Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Forbes Releases 2024 30 Under 30 Asia List Details
2024 ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితా

ఫోర్బ్స్ తన 30 అండర్ 30 ఆసియా తొమ్మిదవ ఎడిషన్‌ను ప్రకటించింది. ఇందులో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 300 మంది యువ పారిశ్రామికవేత్తలు, లీడర్స్, ట్రయల్‌బ్లేజర్‌లు ఉన్నారు. వీరి వయసు 30 ఏళ్లకంటే తక్కువ.అండర్ 30 ఆసియా క్లాస్ ఆఫ్ 2024లో ది ఆర్ట్స్, ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్, మీడియా మొదలైన 10 విభాగాల్లో 300 మంది ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్నవారిలో కే-పాప్ గర్ల్, సింగపూర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ వెరోనికా శాంతి పెరీరా, అషియా సిటీకి చెందిన జపాన్ యొక్క అతి పిన్న వయస్కుడైన మేయర్ రియోసుకే తకాషిమా మొదలైనవారు ఉన్నారు."30 అండర్ 30 ఆసియా" జాబితాసియాన్ డాసన్ - ఆస్ట్రేలియా: ది ఆర్ట్స్మెటల్ బ్యాండ్ - ఇండోనేషియా: ఎంటర్టైన్మెంట్ & స్పోర్ట్స్అలీనా నదీమ్ - పాకిస్తాన్ : ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్ఎరికా ఎంగ్ - మలేషియా: మీడియా, మార్కెటింగ్ & అడ్వర్టైజింగ్యూమీ హ్వాంగ్ - సౌత్ కొరియా: రిటైల్ & ఇకామర్స్జు యుయాంగ్ - చైనా: ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీఅక్షిత్ బన్సల్ & రాఘవ్ అరోరా - ఇండియా: ఇండస్ట్రీ, మాన్యుఫ్యాక్టరింగ్ & ఎనర్జీజాంగ్ జికియాన్ - చైనా: హెల్త్‌కేర్ & సైన్స్భాగ్య శ్రీ జైన్ - ఇండియా: సోషల్ ఇంపాక్ట్జాన్సన్ లిమ్ - సింగపూర్: కన్స్యూమర్ టెక్నాలజీ

Best AI Tools For Answer Questions From Your PDFs
బెస్ట్ ఏఐ టూల్స్.. పీడీఎఫ్‌ ప్రశ్నలకు ఇట్టే సమాధానం

చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ ప్రశ్నకైనా ఇట్టే సమాధానం లభిస్తోంది. ఇప్పటికే మనం చాట్‌జీపీటీని ఉపయోగించి రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆరోగ్యం కోసం చాట్‌జీపీటీని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నాం. ఈ కథనంలో పీడీఎఫ్ ఫైల్స్‌లో ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే ఏడు ఏఐ పవర్డ్ టూల్స్‌ గురించి ఇక్కడ చూసేద్దాం..ఆస్క్ యువర్ పీడీఎఫ్ (AskYourPDF)AskYourPdf అనేది PDFలను అప్‌లోడ్ చేయడానికి మాత్రమే కాకుండా సంబంధిత సమాచారాన్ని తొందరగా తిరిగి పొందేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో మీ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసిన తరువాత పీడీఎఫ్‌లోని ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు.. ప్రశ్నను ఎంటర్ చేయవచ్చు. మీరు ఎంటర్ చేసిన తరువాత ఆస్క్ యువర్ పీడీఎఫ్ మీకు సమాధానం అందిస్తుంది.ఆస్క్ యువర్ పీడీఎఫ్ అనేది పూర్తిగా ఉచితం. ఇందులో కేవలం పీడీఎఫ్ మాత్రమే కాకుండా.. PPT, TXT, CSV వంటి వాటిని కూడా అప్‌లోడ్ చేయవచ్చు. తెలుసుకోవలసిన ప్రశ్నలను గురించి సర్చ్ చేసి తెలుసుకోవచ్చు. అయితే అప్‌లోడ్ చేసే ఫైల్ సైజ్ 40 ఎంబీ పరిమాణంలో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.చాట్‌పీడీఎఫ్ (ChatPDF)చాట్‌పీడీఎఫ్ జీపీటీ 3.5 టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. కాబట్టి ఇది మల్టిపుల్ భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో హిస్టరీ వంటి వాటిని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఆస్క్ యువర్ పీడీఎఫ్ మాదిరిగానే.. చాట్‌పీడీఎఫ్ లింక్ ద్వారా కూడా డాక్యుమెంట్‌ను ఇతరులతో పంచుకునే అవకాశం ఉంది. దీనిని ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు, పెయిడ్ ప్లాన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఉచితంగా ఉపయోగించుకోవాలంటే ఫైల్ సైజ్ 10 ఎంబీ, పేజీలు 120 వరకు మాత్రమే. పెయిడ్ ప్లాన్‌లో కొన్ని ఇతర ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు.డాక్యుమైండ్ (Documind)మల్టిపుల్ పీడీఎఫ్‌లలో ఒకేసారి సమాచారాన్ని వెతకడం కోసం ఈ డాక్యుమైండ్ ఉపయోగపడుతుంది. మీరు ఎక్కువ డాక్యుమెంట్లను ఒకేసారి అప్‌లోడ్ చేసిన తరువాత.. తెలుసుకోవలసిన ప్రశ్నలను సెర్చ్ చేసుకోవచ్చు, ఖచ్చితమైన సమాధానాలను అందించడానికి డాక్యుమైండ్ అప్‌లోడ్ చేసిన అన్ని పత్రాలను స్కాన్ చేస్తుంది. దీనిని కేవలం 15 సార్లు మాత్రమే ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఆ తరువాత పెయిడ్ ప్లాన్‌ కోసం అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం నెలకు 5 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది.లైట్ పీడీఎఫ్ (LightPDF)లైట్ పీడీఎఫ్ అనేది మీ ప్రశ్నలకు తొందరగా సమాధానాలను అందించడమే కాకుండా.. అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్ కంటెంట్ ఆధారంగా సమ్మరీస్, అవుట్ లైన్స్, పట్టికలను రూపొందించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కేవలం పీడీఎఫ్ ఫైల్‌లకు మాత్రమే పరిమితం కాదు. ఎక్స్ఎల్, వర్డ్, పీపీటీ ఫైల్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీరు 200 కంటే ఎక్కువ పేజీలు ఉన్న పీడీఎఫ్ లేదా వేరే ఫార్మాట్‌లో ఫైల్‌లను అప్‌లోడ్ చేయాలనుకుంటే పెయిడ్ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది.పీడీఎఫ్ ఏఐ (PDF.ai)పీడీఎఫ్ ఏఐ అనేది అన్నింటికంటే సులభమైన ఇంటర్‌ఫేస్‌. ఇందులో ట్యాబ్ రెండు నిలువు వరుసలుగా కనిపిస్తుంది. ఒక వరుస డాక్యుమెంట్ కోసం, రెండో వరుస చాట్‌బాట్ కోసం. డ్యాష్‌బోర్డ్‌లో మీరు అప్‌లోడ్ చేసిన అన్ని డాక్యుమెంట్‌ను చాట్ హిస్టరీ యాక్సెస్ చేస్తుంది. మీరు నేరుగా డాక్యుమెంట్‌లోని సంబంధిత పేజీకి నావిగేట్ చేసుకునే అవకాశం కూడా ఇందులో లభిస్తుంది. డిస్‌ప్లే, జూమ్ సెట్టింగ్స్ వంటి వాటిని కూడా ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ అకౌంట్ ద్వారా కేవలం ఒక పీడీఎఫ్ మాత్రమే అప్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ మీరు నెలకు 17 డాలర్లను పే చేస్తే.. 100 డాక్యుమెంట్లను కూడా అప్‌లోడ్ చేయవచ్చు, అదే నెలకు 5000 ప్రశ్నలను అడగవచ్చు.హుమాటా (Humata)టీమ్ ఉపయోగించడానికి ఓ మంచి టూల్స్ కోసం సర్చ్ చేస్తున్నట్లయితే.. హుమాటా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఫైల్‌లను ఫోల్డర్‌లలో అమర్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది PDF, DOCX, PPT వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఫ్రీ ప్లాన్ మాత్రమే కాకుండా పెయిడ్ ప్లాంట్ కూడా ఉంటుంది. ప్రతి పేజీకి 0.01 నుంచి 0.02 డాలర్ చెల్లించాల్సి ఉంటుంది.బన్నీ (Bunni)అమౌట్ పే చేసి ఉపయోగించడానికి ఇష్టపడితే.. ఈ టూల్ మంచి ఎంపిక అవుతుంది. ఇది మల్టిపుల్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడానికి అనుమతిస్తుంది. ఇందులో మీద సమాధానాలు మాత్రమే కాకుండా.. సూచలను కూడా అందిస్తుంది. ఇందులో సమాచారాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవచ్చు. ఇది వివిధ భాషలకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీ భాషలోనే సమాధానం పొందవచ్చు.

Zoho Corp to venture into chip making
సెమీకండక్టర్స్‌ తయారీలోకి జోహో

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ జోహో తాజాగా సెమీకండక్టర్ల తయారీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీనిపై 700 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టే యోచనలో సంస్థ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి కంపెనీ ప్రోత్సాహకాలు కోరుతోందని పేర్కొన్నాయి. ప్రస్తుతం జోహో ప్రతిపాదనను ఐటీ శాఖ కమిటీ పరిశీలిస్తోందని, వ్యాపార ప్రణాళికలపై మరింత స్పష్టతనివ్వాలని కంపెనీని కోరిందని వివరించాయి. జోహో ఇప్పటికే టెక్నాలజీ భాగస్వామిని కూడా ఎంచుకున్నట్లు తెలిపాయి. 1996లో ఏర్పాటైన జోహో .. గత ఆర్థిక సంవత్సరం 1 బిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయం నమోదు చేసింది. తమిళనాడులో చిప్‌ డిజైన్‌ తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్‌ వెంబు మార్చిలో వెల్లడించిన నేపథ్యంలో తాజా వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశీయంగా 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో సెమీకండక్టర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్, సీజీ పవర్‌ తదితర సంస్థలకు కేంద్రం ఫిబ్రవరిలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచి్చన సంగతి తెలిసిందే. భారత్‌లో సెమీకండక్టర్ల మార్కెట్‌ 2026 నాటికి 63 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా.

Global Trends Lift Sensex and Nifty
బుల్‌ బ్యాక్‌ ర్యాలీ

ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్‌ సూచీలు గురువారం దాదాపు ఒకశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్‌ 677 పాయింట్లు పెరిగి 73,664 వద్ద నిలిచింది. నిఫ్టీ 203 పాయింట్లు లాభపడి 22,404 వద్ద స్థిరపడింది. అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే తక్కువగానే నమోదవడంతో ఈ ఏడాదిలో ఫెడ్‌ రిజర్వ్‌ కనీసం రెండు సార్లు వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు తెరపైకి వచ్చాయి. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం చూపింది. ఒక దశలో సెన్సెక్స్‌ 762 పాయింట్లు బలపడి 73,749 వద్ద, నిఫ్టీ 231 పాయింట్లు పెరిగి 22,432 ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ సూచీలు వరుసగా 1.07%, 0.85% లాభపడ్డాయి. → ఇన్వెస్టర్ల సంపద గురువారం ఒక్కరోజే రూ.3.1 లక్షల కోట్లు పెరిగి బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ. 407.35 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం 30కి గానూ 25 షేర్లు లాభపడ్డాయి. → అమెరికాలో పారిశ్రామిక రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే డోజోన్స్‌ సూచీ తొలిసారి 40వేల పాయింట్ల పైకి చేరింది.

Special Cashback Offer for RuPay Credit Debit Cardholders
గుడ్‌న్యూస్‌.. రెండున్నర నెలలపాటు భారీ క్యాష్‌ బ్యాక్‌

రూపే (RuPay) క్రెడిట్, డెబిట్ కార్డులున్న వారికి శుభవార్త. తమ కార్డ్ హోల్డర్లకు ప్రత్యేక స్కీమ్‌ కింద రూపే ఇటీవల భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. దాదాపు రెండున్నర నెలలపాటు ఈ కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై భారీగా క్యాష్‌ బ్యాక్‌ పొందే వీలు కల్పించింది."ఆఫర్ వ్యవధిలో డిస్కవర్ నెట్‌వర్క్ లేదా కెనడా, జపాన్, స్పెయిన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే, యూఎస్‌ఏలోని డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నెట్‌వర్క్‌, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)లో కార్డులను అంగీకరించే వ్యాపారుల వద్ద చేసిన పాయింట్-ఆఫ్-సేల్ కొనుగోళ్లపై క్వాలిఫైడ్ రూపే కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్‌లు 25 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు" అని రూపే సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.ఈ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్ మే 15 నుంచి జూలై 31 వరకు చెల్లుబాటు అవుతుంది. ఆఫర్ వ్యవధిలో ఒక కార్డ్‌కి ఒక లావాదేవీకి గరిష్ట క్యాష్‌బ్యాక్‌గా రూ. 2,500 లభిస్తుంది. రూపే అనేది డెబిట్, క్రెడిట్, ఇంటర్నేషనల్, ప్రీపెయిడ్, కాంటాక్ట్‌లెస్ కార్డ్. భారతీయులందరికీ దేశీయ చెల్లింపు కార్డులను అందించాలనే ఆర్బీఐ దృష్టిని నెరవేర్చడానికి ఎన్‌పీసీఐ వీటిని ప్రారంభించింది.

TVS Motor Expands Operations In Italy Details
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ తన కార్యకలాపాలను ఇటలీలో కూడా ప్రారంభించింది. ఇప్పటికే 80 దేశాల్లో విస్తరించిన టీవీఎస్ కంపెనీ మరిన్ని దేశాలకు విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.టీవీఎస్ మోటార్ ఇటాలియా ద్వారా ఇటలీలో తన కార్యకలాపాలను విస్తరిస్తుంది. దీనికి జియోవన్నీ నోటార్‌బార్టోలో డి ఫర్నారీ నేతృత్వం వహిస్తారు. దీని ద్వారా టీవీఎస్ అపాచీ RTR, అపాచీ RTR 310, టీవీఎస్ రైడర్, టీవీఎస్ NTorq, జుపీటర్ 125 వంటి మోడల్స్ విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది.టీవీఎస్ కంపెనీ ఇటలీ మార్కెట్లో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా విక్రయించే అవకాశం ఉంది. టీవీఎస్ మోటార్ కంపెనీ హెడ్ గ్రూప్ స్ట్రాటజీ ప్రెసిడెంట్, శరద్ మోహన్ మిశ్రా, కంపెనీ ఇటాలియన్ లాంచ్‌పై మాట్లాడుతూ.. మా వాహనాలకు ఇటాలియన్ వినియోగదారులను పరిచయం చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాము. ఇక్కడ కూడా కంపెనీ ఉత్తమ ఆదరణ పొందుతుందని భావిస్తున్నామని అన్నారు.

USAID India Mission Director Veena Reddy Visit Hyderabad
హైదరాబాద్‌లో యూఎస్ఏఐడీ ఇండియా డైరెక్టర్

యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) ఇండియా మిషన్ డైరెక్టర్ 'వీణా రెడ్డి' హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ క్వాల్‌కమ్ ఇండియాకు సంబంధించిన ఓఆర్ఏఎన్ రీసెర్చ్ ల్యాబ్‌లను సందర్శించారు. ఇక్కడ టెలికమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎలా ముందుకు సాగుతుందో గమనించారు.యూఎస్ఏఐడీ 5జీ అండ్ ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌లతో సహా కొత్త వైర్‌లెస్ టెక్నాలజీలను పరీక్షించడంలో భారతీయ టెలికమ్యూనికేషన్ కంపెనీలకు కొన్ని సంస్థలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది టెలికమ్యూనికేషన్ హార్డ్‌వేర్ అమెరికన్ సరఫరాదారు అయిన 'క్వాల్‌కమ్ టెక్నాలజీ'.క్వాల్కమ్ టెక్నాలజీ సహకారంతో.. భారతీయ టెలికామ్ రంగం కొత్త ఆవిష్కరణలకు పునాది వేస్తుంది, తద్వారా అనేక గ్లోబల్ అప్లికేషన్‌ల పరిష్కారాలు సాధ్యమవుతాయి. ఈ సందర్భంగా వీణా రెడ్డి మాట్లాడుతూ.. జీ20 లీడర్స్ సమ్మిట్ సందర్భంగా చెప్పినట్లుగానే యునైటెడ్ స్టేట్స్, భారతదేశంలో విశ్వసనీయ టెలిక‌మ్యూనికేష‌న్స్‌ వృద్ధి చెందుతాయని అన్నారు.డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక శ్రేయస్సును పెంచడమే ప్రధాన లక్ష్యం. భారతదేశంలో సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైర్‌లెస్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లకు మెరుగుపరచడానికి మేము ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యం కలిగి ఉన్నామని వీణా రెడ్డి పేర్కొన్నారు.

PhonePe Partners With LankaPay Details
భారతీయ పర్యాటకులకు శుభవార్త.. ఇక ఆ దేశంలో 'ఫోన్ పే' సేవలు

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) సేవలు విస్తరణ చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలుదేశాల్లో అందుబాటులో ఉన్న 'ఫోన్ పే' ఇప్పుడు తాజాగా 'లంకాపే'తో చేతులు కలిపింది. ఇది భారతీయ పర్యాటకులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి.శ్రీలంకకు వెళ్లే భారతీయులు ఇకపై ఫోన్ పే యాప్‌తో లంకాపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ పే చేయవచ్చు. ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో భారతీయ పర్యాటకులు శ్రీలంకకు వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా డబ్బు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.ఇప్పటికే ఫోన్ పే సేవలు సింగపూర్, నేపాల్ వంటి దేశాల్లో అమలులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా శ్రీలంక దేశంలో కూడా అందుబాటులోకి వచ్చేసింది.శ్రీలంకలో ప్రారంభమైన ఫోన్ పే సేవల సందర్భంగా.. లంకాపే సీఈఓ చన్నా డి సిల్వా మాట్లాడుతూ, భారతీయ పర్యాటకులు, బిజినెస్‌ ప్రయాణీకులకు శ్రీలంక పర్యటన సమయంలో చెల్లింపు అనుభవాన్ని మెరుగుపరిచే దిశలో ఇది కీలక అడుగు అన్నారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ శ్రీలంక గవర్నర్‌ నందలాల్‌ వీరసింగ్‌ స్పందిస్తూ.. పోటీతత్వాన్ని, శ్రీలంక వ్యాపారులకు ప్రయోజనాలను పెంపొందించడానికి చాలా ఉపయోగకరంగా ఉండదని అన్నారు. ఈ కార్యక్రమానికి బ్యాంకింగ్ అండ్ టూరిజం రంగాల ప్రతినిధులు, వ్యాపార సంఘాల ప్రతినిధులతో సహా శ్రీలంకకు చెందిన ముఖ్య వాటాదారులు హాజరయ్యారు.

Mahindra XUV 3XO Bookings Crossed 50000 in 60 Minutes
బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్.. మార్కెట్లో మహీంద్రా కారు సంచలనం

గత నెల చివరలో దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మహీంద్రా XUV 3XO కారు బుకింగ్స్ బుధవారం (మే 15) ప్రారంభయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 10 నిమిషాల్లో మహీంద్రా కొత్త కారు 27000 బుకింగ్స్ పొందింది. అదే విధంగా 60 నిమిషాల్లో 50000 బుకింగ్స్ పొందింది.మహీంద్రా కంపెనీ ఇప్పటికే 10000 కార్లను (XUV 3XO) ఉత్పత్తి చేసినట్లు సమాచారం. కాబట్టి డెలివరీలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారు మొత్తం 9 వేరియంట్లలో విడుదలైంది. XUV 3XO ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు.తొమ్మిది వేరియంట్లు, ఎనిమిది కలర్ ఆప్షన్లలో లాంచ్ అయిన ఈ కొత్త కారు మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు, లెవల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.Crossing milestones even before it hits the roads. A big thank you to all our customers who have made this possible. Be a part of our journey, book now: https://t.co/P7UUnkoyxv#XUV3XO    #EverythingYouWantAndMore #The3XFactor pic.twitter.com/HMNylKisa1— Mahindra XUV 3XO (@MahindraXUV3XO) May 15, 2024

Motorola Edge 50 Fusion Launch in India Price and Details
మోటోరోలా కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?

దేశీయ మార్కెట్లో మోటోరోలా కంపెనీ తన 'ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త ఫోన్ ధరలు, ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.భారతీయ విపహ్లవు లాంచ్ అయిన కొత్త మోటోరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ ప్రారంభ ధర రూ. 22999 (8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్), 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24999. ఈ మొబైల్ మే 22 నుంచి మోటోరోలా.ఇన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో ప్రముఖ రిటైల్ స్టోర్‌లో కూడా విక్రయానికి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు ఈఎంఐ లావాదేవీలతో రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు.మోటోరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ వేగన్ లెదర్ ముగింపుతో హాట్ పింక్,మార్ష్‌మల్లౌ బ్లూ కలర్‌వేస్‌లో మాత్రమే కాకుండా.. పాలీమిథైల్ మెథాక్రిలేట్ (PMMA) ముగింపుతో ఫారెస్ట్ బ్లూ కలర్ ఎంపికలో కూడా అందుబాటులో ఉంటుంది.లేటెస్ట్ మోటోరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ 6.7 ఇంచెస్ ఫుల్ HD+ (1,0800x2,400 పిక్సెల్‌లు) pOLED కర్వ్డ్ డిస్‌ప్లే పొందుతుంది. ఇది క్వాల్‌కామ్‌ 4ఎన్‌ఎం స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌2 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ మొబైల్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి 68 వాట్‌ టర్బోపవర్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం ఐపీ68 రేటింగ్ పొందుతుంది.కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇది 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై-6, బ్లూటూత్‌ 5.2, జీపీఎస్‌, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. బయోమెట్రిక్‌ కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ వంటివి ఇందులో లభిస్తాయి.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
EUR 90.648214 2024-05-16
USD 90.648214 2024-05-16

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 90800.00 90800.00 100.00
Gold 22K 10gm 66740.00 66740.00 -10.00
Gold 24k 10 gm 72810.00 72810.00 -10.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement