Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Nearly 6 lakh IT returns filed within 30 days of portal opening
Income tax: నెల రోజుల్లో 6 లక్షల ఐటీ రిటర్న్స్‌

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ స్వీకరణ ప్రారంభమైన నెల రోజుల్లో దాదాపు 6 లక్షల ఐటీ రిటర్న్స్‌ దాఖలయ్యాయి. వీటిని ఆదాయపన్ను శాఖ అంతే వేగంగా ప్రాసెస్‌ చేయడం విశేషం. వెరిఫై చేసిన రిటర్న్స్‌లో దాదాపు మూడింట రెండు వంతులు ఇప్పటికే ప్రాసెస్ అయినట్లు బిజినెస్ లైన్ నివేదించింది.2024-25 అసెస్‌మెంట్ ఇయర్ (FY25) మొదటి నెలలో ఏప్రిల్ 29 నాటికి 5.92 లక్షలకు పైగా రిట‍ర్న్స్‌ దాఖలయ్యాయి. వీటిలో 5.38 లక్షలకు పైగా వెరిఫై కాగా  3.67 లక్షల వెరిఫైడ్ రిటర్న్స్‌ను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున అంటే ఏప్రిల్‌ 1న ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించింది.ముందస్తుగా ఐటీ రిటర్న్స్‌ ఫైల్ చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు త్వరగా రీఫండ్‌ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పెనాల్టీ లేకుండా రిటర్న్స్‌ను రివైజ్ చేయడానికి లేదా సరిచేయడానికి తగినంత సమయం లభిస్తుంది. అయితే, ఉద్యోగులు మాత్రం కొంత సమయం వేచి ఉంటే మంచిదని సూచిస్తున్నారు. కా 2024-25 అసెస్‌మెంట్ ఇయర్‌కు ఐటీ రిటర్న్స్‌ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ.

Bajaj Auto MD Rajiv Bajaj urges for lower GST on commuter bikes
వాహనాల ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా..?

పుణే, బిజినెస్‌ బ్యూరో: కాలుష్యాన్ని కట్టడి చేసే పేరిట అతి నియంత్రణలు, అధిక స్థాయి జీఎస్‌టీలను అమలు చేయడం వల్లే వాహనాల రేట్లకు రెక్కలు వచ్చాయని బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ వ్యాఖ్యానించారు. బ్రెజిల్‌ వంటి దేశాల్లో మోటార్‌సైకిళ్లపై పన్నులు 8–14 శాతం శ్రేణిలో ఉండగా దేశీయంగా మాత్రం అత్యధికంగా 28 శాతం జీఎస్‌టీ ఉంటోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనాల ధరలను తగ్గించే పరిస్థితి ఉండటం లేదని, దీంతో నిర్వహణ వ్యయాలైనా తగ్గే విధంగా వాహనాలను రూపొందించడం ద్వారా కొనుగోలుదారులకు కొంతైనా ఊరటనిచ్చే ప్రయత్నం జరుగుతోందని బజాజ్‌ చెప్పారు.  125 సీసీ పైగా సామర్ధ్యం ఉండే స్పోర్ట్స్‌ మోటార్‌సైకిళ్ల విభాగంలో తమకు ముప్ఫై రెండు శాతం మేర వాటా ఉందని, దీన్ని మరింతగా పెంచుకునే దిశగా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నినాదం తరహాలో డబుల్‌ ఇంజిన్‌ కారోబార్‌ (కార్యకలాపాలు) వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజీవ్‌ చెప్పారు.బజాజ్‌ పల్సర్‌ 400 ధర  రూ. 1,85,000బజాజ్‌ ఆటో తాజాగా పల్సర్‌ ఎన్‌ఎస్‌ 400జీ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్‌ కింద దీని ధర రూ. 1,85,000గా  (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది. డెలివరీలు జూన్‌ మొదటివారం నుంచి ప్రారంభమవుతాయని సంస్థ ఎండీ రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. స్పోర్ట్స్‌ సెగ్మెంట్‌లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు పల్సర్‌ బైకులు 1.80 కోట్ల పైచిలుకు అమ్ముడైనట్లు బజాజ్‌ వివరించారు. పరిమిత కాలం పాటు వర్తించే ఆఫర్‌ కింద కొత్త పల్సర్‌ను రూ. 5,000కే బుక్‌ చేసుకోవచ్చు.  నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది. శక్తివంతమైన 373 సీసీ ఇంజిన్, 6 స్పీడ్‌ గేర్‌ బాక్స్, ఎల్రక్టానిక్‌ థ్రోటిల్‌ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌ను జూన్‌ 18న ఆవిష్కరించనున్నామని రాజీవ్‌ చెప్పారు.  ఇది ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ అన్నారు. 

Nifty retreats after hitting fresh highs
రికార్డు గరిష్టం నుంచి నిఫ్టీ వెనక్కి..

ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్‌ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. అధిక వెయిటేజీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(–2%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌( –1%), భారతీ ఎయిర్‌టెల్‌(–2%), ఎల్‌అండ్‌టీ (–3%) క్షీణించి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి.   వారాంతాపు రోజున సెన్సెక్స్‌ 733 పాయింట్లు పతనమై 73,878 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 172 పాయింట్లు నష్టపోయి 22,475 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 484 పాయింట్లు పెరిగి 75,095 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 147 పాయింట్లు బలపడి 22,795 జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(75,095) నుంచి 1630 పాయింట్లు కోల్పోయి 73,465 వద్ద, నిఫ్టీ ఆల్‌టైం హై స్థాయి (22,795) నుంచి 447 పాయింట్లు క్షీణించి 22,348 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచి్చంది.  ∗ సెన్సెక్స్‌ ఒకశాతం పతనంతో బీఎస్‌ఈలో రూ.2.25 లక్షల కోట్లు హరించుకుపోయాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో కంపెనీల మొ త్తం విలువ రూ.406 లక్షల కోట్లకు దిగివచి్చంది.  

Apple logs strong double-digit growth in India
భారత్‌లో యాపిల్‌ జోరు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ భారత్‌ మార్కెట్లో జోరు కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి త్రైమాసికంలో కంపెనీ 90.8 బిలియన్‌ డాలర్ల ఆదాయం సాధించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 4% తగ్గినప్పటికీ భారత్‌లో మాత్రం బలమైన రెండంకెల వృద్ధితో సరికొత్త రికార్డు నమోదు చేయడం విశేషం.  అంతర్జాతీయంగా మార్చి త్రైమాసికంలో ఐఫోన్ల విక్రయాలు 10.4 % క్షీణించి 45.9 బిలియన్‌ డాలర్లకు వచ్చి చేరాయి.  

Stock Market nifty on today closing
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు.. 22,500 దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 191 పాయింట్లు నష్టపోయి 22,456 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 732 పాయింట్లు దిగజారి 73,878 వద్దకు చేరింది.సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎం అండ్‌ ఎం, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.ఎల్‌ అండ్‌ టీ, మారుతీ సుజుకీ, భారతీ సుజుకీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐటీసీ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Nepal facing widespread outages in internet due to payments owed to Indian companies
నేపాల్‌లో నిలిచిన ఇంటర్నెట్‌ సేవలు.. కారణం..

నేపాల్‌ ప్రైవేట్‌ ఇంటర్నెట్‌ ప్రొవైడర్లు భారతీయ కంపెనీలకు చెల్లింపులు చేయకపోవడంతో ఇంటర్నెట్‌ సేవలు నిలిచాయి. నేపాల్‌కు చెందిన అప్‌స్ట్రీమ్ భాగస్వాములు బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు నేపాల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (ఇస్పాన్‌) తెలిపింది.నేపాల్‌లోని ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీలు గురువారం రాత్రి తమ సేవలను నిలిపేసినట్లు ఇస్పాన్‌ పేర్కొంది. ఇంటర్నెట్ మానిటర్ సంస్థ నెట్‌బ్లాక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం..18 నేపాలీ ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఐదు గంటలపాటు సర్వీసులను తగ్గించినట్లు, అందులో కొన్ని బ్యాండ్‌ విడ్త్‌ను పూర్తిగా తగ్గించినట్లు తేలింది. ఇంటర్నెట్‌ అంతరాయం కొనసాగవచ్చని, ఈ అంశం తమ పరిధిలో లేదని ఇస్పాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సువాష్ ఖడ్కా తెలిపారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌ సేవలకు అధికప్రాధాన్యం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.ఇదీ చదవండి:  భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..స్థానిక బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్లు భారతీయ కంపెనీలకు సుమారు మూడు బిలియన్ నేపాలీ రూపాయలు (రూ.187 కోట్లు) బకాయిపడ్డారు. అయితే బయటిదేశాలకు డబ్బు బదిలీ చేయడానికి అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఇంటర్నెట్ ప్రొవైడర్లు పాత బకాయిలు చెల్లిస్తేనే సర్వీసులు అందిస్తామని కంపెనీలు చెబుతున్నాయి. కొంతకాలంగా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇటీవల ఇంటర్నెట్‌ సర్వీసులు నిలిపేసినట్లు తెలిసింది. నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ లెక్కల ప్రకారం ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీలకు 10 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లున్నారని సమాచారం.

Again Rainfall In Dubai More Flights Been Cancelled
ఎడారి దేశంలో మళ్లీ వర్షం.. విమాన సర్వీసులు రద్దు

ఎడారి దేశం దుబాయ్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. యూఏఈలో గురువారం మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. దుబాయ్ వాతావరణ శాఖ శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. దాంతో అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. దుబాయ్‌లో బస్సు సర్వీసులను కూడా నిలిపేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమా, అబుదాబి అంతటా ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్‌ వంటి విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ముందే నివేదించాయి. ‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్, అబుదాబి, షార్జాలలో విమాన సర్వీసుల్లో మార్పులుంటాయి. వర్షాల కారణంగా స్థానికంగా రోడ్డు ప్రయాణాల్లో అవాంతరాలు కలుగొచ్చు. అందుకు తగ్గట్టుగా ప్రయాణికులు సిద్ధంకావాలి’ అని ఇండిగో ఎయిర్‌లైన్ తన ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్‌ చేసింది.ఇదీ చదవండి:  భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..బుధవారం రోజునే దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లు స్థానిక విమానయాన సంస్థలతోపాటు ప్రయాణికులకు సలహాలు జారీ చేశాయి. అక్కడి జాతీయ దినపత్రిక ఖలీజ్ టైమ్స్ కథనాల ప్రకారం..గురువారం రాత్రి దుబాయ్‌కి వెళ్లే ఐదు ఇన్‌బౌండ్ విమానాలను దారి మళ్లించగా, తొమ్మిది అరైవల్‌, నాలుగు అవుట్‌బౌండ్ సర్వీసులను రద్దు చేసినట్లు తెలిసింది.#6ETravelAdvisory: Due to bad weather in #Dubai #Sharjah #RasAlKhaimah #AbuDhabi, our flight operations are impacted. Road blockages may disrupt local transport. Plan accordingly and allow extra time for airport travel. Check flight status at https://t.co/F83aKzsIHg— IndiGo (@IndiGo6E) May 2, 2024

Tesla lodged a complaint with the Delhi High Court for violating its trademark
భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..

గురుగ్రామ్‌లోని టెస్లా పవర్ ఇండియా అనధికారికంగా తమ ట్రేడ్‌మార్క్‌ను వాడుకుంటోందని ఎలొన్‌మస్క్‌ ఆధ్వర్యంలోని టెస్లా ఇంక్ గురువారం దిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేసింది. టెస్లా పవర్.. టెస్లా ఇంక్‌ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని సంస్థ తరఫు న్యాయవాది చందర్ లాల్ కోర్టును అభ్యర్థించారు.‘గురుగ్రామ్ ఆధారిత కంపెనీ టెస్లా పవర్‌ ఇండియా.. టెస్లా ఇంక్‌ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోంది. కంపెనీ వ్యాపారాలపై కూడా దాని ప్రభావం పడుతోంది. టెస్లా పవర్ బ్యాటరీలకు సంబంధించిన ఫిర్యాదులను తమ వినియోగదారులు పొరపాటుగా టెస్లా ఇంక్‌తో లింక్ చేస్తున్నారు. ఆ ఫిర్యాదులను నేరుగా అమెరికన్ కంపెనీకి ఫార్వర్డ్ చేస్తున్నారు. టెస్లా పవర్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీగా జాతీయ వార్తాపత్రికల్లో అమెరికన్‌ కంపెనీ లోగోతో ప్రచారం చేసింది. టెస్లా పవర్ ‘టెస్లా’ ట్రేడ్‌మార్క్ వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి’ అని చందర్‌లాల్‌ వాదనలు వినిపించారు.టెస్లా పవర్ ఈవీ బ్యాటరీలను ఉత్పత్తి చేయదని సంప్రదాయ వాహనాలు, ఇన్వర్టర్లలో ఉపయోగించే లెడ్ యాసిడ్ బ్యాటరీలను విక్రయిస్తుందని వాదించింది. ఈ సందర్భంగా కంపెనీ ఛైర్మన్ కవీందర్ ఖురానా మాట్లాడుతూ..తమ కంపెనీకి యూఎస్‌లో భాగస్వామ్య సంస్థ ఉందన్నారు. అయితే తాము ఎలాంటి ఈవీను తయారుచేయమని స్పష్టం చేశారు. ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించే ఉద్దేశం తమ కంపెనీకి లేదని ఖురానా చెప్పారు. తాము మరో సంస్థ ‘ఈ-అశ్వ’తో కలిసి ప్రకటన ఇచ్చినట్లు పేర్కొన్నారు. టెస్లా పవర్ బ్రాండెడ్ ఉత్పత్తుల విక్రయానికి ఈ కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్నారు.ఇదీ చదవండి: భారత్‌లో ఎలక్ట్రానిక్స్‌ తయారీ పెంచేలా ఏం చేస్తున్నారంటే..ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిష్ దయాల్ టెస్లా పవర్‌కి నోటీసు జారీ చేశారు. తదుపరి విచారణను మే 22 తేదీకి వాయిదా వేశారు. టెస్లా ఇంక్‌ను పోలి ఉండే ట్రేడ్‌మార్క్‌తో ఎలాంటి ప్రచార ప్రకటనలను విడుదల చేయకూడదని ఆదేశించారు. అయితే, టెస్లా ఇంక్ ఈ కేసులో ఎలాంటి ఎమర్జెన్సీను ప్రదర్శించలేదని తెలిసింది. 2020 నుంచి ఇరు కంపెనీల మధ్య సంప్రదింపులు సాగుతున్నట్లు సమాచారం.

gold price today rate down may 3
కరుణించిన కనకమహాలక్ష్మి! దిగొచ్చిన బంగారం

దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. క్రితం రోజున భారీ పెరుగుదలను చూసిన బంగారం నేడు (మే 3) గణనీయంగా తగ్గింది. ఏకంగా రూ.1090 మేర తగ్గడంతో ఈరోజు కొనుగోలు చేస్తున్నవారికి పెద్ద ఊరట కలిగింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖపట్నంలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.500 తగ్గి రూ.65,750 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా ధర రూ.540 తగ్గి రూ. 71,730 లకు దిగొచ్చింది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 తగ్గి రూ.65,900 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.540 తగ్గి రూ.71,880 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.500 క్షీణించి రూ.65,750 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 తగ్గి రూ.71,730 వద్దకు క్షీణించింది.చెన్నైలో భారీగా..చెన్నైలో ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.1000 తగ్గి రూ.66,150 ల​కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.1090 తగ్గి రూ.72,160గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 క్షీణించి రూ.65,750 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 తగ్గి రూ.71,730 లకు తగ్గింది. 

heatwaves could reduce farm output impacting food prices
ఎండ దెబ్బతో జేబుకు చిల్లులు! ఆందోళన కలిగిస్తున్న అంచనాలు

ఎండ దెబ్బతో జేబుకు చిల్లులు ఏంటి అనుకుంటున్నారా? దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నుంచి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరుగుతున్నాయి. ఇవి ఇప్పట్లో తగ్గే అవకాశాల్లేవని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.మానవాళి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ఈ తీవ్రమైన ఎండలు, ఉష్ణోగ్రతలు వ్యవసాయోత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేయగలవని, దీంతో అధిక ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతిని ద్రవ్యోల్బణం 30-50 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని సంకేతాలిస్తున్నారు. సాధారణ రుతుపవనాలు వచ్చే జూన్ వరకు ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.హీట్‌వేవ్ ప్రభావం పాడైపోయే ఆహార వస్తువులు, ముఖ్యంగా కూరగాయలపై ఎక్కువగా ఉంటుందని, ఇది ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని డీబీఎస్‌ గ్రూప్ రీసెర్చ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఎకనామిస్ట్ అయిన రాధికా రావు ది ఎకనామిక్ టైమ్స్‌తో అన్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం 30-50 బేసిస్ పాయింట్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న హీట్‌వేవ్ గ్రామీణ వ్యవసాయ ఆదాయం, ఆహార ద్రవ్యోల్బణం, సాధారణ ఆరోగ్య పరిస్థితులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కేర్‌ఎడ్జ్ ముఖ్య ఆర్థికవేత్త రజనీ సిన్హా వివరించారు.గడిచిన మార్చిలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 10 నెలల కనిష్ట స్థాయికి 4.9 శాతానికి తగ్గింది. కానీ ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా 8.5 శాతం వద్ద ఉంది. ప్రధానంగా కూరగాయల ధరలు గణనీయంగా పెరగడం వల్ల ఇది 28 శాతం పెరిగింది. కూరగాయల ద్రవ్యోల్బణం వరుసగా ఐదు నెలలుగా రెండంకెల స్థాయిలోనే ఉంది. ఈ త్రైమాసికంలో సగటున 28 శాతం ఉండవచ్చని, అదనంగా, పండ్ల ధరలు కూడా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. విపరీతమైన వాతావరణ పరిస్థితులలో సరుకు రవాణా సవాళ్లు అస్థిరతను పెంచుతాయని పిరమల్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ దేబోపం చౌధురి అభిప్రాయపడ్డారు.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 65.70 75.20

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement