Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Candidate Offers To Pay Rs 40000 To Founder For a Job Tweet Goes Viral
నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా!

ఓ వ్యక్తి చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం చేయాలని అనుకుంటాడు. అయితే చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం రావడం అనేది ప్రస్తుత కాలంలో అసాధ్యమైపోతోంది. దీంతో కొందరు సొంతంగా బిజినెస్ చేస్తుంటే.. మరికొందరు ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. దీని కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.ఇటీవల వింగిఫై వ్యవస్థాపకుడు ఒక తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో ఓ వ్యక్తి వింగిఫైలో తనకు ఉద్యోగం కావాలని. ''ఉద్యోగం కోసం నేను 500 డాలర్లు (రూ. 41000 కంటే ఎక్కువ) చెల్లిస్తాను. వారం రోజుల్లో నా పనితనాన్ని నిరూపించుకుంటాను. ఆలా నిరూపించుకోని సమయంలో నన్ను ఉద్యోగం నుంచి తొలగించండి. ఆ డబ్బు కూడా మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా మీ టీమ్ సమయాన్ని వృధా చేయకూడదని చేస్తున్నాను'' అని పేర్కొన్నారు.ఈ పోస్టును వింగిఫై ఛైర్మన్ పరాస్ చోప్రా షేర్ చేసిన తరువాత నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగార్ధుల పరిస్థితి ఇది అని కొందరు కామెంట్ చేశారు. మరి కొందరు జాబ్ తెచ్చుకోవడానికి ఇది సరైన మార్గం కాదని పేర్కొన్నారు. అయితే చోప్రా మాత్రం ఇది అందరి దృష్టిని ఆకర్శించింది అని అన్నారు.This is how you get attention!(Obviously won’t take money but very impressed with the pitch) pic.twitter.com/mlJIL0154u— Paras Chopra (@paraschopra) May 3, 2024

Nepal announced printing of Rs 100 note featuring a map of Indian territories
వివాదాస్పద భూభాగాలతో రూ.100 నోట్‌ ముద్రించాలని నిర్ణయం

నేపాల్ భారత భూభాగాలైన లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీలు కలిగి ఉన్న మ్యాప్‌తో కొత్త రూ.100 కరెన్సీ నోటును ముద్రించాలని నిర్ణయించింది. ఈ చర్యను భారత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో వివాదాస్పద భూభాగాలను నేపాల్ కొత్త మ్యాప్‌లో చేర్చాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి రేఖా శర్మ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ భూభాగాలకు సంబంధించి ఇండియా-నేపాల్‌ మధ్య భిన్నాభిప్రాయలున్నాయి.వివాదాస్పద భూభాగాలతో కూడిన మ్యాప్‌ను నేపాలీ రూ.100 నోట్‌పై ముద్రించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేపాల్‌ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్‌ టెక్నాలజీ మంత్రి రేఖా శర్మ తెలిపారు. ఏప్రిల్ 25, మే 2వ తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొత్త మ్యాప్‌ రీడిజైన్‌కు ఆమోదం లభించినట్లు ఆమె చెప్పారు.ఇదీ చదవండి: ‘ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు..’ నిర్మలాసీతారామన్‌ వివరణఅసలు వివాదం ఏమిటి..?లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలు నవంబర్ 2019లో భారత్‌మ్యాప్‌లో చేర్చారు. అవి ఇండియా తమ భూభాగాలుగా భావిస్తోంది. మే 2020లో నేపాల్ అదే భూభాగాలతో రాజకీయ మ్యాప్‌ను విడుదల చేసింది. దాంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. మే 8, 2020న లిపులేఖ్ మీదుగా కైలాష్ మానస సరోవరాన్ని కలిపేలా రహదారిని ప్రారంభించాలని భారత్‌ ప్రయత్నించింది. దాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్ భారత్‌కు నోట్‌ను పంపించింది. దాంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లా గుండా వెళ్లే రహదారి పూర్తిగా భారత భూభాగంలోనే ఉందని స్పష్టం చేసింది.

Govt lifts restrictions on onion exports
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత

దేశంలో ఉల్లి ఎగుమతులపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ ఉల్లిపాయల ఎగుమతి విధానాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తక్షణమే అమలులోకి వచ్చేలా కనీస ఎగుమతి ధరను మెట్రిక్ టన్నుకు 550 డాలర్లు (రూ.45,860)గా నిర్ణయించింది.ఈమేరకు విదేశీ వాణిజ్య విధానంలో సవరణలు చేస్తున్నట్లు మే 4 నాటి నోటిఫికేషన్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) పేర్కొంది. మే 3 నుంచి ఉల్లిపై ప్రభుత్వం 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. దీంతో 40 శాతం సుంకంతో ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుంది.ప్రస్తుతం ఉల్లి ఎగుమతిపై నిషేధం ఉంది. అయితే మిత్ర దేశాలైన యూఏఈ, బంగ్లాదేశ్‌లకు మాత్రం నిర్దిష్ట పరిమాణంలో ఉల్లి ఎగుమతులకు కేం‍ద్ర ప్రభుత్వం అనుమతించింది. గత ఏడాది ఆగస్టులో ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. 2023 డిసెంబర్‌లో ఎగుమతి నిషేధం విధించిన దాదాపు ఐదు నెలల తర్వాత ఏప్రిల్ 26న, మహారాష్ట్ర నుంచి ప్రధానంగా ఆరు పొరుగు దేశాలకు 99,150 మిలియన్ టన్నుల ఉల్లిని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.

News Viral That IT Dept planning to introduce changes in the capital gains tax structure
‘ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు..’ నిర్మలాసీతారామన్‌ వివరణ

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే మూలధన లాభాల పన్ను విధానంలో మార్పులు తీసుకురావాలని ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) యోచిస్తోందన్న వార్తలు వైరల్‌గా మారాయి. వాటిని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు.ఆర్థికంగా అన్ని తరగతుల వారికి ఒకే విధమైన పన్ను అమలయ్యేలా యూనిఫామ్‌ విధానాన్ని తీసుకురావాలని ఐటీ శాఖ యోచిస్తోందనే వార్తలు వివిధ సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం వైరల్‌గామారాయి. ప్రముఖ న్యూస్ ఛానెల్‌కు సంబంధించిన ట్విటర్‌ ఖాతాలో ఈ మేరకు పోస్టులు వెలిశాయి. దాంతో ఆర్థికమంత్రి నిర్మాలాసీతారామన్ తన ‘ఎక్స్‌’ ఖాతాలో స్పందించారు. ‘ఈ వార్తలు ఎలా వస్తున్నాయో ఆశ్చర్యంగా ఉంది. అలా ఏదైనా అప్‌డేట్‌ ఉందని తెలిస్తే సంబంధిత శాఖతో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలి. ఇలా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదు. లోక్‌సభ ఎన్నికల ముందు ఇలాంటి వార్తలు వస్తుండడం ఇబ్బందిగా ఉంది’ అని వివరణ ఇచ్చారు.ఇదీ చదవండి: పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీవైరల్‌ అయిన వార్తకు సంబంధించిన పోస్టులు శుక్రవారం మార్కెట్‌ సమయంలోనే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దానికితోడు స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుపై అనుమానాలు, ఫెడ్‌ కీలక వడ్డీరేట్లను తగ్గించడంలో మరికొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో మార్కెట్లు నిన్న భారీగా నష్టపోయాయి. తాజాగా ఆర్థికమంత్రి స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి అంతర్జాతీయ అనిశ్చితులు ఏర్పడకపోతే సోమవారం మార్కెట్లు లాభాల్లోకి వెళుతాయని నిపుణులు భావిస్తున్నారు.

States in India are offering discounts of upto 25% on scrap old vehicles and buy a new one
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..

కాలంచెల్లిన వాహనాలను తుక్కుగా మార్చి వాటిస్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ప్రకారం..పాత వ్యక్తిగత వాహనాన్ని తుక్కుగా మార్చి కొత్తది కొనుగోలు చేయాలనుకునే వారు వాహన ధరలో లేదా రోడ్డు పన్నులో 25 శాతం వరకు రాయితీ పొందవచ్చు. అదే వాణిజ్య వాహనాలకు 15 శాతం రాయితీ పొందే వీలుంది.ఫిట్‌‌‌‌నెస్ లేని, కాలం చెల్లిన వాహనాలను దశలవారీగా తొలగించి వాయు కాలుష్యాన్ని తగ్గించడం, ఆటోమొబైల్ రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ స్క్రాపేజ్ విధానాన్ని తీసుకొచ్చారు. భారతీయ రోడ్లపై గత 15 ఏళ్లగా 5 కోట్ల  ప్రైవేట్  మోటారు వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని అంచనా. దాంతో గణనీయమైన వాయు కాలుష్యం ఏర్పడుతోంది. కాలంచెల్లిన ఈ వాహనాలను తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. వాహనదారులు తిరిగి కొత్తవాటిని కొనుగోలు చేసేలా వారికి ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.తుక్కుగా మార్చిన వాహనం విలువలో 10-25శాతం కొత్త వాహన ధరల్లో లేదా రోడ్డు పన్ను చెల్లింపులో రాయితీ ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. వాణిజ్య, ప్రైవేట్ వాహనాలకు వేర్వేరు కాలాలు నిర్ణయించారు. ప్రభుత్వ వెహికల్ స్క్రాపింగ్ విధానం ప్రకారం.. పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంతో నడిచే వ్యక్తిగత వాహనాలను 15 ఏళ్ల తర్వాత మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తిరిగి రెన్యువల్‌ అయిన తర్వాత 5 ఏళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. 20 ఏళ్ల తర్వాత వాహనాన్ని వినియోగించాలనుకుంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలి. ఇదీ చదవండి: అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!దిల్లీ-ఎన్‌సీఆర్‌కు ఈ నిబంధనల్లో మార్పులున్నాయి. అక్కడ పెట్రోల్ వాహనాలకు గరిష్ట వయోపరిమితి 15 ఏళ్లు కాగా, డీజిల్ వాహనాలకు గరిష్ట వయోపరిమితి 10 ఏళ్లు. దిల్లీ రోడ్లపై పరిమితికి మించి పాత కారు కనిపిస్తే రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆ వాహనాన్ని నేరుగా స్క్రాపింగ్ కోసం పంపించాలి.

Over 21000 Employees Fired From Tech Companies In April
Tech Layoffs 2024: షాకింగ్‌ రిపోర్ట్‌: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలలో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లకు సంబంధించి షాకింగ్‌ రిపోర్ట్‌ ఒకటి వెల్లడైంది. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి టెక్‌ కంపెనీలు.layoffs.fyi ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. టెక్నాలజీ రంగంలోని 50 కంపెనీల నుండి ఒక్క ఏప్రిల్ నెలలోనే 21,473 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ఈ ఏడాది లేఆఫ్‌ల ధోరణికి ఏప్రిల్‌ నెల తొలగింపులు అద్దం పడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కనీసం ఇప్పటి వరకూ 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగులను తొలగించాయి. జనవరిలో 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు జరిగాయి. ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 మందిని తొలగించాయి. ఇక మార్చిలో 37 కంపెనీల్లో 7,403 మంది ఉద్యోగాలను కోల్పోయారు. మార్చి నుంచి ఏప్రిల్‌కు ఒక్క నెలలో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ఏప్రిల్‌లో టెక్ తొలగింపులుయాపిల్ ఇటీవల 614 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొదటి ప్రధాన రౌండ్ ఉద్యోగ కోత.పైథాన్, ఫ్లట్టర్, డార్ట్‌లో పనిచేస్తున్న వారితో సహా వివిధ టీమ్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను గూగుల్‌ తొలగించింది.అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది ఉద్యోగాలను తగ్గించింది.ఇంటెల్ దాని ప్రధాన కార్యాలయంలోని దాదాపు 62 మంది ఉద్యోగులను లేఆఫ్‌ చేసింది. ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది.ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా అత్యధికంగా 14 వేల మందిని లేఆఫ్‌ చేసింది.ఓలా క్యాబ్స్ దాదాపు 200 ఉద్యోగాలను తొలగించింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీఫైమ్‌ దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించింది. గృహోపకరణాలను తయారు చేసే వర్ల్‌పూల్ సుమారు 1,000 మందిని లేఆఫ్‌ చేసింది.టేక్-టూ ఇంటరాక్టివ్ కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 5% మందిని తొలగించింది. నార్వేలోని టెలికాం కంపెనీ టెలినార్ 100 మంది ఉద్యోగులను తొలగించింది.

aware about fire extinguisher at the time of fire accident
అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!

రూ.లక్షలు ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకుంటాం. నచ్చిన విధంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటాం. భద్రంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగితే విలువైన వస్తువులు కాలిపోవడంతోపాటు కొన్నిసార్లు మనుషుల ప్రాణాలు పోవచ్చు. ఫైరింజన్‌ సిబ్బందికి సమాచారం అందించినా వారు వచ్చేలోపు ప్రమాదం మరింత తీవ్రస్థాయికి చేరవచ్చు. అసలే వేసవికాలం ఇలాంటి ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇళ్లు నిర్మించుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మరింత రక్షణగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంటితోపాటు కంపనీలు, షాపింగ్‌మాల్స్‌, భవనాల్లో తప్పకుండా ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు ఉపయోగించాలంటున్నారు. వీటికోసం చేసే చిన్నపాటి ఖర్చుతో ఇంటికి మరింత భద్రత కల్పించవచ్చని చెబుతున్నారు. వాటిని ఎంచుకునేముందు కనీస అవగాహన తప్పనిసరని అభిప్రాయపడుతున్నారు.మంటలను ఆర్పేందుకు ఉపయోగించే ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు చాలా రకాలుగా ఉంటాయి.స్టాండర్డ్‌ వాటర్‌: కాగితం, కార్డ్‌బోర్డ్‌, ప్లాస్టిక్‌, కలప, ఫ్యాబ్రిక్‌కు అంటిన మంటలను అదుపు చేయవచ్చు.డ్రైవాటర్‌ మిస్ట్‌: నీటి రేణువులను పొడి సూక్ష్మకణాలుగా మార్చి మంటపై చల్లుతుంది.వెట్‌ కెమికల్‌: మంటలపై సబ్బు ద్రావణాన్ని చల్లుతుంది. కొవ్వులు, వంట నూనెల వల్ల సంభవించే మంటలను అదుపు చేయవచ్చు. పౌడర్‌: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాసోలిన్‌ నుంచి వచ్చే మంటలు, మీథేన్‌, ప్రొపేన్‌, బ్యూటేన్‌ వంటి వాయువుల వల్ల ఏర్పడే వాటినిక ఆర్పవచ్చు. కార్బన్‌ డైయాక్సైడ్‌: పెట్రో ఉత్పత్తులు, విద్యుత్తు వల్ల కలిగే మంటలు తగ్గించవచ్చు.వాటర్‌ మిస్ట్‌ టైప్‌ ఫైర్‌: వరండాలు, వంట గదిలో వాడుకోవచ్చు. ఇది మంటపై నీటిని స్ప్రే చేస్తుంది.

MRF announced a final dividend of Rs 194 And Britannia announced Rs 73.5
రూ.194 డివిడెండ్‌ ప్రకటించిన కంపెనీ

ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్‌ఎఫ్‌ తన ఇన్వెస్టర్లకు రూ.10 ముఖవిలువ కలిగిన ప్రతి షేరుకు రూ.194 డివిడెండ్‌ ప్రకటించింది.2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎంఆర్‌ఎఫ్‌ నికరలాభం రూ.2081 కోట్లుగా నమోదైంది. 2022-23 నికరలాభం రూ.769 కోట్లుగా కంపెనీ పోస్ట్‌ చేసింది. కార్యకలాపాల ఆదాయం కూడా రూ.23,008 కోట్ల నుంచి రూ.25,169 కోట్లకు వృద్ధి చెందినట్లు చెప్పింది.మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.341 కోట్లతో పోలిస్తే ఇది 16% ఎక్కువ. కంపెనీ తాజాగా ప్రకటించిన డివిడెండ్‌తోపాటు ఇప్పటికే మధ్యంతర డివిడెండ్‌ను రెండుసార్లు రూ.3 చొప్పున సంస్థ అందించింది.ఇదీ చదవండి: నేపాల్‌లో నిలిచిన ఇంటర్నెట్‌ సేవలు.. కారణం..బ్రిటానియా రూ.73.50 డివిడెండ్‌బ్రిటానియా ఇండస్ట్రీస్‌ మార్చి త్రైమాసికంలో రూ.536.61 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాలంలో నమోదుచేసిన లాభం రూ.557.60 కోట్ల కంటే ఇది తక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.4023.18 కోట్ల నుంచి 1.14% పెరిగి రూ.4069.36 కోట్లకు చేరింది. రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.73.50 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది.

Nearly 6 lakh IT returns filed within 30 days of portal opening
Income tax: నెల రోజుల్లో 6 లక్షల ఐటీ రిటర్న్స్‌

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ స్వీకరణ ప్రారంభమైన నెల రోజుల్లో దాదాపు 6 లక్షల ఐటీ రిటర్న్స్‌ దాఖలయ్యాయి. వీటిని ఆదాయపన్ను శాఖ అంతే వేగంగా ప్రాసెస్‌ చేయడం విశేషం. వెరిఫై చేసిన రిటర్న్స్‌లో దాదాపు మూడింట రెండు వంతులు ఇప్పటికే ప్రాసెస్ అయినట్లు బిజినెస్ లైన్ నివేదించింది.2024-25 అసెస్‌మెంట్ ఇయర్ (FY25) మొదటి నెలలో ఏప్రిల్ 29 నాటికి 5.92 లక్షలకు పైగా రిట‍ర్న్స్‌ దాఖలయ్యాయి. వీటిలో 5.38 లక్షలకు పైగా వెరిఫై కాగా  3.67 లక్షల వెరిఫైడ్ రిటర్న్స్‌ను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున అంటే ఏప్రిల్‌ 1న ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించింది.ముందస్తుగా ఐటీ రిటర్న్స్‌ ఫైల్ చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు త్వరగా రీఫండ్‌ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పెనాల్టీ లేకుండా రిటర్న్స్‌ను రివైజ్ చేయడానికి లేదా సరిచేయడానికి తగినంత సమయం లభిస్తుంది. అయితే, ఉద్యోగులు మాత్రం కొంత సమయం వేచి ఉంటే మంచిదని సూచిస్తున్నారు. కా 2024-25 అసెస్‌మెంట్ ఇయర్‌కు ఐటీ రిటర్న్స్‌ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ.

Bajaj Auto MD Rajiv Bajaj urges for lower GST on commuter bikes
వాహనాల ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా..?

పుణే, బిజినెస్‌ బ్యూరో: కాలుష్యాన్ని కట్టడి చేసే పేరిట అతి నియంత్రణలు, అధిక స్థాయి జీఎస్‌టీలను అమలు చేయడం వల్లే వాహనాల రేట్లకు రెక్కలు వచ్చాయని బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ వ్యాఖ్యానించారు. బ్రెజిల్‌ వంటి దేశాల్లో మోటార్‌సైకిళ్లపై పన్నులు 8–14 శాతం శ్రేణిలో ఉండగా దేశీయంగా మాత్రం అత్యధికంగా 28 శాతం జీఎస్‌టీ ఉంటోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనాల ధరలను తగ్గించే పరిస్థితి ఉండటం లేదని, దీంతో నిర్వహణ వ్యయాలైనా తగ్గే విధంగా వాహనాలను రూపొందించడం ద్వారా కొనుగోలుదారులకు కొంతైనా ఊరటనిచ్చే ప్రయత్నం జరుగుతోందని బజాజ్‌ చెప్పారు.  125 సీసీ పైగా సామర్ధ్యం ఉండే స్పోర్ట్స్‌ మోటార్‌సైకిళ్ల విభాగంలో తమకు ముప్ఫై రెండు శాతం మేర వాటా ఉందని, దీన్ని మరింతగా పెంచుకునే దిశగా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నినాదం తరహాలో డబుల్‌ ఇంజిన్‌ కారోబార్‌ (కార్యకలాపాలు) వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజీవ్‌ చెప్పారు.బజాజ్‌ పల్సర్‌ 400 ధర  రూ. 1,85,000బజాజ్‌ ఆటో తాజాగా పల్సర్‌ ఎన్‌ఎస్‌ 400జీ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్‌ కింద దీని ధర రూ. 1,85,000గా  (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది. డెలివరీలు జూన్‌ మొదటివారం నుంచి ప్రారంభమవుతాయని సంస్థ ఎండీ రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. స్పోర్ట్స్‌ సెగ్మెంట్‌లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు పల్సర్‌ బైకులు 1.80 కోట్ల పైచిలుకు అమ్ముడైనట్లు బజాజ్‌ వివరించారు. పరిమిత కాలం పాటు వర్తించే ఆఫర్‌ కింద కొత్త పల్సర్‌ను రూ. 5,000కే బుక్‌ చేసుకోవచ్చు.  నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది. శక్తివంతమైన 373 సీసీ ఇంజిన్, 6 స్పీడ్‌ గేర్‌ బాక్స్, ఎల్రక్టానిక్‌ థ్రోటిల్‌ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌ను జూన్‌ 18న ఆవిష్కరించనున్నామని రాజీవ్‌ చెప్పారు.  ఇది ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ అన్నారు. 

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 86.50 0.50
Gold 22K 10gm 65850.00 10.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement