Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Stock Market nifty on today closing
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు.. 22,500 దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 191 పాయింట్లు నష్టపోయి 22,456 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 732 పాయింట్లు దిగజారి 73,878 వద్దకు చేరింది.సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎం అండ్‌ ఎం, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.ఎల్‌ అండ్‌ టీ, మారుతీ సుజుకీ, భారతీ సుజుకీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐటీసీ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Nepal facing widespread outages in internet due to payments owed to Indian companies
నేపాల్‌లో నిలిచిన ఇంటర్నెట్‌ సేవలు.. కారణం..

నేపాల్‌ ప్రైవేట్‌ ఇంటర్నెట్‌ ప్రొవైడర్లు భారతీయ కంపెనీలకు చెల్లింపులు చేయకపోవడంతో ఇంటర్నెట్‌ సేవలు నిలిచాయి. నేపాల్‌కు చెందిన అప్‌స్ట్రీమ్ భాగస్వాములు బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు నేపాల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (ఇస్పాన్‌) తెలిపింది.నేపాల్‌లోని ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీలు గురువారం రాత్రి తమ సేవలను నిలిపేసినట్లు ఇస్పాన్‌ పేర్కొంది. ఇంటర్నెట్ మానిటర్ సంస్థ నెట్‌బ్లాక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం..18 నేపాలీ ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఐదు గంటలపాటు సర్వీసులను తగ్గించినట్లు, అందులో కొన్ని బ్యాండ్‌ విడ్త్‌ను పూర్తిగా తగ్గించినట్లు తేలింది. ఇంటర్నెట్‌ అంతరాయం కొనసాగవచ్చని, ఈ అంశం తమ పరిధిలో లేదని ఇస్పాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సువాష్ ఖడ్కా తెలిపారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌ సేవలకు అధికప్రాధాన్యం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.ఇదీ చదవండి:  భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..స్థానిక బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్లు భారతీయ కంపెనీలకు సుమారు మూడు బిలియన్ నేపాలీ రూపాయలు (రూ.187 కోట్లు) బకాయిపడ్డారు. అయితే బయటిదేశాలకు డబ్బు బదిలీ చేయడానికి అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఇంటర్నెట్ ప్రొవైడర్లు పాత బకాయిలు చెల్లిస్తేనే సర్వీసులు అందిస్తామని కంపెనీలు చెబుతున్నాయి. కొంతకాలంగా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇటీవల ఇంటర్నెట్‌ సర్వీసులు నిలిపేసినట్లు తెలిసింది. నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ లెక్కల ప్రకారం ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీలకు 10 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లున్నారని సమాచారం.

Again Rainfall In Dubai More Flights Been Cancelled
ఎడారి దేశంలో మళ్లీ వర్షం.. విమాన సర్వీసులు రద్దు

ఎడారి దేశం దుబాయ్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. యూఏఈలో గురువారం మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. దుబాయ్ వాతావరణ శాఖ శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. దాంతో అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. దుబాయ్‌లో బస్సు సర్వీసులను కూడా నిలిపేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమా, అబుదాబి అంతటా ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్‌ వంటి విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ముందే నివేదించాయి. ‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్, అబుదాబి, షార్జాలలో విమాన సర్వీసుల్లో మార్పులుంటాయి. వర్షాల కారణంగా స్థానికంగా రోడ్డు ప్రయాణాల్లో అవాంతరాలు కలుగొచ్చు. అందుకు తగ్గట్టుగా ప్రయాణికులు సిద్ధంకావాలి’ అని ఇండిగో ఎయిర్‌లైన్ తన ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్‌ చేసింది.ఇదీ చదవండి:  భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..బుధవారం రోజునే దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లు స్థానిక విమానయాన సంస్థలతోపాటు ప్రయాణికులకు సలహాలు జారీ చేశాయి. అక్కడి జాతీయ దినపత్రిక ఖలీజ్ టైమ్స్ కథనాల ప్రకారం..గురువారం రాత్రి దుబాయ్‌కి వెళ్లే ఐదు ఇన్‌బౌండ్ విమానాలను దారి మళ్లించగా, తొమ్మిది అరైవల్‌, నాలుగు అవుట్‌బౌండ్ సర్వీసులను రద్దు చేసినట్లు తెలిసింది.#6ETravelAdvisory: Due to bad weather in #Dubai #Sharjah #RasAlKhaimah #AbuDhabi, our flight operations are impacted. Road blockages may disrupt local transport. Plan accordingly and allow extra time for airport travel. Check flight status at https://t.co/F83aKzsIHg— IndiGo (@IndiGo6E) May 2, 2024

Tesla lodged a complaint with the Delhi High Court for violating its trademark
భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..

గురుగ్రామ్‌లోని టెస్లా పవర్ ఇండియా అనధికారికంగా తమ ట్రేడ్‌మార్క్‌ను వాడుకుంటోందని ఎలొన్‌మస్క్‌ ఆధ్వర్యంలోని టెస్లా ఇంక్ గురువారం దిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేసింది. టెస్లా పవర్.. టెస్లా ఇంక్‌ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని సంస్థ తరఫు న్యాయవాది చందర్ లాల్ కోర్టును అభ్యర్థించారు.‘గురుగ్రామ్ ఆధారిత కంపెనీ టెస్లా పవర్‌ ఇండియా.. టెస్లా ఇంక్‌ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోంది. కంపెనీ వ్యాపారాలపై కూడా దాని ప్రభావం పడుతోంది. టెస్లా పవర్ బ్యాటరీలకు సంబంధించిన ఫిర్యాదులను తమ వినియోగదారులు పొరపాటుగా టెస్లా ఇంక్‌తో లింక్ చేస్తున్నారు. ఆ ఫిర్యాదులను నేరుగా అమెరికన్ కంపెనీకి ఫార్వర్డ్ చేస్తున్నారు. టెస్లా పవర్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీగా జాతీయ వార్తాపత్రికల్లో అమెరికన్‌ కంపెనీ లోగోతో ప్రచారం చేసింది. టెస్లా పవర్ ‘టెస్లా’ ట్రేడ్‌మార్క్ వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి’ అని చందర్‌లాల్‌ వాదనలు వినిపించారు.టెస్లా పవర్ ఈవీ బ్యాటరీలను ఉత్పత్తి చేయదని సంప్రదాయ వాహనాలు, ఇన్వర్టర్లలో ఉపయోగించే లెడ్ యాసిడ్ బ్యాటరీలను విక్రయిస్తుందని వాదించింది. ఈ సందర్భంగా కంపెనీ ఛైర్మన్ కవీందర్ ఖురానా మాట్లాడుతూ..తమ కంపెనీకి యూఎస్‌లో భాగస్వామ్య సంస్థ ఉందన్నారు. అయితే తాము ఎలాంటి ఈవీను తయారుచేయమని స్పష్టం చేశారు. ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించే ఉద్దేశం తమ కంపెనీకి లేదని ఖురానా చెప్పారు. తాము మరో సంస్థ ‘ఈ-అశ్వ’తో కలిసి ప్రకటన ఇచ్చినట్లు పేర్కొన్నారు. టెస్లా పవర్ బ్రాండెడ్ ఉత్పత్తుల విక్రయానికి ఈ కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్నారు.ఇదీ చదవండి: భారత్‌లో ఎలక్ట్రానిక్స్‌ తయారీ పెంచేలా ఏం చేస్తున్నారంటే..ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిష్ దయాల్ టెస్లా పవర్‌కి నోటీసు జారీ చేశారు. తదుపరి విచారణను మే 22 తేదీకి వాయిదా వేశారు. టెస్లా ఇంక్‌ను పోలి ఉండే ట్రేడ్‌మార్క్‌తో ఎలాంటి ప్రచార ప్రకటనలను విడుదల చేయకూడదని ఆదేశించారు. అయితే, టెస్లా ఇంక్ ఈ కేసులో ఎలాంటి ఎమర్జెన్సీను ప్రదర్శించలేదని తెలిసింది. 2020 నుంచి ఇరు కంపెనీల మధ్య సంప్రదింపులు సాగుతున్నట్లు సమాచారం.

gold price today rate down may 3
కరుణించిన కనకమహాలక్ష్మి! దిగొచ్చిన బంగారం

దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. క్రితం రోజున భారీ పెరుగుదలను చూసిన బంగారం నేడు (మే 3) గణనీయంగా తగ్గింది. ఏకంగా రూ.1090 మేర తగ్గడంతో ఈరోజు కొనుగోలు చేస్తున్నవారికి పెద్ద ఊరట కలిగింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖపట్నంలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.500 తగ్గి రూ.65,750 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా ధర రూ.540 తగ్గి రూ. 71,730 లకు దిగొచ్చింది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 తగ్గి రూ.65,900 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.540 తగ్గి రూ.71,880 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.500 క్షీణించి రూ.65,750 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 తగ్గి రూ.71,730 వద్దకు క్షీణించింది.చెన్నైలో భారీగా..చెన్నైలో ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.1000 తగ్గి రూ.66,150 ల​కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.1090 తగ్గి రూ.72,160గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 క్షీణించి రూ.65,750 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 తగ్గి రూ.71,730 లకు తగ్గింది. 

heatwaves could reduce farm output impacting food prices
ఎండ దెబ్బతో జేబుకు చిల్లులు! ఆందోళన కలిగిస్తున్న అంచనాలు

ఎండ దెబ్బతో జేబుకు చిల్లులు ఏంటి అనుకుంటున్నారా? దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నుంచి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరుగుతున్నాయి. ఇవి ఇప్పట్లో తగ్గే అవకాశాల్లేవని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.మానవాళి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ఈ తీవ్రమైన ఎండలు, ఉష్ణోగ్రతలు వ్యవసాయోత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేయగలవని, దీంతో అధిక ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతిని ద్రవ్యోల్బణం 30-50 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని సంకేతాలిస్తున్నారు. సాధారణ రుతుపవనాలు వచ్చే జూన్ వరకు ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.హీట్‌వేవ్ ప్రభావం పాడైపోయే ఆహార వస్తువులు, ముఖ్యంగా కూరగాయలపై ఎక్కువగా ఉంటుందని, ఇది ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని డీబీఎస్‌ గ్రూప్ రీసెర్చ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఎకనామిస్ట్ అయిన రాధికా రావు ది ఎకనామిక్ టైమ్స్‌తో అన్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం 30-50 బేసిస్ పాయింట్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న హీట్‌వేవ్ గ్రామీణ వ్యవసాయ ఆదాయం, ఆహార ద్రవ్యోల్బణం, సాధారణ ఆరోగ్య పరిస్థితులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కేర్‌ఎడ్జ్ ముఖ్య ఆర్థికవేత్త రజనీ సిన్హా వివరించారు.గడిచిన మార్చిలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 10 నెలల కనిష్ట స్థాయికి 4.9 శాతానికి తగ్గింది. కానీ ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా 8.5 శాతం వద్ద ఉంది. ప్రధానంగా కూరగాయల ధరలు గణనీయంగా పెరగడం వల్ల ఇది 28 శాతం పెరిగింది. కూరగాయల ద్రవ్యోల్బణం వరుసగా ఐదు నెలలుగా రెండంకెల స్థాయిలోనే ఉంది. ఈ త్రైమాసికంలో సగటున 28 శాతం ఉండవచ్చని, అదనంగా, పండ్ల ధరలు కూడా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. విపరీతమైన వాతావరణ పరిస్థితులలో సరుకు రవాణా సవాళ్లు అస్థిరతను పెంచుతాయని పిరమల్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ దేబోపం చౌధురి అభిప్రాయపడ్డారు.

Govt focus on value add to collaborates with electronics manufacturing companies boost in India
భారత్‌లో ఎలక్ట్రానిక్స్‌ తయారీ పెంచేలా ఏం చేస్తున్నారంటే..

భారత్‌లో ఎలక్ట్రానిక్స్‌ తయారీ పెంచేలా కంపెనీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తమ అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు చెప్పినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది.భారత్‌లో మరిన్ని డిజైన్లను రూపొందించడానికి యాపిల్ వంటి ఎలక్ట్రానిక్స్ తయారీదారులను ప్రోత్సహించే విధానాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకు తమ అవసరాలేమిటో గుర్తించి వాటిని తేర్చేలా కంపెనీలను, పరిశ్రమ వర్గాలను సంప్రదిస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ) ఇప్పటికే ఇండియా సెల్యులార్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) వంటి పరిశ్రమ సంస్థలతో సమావేశాలను నిర్వహించింది. ఈ సంస్థలో యాపిల్‌ వంటి దిగ్గజ కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి.ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించడంలో ఎదురయ్యే సాంకేతికపరమైన అంశాలను అధ్యయనం చేసేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ కొన్ని ఐఐటీలను కూడా సంప్రదించిందని తెలిసింది. ఎలక్ట్రానిక్స్ సప్లై చెయిన్‌లో స్థానికంగా ఏ భాగాలు  రూపొందించబడుతాయి.. ఎలా తయారు చేస్తారు.. దేశీయ విలువ జోడింపును పెంచడానికి ఎలాంటి విధానాలు పాటించాలి అనే అంశాలను గుర్తించడం దీని లక్ష్యం అని ఓ అధికారి తెలిపారు.ఇదీ చదవండి: తగ్గుతున్న ఐఫోన్‌ విక్రయాలు.. భారత్‌లో ఎలా ఉందంటే..ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం, ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకోబోతున్న ఈ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్‌లో భారత్‌లో తయారవుతున్న ఉత్పత్తులకు గిరాకీ ఎర్పడనుందని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. గ్లోబల్ లీడ్ కంపెనీలు ఇన్నోవేషన్, డిజైన్, తయారీరంగంలో భారత్‌ను తమ హబ్‌గా ఎంచుకోవడానికి ప్రభుత్వం అనుకూలమైన పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను కలిగి ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Stock Market Rally On Today Opening
గరిష్ఠాలను చేరిన మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 124 పాయింట్లు లాభపడి 22,778కు చేరింది. సెన్సెక్స్‌ 430 పాయింట్లు ఎగబాకి 75,050 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్‌ సూచీలు ఆల్‌టైమ్‌హైలో ట్రేడవుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని అంచనాలు వస్తున్నాయి.  దాంతో సూచీలు రికార్డుస్థాయిలో దూసుకుపోతున్నట్లు తెలుస్తుంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 83.64 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.58 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.91 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 1.51 శాతం ఎగబాకింది.ఏప్రిల్‌ నెలలో జీఎస్‌టీ వసూళ్లు గరిష్ఠ స్థాయిలో నమోదయ్యాయి. తయారీ సానుకూల గణాంకాలను విడుదల చేసింది. వీటి మద్దతుతో దేశీయ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. విదేశీ కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ వరుసగా ఆరో సమావేశంలో  కీలక వడ్డీరేట్లను 5.25-5.50 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. ద్రవ్యోల్బణం రెండు శాతం చేరేంత వరకు వడ్డీరేట్లలో మార్పులు చేయడం సరికాదని భావిస్తున్నట్లు చెప్పారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Apple sets revenue records in India during March quarter
తగ్గిన ప్రపంచ నం1 కంపెనీ విక్రయాలు.. భారత్‌లో మాత్రం..

ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్‌ ఐఫోన్‌ విక్రయాలు తగ్గుతున్నట్లు తెలిసింది. మార్చి 2024తో ముగిసిన త్రైమాసికంలో యాపిల్ ఐఫోన్‌ విక్రయాలు 10 శాతం తగ్గినట్లు కంపెనీ చెప్పింది. దాంతో కంపెనీ ఆదాయం 4 శాతం క్షీణించిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు.గడిచిన త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌ విక్రయాలు తగ్గుతుంటే ఇండియాలో మాత్రం వీటికి ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఇండియాలో రికార్డు స్థాయిలో విక్రయాలు పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియాలో యాపిల్‌ ఉత్పత్తులకు అద్భుతమైన మార్కెట్‌ ఉంది. భారత్‌లో స్థిరంగా రెండంకెల వృద్ధి నమోదవుతోంది. ఇక్కడ రికార్డుస్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. ముందుగా కంపెనీ ఆశించినమేరకు అంచనాలను అధిగమిస్తున్నాం’ అని అన్నారు.యాపిల్‌ సంస్థ ముంబై, దిల్లీలో రెండు అవుట్‌లెట్‌లను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్‌ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ స్టోర్‌లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..ముంబై స్టోర్ యాపిల్‌ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్‌ సాకెట్‌ కంటే కొంచెం అధికంగా నమోదవుతోంది. త్వరలో భారత్‌లో మరో మూడు స్టోర్‌లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే గతేడాది జూన్‌లో వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్‌ తన స్టోర్‌లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్‌లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

RBI lifts restrictions on Bajaj Finance eCOM Insta EMI Card
బజాజ్ ఫైనాన్స్‌కు ఆర్బీఐ ఉపశమనం

బజాజ్ ఫైనాన్స్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉపశమనం కల్పించింది. బజాజ్ ఫైనాన్స్‌కు సంబంధించిన రెండు ఉత్పత్తులు ఈకామ్‌ (eCOM), ఆన్‌లైన్ డిజిటల్ ఇన్‌స్టా ఈఎంఐ (Insta EMI) కార్డ్‌పై ఉన్న ఆంక్షలను తక్షణమే తొలగించింది. ఈమేరకు కంపెనీ మే 2న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.ఈఎంఐ కార్డ్‌ల జారీతో సహా రెండు వ్యాపార విభాగాలలో రుణాల మంజూరు, పంపిణీని ఇప్పుడు పునఃప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. 2023 నవంబర్ 15న  బజాజ్ ఫైనాన్స్ లెండింగ్ ఉత్పత్తులైన ఈకామ్‌, ఇన్‌స్టా ఈఎంఐ కార్డ్‌ కింద రుణాల మంజూరు, పంపిణీని తక్షణమే నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. తమ డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాలు, నిబంధనలకు కంపెనీ కట్టుబడి ఉండకపోవడంతో ఆంక్షలు విధించింది.ఆర్బీఐ గత సంవత్సరం తమ రెండు రుణ ఉత్పత్తులపై వ్యాపార పరిమితులను విధించిన తర్వాత అవసరమైన మార్పులు చేసినట్లు బజాజ్ ఫైనాన్స్ ఏప్రిల్ 25న  జనవరి-మార్చి ఫలితాలను ప్రకటిస్తూ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీన్ని అనుసరించి, ఆంక్షలను సమీక్షించాలని ఆర్బీఐని అభ్యర్థించింది.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 65.70 75.20

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement