Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Heavyweights pull down Nifty for third day: Sensex down 384 points
బ్లూచిప్స్‌కు అమ్మకాల షాక్‌

ముంబై: అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(1%), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (1.25%) ఐసీఐసీఐ బ్యాంక్‌(1.50%) షేర్ల పతనంతో స్టాక్‌ సూచీలు మంగళవారం అరశాతం నష్టపోయాయి. సెన్సెక్స్‌ 384 పాయింట్లు పతనమై 73,512 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు క్షీణించి 22,303 పాయింట్ల వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి.అయితే దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలలో తక్కువ ఓటింగ్‌ శాతం నమోదవుతుండటం, మార్కెట్లలో ప్రీమియం వాల్యుయేషన్ల ఆందోళనలతో ఇన్వెస్టర్లు లాభాల పలు కీలక రంగాల రంగాల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఒక దశలో సెన్సెక్స్‌ 636 పాయింట్లు క్షీణించి 73,259, నిఫ్టీ 211 పాయింట్లు పతనమై 22,232 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 2%, 1.65% చొప్పున నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లు రాణించాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. సూచీల వారీగా రియల్టీ 3.50%, యుటిలిటీస్‌ 3%, కమోడిటీస్, వినిమయ, టెలికం, ప్రభుత్వరంగ బ్యాంకులు 2.50% క్షీణించాయి. ప్రైవేట్‌ బ్యాంకులు, ఆటో, మెటల్, ఇంధన ఇండెక్సులు రెండుశాతం చొప్పున నష్టపోయాయి.  శనివారం (మే18న) ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ ప్రాథమిక సైట్‌లో ఏమైనా లోపాలు లేదా అంతరాయాలు తలెత్తితే ఎదుర్కొనే సన్నద్ధతను పరీక్షించేందుకు శనివారం(మే 18న) ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్‌ విభాగాల్లో ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ను నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు తెలిపాయి. ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటల వరకు తొలి సెషన్‌ ప్రధాన ప్రాథమిక సైట్‌లో.., ఉదయం 11.30 నుంచి 12.30 మధ్య మరో సెషన్‌ డిజార్టర్‌ రికవరీ సైట్‌లో ట్రేడింగ్‌ జరగనుంది. అన్ని సెక్యూరిటీస్, డెరివేటివ్‌ ఉత్పత్తులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి. గరిష్ట పరిమితిని 5 శాతంగా నిర్ణయించాయి. ఎక్సే్చంజీలు ఈ తరహా ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ను ఈ మార్చి 2న నిర్వహించాయి.ట్రేడింగ్‌ వేళల పెంపునకు నో ఎన్‌ఎస్‌ఈ ప్రతిపాదనకు సెబీ చెక్‌  ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో ట్రేడింగ్‌ వేళల పెంపు ప్రతిపాదనను క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ చేసిన ప్రతిపాదనకు సెబీ తాజాగా నో చెప్పింది. ఈ అంశంపై స్టాక్‌ బ్రోకర్ల నుంచి ఎలాంటి స్పందన లభించకపోవడంతో సెబీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. దశలవారీగా ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో లావాదేవీలు చేపట్టే వేళలను పెంచమంటూ ఎన్‌ఎస్‌ఈ.. సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఇందుకు స్టాక్‌ బ్రోకర్ల అభిప్రాయాలను కోరినప్పటికీ స్పందన లభించకపోవడంతో సెబీ దరఖాస్తును తిప్పిపంపినట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది.వెరసి ప్రస్తుతానికి ట్రేడింగ్‌ వేళల పెంపు ప్రతిపాదన వీగిపోయినట్లేనని తెలియజేసింది. ప్రపంచ మార్కెట్ల నిరంతర సమాచారం కారణంగా తలెత్తే ఓవర్‌నైట్‌ రిస్‌్కలను తగ్గించుకునేందుకు వీలుగా ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్‌ వేళల పెంపు ప్రతిపాదనకు తెరతీసింది. రోజువారీ(ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30వరకూ) సెషన్‌ ముగిశాక కమోడిటీ డెరివేటివ్స్‌ తీరులో సాయంత్రం 6–9 మధ్య ట్రేడింగ్‌కు గతేడాది సెపె్టంబర్‌లో ప్రతిపాదించినట్లు ఎన్‌ఎస్‌ఈ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ చీఫ్‌ శ్రీరామ్‌ కృష్ణన్‌ పేర్కొన్నారు. తదుపరి స్టాక్‌ బ్రోకర్ల స్పందననుబట్టి క్రమంగా రాత్రి 11.55 వరకూ పొడిగించేందుకు యోచించినట్లు తెలియజేశారు.

Anant Sharma Slams City Infra And Weather
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్‌ అసహనం

దేశాన్ని విడిచి వెళ్లాలా? అంటూ బెంగళూరు ఇన్ఫ్రా, వాతావారణంపై ఆంత్రప్రెన్యూర్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీశాయి.  ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన బెంగళూరు ఇప్పుడు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొటోంది. ఈ తరుణంలో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మోమో మీడియా కో-ఫౌండర్‌, క్రియేటీవ్‌ హెడ్‌ అనంత్‌ శర్మ బెంగళూరు నగరంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.బెంగళూరులో మౌలిక సదుపాయాలు, వాతావరణం, నీటి సమస్యపై ఎక్స్‌ వేదికపై అనంత్‌ శర్మ స్పందించారు. శర్మ తాను ముంబై లేదా పూణే షిఫ్ట్‌ అవ్వడం మంచిదా లేకా దేశం విడిచిపెట్టి వెళ్లడం మంచిదా అంటూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.   Bangalore looks like it's gonna go to the dogs in another 5 years with bad infra bad weather and bad water. Is Mumbai or Pune worth shifting to or should I just leave India?— Anant (@AnantNoFilter) May 3, 2024‘బాడ్ ఇన్‌ఫ్రా, బ్యాడ్‌ వెదర్‌, బ్యాడ్‌ వాటర్‌. నేను ముంబై లేదా పూణేకు షిఫ్ట్‌ అవ్వాలా? లేదా? దేశం విడిచి వెళ్లాలా? అంటూ నెటిజన్ల అభిప్రాయాల్ని కోరారు.  అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఎక్కువ మంది నెటిజన్లు తన అభిప్రాయంతో ఏకీభవించారు. కొందరు మరో ప్రాంతానికి షిఫ్ట్‌ అవ్వండి అంటూ సలహా ఇస్తే.. మరికొందరు మాత్రం బెంగళూరులో సానుకూల అంశాలను చర్చించారు.  మీకు ఆర్థిక స్థోమత ఉంటే వదిలేయండి అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయగా.. బెంగుళూరుతో ఉన్న వ్యవస్థాగత సమస్య ఏమిటంటే ప్రజలు దీనిని వలస నగరంగా భావించడం. ఓటు బ్యాంకుగా మారితే తప్ప నగరాన్ని మార్చాలని ఎవరూ కోరుకోరని నిట్టూర్చాడు. 

Techie Got Promoted in April Now She Loss Job
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన

అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా కంపెనీలో సుమారు ఏడు సంవత్సరాలు పనిచేసిన ఓ ఉద్యోగిని ఒక్క ఈమెయిల్‌తో తొలగించినట్లు వెల్లడించింది.దాదాపు ఏడేళ్ల పాటు ఎంతో నమ్మకంగా పని చేసిన తన సోదరి లేఆఫ్‌కి గురైన తీరుపై ఆమె సోదరుడు జతిన్ సైనీ లింక్డిన్‌లో పోస్ట్ చేశారు. ఇందులో గత నెలలోనే ఆమె ప్రమోషన్ (పదోన్నతి) పొందినట్లు పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన తరువాత వారు న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్‌కు మకాం మార్చాలని కూడా అనుకున్నట్లు పేర్కొన్నారు.రోజు మాదిరిగానే జతిన్ సైనీ సోదరి మే 3న ఆఫీసుకు వెళ్తే తన కార్డు పనిచేయకపోవడాన్ని గమనించి విస్తుపోయింది. ఆశలన్నీ ఆవిరైపోవడంతో ఆమె చాలా బాధపడింది. ఆమెను మాత్రమే కాకుండా ఆమె టీమ్‌లో ఉండే దాదాపు 73 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఏడు సంవత్సరాలు ఎంతో నమ్మకంగా పనిచేసినప్పటికీ ఒక్క మైయిల్ పంపి తీసివేయడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది.పోస్ట్ చివరలో.. జతిన్ సైనీ తన సోదరి ఉద్యోగాన్ని కోల్పోవడంతో కార్పొరేట్ నిర్ణయాల వెనుక ఉన్న విలువలను గురించి వెల్లడించారు. టెస్లాలో ఏడు సంవత్సరాలు పనిచేస్తే.. కష్టాన్ని ఏ మాత్రం గుర్తించకుండా ఇప్పుడు బయటకు పంపారు. శ్రమ మొత్తం సున్నా అయిపోయిందని అన్నారు.టెస్లా కంపెనీ ఏప్రిల్ నెలలో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతం కంటే ఎక్కువమందిని తొలగించింది. గ్లోబల్ మార్కెట్లో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కారణంగా ఇప్పటికి నాలుగు సార్లు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. దీంతో టెస్లాలో ఉద్యోగం గాల్లో దీపంలాగా అయిపోయింది.

Andhra Pradesh Creates New Record In Blue Economy Exports
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న ఆంద్రప్రదేశ్ 'బ్లూ ఎకానమీ' (ఓషన్ ఎకానమీ)లో కూడా ఓ కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే కోస్తాంధ్రలోని ప్రతి 50 కిలోమీటర్లకు ఓడరేవు, ఫిష్ ల్యాండర్లు, ఫిషింగ్ హోరోబర్‌లలో ఏదో ఒకదాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఆంధ్రప్రదేశ్ రెండవ అతిపెద్ద తీరప్రాంతాన్ని కలిగి ఉండటం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం బ్లూ ఎకానమీపై దృష్టి సారించింది. ఇప్పటికే వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం 4 కొత్త ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను నిర్మించింది. ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను ఎక్కడ నిర్మించారు. వాటికైన ఖర్చు వివరాలు కింద గమనించవచ్చు.ఓడరేవులురామాయపట్నం పోర్టు: రూ. 3,736.14 కోట్లుమచిలీపట్నం పోర్టు: రూ. 5,115.73 కోట్లుమూలపేట పోర్టు: రూ. 4,361.91 కోట్లుకాకినాడ గేట్‌వే పోర్ట్: రూ. 2,123.43 కోట్లుఫిషింగ్ హార్బర్‌లుజువ్వాలదిన్నె: రూ. 288.80 కోట్లునిజాంపట్నం: రూ. 451 కోట్లుమచిలీపట్నం: రూ. 422 కోట్లుఉప్పాడ: రూ. 361 కోట్లుబుడగట్లపాలెం: రూ. 365.81 కోట్లుపూడిమడక: రూ. 392.53 కోట్లుబియ్యపుతిప్ప: రూ. 428.43 కోట్లువొడరేవు: రూ. 417.55 కోట్లుకొత్తపట్నం: రూ. 392.45 కోట్లుమంచినీళ్లపేట: అప్‌గ్రేడేషన్ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలుచింతపల్లి: రూ. 23.74 కోట్లుభీమిలి: రూ. 24.86 కోట్లురాజయ్యపేట: రూ. 24.73 కోట్లుదొండవాక: రూ. 23.90 కోట్లుఉప్పలంక: రూ. 5.74 కోట్లురాయదరువు: రూ. 23.90 కోట్లువైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్మించిన ఈ కేంద్రాల వల్ల ఎంతోమంది ఉపాధి పొందగలిగారు. పోర్ట్‌లు ద్వారా 75000 కంటే ఎక్కువమంది ఉపాధి పొందారు. ఫిషింగ్ హార్బర్‌ల ద్వారా 65000 కంటే ఎక్కువ, ఫిష్ ల్యాండర్ల ద్వారా 39000 కంటే ఎక్కువమంది ఉపాధి అవకాశాలను పొందగలిగారు.ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఎగుమతులు కూడా పెరిగాయి. ఎగుమతుల్లో 12వ సంఖ్య దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ కేంద్రాల నిర్మాణం తరువాత ఆరో స్థానానికి చేరింది. 2014-19లో ఎగుమతుల విలువ రూ. 90829 కోట్లు, కాగా 2019-23 మధ్య రూ. 159368 కోట్లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బ్లూ ఎకానమీలో రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Tesla Job Cuts Continue, Company Sends Layoff Notice To More Employees
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు

అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే గత వారం ఇలాన్ మస్క్ (Elon Musk) టెస్లాలో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.ఇటీవల టెస్లా తొలగించిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు సూపర్‌చార్జర్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్‌గా పని చేస్తున్న 'రెబెక్కా టినుచీ', మరొకరు న్యూ వెహికల్ ప్రోగ్రామ్ హెడ్ 'డేనియల్ హో' ఉన్నారు. వీరితో పాటు ప‌లువురు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు పేర్కొన్నారు. త‌మ‌కు అందిన ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను లింక్డిన్‌లో షేర్ చేయ‌డంతో ఈ వివ‌రాలు వెలుగులోకి వచ్చాయి.టెస్లా సీఈఓ మస్క్ ఏప్రిల్ 14న కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతానికంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రిక్రూట్‌మెంట్, మార్కెటింగ్, సూపర్‌చార్జింగ్ టీమ్‌తో సహా వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. ఒక్క సూపర్‌చార్జింగ్ టీమ్‌లోనే సుమారు 500 మంది ఉద్యోగాలను తొలగించినట్లు సమాచారం.ఇప్పటికే మూడు సార్లు లేఆప్స్ ప్రకటించిన టెస్లా మరోమారు ఉద్యోగులను తొలగించడానికి పూనుకుంది. దీంతో ఉద్యోగుల్లో లేఆప్స్ భయం నిండిపోయింది. కంపెనీ ఉద్యోగులను తగ్గించడానికి ప్రధాన కారణం.. అంచనాల కంటే తక్కువ డెలివరీ సంఖ్యలు నమోదు చేయడమనే తెలుస్తోంది.

Stock Market Rally On Today closing
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 141 పాయింట్లు నష్టపోయి 22,301 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 383 పాయింట్లు దిగజారి 73,511 వద్దకు చేరింది.సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌యూఎల్‌, టెక్‌మహీంద్రా, నెస్లే, విప్రో, టీసీఎస్‌, ఐటీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, ఎం అండ్‌ ఎం, యాక్సిస్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, సన్‌ఫార్మా కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

McAfee Deepfake Detector tool will soon be available more languages in the coming months
డీప్‌ఫేక్‌ టెక్నాలజీకోసం ఇంటెల్‌తో జతకట్టనున్న ప్రముఖ కంపెనీ

యూఎస్‌ ఆధారిత సైబర్ సెక్యూరిటీ కంపెనీ మెకాఫీ అమెరికన్ చిప్ తయరీ సంస్థ ఇంటెల్ సహకారంతో డీప్‌ఫేక్ డిటెక్షన్ టెక్నాలజీను రూపొందిస్తుంది. మీడియా సంస్థల కథనం ప్రకారం.. మెకాఫీ డీప్‌ఫేక్ డిటెక్టర్ సింథటిక్ కంటెంట్‌ను గుర్తించడానికి  ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌లలోని న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (ఎన్‌పీయూ)ను వాడుకుంటూ ఏఐ అల్గారిథమ్‌లను అమలు చేస్తుంది.డీప్‌ఫేక్‌ ప్రాసెసింగ్ కోసం వ్యక్తిగత డేటాను క్లౌడ్‌కు పంపాల్సిన అవసరం లేకుండా విశ్లేషణ మొత్తం డివైజ్‌లోనే జరుగుతుందని మెకాఫీ తెలిపింది. ఈ ప్రక్రియ వినియోగదారు గోప్యతకు ప్రధాన్యం ఇస్తుందని చెప్పింది. ఈ టెక్నాలజీ పనితీరును 300 శాతం మెరుగుపరిచేలా కొత్త విధానం ఉపయోగపడుతుందని తెలిపింది. రానున్న కొన్ని నెలల్లో డీప్‌ఫేక్‌ సంబంధించిన వీడియోలను కనుగొనేందుకు మరిన్ని ల్యాంగ్వేజీలను వినియోగించనున్నట్లు చెప్పింది.మెకాఫీ డీప్ ఫేక్ డిటెక్టర్‌ ఏఐ ఆధారిత డిటెక్షన్‌ టెక్నిక్‌లను వినియోగిస్తుంది. ఏఐ ట్రాన్స్‌ఫామ్‌ ఆధారిత ‘డీప్ న్యూరల్ నెట్‌వర్క్’ మోడల్‌లతో ఇది పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా మెకాఫీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ స్టీవ్ గ్రోబ్‌మాన్ మాట్లాడుతూ..‘ఇంటెల్‌తో కలిసి పనిచేయడం గొప్పఅనుభవాన్నిస్తుంది. ఏఐ రూపొందించిన డీప్‌ఫేక్‌ల్లో నకిలీ వాటిని గుర్తించేలా కొత్త టెక్నాలజీను వాడుతున్నాం. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ టెక్నాలజీకు చెందిన ఎన్‌పీయూను ఉపయోగిస్తున్నాం. దాంతో వినియోగదారులకు శక్తివంతమైన ఏఐ డీప్‌ఫేక్ డిటెక్షన్ సామర్థ్యాలను అందించనున్నాం’ అన్నారు.

 Gold Rate Today In India
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?

దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. మంగళవారం పసిడి ధర మరోసారి పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.300, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.330 పెరిగింది.దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయిహైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380గా ఉందివిజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందివైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందిబెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందిచెన్నైలో  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,430 గా ఉందిముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందిఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందికోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉంది 

Apple Let Loose Ipad Launch Event Today
మరికొన్ని గంటల్లో యాపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’

టెక్‌ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఈవెంట్‌ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.ఈ ఏడాది తొలిసారి యాపిల్‌ సంస్థ ఏప్రిల్‌ 7న ‘లెట్‌ లూస్‌’ ఈవెంట్‌లో కొత్త ఐపాడ్‌లపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. ఓల్‌ఈడీ ఐపాడ్‌ ప్రో, ఐపాడ్‌ ఎయిర్స్‌ను లాంచ్‌ చేయనుందని సమాచారం. టెక్‌ దిగ్గజం లాంచ్‌ చేయనున్న కొత్త ఐపాడ్‌ ప్రో తరహాలో మాక్‌ బుక్‌ ప్రో సైతం మరింత పవర్ఫుల్‌గా ఉండనుంది.యాపిల్‌ లెట్‌ లూస్‌ ఈవెంట్‌లో ప్రత్యేకతలు లెట్‌ లూస్‌ ఈవెంట్‌లో యాపిల్‌ సంస్థ విడుదల చేయనున్న ఐపాడ్‌ ప్రోలో ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక చెబుతోంది. అంతేకాదు బెటర్‌ బ్రైట్‌నెస్‌, కాంట్రాస్ట్‌, కలర్‌ ఆక్యురెన్స్‌ సైతం అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ యూజర్లకు వినియోగం మరింత సులభం కానుందనే నివేదిక హైలెట్‌ చేసింది.  స్క్రీన్ అప్‌గ్రేడ్‌తో పాటు కొత్త ఐపాడ్ ప్రో మోడల్‌లు ఓల్డ్‌ మోడళ్ల కంటే సన్నగా ఉండనుందని అంచనా. 12.9 అంగుళాల మోడల్‌కు 20 శాతం, 11 అంగుళాల మోడల్‌కు 15 శాతం వరకు సైజ్‌ తగ్గుతుంది.  ఐపాడ్‌ ప్రోలో ఎం4 చిప్‌యాపిల్‌ నెక్ట్స్‌ జనరేషన్‌ ఎం4 చిప్‌ని ఐపాడ్‌ ప్రోలో అప్‌డేట్‌ చేయనుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో ప్రస్తుత ఎం3 చిప్ కంటే గణనీయమైన పనితీరు, సామర్థ్యం సైతం పెరగనుందని టెక్‌ లవర్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఊహానాల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న యాపిల్‌ లెట్‌ లూస్‌ ఈవెంట్‌లో స్పష్టత రానుంది.   యాపిల్ లెట్ లూస్ ఐప్యాడ్ లాంచ్‌ను ఎలా చూడాలిఇక  మే 7న యాపిల్‌ లెట్ లూస్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌ను యూట్యూబ్‌, యాపిల్‌.కామ్‌, యాపిల్‌ టీవీలో వీక్షించవచ్చు.

Rekha Jhunjhunwala lost over Rs800 crs on Monday as the shares of the Titan big decline
Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు చెందిన టైటన్ కంపెనీ షేర్లు  సోమవారం భారీగా క్షీణించడంతో రూ.800 కోట్లకు పైగా సంపద నష్టపోయారు.టాటా గ్రూప్ కంపెనీ అయిన టైటన్ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా ​కుటుంబానికి భారీగా సంపద సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్ల అంచనాలకు అందుకోకపోవడంతో మదుపరులు సోమవారం భారీగా నష్టపోవాల్సి వచ్చింది. రేఖా మార్చి 31, 2024 నాటికి టైటన్‌లో 5.35 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలిసింది. శుక్రవారం ముగింపు నాటికి ఆమె వద్ద ఉన్న షేర్ల విలువ రూ.16,792 కోట్లుగా ఉంది.త్రైమాసిక ఆదాయాలు ఆశాజనకంగా లేకపోవడంతో సోమవారం షేరు ధర 7 శాతం పడిపోయింది. షేర్‌ రూ.3,352.25 కనిష్ట స్థాయిని తాకింది. బీఎస్‌ఈలో రూ.3,281.65 వద్ద ముగిసింది. దాంతో కంపెనీ నికర విలువ రూ.3 లక్షల కోట్ల మార్క్ కంటే దిగువకు పడిపోయింది. ఫలితంగా కంపెనీ మార్కెట్‌ విలువ రూ.2,91,340.35 కోట్లకు చేరింది. సోమవారం ఒక్కరోజే కంపెనీ విలువలో దాదాపు రూ.22,000 కోట్లకు పైగా సంపద తుడిచి పెట్టుకుపోయింది.ఇదీ చదవండి: గూగుల్‌, ఓపెన్‌ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్‌ తయారీటైటన్‌ కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.771 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.736 కోట్ల కంటే ఇది 5% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.9419 కోట్ల నుంచి రూ.11,472 కోట్లకు పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ లాభం రూ.3496 కోట్లకు పెరిగింది. 2022-23లో ఈ మొత్తం రూ.3274 కోట్లు మాత్రమే. మొత్తం ఆదాయం కూడా రూ.38,675 కోట్ల నుంచి రూ.47,501 కోట్లకు పెరిగింది.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 100 gm 8750.00 100.00
Gold 22K 10gm 66050.00 200.00
Gold 24k 10 gm 72050.00 220.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement