Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Bombay High Court granted bail to Jet Airways founder Naresh Goyal for two months
నరేష్‌ గోయెల్‌కు బెయిల్‌ మంజూరు.. ఏం జరిగిందంటే..

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేష్‌ గోయెల్‌కు ముంబయి హైకోర్టు రెండు నెలలపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరుచేసింది. ఆయన భౌతిక, మానసిక ఆరోగ్యం బాగోలేదని గోయెల్‌ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) 2023 సెప్టెంబరులో తనను అరెస్టు చేసింది. తాజాగా బెయిల్‌ మంజూరు చేస్తున్న సమయంలో అనుమతి లేకుండా ముంబయిని విడిచి వెళ్లకూడదని, హామీ కింద రూ.లక్ష జమ చేయాలని ఆదేశించింది. దాంతోపాటు ఆయన పాస్‌పోర్టును కోర్టుకు సరెండర్‌ చేయాలని తెలిపింది.నరేశ్‌ గోయెల్‌ కొన్నిరోజుల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాంతో ఆ చికిత్స నిమిత్తం పలుమార్లు బెయిల్‌కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అందుకు కోర్టు నిరాకరించింది. జైలులోనుంచి బయటకు వెళ్లి సాక్ష్యాలను మారుస్తారని బెయిల్‌ ఇవ్వలేదని సమాచారం. మానవతా దృక్ఫథంతో తనకు బెయిలు మంజూరు చేయాలని గోయెల్‌ విజ్ఞప్తి చేస్తూనే వచ్చారు. ఆసుపత్రిలో గోయెల్‌ చికిత్స గడువును పొడిగిస్తే  ఈడీకి ఎటువంటి అభ్యంతరం లేదని తెలపడంతో బెయిల్‌ మంజూరు చేసినట్లు తెలసింది.ఇదీ చదవండి: ప్రభుత్వ యాప్‌లకు ప్రత్యేక లేబుల్‌..! కారణం..జెట్‌ ఎయిర్‌వేస్‌ అభివృద్ధి కోసం కెనరా బ్యాంకు ద్వారా గతంలో దాదాపు రూ.530 కోట్లు అప్పు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని సంస్థ వృద్ధికికాకుండా వ్యక్తిగత అవసరాలకు, ఇతరవాటికి వినియోగించారని తేలడంతో గోయెల్‌తోపాటు ఆయన భార్యను అరెస్టు చేశారు. అయితే తన భార్య ఆరోగ్యంరీత్యా బెయిల్‌ ఇచ్చారు.

Mutual fund stake in NSE-listed cos at all time high
ఫండ్స్‌ పెట్టుబడుల జోరు..

ముంబై: స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీలలో మ్యూచువల్‌ ఫండ్స్‌(ఎంఎఫ్‌లు) పెట్టుబడులు చరిత్రాత్మక గరిష్టానికి చేరాయి. మార్చితో ముగిసిన గతేడాది(2023–24) చివరి త్రైమాసికంలో లిస్టెడ్‌ కంపెనీలలో ఎంఎఫ్‌ల వాటా 9 శాతానికి ఎగసింది. ఇందుకు ఈ కాలంలో తరలివచి్చన రూ. 81,539 కోట్ల నికర పెట్టుబడులు దోహదపడ్డాయి. ప్రైమ్‌ డేటాబేస్‌ గ్రూప్‌ వివరాల ప్రకారం 2023 డిసెంబర్‌ చివరికల్లా ఈ వాటా 8.8 శాతంగా నమోదైంది. ఈ కాలంలో దేశీయంగా అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్‌ అయిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ వాటా 3.64 శాతం నుంచి 3.75 శాతానికి బలపడింది. ఎల్‌ఐసీకి 280 లిస్టెడ్‌ కంపెనీలలో 1 శాతానికిపైగా వాటా ఉంది. వెరసి ఎంఎఫ్‌లు, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలు, పెన్షన్‌ ఫండ్స్‌తోకూడిన దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(డీఐఐలు) వాటా మొత్తంగా 15.96 శాతం నుంచి 16.05 శాతానికి మెరుగుపడింది. ఇందుకు భారీగా తరలివచి్చన రూ. 1.08 లక్షల కోట్ల పెట్టుబడులు తోడ్పాటునిచ్చాయి.విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌.. 11ఏళ్ల కనిష్టం 2024 మార్చికల్లా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల వాటా 17.68 శాతానికి నీరసించింది. ఇది గత 11ఏళ్లలోనే కనిష్టంకాగా.. 2023 డిసెంబర్‌కల్లా 18.19 శాతంగా నమోదైంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీలలో డీఐఐలు, ఎఫ్‌పీఐల హోల్డింగ్‌(వాటాలు) మధ్య అంతరం చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఎఫ్‌పీఐలు డీఐఐల మధ్య వాటాల అంతరం 9.23 శాతానికి తగ్గింది. గతంలో 2015 మార్చిలో ఎఫ్‌పీఐలు, డీఐఐల మధ్య వాటాల అంతరం అత్యధికంగా 49.82 శాతంగా నమోదైంది. ఇది ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన 1,989 కంపెనీలలో 1,956 కంపెనీలను లెక్కలోకి తీసుకుని చేసిన మదింపు.

Services activity holds steady in April
భారత్‌ సేవల రంగం నెమ్మది

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటినెల ఏప్రిల్‌లో నెమ్మదించింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ మార్చిలో 61.2 వద్ద ఉంటే, ఏప్రిల్‌లో 60.8కి తగ్గింది. అయితే ఈ స్థాయి కూడా 14 ఏళ్ల గరిష్ట స్థాయిలోనే కొనసాగుతుండటం గమనార్హం.  కాగా, ఈ సూచీ 50పై ఉంటే దానిని వృద్ధి బాటగా, దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణించడం గమనార్హం.  మరోవైపు తయారీ, సేవలు కలగలిపిన హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ మార్చిలో 61.8 ఉంటే,  ఏప్రిల్‌లో 61.5కు తగ్గడం మరో అంశం. అయితే ఇది కూడా 14 సంవత్సరాల గరిష్ట స్థాయే కావడం గమనార్హం. 

Stock market: Sensex, Nifty 50 end mixed
సెన్సెక్స్‌ ప్లస్, నిఫ్టీ మైనస్‌

అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో స్టాక్‌ సూచీలు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్‌ 17 పాయింట్లు లాభపడి 73,896 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 22,443 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్‌ ఆద్యంతం పరిమితి శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కన్జూమర్‌ డ్యూరబుల్స్, సరీ్వసెస్, యుటిలిటీ, విద్యుత్, పారిశ్రామికోత్పత్తి, కమోడిటీ షేర్లూ నష్టాలను చవిచూశాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ సూచీలు 1% నష్టపోయాయి. అమెరికా వడ్డీరేట్ల పెంపు ఆశలతో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, ఆటో, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియాలో జపాన్, దక్షిణ కొరియా, తైవాన్‌ దేశాల స్టాక్‌ మార్కెట్లు పనిచేయలేదు. చైనా, హాంగ్‌కాంగ్‌ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. యూరప్‌ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. నిర్మాణంలో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణాల కేటాయింపు కఠినతరం చేస్తూ రూపొందించిన ముసాయిదాను ఆర్‌బీఐ ఆమోదించడంతో ప్రభుత్వరంగ బ్యాంకులు, కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

Today Gold and Silver Price 6th May 2024
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి

గత వారంలో పడుతూ.. లేస్తూ కొనసాగిన బంగారం ధరలు, ఈ వారం ప్రారంభంలో కొంత పెరుగుదల వైపు అడుగులు వేసాయి. దీంతో తులం పసిడి ధర సోమవారం రూ.200 నుంచి రూ.220 వరకు పెరిగింది. ధరలు పెరగడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో, చెన్నై, ఢిల్లీలలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66050 (22 క్యారెట్స్), రూ.72050 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఈ రోజు రూ. 200 నుంచి రూ. 220 వరకు పెరిగాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరల్లో స్వల్పంగా పెరిగాయి. కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66200 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 72200 రూపాయల వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్లు ఈ రోజు కొంత పెరుగుదల దిశగా అడుగులు వేసాయి.తెలుగు రాష్ట్రాల్లో, ఢిల్లీలలో రూ. 200 నుంచి రూ. 220 పెరిగిన ధరలు చెన్నైలో మాత్రం రూ. 100 నుంచి రూ. 110 వరకు మాత్రమే పెరిగింది. దీంతో సోమవారం చెన్నైలో బంగారం ధరలు రూ. 66100 (10 గ్రాముల 22 క్యారెట్స్) రూ. 72110 (10 గ్రాముల 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా రూ. 1000 (ఒక కేజీ వెండి) పెరిగింది. కాబట్టి ఒక కేజీ వెండి ధర ఈ రోజు (మే 6) రూ. 84000 వద్ద ఉంది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరలు కొంత పెరిగినట్లు స్పష్టమవుతోంది.

stock market trend on today closing
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు..

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 22,459 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 17 పాయింట్లు లాభపడి 73,895 వద్దకు చేరింది.సెన్సెక్స్‌ 30 సూచీలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, సన్‌ఫార్మా, ఎం అండ్‌ ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.టైటాన్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతీసుజుకీ కంపెనీ షేర్లు నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Google new feature will help users to identify if an app is genuine or not
ప్రభుత్వ యాప్‌లకు ప్రత్యేక లేబుల్‌..! కారణం..

ప్రభుత్వ మొబైల్‌ యాప్‌లకు ప్రత్యేకమైన లేబుల్‌ వాడనున్నారు. ఈమేరకు ప్లేస్టోర్‌లో ప్రభుత్వ యాప్‌లకు లేబుల్‌వాడేందుకు గూగుల్‌ సిద్ధమైంది. ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్‌ లావాదేవీలతోపాటు ఓటీటీ యుటిలిటీ బిల్లు చెల్లింపులు, క్రెడిట్ కార్డుల చెల్లింపుల వరకూ..దాదాపు డిజిటల్‌గానే జరుగుతున్నాయి. డిజిటలైజేషన్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ మోసాలు అధికమవుతున్నాయి. వీటిని కట్టడిచేసేందుకు ఈ మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిసింది.ప్లేస్టోర్‌లో లక్షల్లో యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. వాటిలో వినియోగదారులకు ఏది నమ్మకమైన యాప్‌..ఏది కాదో అనే అంశంపై స్పష్టత కరవవుతోంది. కొన్ని ప్రభుత్వ యాప్‌లో వ్యక్తిగత సమాచారం పంచుకోవాల్సి ఉంటుంది. అయితే అలా మన వివరాలిస్తున్న యాప్‌ అసలు ప్రభుత్వ ఆమోదం పొందిందా..లేదా అనే విషయాన్ని ధ్రువపరుస్తూ కొత్త మార్పులు తీసుకురానున్నారు. ప్లేస్టోర్‌లోని ప్రభుత్వ యాప్‌లకు ప్రత్యేక లేబుల్‌ ఉపయోగించనున్నారు. దాంతో ఆ యాప్‌లను వెంటనే గుర్తించే వీలుంటుందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ మేరకు యాప్‌లో లేబుల్‌ ఉంచేందుకు గూగుల్‌ సైతం సిద్ధమైందని తెలిసింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..‘ఎక్స్’ (ట్విటర్‌)లో బ్లూటిక్ ఎవరైనా కొనుగోలు చేసే వీలు ఉండటంతో ప్రభుత్వ ఖాతాలను తేలిగ్గా గుర్తించడానికి గ్రే టిక్ ఇవ్వడంతో అదే పేరుతో నకిలీ ఖాతాలు నడుపుతున్న వారిని తేలిగ్గా గుర్తించవచ్చు. ఇదే తరహాలో గూగుల్ ప్లే స్టోర్ లేబుల్ తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్‌లకు గూగుల్ ప్లే స్టోర్‌లో ఇకపై లేబుల్ కనిపిస్తుంది.

out of 2781 Billionaires 934 individuals inherited their fortunes to next generations
ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..

సంపన్నులైన వ్యాపార దిగ్గజాలు వారి బిజినెస్‌ కార్యకలాపాలను తమ వారసులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే ఆసియాలోనే కుబేరుడైన ముఖేశ్‌ అంబానీ తన వారసులకు వ్యాపారాలను అప్పగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారస్థులు తమ తర్వాత తరాన్ని పరిచయం చేస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఫోర్బ్స్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్స్ ర్యాంకింగ్‌ 2024లో ఉన్న 2,781 మందిలో దాదాపు మూడింట ఒకవంతు మంది అంటే మొత్తం 934 మంది తమ వారసులకు వ్యాపారాన్ని అప్పగించారు. వీరు నడిపిస్తున్న కంపెనీలు, వాటి మార్కెటింగ్‌ విలువ ఏకంగా 5 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్లుగా ఉంది.ముఖేశ్‌ అంబానీరిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్‌ అంబానీ సంపద దాదాపు 113.5 బిలియన్ అమెరికన్‌ డాలర్లు. రిలయన్స్ టెలికాం విభాగం జియో ఇన్ఫోకామ్‌కు తన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ సారథ్యం వహిస్తున్నారు. కూతురు ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు అనంత్ అంబానీ పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.బెర్నార్డ్ ఆర్నాల్ట్ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు డెల్ఫిన్ ఆర్నాల్ట్, ఆంటోయిన్ ఆర్నాల్ట్, జీన్ ఆర్నాల్ట్, ఫ్రెడెరిక్ ఆర్నాల్ట్, అలెగ్జాండర్ ఆర్నాల్ట్ అనే వారసులున్నారు. తన కుటుంబ సంపద మొత్తం 214.1 బిలియన్ అమెరికన్‌ డాలర్లు. తన వారసులు బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంపెనీ ఎల్‌వీఎంహెచ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. డెల్ఫిన్ ఆర్నాల్ట్(49) 2023లో మాంటిల్‌ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆంటోయిన్ ఆర్నాల్ట్(46) ఎల్‌వీఎంహెచ్‌ కమ్యూనికేషన్స్, ఇమేజ్ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్ ఇనిషియేటివ్‌ విభాగాన్ని పర్యవేక్షిస్తారు. అలెగ్జాండర్‌ ఆర్నాల్ట్(31) కమ్యూనికేషన్‌ విభాగంలో పనిచేస్తున్నారు. ఫ్రెడెరిక్‌ ఆర్నార్ట్‌(29)ట్యాగ్‌హ్యూర్‌ పదవీకాలం తర్వాత 2024లో ఎల్‌వీఎంహెచ్‌ వాచెస్‌కు సీఈఓగా చేరారు. జీన్ ఆర్నాల్ట్(25) 2021లో ఎల్‌వీఎంహెచ్‌లో చేరారు. లూయిస్ విట్టన్ వాచీల విభాగానికి మార్కెటింగ్ హెడ్‌గా చేస్తున్నారు.అదానీ గ్రూప్గౌతమ్ అదానీ ఛైర్మన్‌గా ఉన్న ఈ గ్రూప్‌ సంపద సుమారు 102.4 బిలియన్ అమెరికన్‌ డాలర్లు. ఆయనకు కరణ్, జీత్ అదానీలు ఇద్దరు కుమారులు. పర్డ్యూ యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన కరణ్ తన తండ్రి తర్వాత అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్‌) మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. జీత్ అదానీ 2019లో అదానీ గ్రూప్‌లో చేరారు.షాపూర్జీ పల్లోంజీ గ్రూప్షాపూర్ మిస్త్రీ స్థాపించిన ఈ గ్రూప్‌ సంపద 37.7 బిలియన్ యూఎస్‌ డాలర్లుగా ఉంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వారసుడిగా పల్లోన్ మిస్త్రీ సంస్థను ముందుండి నడిపిస్తున్నారు. ఈ గ్రూప్‌నకు నిర్మాణం, రియల్ ఎస్టేట్‌ రంగంలో మంచి పేరుంది. ఇందులో టాటా సన్స్‌ వాటా కలిగి ఉంది.ఇదీ చదవండి: 15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టుఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్లాఓరీల్‌ సంస్థ వ్యవస్థాపకుడు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ 94.5 బిలియన్‌ డాలర్ల సందప కలిగి ఉన్నారు. ప్రపంచంలోని ప్రముఖ సౌందర్య సాధనాల దిగ్గజ సంస్థగా లాఓరీల్‌కు మంచి పేరుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళ ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ వారసులు జీన్-విక్టర్, నికోలస్ మేయర్స్. జీన్-విక్టర్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో పనిచేస్తున్నారు. నికోలస్ మేయర్స్‌ కుంటుంబం పెట్టుబడి సంస్థకు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. 

పేమెంట్స్‌ బ్యాంకులకు గుడ్‌ న్యూస్‌..
పేమెంట్స్‌ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!

న్యూఢిల్లీ: దేశీయంగా పేమెంట్స్‌ బ్యాంకులకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోందని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ సీఈవో అనుబ్రత బిశ్వాస్‌ తెలిపారు. అందరికీ ఆర్థిక సేవలు అందించే (ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌) దిశగా అమలవుతున్న చర్యలు, ఆర్థిక.. డిజిటల్‌ వృద్ధి పుంజుకోవడం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు.డిజిటల్‌ బ్యాంకింగ్‌లో 10 కోట్ల మంది యూజర్ల స్థాయిలో అవకాశాలు ఉన్నాయని బిస్వాస్‌ వివరించారు. ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్, డిజిటల్‌ ఇన్‌క్లూజన్‌ మార్కెట్‌ పరిమాణం 50 కోట్ల యూజర్ల స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇంత భారీ సంఖ్యలో జనాభా ఆర్థిక అవసరాల కోసం వివిధ విధానాల్లో పని చేసే భారీ బ్యాంకులు పెద్ద సంఖ్యలో కావాల్సి ఉంటుందని బిశ్వాస్‌ పేర్కొన్నారు.ప్రస్తుతం 70 కోట్ల పైచిలుకు స్మార్ట్‌ఫోన్లు ఉండగా దాదాపు ఆర్థికంగా చెల్లింపులు జరిపేవారు (యూపీఐ ద్వారా, నగదు లావాదేవీల రూపంలో) 40 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. డిజిటల్‌ యూజర్లు, డిజిటల్‌ ఫైనాన్షియల్‌ యూజర్ల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని భర్తీ చేయడంలో ఫిన్‌టెక్‌ సంస్థలు కీలక పాత్ర పోషించగలవని బిశ్వాస్‌ పేర్కొన్నారు.తమ సంస్థ విషయానికొస్తే దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌కు దాదాపు 5,00,000 బ్యాంకింగ్‌ పాయింట్స్‌ ఉన్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో అగ్రగామిగా ఉన్నామని, గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో కలిపి ప్రతి నెలా పది లక్షల బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఇవి చదవండి: నిరాశపర్చిన ఈ-టూవీలర్స్ విక్రయాలు..

Form-3 Is Applicable Only To Those Who Have Income From Business Or Profession
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3

ఒక్క మాటలో చెప్పాలంటే ఫారం 1,2 .. జీతం మీద ఆదాయం వచ్చిన వారే వేయాలి. మిగిలిన ఫారాలు ఏవి కూడా వేతన జీవులకు వర్తించవు. ఈ ఫారం–3, అలాగే ఇక నుంచి వచ్చే ఫారాలు వ్యాపారం లేదా వృత్తి మీద ఆదాయం ఉన్న వారికే వర్తిస్తాయి. ఫారం–3ని వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు వాడాలి.ఇది చాలా పెద్ద ఫారం అని చెప్పవచ్చు. నిడివిపరంగా అనడం లేదు.. ఇవ్వాల్సిన వివరాలు ఎక్కువ..సంఖ్య ఎక్కువ.వ్యక్తులు, హిందు ఉమ్మడి కుటుంబాలు వేయొచ్చు.ముఖ్యమైన రూలు ఏమిటంటే వ్యాపారం / లేదా వృత్తి మీద ఆదాయం ఉన్నవారు మాత్రమే ఫారం–3ని వేయాలి.ఆదాయపు పన్ను చట్టప్రకారం వ్యాపారానికొక రకమైన ఫారం, వృత్తి నిపుణులకొక రకమైన ఫారం లేదు. అందరికీ ఒకే ఫారం.‘వ్యాపారం’ అనే పదానికి నిర్వచనంలోనే ఎన్నో వాటితో పాటు ‘వృత్తి’ని కలిపారు.వ్యక్తులు/కుటుంబాలకు ట్యాక్స్‌ ఆడిట్‌ వర్తించినా, వర్తించకపోయినా ఈ ఫారం వేయాలి.ఈ రిటర్నులో ఇంటి మీద ఆదాయం, జీతం, పెన్షన్, వ్యాపారం/వృత్తి మీద ఆదాయం, ఇతర ఆదాయాలు, మూలధన లాభాలు.. అంటే చట్టంలో పొందుపర్చిన అన్నీ.. అంటే ఐదు శీర్షికల్లో ఏర్పడ్డ ఆదాయం ఉన్నవారు వేయొచ్చు.భాగస్వామ్యం నుంచి పారితోíÙకం వచ్చే వారు వేయొచ్చు.దీన్ని ‘మాస్టర్‌ ఫారం’ అని అనొచ్చు. ఎందుకంటే, వ్యక్తి లేదా ఉమ్మడి కుటుంబం ప్రతి ఆదాయం.. ఇండియాలో వచ్చినది కావొచ్చు విదేశాల నుంచి వచ్చినది కావొచ్చు.. ‘సర్వం’ ఇందులో కవర్‌ అవుతుంది.అంతే కాకుండా, ఆదాయం కానివి.. ఉదాహరణకు, అడ్వాన్సులకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వాలి.ఆ ఆర్థిక సంవత్సరంలో జరిగిన పెద్ద లావాదేవీలు, ఇండియాలో గానీ విదేశాల్లో గానీ జరిగినవి ఇవ్వాలి.అలాగే, మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్ల వివరాలు ఇవ్వాలి. ఈ ఇన్వెస్ట్‌మెంట్ల వల్ల ఆదాయం ఏర్పడకపోయినా వివరాలు ఇవ్వాలి. ఉదాహరణగా ఒక ఇంటి కోసం భారీ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇచ్చారు. ఇలాంటి వ్యవహారాలన్నింటిని కూడా పొందుపర్చాలి.కొంత నిర్దేశించిన టర్నోవరు దాటిన వారే అకౌంట్స్‌ బుక్స్‌ రాయాలి. కానీ మా సలహా ఏమిటంటే.. వ్యాపారం/వృత్తి ఉన్నవారు అకౌంట్స్‌ రాయండి. వ్యవహారం జరిగినప్పుడు స్పష్టంగా సమగ్రంగా అన్నీ ఒక చోట పర్మనెంట్‌ బుక్‌లో రాసుకోండి. వివరణ రాయండి.ఇలా రాసి ఉంచడం మీకు కాస్తంత శ్రమ కావచ్చు కానీ, తర్వాత రోజుల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫారం నింపడానికి / దాఖలు చేయడానికి అవసరమైతే వృత్తి నిపుణుల సర్వీసులు తీసుకోండి.- కె.సీహెచ్‌, ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, - కె.వి.ఎన్‌ లావణ్య, ట్యాక్సేషన్‌ నిపుణులుఇవి చదవండి: రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు..

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 100 gm 8750.00 100.00
Gold 22K 10gm 66050.00 200.00
Gold 24k 10 gm 72050.00 220.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement