Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Home loans been increasing in two financial years to Rs10 lakh Crs
పెరిగిన రుణాలు.. రెండేళ్లలో రూ.10లక్షల కోట్లు

సొంతిల్లు సామాన్యుడి కల. రో​జురోజుకు రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ పెరుగుతోంది. దాంతో రియల్టీ వ్యాపారులు, గృహాలు నిర్మిస్తున్న డెవలపర్లు వాటిని కొనుగోలు చేయాలనుకునేవారిని వివిధ మార్గాల ద్వారా ఆకర్షిస్తున్నారు. దాంతో మరింత సమయం వేచిచూస్తే ధరలు పెరుగుతాయనే భావనతో ఎలాగోలా అప్పు చేసైనా గృహాలు కొంటున్నారు. అలా ఏటా వినియోగదారులు తీసుకుంటున్న గృహ రుణాలు బ్యాంకుల వద్ద పేరుకుపోతున్నాయి. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రికార్డు స్థాయిలో రూ.10లక్షల కోట్ల గృహ నిర్మాణ రంగ రుణాలు పెరిగాయి.ఇదీ చదవండి: 15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు2024 మార్చి నెల వరకు గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన డేటా ప్రకారం తెలిసింది. 2022 మార్చి నాటికి రూ.17,26,697 కోట్ల బకాయిలు ఉండగా, 2023 మార్చి నాటికి రూ.19,88,532 కోట్లకు, 2024 మార్చి నాటికి రూ.27,22,720 కోట్లకు చేరాయని పేర్కొంది. వాణిజ్య స్థిరాస్తి రుణ బకాయిలు 2024 మార్చి నాటికి రూ.4,48,145 కోట్లకు చేరాయని, 2022 మార్చిలో రూ.2,97,231 కోట్లుగా ఉన్నాయని వెల్లడించింది.

పేమెంట్స్‌ బ్యాంకులకు గుడ్‌ న్యూస్‌..
పేమెంట్స్‌ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!

న్యూఢిల్లీ: దేశీయంగా పేమెంట్స్‌ బ్యాంకులకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోందని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ సీఈవో అనుబ్రత బిశ్వాస్‌ తెలిపారు. అందరికీ ఆర్థిక సేవలు అందించే (ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌) దిశగా అమలవుతున్న చర్యలు, ఆర్థిక.. డిజిటల్‌ వృద్ధి పుంజుకోవడం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు.డిజిటల్‌ బ్యాంకింగ్‌లో 10 కోట్ల మంది యూజర్ల స్థాయిలో అవకాశాలు ఉన్నాయని బిస్వాస్‌ వివరించారు. ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్, డిజిటల్‌ ఇన్‌క్లూజన్‌ మార్కెట్‌ పరిమాణం 50 కోట్ల యూజర్ల స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇంత భారీ సంఖ్యలో జనాభా ఆర్థిక అవసరాల కోసం వివిధ విధానాల్లో పని చేసే భారీ బ్యాంకులు పెద్ద సంఖ్యలో కావాల్సి ఉంటుందని బిశ్వాస్‌ పేర్కొన్నారు.ప్రస్తుతం 70 కోట్ల పైచిలుకు స్మార్ట్‌ఫోన్లు ఉండగా దాదాపు ఆర్థికంగా చెల్లింపులు జరిపేవారు (యూపీఐ ద్వారా, నగదు లావాదేవీల రూపంలో) 40 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. డిజిటల్‌ యూజర్లు, డిజిటల్‌ ఫైనాన్షియల్‌ యూజర్ల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని భర్తీ చేయడంలో ఫిన్‌టెక్‌ సంస్థలు కీలక పాత్ర పోషించగలవని బిశ్వాస్‌ పేర్కొన్నారు.తమ సంస్థ విషయానికొస్తే దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌కు దాదాపు 5,00,000 బ్యాంకింగ్‌ పాయింట్స్‌ ఉన్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో అగ్రగామిగా ఉన్నామని, గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో కలిపి ప్రతి నెలా పది లక్షల బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఇవి చదవండి: నిరాశపర్చిన ఈ-టూవీలర్స్ విక్రయాలు..

Form-3 Is Applicable Only To Those Who Have Income From Business Or Profession
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3

ఒక్క మాటలో చెప్పాలంటే ఫారం 1,2 .. జీతం మీద ఆదాయం వచ్చిన వారే వేయాలి. మిగిలిన ఫారాలు ఏవి కూడా వేతన జీవులకు వర్తించవు. ఈ ఫారం–3, అలాగే ఇక నుంచి వచ్చే ఫారాలు వ్యాపారం లేదా వృత్తి మీద ఆదాయం ఉన్న వారికే వర్తిస్తాయి. ఫారం–3ని వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు వాడాలి.ఇది చాలా పెద్ద ఫారం అని చెప్పవచ్చు. నిడివిపరంగా అనడం లేదు.. ఇవ్వాల్సిన వివరాలు ఎక్కువ..సంఖ్య ఎక్కువ.వ్యక్తులు, హిందు ఉమ్మడి కుటుంబాలు వేయొచ్చు.ముఖ్యమైన రూలు ఏమిటంటే వ్యాపారం / లేదా వృత్తి మీద ఆదాయం ఉన్నవారు మాత్రమే ఫారం–3ని వేయాలి.ఆదాయపు పన్ను చట్టప్రకారం వ్యాపారానికొక రకమైన ఫారం, వృత్తి నిపుణులకొక రకమైన ఫారం లేదు. అందరికీ ఒకే ఫారం.‘వ్యాపారం’ అనే పదానికి నిర్వచనంలోనే ఎన్నో వాటితో పాటు ‘వృత్తి’ని కలిపారు.వ్యక్తులు/కుటుంబాలకు ట్యాక్స్‌ ఆడిట్‌ వర్తించినా, వర్తించకపోయినా ఈ ఫారం వేయాలి.ఈ రిటర్నులో ఇంటి మీద ఆదాయం, జీతం, పెన్షన్, వ్యాపారం/వృత్తి మీద ఆదాయం, ఇతర ఆదాయాలు, మూలధన లాభాలు.. అంటే చట్టంలో పొందుపర్చిన అన్నీ.. అంటే ఐదు శీర్షికల్లో ఏర్పడ్డ ఆదాయం ఉన్నవారు వేయొచ్చు.భాగస్వామ్యం నుంచి పారితోíÙకం వచ్చే వారు వేయొచ్చు.దీన్ని ‘మాస్టర్‌ ఫారం’ అని అనొచ్చు. ఎందుకంటే, వ్యక్తి లేదా ఉమ్మడి కుటుంబం ప్రతి ఆదాయం.. ఇండియాలో వచ్చినది కావొచ్చు విదేశాల నుంచి వచ్చినది కావొచ్చు.. ‘సర్వం’ ఇందులో కవర్‌ అవుతుంది.అంతే కాకుండా, ఆదాయం కానివి.. ఉదాహరణకు, అడ్వాన్సులకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వాలి.ఆ ఆర్థిక సంవత్సరంలో జరిగిన పెద్ద లావాదేవీలు, ఇండియాలో గానీ విదేశాల్లో గానీ జరిగినవి ఇవ్వాలి.అలాగే, మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్ల వివరాలు ఇవ్వాలి. ఈ ఇన్వెస్ట్‌మెంట్ల వల్ల ఆదాయం ఏర్పడకపోయినా వివరాలు ఇవ్వాలి. ఉదాహరణగా ఒక ఇంటి కోసం భారీ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇచ్చారు. ఇలాంటి వ్యవహారాలన్నింటిని కూడా పొందుపర్చాలి.కొంత నిర్దేశించిన టర్నోవరు దాటిన వారే అకౌంట్స్‌ బుక్స్‌ రాయాలి. కానీ మా సలహా ఏమిటంటే.. వ్యాపారం/వృత్తి ఉన్నవారు అకౌంట్స్‌ రాయండి. వ్యవహారం జరిగినప్పుడు స్పష్టంగా సమగ్రంగా అన్నీ ఒక చోట పర్మనెంట్‌ బుక్‌లో రాసుకోండి. వివరణ రాయండి.ఇలా రాసి ఉంచడం మీకు కాస్తంత శ్రమ కావచ్చు కానీ, తర్వాత రోజుల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫారం నింపడానికి / దాఖలు చేయడానికి అవసరమైతే వృత్తి నిపుణుల సర్వీసులు తీసుకోండి.- కె.సీహెచ్‌, ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, - కె.వి.ఎన్‌ లావణ్య, ట్యాక్సేషన్‌ నిపుణులుఇవి చదవండి: రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు..

Delhi Police seized 15 tones of spurious spices arrest three individuals
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

ఈశాన్య దిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో కల్తీ మసాలా దినుసుల తయారీకి సంబంధించిన భారీ రాకెట్‌ను పోలీసులు కనుగొన్నారు. రెండు కర్మాగారాలపై దాడులు నిర్వహించి 15 టన్నుల నకిలీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీకి కారణమైన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసుకు సంబంధించి డీసీపీ పవేరియా మాట్లాడుతూ..‘మసాలా దినుసుల్లో కల్తీ జరుగుతోందనే సమాచారం మేరకు ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. దిల్లీ పరిసర ప్రాంతాల్లో సెర్చ్‌ నిర్వహించాం. ఆపరేషన్ సమయంలో దిలీప్ సింగ్ (46) అనే వ్యక్తికి చెందిన ఒక ప్రాసెసింగ్ యూనిట్‌లో పాడైపోయిన ఆకులు, నిషేధిత పదార్థాలను ఉపయోగించి కల్తీ పసుపును ఉత్పత్తి చేయడం గుర్తించాం. బియ్యం, మినుములు, కలప పొట్టు, మిరపకాయలు, ఆమ్లాలు, నూనెలను కలిపి వీటిని తయారుచేస్తున్నట్లు కనుగొన్నాం. సెర్చ్‌ సమయంలో సింగ్‌తోపాటు అక్కడే ఉన్న సర్ఫరాజ్(32) పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాం. ఈ కల్తీ మసాలా దినుసులు మార్కెటింగ్‌ చేసేది ఖుర్సీద్ మాలిక్ (42) అనే మరోవ్యక్తి అని తేలింది. దాంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నాం. సర్ఫరాజ్‌కు కరవాల్ నగర్‌లోని కాలీ ఖాతా రోడ్‌లో మరో ప్రాసెసింగ్ యూనిట్‌ ఉంది. ఈ ముఠా 2019 నుంచి కల్తీ మసాలా దినుసుల వ్యాపారం చేస్తున్నారు. ఈ రెండు యూనిట్లలో నిలువ ఉన్న సుమారు 15 టన్నుల కల్తీ మసాలా దినుసులను సీజ్‌ చేశాం. చట్ట ప్రకారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’ అని వివరించారు.సీజ్‌చేసిన వాటిలో పసుపు, గరం మసాలా, దనియా పొడి కలిపి 7,105 కిలోలు ఉంది. కలపపొడి, బియ్యం, మినుములు, మిరపకాయలు, సిట్రిక్‌ యాసిడ్‌.. వంటి పదార్థాలు 7,215 కిలోలు ఉన్నాయి.ఇదీ చదవండి: మసాలాలో పురుగుమందులు.. నివేదికలను తోసిపుచ్చిన ప్రభుత్వ సంస్థభారత బ్రాండ్లైన ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్‌ఎస్‌ఏ) గుర్తించిన సంగతి తెలిసిందే. దాంతో హాంకాంగ్, సింగపూర్‌ల్లో వాటి ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే 2020 సెప్టెంబర్‌ నుంచి 2024 ఏప్రిల్‌ మధ్యకాలంలో ఇండియాలో తయారైన దాదాపు 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్‌కు దారితేసే కారకాలు ఉన్నట్లు రాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ (ఆర్‌ఏఎస్‌ఎఫ్‌ఎఫ్‌) డేటా ప్రకారం నిర్ధారణ అయినట్లు ఈఎఫ్‌ఎస్‌ఏ అధికారులు ఇటీవల తెలిపారు.

RBI Statistics Revealed That 27 Lakh Crore Home Loans
రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు..

న్యూఢిల్లీ: గృహాల రంగానికి ఇచ్చిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు రూ. 10 లక్షల కోట్లు ఎగిశాయి. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రికార్డు స్థాయిలో రూ. 27.23 లక్షల కోట్లకు చేరాయి. రంగాలవారీగా బ్యాంకు రుణాల అంశంపై ఆర్‌బీఐ వెలువరించిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.వీటి ప్రకారం 2022 మార్చిలో గృహ నిర్మాణ రంగంలో (హౌసింగ్‌కు ప్రాధాన్యతా రంగం కింద ఇచ్చినవి సహా) రుణబాకీలు రూ. 17,26,697 కోట్లుగా ఉండగా 2024 మర్చి ఆఖరు నాటికి రూ. 27,22,720 కోట్లకు చేరింది. కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌కి ఇచ్చినవి రూ. 2.97 లక్షల కోట్ల నుంచి రూ. 4.48 లక్షల కోట్లకు చేరాయి.కోవిడ్‌ అనంతరం గత రెండేళ్లలో ఇళ్ల విక్రయాలు, ధరలు గణనీయంగా పెరిగినట్లు పలు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. ప్రభుత్వ తోడ్పాటు చర్యలతో అందుబాటు ధరల్లోని ఇళ్లకు డిమాండ్‌ నెలకొన్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చీఫ్‌ ఎకానమిస్ట్‌ మదన్‌ సబ్నవీస్‌ తెలిపారు. రాబోయే రోజుల్లోనూ గృహ రుణాల వృద్ధి పటిష్టంగానే ఉంటుందని, అయితే, అధిక బేస్‌ కారణంగా 15–20 శాతానికి దిగి రావొచ్చని పేర్కొన్నారు.ఇవి చదవండి: పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!

The Sales Of E-Two Wheelers Which Have Reduced Drastically Due To The Election Season
నిరాశపర్చిన ఈ–టూవీలర్స్‌ విక్రయాలు..

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన విక్రయాలు ఏప్రిల్‌ నెలలో నిరాశపరిచాయి. దేశవ్యాప్తంగా మార్చి నెలలో 1,37,146 యూనిట్లు రోడ్డెక్కితే.. గత నెలలో ఈ సంఖ్య సగానికంటే క్షీణించి 64,013 యూనిట్లకు పరిమితమైంది. సబ్సిడీ మొత్తం తగ్గడం, కొన్ని ప్రముఖ మోడళ్ల ధర పెరగడం ఈ క్షీణతకు కారణం.ఎన్నికల సీజన్‌ కావడం కూడా ప్రభావం చూపిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 2023 ఏప్రిల్‌లో కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిన ఈ–టూవీలర్ల సంఖ్య 66,873 యూనిట్లు. 2024 జనవరి, ఫిబ్రవరిలో ప్రతినెలా 82 వేల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఫేమ్‌–2 సబ్సిడీ అందుకోవడానికి మార్చి నెల చివరిది కావడం కూడా 1,37,146 యూనిట్ల గరిష్ట అమ్మకాలకు దోహదం చేసింది.కంపెనీలు మోడల్‌నుబట్టి రూ.4,000లతో మొదలుకుని రూ.16,000 వరకు ధరలను పెంచడం గమనార్హం. అయితే నూతన ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌ 2024 ఏప్రిల్‌ 1 నుంచి జూలై 31 వరకు అమలులో ఉంటుంది. ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.10,000, ఈ–రిక్షా, ఈ–కార్ట్‌కు రూ.25,000, ఈ–ఆటోకు రూ.50,000 సబ్సిడీ ఆఫర్‌ చేస్తారు. ఇక ఏప్రిల్‌లో ఈ–టూ వీలర్ల విక్రయాల్లో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్‌ మోటార్‌ కో, బజాజ్‌ ఆటో, ఏథర్‌ ఎనర్జీ, గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ టాప్‌లో నిలిచాయి.ఇవి చదవండి: అధిక రాబడులకు మూమెంటమ్ ఇన్వెస్టింగ్..

Stock Market Rally On Today Opening
పుంజుకున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 22,542కు చేరింది. సెన్సెక్స్‌ 227 పాయింట్లు ఎగబాకి 74,097 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.08 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 82.91 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 1.26 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 1.99 శాతం ఎగబాకింది.అమెరికా జాబ్స్‌ డేటా ముందుగా అనుకున్న దానికంటే తక్కువగా నమోదైంది. మార్కెట్‌ 2.4లక్షల ఉద్యోగాలు కొత్తగా చేరుతాయని భావించింది. కానీ 1.75లక్షల ఉద్యోగాలు నమోదయ్యాయి. నిరుద్యోగిత రేటు 3.9 శాతంగా ఉంది. యూఎస్‌ 2 ఏళ్ల ఈల్డ్‌ 10 పాయింట్లు తగ్గింది. శుక్రవారం ఎఫ్‌ఐఐలు రూ.2392 కోట్లు విలువచేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ.691 కోట్లు విలువచేసే షేర్లు కొనుగోలు చేశారు. ఫ్యూచర్‌ ఇండెక్స్‌లో 44 శాతం లాంగ్‌ పొజిషన్లు, 56 శాతం షార్ట్‌ పొజిషన్లు నమోదయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

FSSAI clarified that it allows 10 times more pesticide residue levels in spices one of the MRL
మసాలాలో పురుగుమందులు.. నివేదికలను తోసిపుచ్చిన ప్రభుత్వ సంస్థ

మసాలాలు, సుంగధద్రవ్యాల్లో 10 రెట్లకంటే అధికంగా పురుగుమందుల అవశేషాలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతిస్తోందని తెలిపే నివేదికలను సంస్థ తోసిపుచ్చింది. ఆహార పదార్థాల విషయంలో ఇండియాలో కఠినమైన నియమాలు ఉన్నాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది.ఇటీవల రెండు ప్రముఖ భారతీయ బ్రాండ్లు ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ల ఉత్పత్తుల్లో పురుగు మందు ఇథిలీన్‌ ఆక్సైడ్‌ ఉన్నట్లు ఆరోపిస్తూ హాంకాంగ్‌ ఆహార నియంత్రణ సంస్థ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దాంతో భారత్‌ ఉత్పత్తులను ముందుగా విదేశాలకు ఎగుమతి చేయాలంటే స్థానికంగా ఉన్న ఆహార నియంత్రణ సంస్థలు పూర్తి స్థాయిలో వాటిని పరీక్షించి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అయినప్పటికీ హాంకాంగ్‌ ఆహార నియంత్రణ సంస్థ చేసిన పరీక్షల్లో ఇథిలీన్‌ ఆక్సైడ్‌ ఉందని తేలడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాంతో సామాజిక మాధ్యమాల్లో భారత ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పనితీరును ప్రశ్నిస్తూ వార్తలు వైరల్‌గా మారాయి. దాంతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ దాని పనితీరుపై స్పష్టతనిచ్చింది.ఇదీ చదవండి: వివాదాస్పద భూభాగాలతో రూ.100 నోట్‌ ముద్రించాలని నిర్ణయంపురుగుమందుల అవశేషాలకు సంబంధించి గరిష్ట అవశేష స్థాయి (ఎంఆర్‌ఎల్‌) అత్యంత కఠినమైన ప్రమాణాల్లో ఒకటి. పురుగుమందుల ఎంఆర్‌ఎల్‌లు వివిధ ఆహార వస్తువులకు వాటి ప్రమాద అంచనాల ఆధారంగా వేర్వేరుగా నిర్ణయిస్తారు. అయితే భారత్‌లో మొత్తం 295 పురుగుమందులు నమోదయ్యాయి. వాటిలో 139 వాటిని మాత్రమే మసాలా దినుసుల ఉత్తత్తిలో వాడేందుకు అనుమతులున్నాయి.

Health Insurance For Any Age Decision Of IRDAI
ఏ వయసు వారికైనా.. ఆరోగ్య బీమా! 65 ఏళ్ల పరిమితి లేదిక..

వైద్య ఖర్చులు గణనీయంగా పెరిగిపోయిన నేటి రోజుల్లో ఆరోగ్య బీమా ఎన్నో కుటుంబాలకు మెరుగైన రక్షణ కలి్పస్తుందనడంలో సందేహం లేదు. కానీ, మన దేశంలో సగం మంది ఇప్పటికీ ఆరోగ్య బీమా రక్షణ పరిధిలో లేరన్నది వాస్తవం. 2047 నాటికి అందరికీ బీమాను చేరువ చేయాలన్న లక్ష్యంలో భాగంగా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఇటీవలే నిబంధనల్లో కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చింది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో పాలసీదారులకు ప్రయోజనం కలిగించే మార్పులకు శ్రీకారం చుట్టింది.  హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో ‘65 ఏళ్ల’ పరిమితిని తొలగించింది. ముందస్తు వ్యాధుల కవరేజీకి వేచి ఉండాల్సిన కాలాన్ని తగ్గించింది. క్లెయిమ్‌ తిరస్కరణ నిబంధనలను మరింత అనుకూలంగా మార్చింది. వీటివల్ల పాలసీదారులకు ఒరిగే ప్రయోజనం, ప్రీమియం భారం గురించి తెలుసుకుందాంహెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కొనుగోలు సమయంలో తమ ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికే ఏదైనా అనారోగ్యం బారిన పడ్డారా?, ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని బీమా సంస్థ పాలసీ దరఖాస్తులో అడుగుతుంది. అప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, అవి ముందస్తు వ్యాధుల కిందకు వస్తే (పీఈడీ) నిర్ణీత కాలం పాటు ఆయా వ్యాధుల కవరేజీ కోసం వేచి ఉండాలి.ఈ వెయిటింగ్‌ పీరియడ్‌ ముగిసే వరకు వాటికి సంబంధించిన క్లెయిమ్‌లకు బీమా సంస్థ చెల్లింపులు చేయదు. పాలసీదారులు సొంతంగా చెల్లించుకోవాలి. ఈ వెయిటింగ్‌ పీరియడ్‌ అనేది గరిష్టంగా 48 నెలలు (నాలుగేళ్లు) ఉండగా, దీనిని ఐఆర్‌డీఏఐ తాజాగా 36 నెలలకు (మూడేళ్లు) తగ్గించింది. కాకపోతే ఒక్కో బీమా సంస్థలో ఈ కాలం ఒక్కో మాదిరిగా ఉండొచ్చు. అదనపు ప్రీమియం చెల్లిస్తే ఈ వెయిటింగ్‌ కాలాన్ని కొన్ని బీమా సంస్థలు తగ్గిస్తున్నాయి కూడా. మరి అదనపు ప్రీమియం భరించలేని వారికి తాజా నిబంధన సంతోషాన్నిచ్చేదే.తాజా పరిణామంతో బీమా సంస్థలు ముందు నుంచి ఉన్న వ్యాధులకు మూడేళ్లకు మించి కొర్రీలు పెట్టడం కుదరదు. ఇది బీమా వ్యాప్తిని పెంచుతుందని పాలసీబజార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విభాగం బిజినెస్‌ హెడ్‌ సిద్థార్థ్‌ సింఘాల్‌ అభిప్రాయపడ్డారు. ‘‘ముందస్తు వ్యాధులకు మూడేళ్లకంటే తక్కువ వెయిటింగ్‌ పీరియడ్‌తో పాలసీలను కొన్ని సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయి. కానీ, తక్కువ వెయిటింగ్‌ పీరియడ్‌ పాలసీని ఎంపిక చేసుకోవడం పాలసీదారుల అవసరం, అవగాహనపైనే ఆధారపడి ఉంటోంది.తక్కువ వెయిటింగ్‌ పీరియడ్‌ పాలసీదారులకు అనుకూలం’’అని నివా బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉత్పత్తులు, క్లెయిమ్‌లు, అండర్‌రైటింగ్‌ డైరెక్టర్‌ బసుతోష్‌ మిశ్రా చెప్పారు. ఒక ఏడాది తగ్గించడం వల్ల ముందస్తు వ్యాధుల పేరుతో బీమా సంస్థల నుంచి క్లెయిమ్‌ తిరస్కరణలు తగ్గిపోతాయని నిపుణుల విశ్లేషణ.మొదటి రోజు నుంచే..అదనపు ప్రీమియం చెల్లిస్తే మొదటి రోజు నుంచే ముందస్తు వ్యాధులకు కవరేజీ ఇచ్చే పాలసీలు కూడా ఉన్నాయి. ‘‘మధుమేహం, రక్తపోటు, ఉబ్బసం, కొలె్రస్టాల్‌ తదితర ముందు నుంచి ఉన్న వ్యాధులకు పాలసీదారులు మొదటి రోజు నుంచే కవరేజీ పొందొచ్చు. కాకపోతే ఇందు కోసం 10–15 శాతం అదనపు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది’’అని పాలసీబజార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ హెడ్‌ సిద్ధార్థ్‌ సింఘాల్‌ తెలిపారు.ముందు నుంచి అంటే ఎంత కాలం..?పాలసీ తీసుకునే తేదీ నాటి నుంచి దానికి ముందు 36 నెలల కాలంలో డాక్టర్‌ ఏదైనా సమస్యని నిర్ధారించడం.. అందుకు గాను చికిత్స లేదా ఔషధాలు సూచించినా అది పీఈడీ కిందకు వస్తుందిన నిజానికి ఇప్పటి వరకు ఇది 48 నెలలుగా ఉండేది. అంటే పాలసీ తీసుకునే నాటికి ముందు నాలుగేళ్ల కాలంలో ఏదైనా ప్రత్యేక ఆరోగ్య సమస్య ఎదుర్కొంటే దాన్ని పీఈడీగా పరిగణించే వారు. ఇప్పుడు మూడేళ్లకు ఐఆర్‌డీఏఐ తగ్గించింది. దశాబ్దం క్రితం ఐదారేళ్ల పాటు వెయిటింగ్‌ పీరియడ్‌ ఉండేది. బీమా రంగంలో పోటీ పెరగడం, పాలసీ కొనుగోలుదారులు విస్తరించడంతో గణనీయంగా తగ్గుతూ వస్తోంది. భవిష్యత్తులోనూ మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదు.  ఈ తప్పు చేయొద్దు..పాలసీ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ పీఈడీల గురించి వెల్లడించాల్సిందే. ఉదాహరణకు ఒక వ్యక్తి చిన్న డోస్‌తో రక్తపోటును నియంత్రించుకోవచ్చు. ఇవి పరీక్షల్లో బయటపడేవి కావని చెప్పి చాలా మంది తమకు ఈ సమస్యలు ఉన్నట్టు పాలసీ దరఖాస్తులో వెల్లడించరు. కానీ, ఇది పెద్ద తప్పు. తాము ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నదీ, వాటికి ఏవేవి మందులు వాడుతున్నది తప్పకుండా వెల్లడించాలి. దీనివల్ల పాలసీ డాక్యుమెంట్‌లో మీ ఆరోగ్య సమస్యలు నమోదు అవుతాయి. దీనివల్ల ఆ తర్వాతి కాలంలో క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు చెల్లింపుల పరంగా వివాదాలు తగ్గిపోతాయి.కానీ, ఆరోగ్య సమస్యలను బయట పెడితే కంపెనీలు పాలసీ జారీకి నిరాకరిస్తారయన్న భయంతో కొందరు వెల్లడించరు. కానీ, థైరాయిడ్, కొలె్రస్టాల్, అధిక రక్తపోటు, గుండె జబ్బులకు సైతం అండర్‌రైటింగ్‌ విషయంలో (పాలసీ జారీ) బీమా సంస్థలు సౌకర్యంగానే ఉంటాయి. కనుక నిజాయితీగా వెల్లడించడమే మంచిదని నిపుణుల వ్యాఖ్య.వ్యాధుల వారీగా వెయిటింగ్‌..కొన్ని ఆనారోగ్యాలకు చికిత్స కవరేజీని బీమా సంస్థలు మొదటి రోజు నుంచే ఆఫర్‌ చేయవు. వీటి కోసం ‘ప్రత్యేకమైన వెయిటింగ్‌ పీరియడ్‌’ను అమలు చేస్తుంటాయి. నిబంధల ప్రకారం ఈ కాలాన్ని గరిష్టంగా 4 సంవత్సరాలకు మించి అమలు చేయకూడదు. ఇప్పుడు ఈ కాలాన్ని మూడేళ్లకు ఐఆర్‌డీఏఐ తగ్గించింది. నిజానికి కొన్ని బీమా సంస్థలు రెండేళ్లకే ఈ వెయిటింగ్‌ పీరియడ్‌ను అమలు చేస్తున్నాయి.పాలసీ వర్డింగ్స్‌ డాక్యుమెంట్‌లో ఈ వ్యాధుల వివరాలు పూర్తిగా ఉంటాయి. నిరీ్ణత వెయిటింగ్‌ కాలం ముగిసిన తర్వాతే వీటికి సంబంధించిన క్లెయిమ్‌కు అర్హత లభిస్తుంది.  క్యాటరాక్ట్, సైనసైటిస్, అడినాయిడ్స్, టాన్సిలైటిస్‌ చికిత్సలు, కిడ్నీలో రాళ్ల తొలగింపు, కీళ్ల మార్పిడి చికిత్సలకు సాధారణంగా వెయిటింగ్‌ పీరియడ్‌ అమలవుతుంటుంది. ఈ వెయిటింగ్‌ పీరియడ్‌ తగ్గింపు కొత్త వారికే కాకుండా పాత పాలసీదారులకూ వర్తిస్తుంది. ఐదేళ్లు పూర‍్తయితే చాలు!మారటోరియం పీరియడ్‌ను 8 సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు తగ్గించడం మరో ముఖ్యమైన నిర్ణయం. పాలసీ తీసుకుని, క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే.. ఆ తర్వాతి కాలంలో ఎలాంటి కారణం చూపుతూ బీమా సంస్థ క్లెయిమ్‌ తిరస్కరించడం కుదరదు. పాలసీదారు మోసం చేసినట్టు నిరూపిస్తే తప్పించి క్లెయిమ్‌ను ఆమోదించాల్సిందే. ఒకేసారి 8 ఏళ్ల నుంచి 5ఏళ్లకు తగ్గించడం వల్ల పాలసీదారులకు ఎంతో వెసులుబాటు లభించినట్టయింది.దరఖాస్తులో ఆరోగ్య సమాచారం పూర్తిగా వెల్లడించలేదనో, తప్పుడు సమాచారం ఇచ్చారనే పేరుతో బీమా సంస్థలు కొన్ని సందర్భాల్లో క్లెయిమ్‌లకు చెల్లింపులు చేయకుండా నిరాకరిస్తుంటాయి. ఉదాహరణకు మధుమేహం, ఆస్తమా తదితర వ్యాధులు ముందు నుంచి ఉన్నా కానీ వెల్లడించలేదంటూ క్లెయిమ్‌లు తిరస్కరించిన కేసులు ఎన్నో ఉన్నాయి. కానీ, పాలసీదారు మోసపూరితంగా సమాచారం వెల్లడించిన సందర్భాల్లోనే ఐదేళ్లు ముగిసిన తర్వాత కూడా క్లెయిమ్‌ తిరస్కరించడానికి ఇక మీదట కూడా బీమా సంస్థలకు అధికారం ఉంటుంది.ఈ ఐదేళ్లు అన్నది సదరు వ్యక్తి ఆ పాలసీ మొదటి సంవత్సరం నుంచి వర్తిస్తుంది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పోర్టబులిటీ ద్వారా మారినప్పటికీ, అంతకుముందు సంస్థల్లోని కాలం కూడా కలుస్తుంది. అలాగే, ఈ మారటోరియం అన్నది మొదట తీసుకున్న బీమా కవవరేజీకే ఐదేళ్లు వర్తిస్తుంది. ఇది ఎలా అంటే ఉదాహరణకు ఆరంభంలో రూ.5 లక్షలకు తీసుకున్నారని అనుకుందాం. ఐదేళ్ల తర్వాత రూ.10 లక్షలకు పెంచుకున్నారని అనుకుందాం.అప్పుడు ఐదేళ్లు ముగిసిన మొదటి రూ.5 లక్షల కవరేజీకి మారటోరియం తొలగిపోతుంది. పెంచుకున్న కవరేజీ అప్పటి నుంచి ఐదేళ్లు ముగిసిన తర్వాతే మారటోరియం పరిధిలోకి వస్తుంది. ‘‘ఇది పాలసీదారుల అనుకూల నిర్ణయం. ఎనిమిదేళ్లు మారటోరియం అన్నది చాలా సుదీర్ఘమైనది. పాలసీ తీసుకునే ముందే ఏవైనా వ్యాధులు ఉంటే అవి బయట పడేందుకు ఐదేళ్లు సరిపోతుంది. ఏదైనా మోసం ఉంటే దాన్ని నిరూపించాల్సిన బాధ్యత బీమా సంస్థపైనే ఉంటుంది’’అని  ఇన్సూరెన్స్‌ సమాధాన్‌ సంస్థ సీఈవో శిల్పా అరోరా పేర్కొన్నారు.  ప్రీమియం భారం..వృద్ధులకూ ఆరోగ్య బీమా కవరేజీని విస్తతం చేయడమే ఐఆర్‌డీఏఐ తాజా చర్య వెనుక ఉద్దేశ్యం. దీంతో బీమా సంస్థలు ఇప్పుడు ఏ వయసు వారికైనా బీమా పాలసీలను ఆఫర్‌ చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో పోటీ ఎలానూ ఉంటుంది. కనుక ఇక మీదట వృద్ధుల కోసం బీమా సంస్థలు మరిన్ని నూతన ఉత్పత్తులను తీసుకురానున్నాయి. అదే సమయంలో వీటి ప్రీమియం 10–15 శాతం వరకు పెరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు.అంతేకాదు, ఇతర పాలసీదారులపైనా ప్రీమియం భారం పడనుంది. వెయిటింగ్‌ పీరియడ్‌ తగ్గించడం వల్ల బీమా సంస్థలకు క్లెయిమ్‌లు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా అన్ని పాలసీల ప్రీమియంను బీమా సంస్థలు సవరించొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం సామాన్య, మధ్యతరగతి వాసులకు భరించలేని స్థాయికి చేరగా, ఇప్పుడు మరో విడత పెంపుతో ఈ భారం మరింత అధికం కానుంది.  65 ఏళ్ల పరిమితి లేదిక.. 2016 నాటి ఆరోగ్య బీమా మార్గదర్శకాల ప్రకారం బీమా సంస్థలు 65 ఏళ్లలోపు వారికి తప్పనిసరిగా హెల్త్‌ కవరేజ్‌ ఆఫర్‌ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక కారణాలు ఉంటే తప్పించి ఈ వయసులోపు వారికి కవరేజీని తిరస్కరించరాదన్నది నిబంధనల్లోని ఉద్దేశ్యం. 65 ఏళ్లు దాటిన వారికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను ఇవ్వడం, ఇవ్వకపోడం బీమా కంపెనీల అభీష్టంపైనే ఆధారపడి ఉండేది. అంతేకానీ, 65 ఏళ్లు నిండిన వారికి సైతం ఆరోగ్య బీమా కవరేజీ ఇవ్వాలని బీమా సంస్థలపై ఇప్పటి వరకు ఎలాంటి ఒత్తిడి లేదు.తాజా నిబంధనల్లో 65 ఏళ్లను ఐఆర్‌డీఏఐ ప్రస్తావించలేదు. అంటే వృద్ధుల విషయంలో బీమా కంపెనీలకు మరింత స్వేచ్ఛనిచి్చనట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వివిధ వయసుల వారి అవసరాలకు తగ్గట్టు ప్రత్యేకమైన ఫీచర్లతో పాలసీలను బీమా సంస్థలు తీసుకురావచ్చంటున్నారు. 65 ఏళ్లకు మించిన వారికి సైతం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇచ్చేందుకు ఐఆర్‌డీఏఐ అనుమతించిందన్న వార్తలు వాస్తవం కాదు. నిబంధనల్లో 65 ఏళ్ల పరిమితిని తొలగించింది అంతే.ఈ ఏడాది మార్చి వరకు అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం కూడా 65 ఏళ్లు దాటిన వారికి ఆరోగ్య బీమా ఆఫర్‌ చేయడంపై ఎలాంటి నిషేధం లేదు. అందుకే 65 ఏళ్లు దాటిన వారికి సైతం కొన్ని బీమా సంస్థలు ప్రత్యేక ఆరోగ్య బీమా పాలసీలను ఇప్పటికే మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ‘‘ఇప్పటి వరకు ఉన్న 65 ఏళ్ల పరిమితిని ఆసరాగా తీసుకుని.. అంతకుమించిన వయసు వారికి ఆరోగ్య బీమా కవరేజీ ప్రతిపాదనలను కొన్ని బీమా సంస్థలు నిరాకరించేవి.ఇప్పుడు దీన్ని తొలగించడం వల్ల ఇక మీదట అలా చేయడం కుదరదు. వివిధ వయసుల వారికి అనుగుణమైన బీమా ఉత్పత్తులను రూపొందించి, ప్రీమియం నిర్ణయించాల్సిందే’’అని రాయల్‌ సుందరం జనరల్‌ ఇన్సూరెన్స్‌ హెల్త్‌ ఇన్సనూరెన్స్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ నిఖిల్‌ ఆప్టే పేర్కొన్నారు. సాధారణంగా వృద్ధులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం ఇతరులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వయసులో అనారోగ్యాల ముప్పు ఎక్కువగా ఉండడం ఇందుకు కారణం.

Momentum Investing for High Returns: Chintan Haria
అధిక రాబడులకు మూమెంటమ్‌ ఇన్వెస్టింగ్‌..

అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా భారత ఎకానమీ పటిష్టంగా ముందుకు సాగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు సుమారు 7.6 శాతంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7 శాతంగా ఉంటుందనే సానుకూల అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి గతి (మూమెంటమ్‌) భారత్‌కు సానుకూలంగా ఉందనడానికి ఇవి నిదర్శనాలు. దీన్ని భారతీయ స్టాక్‌ మార్కెట్లకు కూడా అన్వయించుకోవచ్చు. గత కొన్నాళ్లుగా పలు స్టాక్స్‌ ధరలు పెరుగుతూనే ఉండగా, మరికొన్ని అదే గతిని ఇకపైనా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో మూమెంటమ్‌ను కీలక ఫిల్టరుగా ఉపయోగించి స్టాక్స్‌ను ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉండగలదు. మూమెంటమ్‌ ఇన్వెస్టింగ్‌ సూత్రం ప్రకారం లాభాల బాటలో ఉన్న కొన్ని స్టాక్స్‌ సమీప భవిష్యత్తులోనూ అదే గతిని కొనసాగించే అవకాశాలు ఉంటాయి. సమయానుగుణంగా ఇలాంటి స్టాక్స్‌ సమూహం మారవచ్చు గానీ సరైన మూమెంటమ్‌ స్టాక్స్‌లో కనుక ఇన్వెస్ట్‌ చేస్తే పోర్ట్‌ఫోలియో మొత్తానికి లబ్ధిని చేకూర్చగలవు. ఇలాంటి వాటిలో సులభంగా ఇన్వెస్ట్‌ చేసేందుకు ఉపయోగపడే పలు మార్గాల్లో నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 ఇండెక్స్‌ కూడా ఒకటి. ఈ సూచీ ప్రాతిపదికన ఈటీఎఫ్‌లు, ఇండెక్స్‌ ఫండ్స్‌ .. ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి.  పెరిగే ధరతో ప్రయోజనంపెరగడమైనా, తగ్గడమైనా ధరల్లో కదలికలు ఒకసారి మొదలైతే కొన్నాళ్ల పాటు స్థిరంగా అవే ధోరణులు కొనసాగుతాయనే ప్రాతిపదికన మూమెంటమ్‌ విధానం ఉంటుంది. మూమెంటమ్‌ ధోరణిని నిర్ణయించేందుకు 6 నెలలు, 12 నెలల ధరల కదలికలను పరిగణనలోకి తీసుకుంటారు. మూమెంటమ్‌ ఇన్వెస్టింగ్‌ విధానంలో ధర పెరుగుతున్న స్టాక్స్‌లో స్వల్పకాలిక పొజిషన్లు తీసుకుని, ట్రెండ్‌ బలహీనపడుతున్నప్పుడు వాటి నుంచి నిష్క్రమించడం ద్వారా మార్కెట్లో హెచ్చుతగ్గుల నుంచి ప్రయోజనం పొందే ప్రయత్నం జరుగుతుంది.ఆ తర్వాత పరుగు అందుకుంటున్న వేరే స్టాక్స్‌పై దృష్టి పెడతారు. నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 సూచీలో నిఫ్టీ 200 స్టాక్స్‌ నుంచి ఎంపిక చేసిన 30 షేర్లు ఉంటాయి. కనీసం సంవత్సర కాలం పాటు లిస్టింగ్‌ చరిత్ర ఉండి, ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ సెగ్మెంట్లలో ట్రేడింగ్‌కి అందుబాటులో ఉన్న స్టాక్స్‌కు ఇందులో చోటు లభించే అవకాశం ఉంటుంది. మూమెంటమ్‌ స్కోరు ప్రాతిపదికన స్టాక్స్‌ను ఎంపిక చేస్తారు. 2024 మార్చి 31 నాటి డేటా ప్రకారం ప్రస్తుతం ఈ సూచీలోని టాప్‌ 5 రంగాల్లో ఆటో–ఆటో విడిభాగాల రంగానికి అత్యధికంగా 22.9%, హెల్త్‌కేర్‌కి 18 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌కి 15.5 శాతం, ఆర్థిక సేవలకు 12.2 శాతం, కన్జూమర్‌ సర్వీసెస్‌ షేర్లకు 5.8 శాతం వాటా ఉంది. సూచీలోని స్టాక్స్‌ను ఏటా జూన్, డిసెంబర్‌లో సమీక్షిస్తారు.సాధారణ బెంచ్‌మార్క్‌కు మించి రాబడులుధరలు పెరిగే అవకాశమున్న వాటినే ఎంపిక చేయడం వల్ల ఈ సూచీలోని స్టాక్స్‌ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి సాధారణ బెంచ్‌మార్క్‌ సూచీతో పోలిస్తే అధిక రాబడులు పొందేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు 2020 ఆఖర్లో అత్యంత మెరుగ్గా రాణిస్తున్న ఐటీ, హెల్త్‌కేర్‌ స్టాక్స్‌కు అధిక వెయిటేజీ లభించింది. ఇక 2022 చివర్లో ఆర్థిక సేవల రంగం రాణిస్తుండటంతో దానికి ప్రాధాన్యం పెరిగింది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలికంగా చూసినప్పుడు నిఫ్టీ 200 సూచీతో పోలిస్తే నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 ఇండెక్స్‌ చాలా మెరుగ్గా రాణించింది. ఈ పట్టికను బట్టి చూస్తే మూడు నుంచి అయిదేళ్ల వ్యవధిలో మూమెంటమ్‌ ఇండెక్స్‌.. నిఫ్టీ 200 కన్నా 7–10 పర్సంటేజీ పాయింట్ల మేర అధిక రాబడులే అందించిన సంగతి స్పష్టమవుతోంది. నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 ఇండెక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఇన్వెస్టర్లు ఈటీఎఫ్‌ మార్గాన్ని ఎంచుకోవచ్చు. డీమ్యాట్‌ అకౌంటు లేని వారు ఇండెక్స్‌ ఫండ్‌ మార్గం ద్వారా ఇన్వెస్ట్‌ చేయొచ్చు.                                                               1 ఏడాది       3 ఏళ్లు    5 ఏళ్లు నిఫ్టీ 200 మూమెంటమ్‌    30 టీఆర్‌ఐ    70.0%         28.6%     23.6% నిఫ్టీ 200 టీఆర్‌ఐ                                   38.3%         18.4%   16.5%  

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 100 gm 8750.00 100.00
Gold 22K 10gm 66050.00 200.00
Gold 24k 10 gm 72050.00 220.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement