Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

HDFC Life is first insurer to partner with Upstox to its term insurance
ఇన్సూరెన్స్‌ సేవల్లోకి ప్రముఖ సంస్థ

ప్రముఖ ఆన్‌లైన్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ అప్‌స్టాక్స్‌ ఇన్సూరెన్స్‌ వ్యాపారంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. తమ కొత్త బిజినెస్‌ను టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో ప్రారంభిస్తున్నామని కంపెనీ వర్గాలు చెప్పాయి. త్వరలో హెల్త్, మోటార్, ట్రావెల్ సెగ్మెంట్లలో బీమా ఉత్పత్తులు మొదలుపెడుతామని కంపెనీ తెలిపింది.అప్‌స్టాక్స్‌తో మొదటి భాగస్వామిగా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ జతైనట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా అప్‌స్టాక్స్ కోఫౌండర్ కవితా సుబ్రమణియన్ మాట్లాడుతూ..‘మా కంపెనీను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ ప్లాట్‌ఫామ్‌ సురక్షితంగా, వేగంగా పనిచేస్తోంది. వినియోగదారుల సంపదను సమర్థంగా నిర్వహించడంలో భాగంగా బీమా సేవలు ప్రారంభించాం​. కొత్త బిజినెస్‌ మోడల్‌ వల్ల సంస్థకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’ అని అన్నారు.అప్‌స్టాక్స్ ఇప్పటికే స్టాక్‌ క్రయవిక్రయాలు, ఐపీఓలు, ఫ్యూచర్స్ అండ్‌ ఆప్షన్‌లు, కమోడిటీలు, కరెన్సీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పీర్-టు-పీర్ లెండింగ్, ప్రభుత్వ బాండ్‌లు, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు సహా అనేక రకాల సేవలందిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.1,000 కోట్లకు చేరినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కస్టమర్లకు సంబంధించి పది రెట్లు వృద్ధి నమోదు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.ఫోన్‌పే వంటి ఫిన్‌టెక్ కంపెనీలు సైతం బీమా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్‌స్టాక్స్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో మార్కెట్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2023, ఏప్రిల్ 24న వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్‌లో రూ.426 కోట్లు పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే.

Honda Zero Series EVs Near 500 Km Range Target
హోండా 0 సిరీస్ ఎలక్ట్రిక్ కార్లు.. 500 కిమీ టార్గెట్!

గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే అనేక సంస్థలు ఈవీలను లాంచ్ చేసి ఉత్తమ అమ్మకాలను పొందుతున్నాయి. ఇప్పటి వరకు హోండా మాత్రం ప్యూర్ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయలేదు. అయితే ఈ సంస్థ 2030 నాటికి ఏడు 0 సిరీస్ మోడళ్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నద్ధమైంది.హోండా కంపెనీ లాంచ్ చేయనున్న 7 మోడల్స్ 480 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించేలా రూపొందిస్తోంది. జపనీస్ ఆటో మేకర్ లాంచ్ చేయనున్న 0 సిరీస్ మోడల్స్ సరికొత్త బెస్పోక్ ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా తయారవుతాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ల బాడీ ఫ్రేమ్‌లు తేలికగా ఉంటాయని తెలుస్తోంది. అంతే కాకుండా డిజైన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది.హోండా లాంచ్ చేయనున్న 0 సిరీస్ కార్లు మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. లెవెల్ 3 ADAS టెక్నాలజీని కూడా పొందుతాయని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.0 సిరీస్ కింద లాంచ్ కానున్న మొదటి ఎలక్ట్రిక్ కారు CES.. ఇప్పటికే ఈ కారు లాస్ వెగాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే.. హోండా లాంచ్ చేయనున్న కార్లు ఎలా ఉండబోతున్నాయనేది స్పష్టమైపోతోంది. కాగా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రోజు రోజుకు ఊపందుకుంటున్న తరుణంలో హోండా భారీ పెట్టుబడులను పెట్టడానికి యోచిస్తున్నట్లు సమాచారం.

Mukesh Ambani Nita Ambani Cast Their Vote Urges Citizen Participation
ఓటేసిన అంబానీ దంపతుల విన్నపం ఇదే..

ముంబై: లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో సెలబ్రిటీలు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, వారి కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి సోమవారం ముంబైలోని మలబార్ హిల్‌కి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఓటు వేసిన అనంతరం రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు కీలక పాత్రను నొక్కిచెప్పారు. ‘దేశ పౌరులుగా ఓటు వేయడం చాలా ముఖ్యం. ఓటు వేయడం మన హక్కు, బాధ్యత. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను" అని ఆమె వ్యాఖ్యానించారు. ముఖేష్ అంబానీ ఇవే భావాలను వ్యక్తీకరించారు. "ప్రతి భారతీయుడు ఓటు వేయాలి. ఇది నాతోటి ప్రజలకు నా విజ్ఞప్తి" అని పేర్కొన్నారు.లోక్‌సభ ఎన్నికల ఐదో దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 49 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 695 మంది అభ్యర్థుల పోటీలో ఉన్నారు. వీరిలో రాజ్‌నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీయూష్ గోయల్, ఉజ్వల్ నికమ్, చిరాగ్ పాశ్వాన్, ఒమర్ అబ్దుల్లా వంటి ప్రముఖలు ఉన్నారు.#WATCH | Reliance Industries Chairman Mukesh Ambani, Founder and Chairperson of Reliance Foundation Nita Ambani along with their son arrive at a voting centre in Mumbai to cast their vote for #LokSabhaElections2024 pic.twitter.com/R97TSDysam— ANI (@ANI) May 20, 2024

This Best Picture of Me In 2024 Elections Says Anand Mahindra
2024 ఎన్నికల్లో ఇది బెస్ట్ ఫోటో: ఆనంద్ మహీంద్రా ట్వీట్

భారతదేశంలో ఐదో దశ ఎన్నికలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇందులో ప్రముఖ బిజినెస్ మ్యాన్స్ రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, కుమార మంగళం బిర్లా ఉన్నారు.ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో 'మనల్ని ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకునే అవకాశం. ఇది ఒక బ్లెస్సింగ్ అంటూ.. ట్వీట్ చేశారు.మరో ఫోటో షేర్ చేస్తూ.. 2024 ఎన్నికలలో ఇది ఉత్తమ చిత్రం, గ్రేట్ నికోబార్‌లోని షోంపెన్ తెగకు చెందిన ఏడుగురిలో ఒకరు, మొదటిసారి ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఇది ఎదురులేని, తిరుగులేని శక్తి అంటూ.. ఆ తెగకు చెందిన వ్యక్తి ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.This, for me, is the best picture of the 2024 elections.One of seven of the Shompen tribe in Great Nicobar, who voted for the first time.Democracy: it’s an irresistible, unstoppable force. pic.twitter.com/xzivKCKZ6h— anand mahindra (@anandmahindra) May 20, 2024

Indian banking sector surpassed IT as net profit tops Rs 3 lakh crore in FY24
ఫస్ట్‌టైమ్‌.. ఐటీని వెనక్కినెట్టిన బ్యాంకింగ్‌

దేశంలో ఐటీ రంగాన్ని వెనక్కి నెట్టి బ్యాంకింగ్‌ రంగం సరికొత్త మైలురాయిని సాధించింది. తొలిసారిగా 2024 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ రంగం నికర లాభం రూ. 3 లక్షల కోట్లను అధిగమించింది. లిస్టెడ్ పబ్లిక్, ప్రైవేట్ రంగ బ్యాంకుల సంయుక్త నికర లాభం 2023 ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ. 2.2 లక్షల కోట్లతో పోలిస్తే 39 శాతం పెరిగి రూ. 3.1 లక్షల కోట్లకు చేరుకుందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదించింది.ఐటీ రంగాన్ని దాటి.. ఇటీవలి కాలంలో సాంప్రదాయకంగా అత్యంత లాభదాయక రంగంగా ఉన్న ఐటీ సేవల రంగాన్ని బ్యాంకుల లాభాలు అధిగమించాయి. 2024లో లిస్టెడ్ ఐటీ సేవల కంపెనీలు రూ. 1.1 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. ఇది బ్యాంకులు ఆర్జించిన లాభాల కంటే చాలా తక్కువ.ప్రభత్వ, ప్రైవేట్ బ్యాంకుల లాభాలు ఇలా.. ఏడాది కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.4 లక్షల కోట్ల నికర లాభాన్ని సాధించాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 34 శాతం పెరిగింది. ఇదిలా ఉండగా, ప్రైవేట్ రంగ బ్యాంకుల నికర లాభం 42 శాతం పెరిగి దాదాపు రూ.1.7 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది ఏడాది క్రితం రూ.1.2 లక్షల కోట్లుగా ఉంది.ప్రధాని ట్వీట్‌ దేశంలో బ్యాంకింగ్‌ రంగం రికార్డ్‌ స్థాయి లాభాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ‘గత 10 సంవత్సరాలలో చెప్పుకోదగ్గ మలుపు. భారతదేశ బ్యాంకింగ్ రంగ నికర లాభం మొదటిసారిగా రూ. 3 లక్షల కోట్లు దాటింది. బ్యాంకుల లాభాలు మెరుగుపడటం పేదలు, రైతులు, ఎంఎస్‌ఎంఈలకు రుణ లభ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు.In a remarkable turnaround in the last 10 years, India's banking sector net profit crosses Rs 3 lakh crore for the first time ever.When we came to power, our banks were reeling with losses and high NPAs due to the phone-banking policy of UPA. The doors of the banks were closed…— Narendra Modi (@narendramodi) May 20, 2024

one out of seven iPhones in the world is now being manufactured in India PM Modi said
భారత్‌లో ఐఫోన్‌ తయారీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్‌ ఐఫోన్‌ ఉత్పత్తుల్లో ప్రతి ఏడింటిలో ఒకటి భారత్‌లోనే తయారవుతోందని ప్రధానిమోదీ అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్‌ఐ) ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ..‘ప్రపంచంలోనే భారత్‌ రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా ఎదిగింది. గ్లోబల్‌గా తయారువుతున్న ఏడు ఐఫోన్‌లలో ఒకటి ఇండియాలోనే తయారుచేస్తున్నారు. ఐఫోన్‌తోపాటు యాపిల్ ఉత్పత్తులను కూడా భారత్‌ రికార్డు సంఖ్యలో ఎగుమతి చేస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ప్రొడక్షన్‌ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకం ద్వారానే ఇది సాధ్యమైంది’ అని అన్నారు.2028 నాటికి మొత్తం ఐఫోన్‌లలో 25 శాతం భారత్‌లోనే తయారవుతాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి త్రైమాసికానికి సంబంధించి యాపిల్‌ ఉత్పత్తుల షిప్‌మెంట్‌లో దేశం రికార్డు స్థాయిని చేరుకుంది. దేశంలోని యాపిల్‌ ఉత్పత్తుల్లో ఏడాదివారీగా 19 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ తెలిపింది.యాపిల్‌ సంస్థ ముంబై, దిల్లీలో రెండు అవుట్‌లెట్‌లను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్‌ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ స్టోర్‌లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది.ముంబై స్టోర్ యాపిల్‌ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్‌ సాకెట్‌ కంటే కొంచెం అధికంగా నమోదవుతోందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనల ద్వారా తెలిసింది. త్వరలో భారత్‌లో మరో మూడు స్టోర్‌లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే గతేడాది జూన్‌లో వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్‌ తన స్టోర్‌లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్‌లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

Will Indians Become Rich Before India Grows Old Says Raghuram Rajan
అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 'భారత్' ఒకటి. అదే సమయంలో అత్యంత పేద దేశం కూడా.. అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ 'రఘురామ్ రాజన్' ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఏప్రిల్ 2024లో నిరుద్యోగిత రేటు 8.1%గా ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) పేర్కొన్న విషయాన్ని రాజన్ హైలైట్ చేశారు.భారతదేశంలోని శ్రామిక జనాభాలో కేవలం 37.6 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారని వివరించారు. పెద్ద సంఖ్యలో యువత శ్రామికశక్తిలోకి రావడం వల్ల భారత్‌కు మేలు జరుగుతుందన్నారు. యువకులకు కావలసిన ఉపాధి కల్పించగలిగితే.. దేశం మరింత వేగంగా డెవలప్ అవుతుందని పేర్కొన్నారు.భారత్ క్రమంగా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో చేరుతోంది. ప్రస్తుతం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియా 2047 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని రఘురామ్ రాజన్ అన్నారు.ఇక అసలు సమస్య ఏమిటంటే.. 2047-2050 నాటికి దేశంలో వృద్ధాప్యం పెరుగుతుంది. అప్పటికి భారతీయులంతా ధనవంతులు కాగలరా? అని రాజన్ అన్నారు. ప్రస్తుత జనాభా డివిడెండ్ శాశ్వతంగా ఉండదని, జనాభా వయస్సు పెరిగే కొద్దీ.. వర్క్‌ఫోర్స్‌లో సంఖ్య తగ్గుతుందని ఆయన అన్నారు.Can India lift itself from the doldrums of a jobs crisis? Can the country grow rich before it grows old?My conversation with Raghuram Rajan, former head of India’s central bank and coauthor of “Breaking the Mold: India’s Untraveled Path to Prosperity” pic.twitter.com/hPz75GRE16— Fareed Zakaria (@FareedZakaria) May 19, 2024

Iran President Dies Impact on Oil Prices Gold Rates
ఇరాన్‌ అధ్యక్షుడి మృతి.. ఎగిసిన చమురు, బంగారం ధరలు!

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్‌బైజాన్ సరిహద్దు సమీపంలోని పర్వత ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ వార్తలు వెలువడిన వెంటనే చమురు ఎక్కువ ఉత్పత్తి చేసే మధ్యప్రాచ్య ప్రాంతంలో రాజకీయ అనిశ్చితి మధ్య బంగారం ఆల్-టైమ్ హైని తాకింది. ముడి చమురు ధరలు పెరిగిపోయాయి.బంగారం ధరలపై ప్రభావంఇరాన్ అధ్యక్షుడి మరణ వార్తల తర్వాత సోమవారం బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గ్లోబల్ అనిశ్చితుల మధ్య సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తారు. 0811 జీఎంటీ అంటే భారతీయ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1:41 గంటల సమయానికి స్పాట్‌ బంగారం ఔన్సు ధర 1 శాతం పెరిగి 2,438.44 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు సెషన్‌లో రికార్డు గరిష్ట స్థాయి 2,449.89 డాలర్లను తాకింది. యూఎస్‌ గోల్డ్ ఫ్యూచర్స్ 1.1 శాతం పెరిగి 2,442.60 డాలర్లకు చేరుకుంది. వెండి కూడా 11 సంవత్సరాల కంటే ఎక్కువ గరిష్ట స్థాయికి చేరుకుంది.ముడి చమురు ధరలుఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ క్రాష్ నివేదికలు వచ్చిన వెంటనే ప్రధాన చమరు ఉత్పత్తి దేశాలలో రాజకీయ అనిశ్చితి మధ్య అంతర్జాతీయ ముడి చమురు ధరలు సోమవారం లాభాలను పొడిగించాయి. ఆరోగ్యంతో సమస్యల కారణంగా సౌదీ అరేబియా యువరాజు జపాన్ పర్యటనను రద్దు చేసుకోవడం కూడా చమురు ధరల పెరుగుదలకు కారణమైనట్లుగా తెలుస్తోంది.భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12:02 గంటల సమయానికి బ్రెంట్ బ్యారెల్‌కు 41 సెంట్లు లేదా 0.5 శాతం పెరిగి 84.39 డాలర్లకు చేరుకుంది, అంతకుముందు 84.43 డాలర్లకి పెరిగింది. మే 10వ తేదీ తర్వాత ఇదే అత్యధికం.

india Economic and Commercial Relations with Israel and iran
ఇరాన్‌ అధ్యక్షుడు హఠాన్మరణం.. భారత్‌తో వాణిజ్యం ఎలా ఉందంటే..

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్(బెల్‌-212) ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ పరస్పరం ప్రతీకార దాడులు జరుపుకుంటున్న నేపథ్యంలో ఇరు దేశాలు భారత్‌తో జరుపుతున్న వాణిజ్యం ఏమేరకు ప్రభావం పడుతుందోననే ఆందోళనలు నెలకొంటున్నాయి. ఇప్పటివరకైతే రెండు దేశాలతో భారత్‌ మెరుగైన సంబంధాలను కలిగి ఉంది. ఏటా ఆయా దేశాలతో చేసే వాణిజ్యాన్ని పెంచుకుంటుంది. ప్రధానంగా వాటి నుంచి జరిపే దిగుమతులు, ఎగుమతులు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.2022-23లో 2.33 బిలియన్‌డాలర్ల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అది 21.7 శాతం అధికం. భారత్‌ నుంచి ఇరాన్‌కు చేసే ఎగుమతులు 1.66 బి.డాలర్లు(ముందు ఏడాదితో పోలిస్తే 14.34శాతం అధికం)గా ఉన్నాయి. ఇరాన్‌ నుంచి భారత్‌ చేసుకునే దిగుమతులు 672 మిలియన్‌ డాలర్లు(ముందు ఏడాదితో పోలిస్తే 45.05 శాతం)గా ఉన్నాయి.భారత్‌ నుంచి ఇరాన్‌ వెళ్తున్న వాటిలో ప్రధానంగా బాస్మతి బియ్యం, టీ పౌడర్‌, షుగర్‌, పండ్లు, ఫార్మా ఉత్పత్తులు, కూల్‌డ్రింక్స్‌, పప్పుదినుసులు ఉన్నాయి. ఇరాన్‌ నుంచి భారత్‌ దిగుమతి చేసుకునే వస్తువుల్లో మిథనాల్‌, పెట్రోలియం బిట్యుమెన్‌, యాపిల్స్‌, ప్రొపేన్‌, డ్రై డేట్స్‌, ఆర్గానిక్‌ కెమికల్స్‌, ఆల్మండ్స్‌ ఉన్నాయి.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్‌ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లుఇజ్రాయెల్‌తోనూ భారత్‌కు మెరుగైన సంబంధాలే ఉన్నాయి. ఇబ్రాయెల్‌కు భారత్‌ ఎగుమతుల్లో ప్రధానంగా ఆటోమేటివ్‌ డీజిల్‌, కెమికల్‌ ఉత్పత్తులు, ఎలక్ట్రికల్‌ వస్తువులు, ప్లాస్టిక్‌, టెక్స్ట్‌టైల్‌, మెటల్‌ ఉత్పత్తులు ఉన్నాయి ఫెర్టిలైజర్‌ ఉత్పత్తులు, రంగురాళ్లు, పెట్రోలియం ఆయిల్స్‌, డిఫెన్స్‌ పరికరాలను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది.

US Hikes Tariff on Chinese EV Full Details
జో బైడెన్ కీలక నిర్ణయం.. చైనా ఉత్పత్తులపై కఠిన ఆంక్షలు

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్.. వివిధ చైనీస్ దిగుమతులపై గణనీయమైన సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. చైనీస్ ఈవీలపై విధించే సుంకం ఈ ఏడాది 25 శాతం నుంచి 100 శాతానికి పెరగనుంది. బ్యాటరీలు, బ్యాటరీ భాగాలు, విడిభాగాలపైన విధించే ట్యాక్స్ 7.5 శాతం నుంచి 25 శాతానికి పెరగనున్నట్లు సమాచారం.అమెరికా తీసుకున్న ఒక్క నిర్ణయం 18 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై ప్రభావం చూపుతుంది. ఈ ట్యాక్స్ 2024 నుంచి మరో మూడు సంవత్సరాలు అమలులో ఉంటాయి. అమెరికాలో చవకైన ఉత్పత్తుల పెరుగుదలను నిరోధించడానికి బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.స్వదేశీ వస్తువుల వినియోగం పెరగటానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలోనే కొత్త ఆవిష్కరణ ఉత్పత్తి చాలా అవసరం. కాబట్టి అమెరికాలోనే కొత్త ఉత్పత్తుల తయారీ సాధ్యమవుతుందని చెబుతున్నారు.2025 నాటికి, సెమీకండక్టర్లపై ట్యాక్ రేటు కూడా 25 శాతం నుంచి 50 శాతానికి పెరుగుతుంది. లిథియం అయాన్ ఈవీ బ్యాటరీలపై సుంకం 2024లో 7.5 శాతం నుంచి 25 శాతానికి పెరుగుతుంది, నాన్ ఈవీ లిథియం అయాన్ బ్యాటరీలపై కూడా ఇదే పెరుగుదలను చూస్తుంది. బ్యాటరీ విడి భాగాల మీద ట్యాక్స్ కూడా 25 శాతానికి పెరుగుతుంది. మొత్తం మీద అమెరికా చైనా వస్తువుల మీద భారీ సుంకాలను విధిస్తూ కీలక ప్రకటనలు చేసింది.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 92500.00 92500.00 0.00
Gold 22K 10gm 67600.00 67600.00 -250.00
Gold 24k 10 gm 73750.00 73750.00 -270.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement