కెట్లోకి టెస్లా ఎంట్రీపై అమితాబ్ కాంత్ ఓ కార్యక్రమంలో పరోక్షంగా స‍్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పాలసీలు అన్ని కంపెనీలు ఆ విధానాన్ని మాత్రమే అనుసరించాలని అమితాబ్ కాంత్ చెప్పారు. కొన్ని నిర్దిష్ట కంపెనీల ప్రకారం భారత్‌ తన ఈవీ పాలసీ విధానాన్ని మార్చదని స్పష్టం చేశారు. అంతేకాదు టెస్లా సంస్థ తమకు ప్రత్యేకంగా కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి ఉండొచ్చు. భారత్‌లో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కోసం కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రభుత్వం ఈవీ పాలసీని ప్రవేశ పెట్టిందని అన్నారు. భారత్‌లో కనీసం రూ.4150 కోట్ల పెట్టుబడి పెట్టే ఈవీ సంస్థలకు రాయితీలు అందిస్తామని కేంద్రం తెలిపింది. పాలసీ ప్రకారం దేశంలో ఈవీ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలి. లేదంటే దేశీయంగా తయారయ్యే విడిభాగాలను కనీసం 25శాతం వినియోగించాలి. ఐదేండ్ల తర్వాత ఆ మొత్తం వినియోగాన్ని 50 శాతానికి పెంచాలి అని ఈవీ పాలసీలో పేర్కొంది.కొత్త విధానం ప్రకారం, భారతదేశంలో ఈవీ ప్యాసింజర్ కార్ల తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలపై 15 శాతం తక్కువ కస్టమ్స్/దిగుమతి సుంకంతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉంది.

Citroen To Supply 1000 Electric Cars to OHM E Logistics Details
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్‌తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ ఎప్పటికప్పుడు తన ఉనికిని పెంచుకుంటూనే ఉంది. ఫ్యూయెల్ కార్లతో పాటు, ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న ఈ కంపెనీ ఇటీవల హైదరాబాద్‌కు చెందిన OHM E లాజిస్టిక్స్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.OHM E లాజిస్టిక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, సిట్రోయెన్ 1000 ఈ-సీ3 ఎలక్ట్రిక్ వాహనాలను దశల వారీగా సరఫరా చేయనుంది. మొదటి ఫ్లీట్ ఇండక్షన్ దశలో కంపెనీ 120 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేయనుంది. ఆ తరువాత 12 నెలల్లో మరో 880 కార్లను డెలివరీ చేస్తుంది.అక్టోబర్ 2022లో కేవలం 100 ఎలక్ట్రిక్ క్యాబ్‌లతో ప్రారంభమైన ఓహెచ్ఎమ్ ఇప్పుడు విస్తృతమైన సేవలు అందిస్తోంది. సిట్రోయెన్ ఈ-సీ3 ఎలక్ట్రిక్ కార్లు ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతూ భారతీయ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. రానున్న రోజుల్లో కంపెనీ మరిన్ని ఉత్పత్తులను దేశీయ విఫణిలో లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Tecno Camon 30 5G, Camon 30 Premier 5G launched in India
టెక్నో క్యామాన్‌ 30ప్రో 5జీ, క్యామాన్‌ 30 ప్రీమియర్ 5జీ విడుదల.. ధర ఎంతంటే?

చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ టెక్నో మొబైల్‌.. టెక్నో క్యామాన్‌ 30ప్రో 5జీ, క్యామాన్‌ 30 ప్రీమియర్ 5జీని భారత్‌లో విడుదల చేసింది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఐపీ53 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పాటు 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ ఇస్తుంది. ఇక తాజాగా విడుదలైన టెక్నో క్యామాన్‌ 30 ప్రో 5జీ, క్యామన్‌ 30 ప్రీమియర్‌ 5జీ ధరలు ఇలా ఉన్నాయి. ముందుగా టెక్నో క్యామాన్‌ 30 5జీ 8జీబీ ర్యామ్‌/ 256జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.22,999 ఉండగా.. 12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.26,999 గా ఉందిక్యామన్‌ 30 ప్రీమియర్‌ 5జీ 12 జీబీ ర్యామ్‌,512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.39,999గా ఉంది. టెక్నో క్యామన్‌ 30 5జీ స్పెసిఫికేషన్స్:టెక్నో క్యామన్‌ 30 5జీ 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్, 1080 x 2436 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో ఎల్‌టీపీఎస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ 360హెచ్‌జెడ్‌ టచ్ శాంప్లింగ్ రేట్, 2160హెచ్‌ జెడ్‌ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మీడియా టెక్‌ డైమన్సిటీ 7020 చిప్‌సెట్‌, గరిష్టంగా 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్‌4ఎక్స్‌ ర్యామ్‌, స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. దీనిని 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్‌, 10డబ్ల్యూ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

Ratan Tata Message for Mumbaikars
లోక్‌సభ ఎలక్షన్స్.. రతన్ టాటా సందేశం

భారతదేశంలో ఇప్పటికే నాలుగు దశల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓటర్లను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు.మే 20న ముంబైలో (ఫేజ్ 5) ఓటింగ్ జరగనుంది. ముంబై వాసులందరూ బయటకు వెళ్లి బాధ్యతాయుతంగా ఓటు వేయాలని నేను కోరుతున్నాను.. అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ.. తప్పకుండా ఓటు వేస్తామన్నట్లు చెబుతున్నారు.ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ముంబై సిటీ, ముంబై సబర్బన్‌లోని ఆరు లోక్‌సభ స్థానాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి.Monday is voting day in Mumbai. I urge all Mumbaikars to go out and vote responsibly.— Ratan N. Tata (@RNTata2000) May 18, 2024

Sundar Pichai Advice for Indian Engineers
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా: '3 ఇడియట్స్' సీన్‌తో..

ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యుగంలో భారతీయ ఇంజనీర్లకు సలహాలు ఇచ్చారు. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ (FAANG) వంటి సంస్థల్లో ఇంటర్వ్యూల్లో ఎలా విజయం సాధించాలో వివరిస్తూ.. రోట్ లెర్నింగ్ గురించి వివరించారు. ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా.. బట్టీ పడితే ఉపయోగం లేదని అన్నారు. కాబట్టి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ తప్పకుండా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని అన్నారు.దీనికి ఉదాహరణగా 3 ఇడియట్స్ సినిమా గురించి వివరించారు. ఈ సినిమాలో మోటార్ ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్నకు ఓ విద్యార్ధి బట్టీ పట్టిన సమాధానం చెబుతాడు. ఆ పద్దతి సరైనది కాదని వివరించారు. ఒక వ్యక్తి ఎంత స్మార్ట్ అయినప్పటికీ.. ఫండమెంటల్స్‌పై దృష్టి పెట్టడంలో విఫలమవుతున్నారని ఆయన అన్నారు.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 92500.00 92500.00 0.00
Gold 22K 10gm 67600.00 67600.00 -250.00
Gold 24k 10 gm 73750.00 73750.00 -270.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement