Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Sundar Pichai Advice for Indian Engineers
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా: '3 ఇడియట్స్' సీన్‌తో..

ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యుగంలో భారతీయ ఇంజనీర్లకు సలహాలు ఇచ్చారు. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ (FAANG) వంటి సంస్థల్లో ఇంటర్వ్యూల్లో ఎలా విజయం సాధించాలో వివరిస్తూ.. రోట్ లెర్నింగ్ గురించి వివరించారు. ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా.. బట్టీ పడితే ఉపయోగం లేదని అన్నారు. కాబట్టి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ తప్పకుండా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని అన్నారు.దీనికి ఉదాహరణగా 3 ఇడియట్స్ సినిమా గురించి వివరించారు. ఈ సినిమాలో మోటార్ ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్నకు ఓ విద్యార్ధి బట్టీ పట్టిన సమాధానం చెబుతాడు. ఆ పద్దతి సరైనది కాదని వివరించారు. ఒక వ్యక్తి ఎంత స్మార్ట్ అయినప్పటికీ.. ఫండమెంటల్స్‌పై దృష్టి పెట్టడంలో విఫలమవుతున్నారని ఆయన అన్నారు.

Nirmala Sitharaman Travels in Delhi Metro
మెట్రో ట్రైన్‌లో నిర్మలా సీతారామన్‌ .. సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా

140 కోట్ల భారతీయులున్న దేశానికి ఆర్థిక మంత్రి. 3937 బిలియన్‌ డాలర్ల మూలధన లెక్కలను చూసే నాయకురాలు ఢిల్లీ మెట్రో ఎక్కి ప్రయాణం చేస్తే ఆశ్చర్యపోరా మరి.!అవును కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సాధాసీదా ప్రయాణికురాలిగా ఢిల్లీ మెట్రో రైలులో లక్ష్మీ నగర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ఆ ఫోటోల్ని, వీడియోల్ని ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు.అయితే నిర్మలా సీతారామన్‌ మెట్రో ట్రైన్‌లో ప్రయాణించడంపై మెట్రోలో ప్రయాణించడంపై నెటిజన్లు ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం 2024 లోక్‌ సభ ఎన్నికల స్టంట్‌ అంటూ విమర్శిస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో నిర్మలా సీతారామన్ ప్రయాణిస్తున్న వీడియోపై నెటిజన్లు ఇలా స్పందించారు ‘పన్ను సంబంధిత ప్రశ్న అడగాలి’ అని ఒక యూజర్‌ అంటుంటే.. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ ప్రజా రవాణాను ఎంచుకుని, తోటి ప్రయాణికులతో మమేకమవడం సంతోషంగా ఉంది. సహచరులకు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. మరో యూజర్‌ మాత్రం.. నిర్మలా సీతారామన్‌ మెట్రో ప్రయాణం ఎన్నికల స్టంట్‌. ఎందుకంటే.. అధికారంలో ఉన్న 10ఏళ్లలో ఒక్కసారైనా మెట్రోలో ప్రయాణించారా? సాధారణ ప్రయాణికులతో ఎప్పుడైనా ముచ్చటించారా అని వ్యాఖ్యానించారు. Smt @nsitharaman travels in Delhi Metro to Laxmi Nagar and interacts with fellow commuters. pic.twitter.com/HYSq3oUiAo— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) May 17, 2024

Iphone 16 Series Production Starts From June 2024
ఐఫోన్ లవర్స్‌కి గుడ్‌న్యూస్

యాపిల్‌ ఐఫోన్‌ ప్రియులకు శుభవార్త. త్వరలో మార్కెట్‌కి పరిచయం కానున్న ఐఫోన్‌ 16 తయారీ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్‌ 15 విడుదలైన మరుక్షణం నుంచి ఐఫోన్‌ 16 ఇలా ఉండబోతుందంటూ రకరకాల డిజైన్లను ప్రస్తావిస్తూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తయారీ ప్రారంభంతో ఆ ఫోన్‌ డిజైన్‌పై స్పష‍్టత రానుంది.ఐ ఫోన్‌ డిస్‌ప్లే అనలిస్ట్‌ రాస్ యంగ్ ఐఫోన్‌ 16 సిరీస్ వచ్చే నెల నుంచి తయారీ ప్రారంభం కానుందని ట్వీట్‌ చేశారు. ఐఫోన్‌ 16 మోడళ్లను హై-ఎండ్ వేరియంట్‌ల కంటే ఎక్కువగా ఉత్పత్తి చేయొచ్చని తెలుస్తోంది. కాగా, గత ఏడాది ఐఫోన్‌ 15 సిరీస్‌ తయారీ ఆగస్ట్‌ నెలలో ప్రారంభం కాగా.. ఈ లేటెస్ట్‌ వెర్షన్‌ అంతకంటే ముందే మ్యానిఫ్యాక్చరింగ్‌కు సిద్ధమైంది. ఐఫోన్‌ 16 భారత్‌లో తయారవుతుందా? మరి యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ 16ను భారత్‌లో తయారు చేస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత రానప్పటికీ ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15లు మాత్రం దేశీయంగా తయారయ్యాయి.ఐఫోన్‌ 15 సిరీస్‌ ధరెంతంటేగతేడాది విడుదలైన ఐఫోన్ 15 ప్రో మోడల్ ధర రూ.1,34,900 నుండి ప్రారంభమవుతుండగా.. ప్రో మాక్స్ ధర రూ. 1,59,900. 128జీబీ స్టోరేజ్ ఐఫోన్ 15మోడల్‌ ధర భారత్‌లో రూ. 79,900, ప్లస్ మోడల్ రూ. 89,900కే మార్కెట్‌లో లభ్యమవుతుంది. ఐఫోన్‌ 16 సిరీస్‌.. చాలా కాస్ట్‌ గురూ..!అయితే ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్‌ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా. ఎందుకంటే ఇటీవలి నిక్కీ ఆసియా మ్యాగిజైన్‌ ఇంటర్వ్యూలో ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ తయారీకి 558 డాలర్ల ఖర్చవుతుందని యాపిల్‌ తెలిపింది. విడి భాగాల ధరలు పెరుగుదల కారణంగా ఐఫోన్‌ 16 ధరలు 12 శాతం పెరిగే అవకాశం ఉందని వెలుగులులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.

Elon Musk Reacts to Saudi Prince Photo With Cybertruck
టెస్లా సైబర్‌ట్రక్‌ పక్కన సౌదీ ప్రిన్స్.. మస్క్ ట్వీట్ వైరల్

సౌదీ యువరాజు 'తుర్కీ బిన్ సల్మాన్ అల్ సౌద్' టెస్లా సైబర్‌ట్రక్‌ పక్కన నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటో సాధారణ నెటిజన్లను మాత్రమే కాకుండా టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్'ను (Elon Musk) కూడా ఆకర్శించింది.నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోను మస్క్ రీ ట్వీట్ చేస్తూ 'కూల్' అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ పోస్టుకు వేలసంఖ్యలో లైక్స్ వచ్చాయి. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.టెస్లా సైబర్ ట్రక్టెస్లా సైబర్‌ట్రక్‌ విషయానికి వస్తే.. దీని ప్రారంభ ధర 60990 డాలర్లు (రూ. 50.83 లక్షలు), హై వేరియంట్ ధర 99,990 డాలర్లు (రూ. 83.21 లక్షలు). ఇది డ్యూయెల్, ట్రై మోటర్ అనే రెండు ఆప్షన్లలలో లభిస్తుంది. డ్యూయెల్ మోటార్ 600 బీహెచ్‌పీ పవర్, ట్రై మోటార్ 845 బీహెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.డ్యూయెల్ మోటార్ మోటార్ 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, ట్రై మోటార్ మోడల్ 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టెస్లా సైబర్‌ట్రక్‌ రేంజ్ 547 కిమీ వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.Cool https://t.co/oS0gzawPCg— Elon Musk (@elonmusk) May 18, 2024

Legendary Banker Narayanan Vaghul Passes Away At 88
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్ 'నారాయణన్ వాఘుల్' చెన్నైలోని అపోలో హాస్పిటల్స్‌లో కన్నుమూశారు. రెండు రోజులకు ముందు ఇంట్లో పడిపోవడం వల్ల అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. హుటాహుటిన ఆయన్ను అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌ సపోర్ట్‌తో చికిత్స పొందుతూ.. శనివారం తుది శ్వాస విడిచారు.నారాయణన్ వాఘుల్ వయసు 88 ఏళ్లు. ఈయన భార్య పద్మా వాఘల్, పిల్లలు మోహన్, సుధ.. మనవళ్లు సంజయ్, కావ్య, అనువ్, సంతోష్ ఉన్నారు. భారతీయ బ్యాంకింగ్‌లో కొత్త శకానికి నాంది పలికిన దిగ్గజం నారాయణన్ వాఘుల్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.నారాయణన్ వాఘుల్ 1936లో దక్షిణ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలో జన్మించారు. అతని కుటుంబం చెన్నైకి (అప్పటి మద్రాసు) వెళ్లింది. అక్కడే లయోలా కాలేజీలో చదువుకున్నాడు. బ్యాంకింగ్ రంగంలో గొప్పగా ఎదిగిన వాఘల్.. ప్రారంభంలో సివిల్ సర్వీసెస్‌లో చేరాలనుకున్నారు. అయితే కొత్తగా ఏర్పడిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ప్రవేశించడానికి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆ పరీక్షను వాఘుల్ కేవలం ప్రాక్టీస్ టెస్ట్ మాదిరిగా ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.తండ్రి ప్రోత్సాహంతో 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎస్‌బీఐ నుంచి వైదొలిగారు. ఆ తరువాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్‌లో చేరి దాని డైరెక్టర్ అయ్యారు. 39 సంవత్సరాల వయస్సులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని చేపట్టారు.నారాయణన్ వాఘుల్ 1981లో బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చెప్పారు. 1981 - 1985 మధ్య కాలంలో ఐసీఐసీఐ లిమిటెడ్‌కి చైర్మన్‌గా నాయకత్వం వహించారు. ఇలా ఆయన దినదినాభివృద్ధి చెందుతూ.. బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. 2006లో ఎకనామిక్ టైమ్స్ ద్వారా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. వాణిజ్యం, పరిశ్రమలకు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2009లో పద్మభూషణ్‌తో సత్కరించింది.Today, I grieve for the Bhishma Pitamah of Indian Banking—Mr. N.Vaghul, who passed away this morning.I grieve not just for a Titan of Indian Business, but for one of the most inspiring & generous people I have ever had the good fortune to encounter. He was a member of the… pic.twitter.com/YgIs5BsE4d— anand mahindra (@anandmahindra) May 18, 2024

Google Ceo Sundar Pichai Reveals His Favourite Indian Food
నాకు నచ్చిన భారతీయ వంటకాలు ఇవే.. సీఈఓ సుందర్‌ పిచాయ్‌

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తనకు నచ్చిన ఆహార పదార్ధాల గురించి బహిర్ఘతం చేశారు. నిత్యం ఏఐ, యాప్స్‌, టెక్నాలజీ అంటూ కంప్యూటర్లతో కుస్తీ పట్టే పిచాయ్‌ ఓ పాడ్‌ కాస్ట్‌లో కాస‍్త రిలాక్స్‌ అయ్యారు. పిచాయ్ ఇటీవల యూట్యూబర్ వరుణ్ మయ్య పాడ్‌కాస్ట్‌లో దేశంలో ఏఐ ప్రభావం, ఐటీ నిపుణులకు సలహాలు, ర్యాపర్‌ స్టార్టప్‌తో పాటు పలు అంశాలపై చర్చించారు. అదే సమయంలో తన అభిమాన భారతీయ వంటకాలను కూడా వెల్లడించారు.భారత్‌లో తనకు ఇష్టమైన ఆహారం పేరు చెప్పమని సుందర్ పిచాయ్‌ను మయ్య అడిగినప్పుడు సీఈఓ సుందర్‌ పిచాయ్‌ దౌత్యంతో సమాధానమిచ్చారు. ప్రాంతాల వారీ ఎదురుయ్యే ఇబ్బందుల్ని ముందే పసిగట్టారు. దేశీయంగా ఉన్న మూడు మెట్రో నగరాలు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో తనకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్ధాల గురించి తన మనుసులో మాటను బయట పెట్టారు. బెంగుళూరులో దోసె, ఢిల్లీలో చోలే భతురే ముంబైలో పావ్ భాజీలను ఇష్టంగా తింటానని తెలిపారు.

Hyderabad Residential Property Market Surges Over 26000 Homes Registered
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ

రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజు రోజుకి ఊపందుకుంటోంది. బెంగళూరు, ముంబై, హైదరాబాద్ నగరాల్లో భూములు మాత్రమే కాకుండా రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన లేటెస్ట్ డేటా ప్రకారం 2024 మొదటి నాలుగు నెలల్లో హైదరాబాద్‌లో 26,027 ఆస్తి రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలుస్తోంది.2024 ఏప్రిల్ వరకు జరిగిన 26,027 ఆస్తి రిజిస్ట్రేషన్ల విలువ సుమారు రూ. 16,190 కోట్లు. 2023 మొదటి నాలుగు నెలలతో పోలిస్తే.. 2024 మొదటి నాలుగు నెలల్లో జరిగిన రిజిస్ట్రేషన్‌ల సంఖ్య 15 శాతం ఎక్కువ. విలువ పరంగా 40 శాతం ఎక్కువని తెలుస్తోంది.2024లో ఎక్కువగా ఖరీదైన గృహాలకు రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.1 కోటి.. అంత కంటే ఎక్కువ ఖరీదైన గృహాలు ఉన్నాయి. ఖరీదైన గృహాల రిజిస్రేషన్స్ 2023 కంటే 2024లో 92 శాతం ఎక్కువ.రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి మధ్యలో ఉన్న గృహాల రిజిస్ట్రేషన్స్ 2023 కంటే 47 శాతం ఎక్కువని గణాంకాల ద్వారా తెలుస్తోంది. మొత్తం మీద అన్ని రకాల కేటగిరీల గృహాల రిజిస్ట్రేషన్, విలువ 2023 కంటే ఎక్కువగానే నమోదయ్యాయి.2024 ఏప్రిల్ నెలలో మొత్తం రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌లు 6,578 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ సంఖ్య 2023 కంటే 46 శాతం పెరిగింది. ఈ ప్రాపర్టీల విలువ రూ.4,260 కోట్లగా నమోదైంది. ఇది కూడా అంతకు ముందు ఏడాది కంటే 86 శాతం పెరుగుదలను చూపుతోంది.హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ హైద‌రాబాద్‌లో మాత్రమే కాకూండా మేడ్చల్, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో ఎక్కువగా ఉంది. ఇవన్నీ ప్రైమరీ, సెకండరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లకు సంబంధించిన గృహ విక్రయాలను కవర్ చేస్తుంది.

Nepal Bans Sale Of Indian Spice Mix Products
ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ

భారతీయ మసాల దినుసుల తయారీ సంస్థ ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ సంస్థలకు మరో ఎదురు దెబ్బ తగిలింది.ఇటీవల ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ మసాల దినుసుల్లో క్యాన్సర్ కారక పెస్టిసైడ్, ఇథిలీన్ ఆక్సైడ్ అధిక స్థాయిలో ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సింగపూర్, హాంకాంగ్‌లు భారత్‌ మసాల దినుసుల్ని వినియోగించరాదంటూ ఆ రెండు దేశాలు అధికారంగా ప్రకటించారు.తాజాగా, నేపాల్ సైతం భారత్‌లో తయారయ్యే మసాల దినుసుల్ని వినియోగించడానికి వీలు లేదని, అందుకు నాణ్యతాపరమైన కారణాల్ని ఎత్తి చూపింది. ఇథిలీన్ ఆక్సైడ్ కారణంగానేపాల్‌ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, అనుమానాస్పద ఇథిలీన్ ఆక్సైడ్ కారణంగా ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌కు చెందిన నాలుగు మసాలా దినుసులపై నిషేధం విధించింది. నేపాల్‌ నిషేధం విధించిన మసాలలలో మద్రాస్ కర్రీ పౌడర్, సాంభార్ మిక్స్డ్ మసాలా పౌడర్, నేపాల్‌లో ఎండీహెచ్‌ మిక్స్‌డ్ మసాలా కర్రీ పౌడర్, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలు ఉన్నాయి. ఇథిలీన్ ఆక్సైడ్ పరిమితిని మించిఈ నాలుగు ఉత్పత్తులలో ఇథిలీన్ ఆక్సైడ్ పరిమితిని మించి ఉన్నట్లు గుర్తించామని, ఆహార నియంత్రణ 2027 బీఎస్‌ ఆర్టికల్ 19 ప్రకారం ఈ ఉత్పత్తుల దిగుమతి, అమ్మకం దేశంలో నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది. మసాలా ఎగుమతులు దాదాపు 40 శాతం భారత్ ప్రపంచ సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ది ఇక్కడ తయారైన 200కు పైగా మసాలాలు దాదాపు 180 దేశాలకు ఎగుమతి అన్నాయి. వీటి విలువ రూ. 33 వేల కోట్లు అని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది. దేశీయ మార్కెట్ రూ. 83 వేల కోట్లకు పైమాట. కానీ ఇప్పుడు మసాల దినుసలపై వెల్లువెత్తున్న ఆరోపణలతో భారత్‌ మసాలా మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. భారతదేశ మసాలా ఎగుమతులు దాదాపు 40 శాతం క్షీణించవచ్చని భారత సుగంధ ద్రవ్యాల వాటాదారుల సమాఖ్య (FISS) తెలిపింది. అదే సమయంలో ఈ ప్రఖ్యాత మసాల దినుసులు ఎంత వరకు సేఫ్ అన్న అంశంపై ఆందోళనలు తలెత్తుతున్నాయి.

BMW M 1000 XR Launched In India; Check Price And Details
రూ.45 లక్షల బీఎండబ్ల్యూ బైక్ - పూర్తి వివరాలు

'బీఎండబ్ల్యూ మోటొరాడ్' దేశీయ మార్కెట్లో సరికొత్త 'ఎమ్ 1000 ఎక్స్ఆర్' బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 45 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పటికే భారతీయ విఫణిలో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ఇది కూడా ఒకటిగా చేరింది. ఇది సీబియూ మార్గం ద్వారా ఇండియాకు దిగుమతి అవుతాయి. ఈ బైక్ బుక్ చేసుకుంటే డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమవుతాయి.మంచి డిజైన్ కలిగిన ఈ బైక్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 6.5 ఇంచెస్ టీఎఫ్‌టీ డిస్ప్లే ఉంటుంది. అంతే కాకుండా ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, బ్రేక్ స్లైడ్ అసిస్ట్ ఫంక్షన్, లాంచ్ కంట్రోల్ మరియు పిట్ లేన్ లిమిటర్ ఫంక్షన్‌లు వంటి అనేక ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఎమ్ 1000 ఎక్స్ఆర్ బైక్ 999సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 199 Bhp పవర్ మరియు 113 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం వాడుతుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 278 కిమీ కావడం గమనార్హం. ఇందులో రెయిన్, రోడ్, డైనమిక్, డైనమిక్ ప్రో మరియు రేస్ ప్రో మోడ్ అనే ఐదు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి.

Pedal electric Hopper German car
తొక్కుతూ నడిపే మూడు చక్రాల కారు!

మీరు పెట్రోల్‌ లేదా డీజిల్‌, బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ కార్లు, వాహనాలు చూసింటారు. సైకిల్‌ లాగా తొక్కే, బ్యాటరీతో నడిచే హైబ్రిడ్‌ కార్లను ఎప్పుడైనా చూశారా? పెడల్-ఎలక్ట్రిక్, సెమీ ఎన్‌క్లోజ్డ్, సైకిల్/కార్-హైబ్రిడ్ కార్లు జర్మనీ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి.మొదట 2020లో కాన్సెప్ట్‌గా ప్రకటించిన ఈ వాహనాలను హాంబర్గ్‌కు చెందిన స్టార్టప్ హాప్పర్ మొబిలిటీ తయారు చేసింది. ఇది ఓపెన్-సైడ్ బాడీతో కూడిన త్రీ-వీలర్. వాతావరణ రక్షణను అందిస్తుంది. అదే సమయంలో రైడర్‌ను సౌకర్యవంతమైన కారు లాంటి డ్రైవింగ్ పొజిషన్‌లో ఉంచుతుంది. చూడటానికి కారులా ఉన్నా.. చట్టబద్ధంగా దీన్ని ఈ-బైక్‌గా పరిగణిస్తున్నారు.దీనికి 250-వాట్ రియర్‌ హబ్ మోటార్‌ను అమర్చారు. పెడలింగ్ చేస్తూ గంటకు 25 కిలో మీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లవచ్చు. అలాగే ఇందులో 30-Ah/48V/1,440-Wh లిథియం-ఐరన్-ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కో ఛార్జ్‌కు సుమారుగా 65 కిమీ ఇస్తుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే కారుపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్ అమర్చుకుని బ్యాటరీని చార్జ్‌ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇందులో వెనుక సీటు ఉండేది, లేనిది రెండు వర్షన్లు ఉన్నాయి. రెండు వెర్షన్లు గరిష్టంగా 160 కిలోల బరువును తట్టుకోగలవు.ఇలాంటి 30 వాహనాలు ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్నాయి. వాహనం మొదటి ఎడిషన్ వాణిజ్య వెర్షన్ ఉత్పత్తి ఈ సంవత్సరం చివరిలో ప్రారంభం కానుంది. దీని ప్రీ ఆర్డర్‌ ప్రస్తుతం జర్మన్ కస్టమర్‌లకు అందుబాటులో ఉంది. 13,500 యూరోలు (సుమారు రూ.12 లక్షలు) చెల్లించి దీన్ని ఆర్డర్‌ చేయవచ్చు. కంపెనీ ప్రస్తుతం ఇతర దేశాలకు కూడా లభ్యతను విస్తరించే పనిలో ఉంది.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 92500.00 92500.00 0.00
Gold 22K 10gm 67600.00 67600.00 -250.00
Gold 24k 10 gm 73750.00 73750.00 -270.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement