Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

DLF sold 795 apartments in its new luxury housing project with in three days in Gurugram
మూడు రోజుల్లో 795 ఫ్లాట్లు అమ్మిన డీఎల్‌ఎఫ్‌.. ఎక్కడంటే..

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్‌ మూడు రోజుల్లోనే గురుగ్రామ్‌లో రూ.5,590 కోట్ల విలువైన 795 లగ్జరీ ఫ్లాట్లు విక్రయించింది. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం..డీఎల్‌ఎఫ్‌ గురుగ్రామ్‌లో 'డీఎల్‌ఎఫ్‌ ప్రివానా వెస్ట్' అనే కొత్త ప్రాజెక్ట్‌ ప్రారంభించింది. ఇందులో భాగంగా లగ్జరీ ఫ్లాట్‌లను నిర్మించారు.ఫ్లాట్ల అమ్మకాలు ప్రారంభించిన మూడు రోజుల్లోనే మొత్తం 795 ఫ్లాట్‌లు విక్రయించారు. వాటి విలువ రూ.5,590 కోట్లుగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను 116 ఎకరాల డీఎల్‌ఎఫ్‌ టౌన్‌షిప్‌లో భాగంగా 12.57 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థ గతంలో ప్రివానా సౌత్‌లో నిర్మించిన 1,113 ఫ్లాట్లను మూడురోజుల్లో విక్రయించి రూ.7,200 కోట్లు సమకూర్చుకుంది.ఇదీ చదవండి: సిక్‌ లీవ్‌ తీసుకున్న ఉద్యోగుల తొలగింపుడీఎల్‌ఎఫ్‌ హోమ్ డెవలపర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్‌ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాష్ ఓహ్రి మాట్లాడుతూ..ఫ్లాట్ల విక్రయానికి సంబంధించి వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు సంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని ఎక్కువగా ఎన్‌ఆర్‌ఐలే కొనుగోలు చేసినట్లు తెలిపారు.

AirIndia terminated 25 employees for their failure to report to work after sick leave
సిక్‌ లీవ్‌ తీసుకున్న ఉద్యోగుల తొలగింపు

టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగులపై కొరడా ఝుళిపించింది. ముకుమ్మడిగా సిక్‌ లీవ్‌ తీసుకున్న ఉద్యోగులను తొలగించింది. సెలవు అనంతరం తిరిగి ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్‌ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇటీవల ఉద్యోగులు విధులకు రాకపోవడంతో బుధవారం సంస్థ దాదాపు 80కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ చర్యకు కారణమైన 25 మంది క్యాబిన్‌ సిబ్బందిపై చర్యలు తీసుకుంది.‘సిక్‌లీవ్‌ అనంతరం 25 మంది ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్‌ చేయడంలో విఫలయ్యారు. వారితీరు వల్ల విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ లిమిటెడ్‌ ఎంప్లాయిస్‌ సర్వీస్‌ రూల్స్‌ను పాటించనందుకు వారిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే వారి ఉద్యోగాలు తొలగించాం’ అని టర్మినేషన్‌ లేటర్‌లో కంపెనీ తెలిపింది.బుధవారం విమాన సర్వీసుల్లో కలిగిన అంతరాయం తర్వాత సంస్థ సీఈఓ అలోక్ సింగ్ స్పందించారు. ఉద్యోగులకు ఏదైనా సమస్యలుంటే క్యాబిన్ సిబ్బందితో చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎయిర్‌లైన్ రాబోయే కొద్ది రోజుల పాటు విమానాలను తగ్గిస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..ఇదిలాఉండగా, ఎయిరిండియా వైఖరిపట్ల సిబ్బంది అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను ఎయిర్‌ఏషియా ఇండియాతో విలీనం చేయడం వల్ల సిబ్బంది జీతాలు దాదాపు 20 శాతం తగ్గాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ కెకె విజయ్‌కుమార్ మాట్లాడుతూ..ఎయిరేషియాతో విలీనానికి ముందు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పరిహారంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ విలీనంతో ఉద్యోగులకు రావాల్సిన అలవెన్సులు పూర్తిగా తొలగించబడ్డాయన్నారు. దాంతో భారీగా జీతాలు తగ్గాయని చెప్పారు. సంస్థ నిర్వహణలో లోపాలున్నాయని, సిబ్బంది పట్ల సమానత్వం కరవైందని యూనియన్ గతంలో దిల్లీలోని రీజినల్ లేబర్ కమిషనర్‌కు, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాసింది.

Stock Market Rally On Today Opening
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 22,256కు చేరింది. సెన్సెక్స్‌ 162 పాయింట్లు తగ్గి 73,287 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 83.8 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.03 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 0.18 శాతం దిగజారింది.బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ప్రైవేట్‌ బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. సార్వత్రిక ఎన్నికల 3 దశల్లో ఓటింగ్‌శాతం తక్కువగా నమోదైందనే వార్తల నడుమ, విదేశీ అమ్మకాలు కొనసాగడమూ ఇందుకు తోడైంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన ‘బీఓబీ వరల్డ్‌’ యాప్‌ ద్వారా కొత్త వినియోగదారులను చేర్చుకోకుండా గతంలో విధించిన ఆంక్షలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం తొలగించింది. నియంత్రణపరమైన ఉల్లంఘనల కారణంగా 2023 అక్టోబరు 10న ఈ ఆంక్షలను ఆర్‌బీఐ విధించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Tata Power profit rises 11 pc to 1000 crore
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం

న్యూఢిల్లీ: టాటా పవర్‌ చివరి త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ నికర లాభం 11% పుంజుకుని రూ. 1,046 కోట్ల ను తాకింది. మొత్తం ఆదాయం రూ. 13,325 కోట్ల నుంచి రూ. 16,464 కోట్లకు జంప్‌చేసింది. షేరుకి రూ. 2 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది.ఇందుకు జులై 4 రికార్డ్‌ డేట్‌. పూర్తి ఏడాదికి టాటా పవర్‌ నికర లాభం రూ. 3,810 కోట్ల నుంచి రూ. 4,280 కోట్లకు బలపడింది. ఆదాయం సైతం రూ. 56,547 కోట్ల నుంచి రూ. 63,272 కోట్లకు ఎగసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికం.కంపెనీ ప్రకటన ప్రకారం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.4 లక్షల కోట్లను అధిగమించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 61,542 కోట్ల అత్యధిక ఆదాయాన్ని, రూ. 12,701 కోట్ల ఎబిటాను సాధించింది.

World Migration Report 2024: India received over 111 billion dollers in remittances in 2022
World Migration Report 2024: భారత్‌కు మనవాళ్ల డబ్బేడబ్బు

ఐక్యరాజ్యసమితి: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి తమ సంపాదనను పంపడంలో (రెమిటెన్స్‌) రికార్డు సృష్టించారు. భారత్‌కు ఈ తరహా నిధులు 2022లో 111.22 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. దీనితో ఇంత భారీ స్థాయిని అందుకున్న తొలి దేశంగా భారత్‌ రికార్డులకు ఎక్కింది. నిజానికి రెమిటెన్సులు 100 బిలియన్‌ డాలర్లు దాటిన తొలి దేశంగా కూడా భారత్‌ నిలిచింది. ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ (ఐఓఎం) ఈ మేరకు విడుదల చేసిన వరల్డ్‌ మైగ్రేషన్‌ రిపోర్ట్‌ 2024లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... » రెమిటెన్సులకు సంబంధించి భారత్‌ తరువాతి నాలుగు స్థానాల్లో మెక్సికో(61 బిలియన్‌ డాలర్లు), చైనా (51 బిలియన్‌ డాలర్లు), ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్‌ నిలిచాయి. 2021లో చైనా స్థానాన్ని 2022లో మెక్సికో అధిగమించింది. » దక్షిణాసియా నుంచి చాలా పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఉన్నందున ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్స్‌కు సంబంధించి అతిపెద్ద మొత్తాలను పొందుతోంది. దక్షిణాసియాలో భారత్‌తోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు రెమిటెన్సులకు సంబంధించి టాప్‌–10 దేశాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ 30 బిలియన్‌ డాలర్లతో ఆరవ స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్‌ 21.5 బిలియన్‌ డాలర్లతో ఎనిమిదవ స్థానంలో నిలుస్తోంది. » 44.8 లక్షల మంది వలసదారుల గమ్యస్థాన దేశంగా భారతదేశం 13వ స్థానంలో నిలిచింది. » విద్యార్థులను ఆకర్షించడంలో తొలి దేశంగా అమెరికా (8,33,000) ఉంది. తరువాతి స్థానాల్లో బ్రిటన్‌ (దాదాపు 6,01,000), ఆస్ట్రేలియా (దాదాపు 3,78,000), జర్మనీ (3,76,000 పైగా), కెనడా (దాదాపు 3,18,000) ఉన్నాయి.భారత్‌ పయనమిలా... (అంకెలు బిలియన్‌ డాలర్లలో) 2010 53.48 2015 68.91 2020 83.15 2022 111.22

RBI lifts restrictions on Bank of Baroda app
ఇక ఆ బ్యాంక్‌ యాప్‌ వాడుకోవచ్చు.. ఆర్‌బీఐ ఊరట

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ)పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ ఆర్‌బీఐ ఊరట కలిగించింది. బీవోబీ వరల్డ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు తాజాగా బీవోబీకు అనుమతినిచ్చింది.బీవోబీ వరల్డ్‌ యాప్‌ ద్వారా వినియోగదార్లను చేర్చుకోరాదంటూ 2023 అక్టోబర్‌ 10న ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. వర్తించే మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా వినియోగదార్లను చేర్చుకుంటామని బీవోబీ తెలిపింది.'బీవోబీ వరల్డ్' యాప్ అనేది పెద్ద సంఖ్యలో కస్టమర్‌ల కోసం ఒక ప్రాథమిక ఛానెల్, వీడియో కేవైసీ ద్వారా ఖాతా తెరవడాన్ని సులభతరం చేస్తుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఓ మొబైల్ బ్యాంకింగ్ ఛానెల్‌ని ఆర్‌బీఐ నిషేధించడం ఇదే తొలిసారిగా నిలిచింది. ఈ నెల ప్రారంభంలో, కొత్త కస్టమర్లను డిజిటల్‌గా ఆన్‌బోర్డ్ చేయకుండా కోటక్ బ్యాంక్‌ను కూడా ఆర్‌బీఐ నిషేధించింది.

TCS Employee Suspended
ఉద్యోగుల తొలగింపు..టీసీఎస్‌లో అసలేం జరుగుతోంది?

ప్రముఖ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ ఉద్యోగుల తొలగింపు మరోసారి చర్చకు దారి తీసింది. గతేడాది ‘లంచాలకు ఉద్యోగాలు’ కుంభకోణంలో పలువురికి ఉద్వాసన పలకగా.. తాజాగా భద్రత పేరుతో అనుమానం ఉన్న ఉద్యోగుల్ని తొలగించడం టెక్‌ విభాగంలో చర్చాంశనీయంగా మారింది. భద్రత పేరుతో టీసీఎస్‌ తమను ఉద్యోగాల నుంచి తొలగించిందంటూ పలువురు ఉద్యోగులు సోషల్‌ మీడియాలో వాపోతున్నారు.రెడ్డిట్‌ పోస్ట్‌ల ప్రకారం.. లేఆఫ్స్‌ ఇచ్చిన ఉద్యోగులు వ్యక్తిగత ల్యాప్‌ట్యాప్‌లను ఉపయోగించి వారి సున్నితమైన లాగిన్‌ క్రెడిన్షియల్స్‌ను షేర్‌ చేశారని, భద్రత దృష్ట్యా వారిని తొలగించినట్లు మేనేజర్‌ ఆరోపిస్తున్నట్లు సదరు బాధిత ఉద్యోగులు రెడ్డిట్‌ పోస్ట్‌లో తెలిపారు. I got suspended from tcs today because of a security incident which was reported by me byu/Personal_Stage4690 indevelopersIndia తమను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించినప్పుడల్లా క్లయింట్ అడ్రస్‌లు షేర్‌ చేయడం, వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడం, వాట్సాప్‌లో కమ్యూనికేట్ చేయడం ఇలా ప్రతిదానిపై నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఉద్యోగుల తొలగింపులపై టీసీఎస్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. I got suspended from tcs today because of a security incident which was reported by me byu/Personal_Stage4690 indevelopersIndia

New Study Finds People Are Breathing In Cancer Causing Chemicals In Their Cars
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?

మీరు కార్లలో ప్రయాణిస్తున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత‍్త. ప్రయాణికులు కార్ల నుంచి వెదజల్లే క్యాన్సర్ కారక రసాయనాలను పీల్చుకుంటున్నారంటూ సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది.అమెరికా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ విభాగానికి చెందిన నేషనల్‌ టాక్సాలజీ ప్రోగ్రామ్‌ (ఎన్‌టీపీ) కార్ల గురించి ద్రిగ్భాంతికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది.2015 నుంచి 2022 మధ్యఎన్‌టీపీ పరిశోధకులు 2015 నుంచి 2022 మధ్య 101 ఎలక్ట్రిక్, గ్యాస్, హైబ్రిడ్ కార్ల క్యాబిన్ ఎయిర్‌పై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో 99 శాతం కార్లలో అగ్నిప్రమాదాల్ని నివారించే టీసీఐపీపీ (అంటే ట్రిస్(1-క్లోరో-2-ప్రొపైల్) ఫాస్ఫేట్) అనే రసాయనం ఉందని పరిశోధకులు గుర్తించారు. దీంతో పాటు క్యాన్సర్‌ కారకాలైన టీడీసీఐపీపీ, టీసీఈపీ అనే రసాయనాలు ఉన్నట్లు నిర్ధారించారు.ఎలాంటి ప్రయోజనం లేదనితాజా అధ్యయనంపై ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ (యూఎస్‌ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్) స్పందించింది. వాహనాల లోపల వెదజల్లే ఫైర్‌ రిటార్డెంట్ రసాయనాల ప్రమాణాలను అప్‌డేట్‌ చేయాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు అమెరికా హెల్త్‌ విభాగం జరిపిన అధ్యయనంలో కార్లలో అన్వేక కారణాల వల్ల వ్యాపించే మంటల్ని అదుపుచేసే రసాయనాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పరిశోధకలు స్పష్టం చేశారు. ఇదొక్కటే పరిష్కారంగ్రీన్ సైన్స్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ సీనియర్ శాస్త్రవేత్త లిడియా జాహ్ల్ మాట్లాడుతూ.. కార్లలో ప్రయాణించే సమయంలో కిటికీలు తెరవడం, నీడలో లేదా గ్యారేజీలలో పార్కింగ్ చేయడం ద్వారా కార్ల నుంచి రసాయనాల నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు.

Stock Market Trend On Today Closing
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 22,306 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 19 పాయింట్లు నష్టపోయి 73,492 వద్దకు చేరింది.సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ, మారుతీ సుజుకీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ, నెస్లే, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ ఫార్మా, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, టీసీఎస్‌ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Microsoft buys 48 acre land in Hyderabad estimated worth 267 crore
హైదరాబాద్‌లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్‌!

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో భారీ విస్తీర్ణంలో భూమిని కొనుగోలు చేసింది. 48 ఎకరాల భూమిని రూ. 267 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రాప్‌స్టాక్‌కు లభించిన పత్రాల ద్వారా తెలిసింది.ఏప్రిల్ 18న సేల్ డీడ్ రిజిస్టర్ అయినట్లు డాక్యుమెంట్లను బట్టీ తెలుస్తోంది. హైదరాబాద్‌ సమీపంలోని రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఉన్న భూమిని ఎకరం సుమారు రూ. 5.56 కోట్లు పెట్టి కొన్నట్లు సమాచారం. ల్యాండ్ అగ్రిగేటర్ సాయి బాలాజీ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఈ డీల్‌ జరిగినట్లు తెలుస్తోంది.అయితే దీనిపై మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి అధికారిక సమాచారం రాలేదు. మీడియా నివేదికల ప్రకారం, 2022లో, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌ను స్థాపించడానికి హైదరాబాద్‌లో సుమారు రూ. 275 కోట్లకు మూడు ల్యాండ్ పార్సెల్‌లను కొనుగోలు చేసింది.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 1 Kg 88700.00 200.00
Gold 22K 10gm 66150.00 -100.00
Gold 24k 10 gm 72160.00 -100.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement