Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Alphabet Inc paid Apple Inc 20 billion USD in 2022 for Google to be the default search engine
దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..

ప్రపంచంలోని టాప్‌ టెక్‌ దిగ్గజ కంపెనీల మధ్య ఒప్పందం జరిగినట్లు కోర్టు పత్రాల ద్వారా బట్టబయలైంది. యాపిల్‌ సఫారి బ్రౌజర్‌లో గూగుల్‌ డిఫాల్ట్ సెర్చ్‌ ఇంజిన్‌గా ఉండటానికి 2022లో 20 బిలియన్‌ డాలర్లు(రూ.1.66లక్షల కోట్లు) చెల్లించినట్లు గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ ఇంక్‌. తెలిపింది. గూగుల్‌కు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన యాంటీట్రస్ట్ దావాలో ఈ విషయం వెలుగుచూసింది.ఆన్‌లైన్ ప్రకటనల ఆదాయం కోసం గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని యూఎస్‌ కోర్టులో గతంలో యాంటీట్రస్ట్ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ కేసులో రెండు టెక్ దిగ్గజాల మధ్య ఒప్పందం జరిగినట్లు ఇటీవల తేలింది. విచారణ జరుపుతున్న న్యాయ శాఖ ఏడాది చివర్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.ఇటీవల జరిగిన విచారణలో రెండు కంపెనీల మధ్య ఒప్పందం జరిగిందని ధ్రువీకరించాయి. ఇందుకోసం జరిగిన చెల్లింపుల మొత్తాన్ని బహిర్గతం చేయకుండా చూడాలని భావించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. కోర్టు విచారణలో నంబర్లు వెల్లడించకుండా ఈ ఒప్పందానికి గూగుల్‌ ‘బిలియన్లు’ చెల్లించినట్లు యాపిల్‌ చెప్పింది. యాపిల్‌ డిఫాల్ట్‌ బ్రౌజర్‌గా ఉన్నందుకు సెర్చ్‌ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 36 శాతం గూగుల్ యాపిల్‌కు చెల్లిస్తున్నట్లు తెలిసింది.కోర్టు పత్రాల వల్ల యాపిల్‌కు వస్తున్న ఆదాయమార్గాల గురించి కూడా స్పష్టత వచ్చినట్లయింది. 2020లో యాపిల్‌ నిర్వహణ ఆదాయంలో దాదాపు 17.5 శాతం గూగుల్‌ నుంచి సమకూరిందేనని అంచనా. గూగుల్‌ డిఫాల్ట్ ఒప్పందాల్లో యాపిల్‌ డీల్‌ అత్యంత ముఖ్యమైంది. యూఎస్‌లో అధికంగా ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ సెర్చ్‌ ఇంజిన్‌ సఫారి బ్రౌజర్‌ కావడంతో గూగుల్‌కు ఈ ఒప్పందం ప్రధానంగా మారింది. 2002లో సఫారీ బ్రౌజర్‌లో గూగుల్‌ను ఉచితంగా ఉపయోగించేందుకు యాపిల్ మొదట అంగీకరించింది. కానీ సెర్చ్‌ ప్రకటనల ఆదాయం పెరుగుతున్న కొద్దీ దాన్ని ఇరు కంపెనీలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. మే 2021 నాటికి సఫారి ‍బ్రౌజర్‌లో డిఫాల్ట్ సెర్చ్‌ఇంజిన్‌ కోసం యాపిల్‌కు నెలకు 1 బిలియన్ డాలర్లు(రూ.8300 కోట్లు) కంటే ఎక్కువే చెల్లించిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.ఇదీ చదవండి: బేబీ పౌడర్‌తో అండాశయ క్యాన్సర్‌.. పరిష్కారానికి రూ.54వేలకోట్లుసెర్చ్‌ ఇంజిన్‌లో గూగుల్‌తో పోటీపడుతున్న బింగ్‌ను యాపిల్‌ డిఫాల్ట్‌బ్రౌజర్‌గా ఉండేలా చూడాలని మైక్రోసాఫ్ట్‌ సంస్థ చాలానే ప్రయత్నించింది. కోర్టులో దాఖలైన పత్రాల ప్రకారం..సఫారీలో బింగ్‌ను డిఫాల్ట్‌గా ఉంచడానికి కంపెనీ తన ప్రకటనల ఆదాయంలో 90 శాతం యాపిల్‌కు ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్‌ సిద్ధ పడింది.

J&J subsidiary proposing paying Rs 54,000 cr over 25 years for cancer allegations
బేబీ పౌడర్‌తో అండాశయ క్యాన్సర్‌.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు

జాన్సన్ అండ్‌ జాన్సన్ ప్రొడక్ట్‌లపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. కంపెనీ అనుబంధ సంస్థ తయారుచేస్తున్న బేబీ పౌడర్‌లోని టాల్కమ్‌ స్త్రీల అండాశయ క్యాన్సర్‌కు కారణమవుతుందని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. వాటిని పరిష్కరించడానికి 25 ఏళ్ల వ్యవధికిగాను కంపెనీ సుమారు 6.48 బిలియన్‌ డాలర్లు(రూ.54వేలకోట్లు) చెల్లించడానికి సిద్ధమైంది.స్త్రీల పరిశుభ్రత కోసం కంపెనీ తయారుచేస్తున్న టాల్కమ్ పౌడర్ ఉపయోగించడం ద్వారా ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై దాడిచేసే మీసోథెలియోమా, అండాశయ క్యాన్సర్‌ వస్తుందని ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించి కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తమ ఉత్పత్తుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కోర్టులో దాఖలైన వ్యాజ్యాల్లో ఏమాత్రం నిజం లేదని కంపెనీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: గూగుల్‌లో మళ్లీ లే ఆఫ్స్‌.. ఎందుకో తెలుసా..బుధవారం అనుబంధ సంస్థ పునర్నిర్మాణానికి 75% మంది వాటాదార్లు సానుకూలంగా ఓటు వేస్తే ప్రీప్యాకేజ్డ్‌ చాప్టర్‌ 11 దివాలాకు దాఖలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. మెసోథెలియోమాకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాలను రిఆర్గనైజేషన్‌ ప్లాన్ వెలుపల పరిష్కరిస్తామని పేర్కొంది. 

Stock Market Rally On Today Opening
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 22,647కు చేరింది. సెన్సెక్స్‌ 148 పాయింట్లు దిగజారి 74,631 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.71 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 83.53 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.63 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.34 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 0.33 శాతం దిగజారింది.మార్కెట్ అంచనాలకు అనుగుణంగా యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ వరుసగా ఆరో సమావేశంలో  కీలక వడ్డీరేట్లను 5.25-5.50 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. రెండు రోజుల ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) సమావేశం తర్వాత నిర్ణయాలు వెల్లడించారు. ద్రవ్యోల్బణం రెండు శాతం చేరేంత వరకు వడ్డీరేట్లలో మార్పులు చేయడం సరికాదని భావిస్తున్నట్లు చెప్పారు. ఎఫ్‌ఓఎంసీ ఇప్పటి వరకు వడ్డీరేట్లను తగ్గిస్తుందనే అంచనాలు ఉండేవి. కానీ తాజా నిర్ణయంతో దీన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Tesla's HR Head Allie Arebalo Exits Amid Layoffs
ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్‌ఆర్‌ హెడ్‌ ఔట్‌!

ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లాలో లేఆఫ్‌లు అలజడి సృష్టిస్తున్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వరుసపెట్టి కంపెనీని వీడుతున్నారు. తాజాగా టాప్ హ్యూమన్ రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ అల్లి అరేబాలో కంపెనీని వీడారు.అరేబాలో ఇక కంపెనీలో కనిపించరని, ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) చెప్పినట్లుగా మనీ కంట్రోల్‌ కథనం పేర్కొంది. నేరుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్‌కి రిపోర్టింగ్‌ చేసే హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆమె అంతట ఆమె కంపెనీని వీడారా.. లేక ఉద్యోగాల కోతలో భాగంగా ఉద్వాసనకు గురయ్యారా అనేది స్పష్టంగా తెలియలేదు. దీనిపై అటు మస్క్ గానీ, అరేబాలో గానీ స్పందించలేదు.ఈ ఎలక్ట్రిక్-వెహికల్ మేకర్ కంపెనీ వ్యాప్తంగా భారీగా ఉద్యోగాలను తగ్గిస్తోందని,  సుమారు 20 శాతం సిబ్బంది తగ్గింపును లక్ష్యంగా చేసుకుందని బ్లూమ్‌బెర్గ్ గత నెలలో నివేదించింది. టెస్లాలో ఉన్నత స్థాయి వ్యక్తులుగా పేరున్న నలుగురిలో ఒకరైన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డ్రూ బాగ్లినోతో సహా మస్క్ టాప్ లెఫ్టినెంట్లలో కొందరు కూడా కొన్ని వారాల క్రితం రాజీనామా చేశారు.ఇటీవలి నెలల్లో వాహన విక్రయాలు క్షీణించడం ప్రారంభించినప్పటి నుండి ఖర్చుల కట్టడి, సిబ్బంది కోతపై ఎలాన్‌ మస్క్‌ దృష్టి పెట్టారు. టెస్లా ఛార్జింగ్ కనెక్టర్‌లను స్వీకరించే ప్రక్రియలో ఇతర ఆటోమేకర్‌లతో భాగస్వామ్యాన్ని పర్యవేక్షిస్తున్న కంపెనీ సూపర్‌చార్జర్ టీమ్‌లో చాలా మందిని ఇప్పటికే తొలగించారు.  అరేబాలో కంపెనీలో అత్యంత సీనియర్ మహిళా ఎగ్జిక్యూటివ్‌లలో  ఒకరు. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. 2023 ఫిబ్రవరి నుంచి ఈ పదవిలో ఉన్నారు. అలాగే సుమారు ఆరేళ్లుగా టెస్లాలో పనిచేస్తున్నారు. 

India collects record 2. 10 trillion rupees as goods and services tax in April
జీఎస్‌టీ రికార్డు వసూళ్లు

సాక్షి, న్యూఢిల్లీ:  భారత్‌ వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో చరిత్రాత్మక రికార్డు సృష్టించాయి. సమీక్షా నెల్లో 2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారి. 2023 ఇదే నెలలో నమోదయిన రూ.1.87 లక్షల కోట్లు ఇప్పటి రికార్డు. అంటే సమీక్షా నెల్లో వార్షిక ప్రాతిపదికన 12.4 శాతం పురోగతి నమోదయ్యిందన్నమాట. ఆర్థిక క్రియాశీలత, దిగుమతుల పురోగతి వంటి అంశాలు జీఎస్‌టీ రికార్డుకు కారణమయ్యింది.  విభాగాల వారీగా ఇలా... ⇒ మొత్తం జీఎస్‌టీ వసూళ్లు రూ.2,10,267 కోట్లు.  ⇒ సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.43,846 కోట్లు.  ⇒ స్టేట్‌ జీఎస్‌టీ రూ.53,538 కోట్లు.  ⇒ ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.99,623 కోట్లు  ⇒ సెస్‌ రూ.13,260 కోట్లు (దిగుమతులపై రూ.1,008 కోట్లుసహా) ఏపీలో 12%, తెలంగాణలో 11% వృద్ధి  కాగా,  జీఎస్‌టీ ఇంటర్‌ గవర్నమెంట్‌ సెటిల్మెంట్‌లో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ నుంచి కేంద్ర జీఎస్‌టీకి రూ.50,307 కోట్లు, రాష్ట్ర జీఎస్‌టీకి రూ.41,600 కోట్లు కేంద్ర ఆర్థిక శాఖ పంపిణీ చేసింది. దీంతో మొత్తంగా కేంద్ర జీఎస్‌టీగా రూ.94,153 కోట్లు, రాష్ట్ర జీఎస్‌టీగా రూ.95,138 కోట్ల ఆదాయం సమీక్షా నెల్లో సమకూరినట్లయ్యింది.  రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏప్రిల్‌ నెలలో జీఎస్‌టీ వసూళ్లు వృద్ధిని కనబరిచాయి. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే జీఎస్‌టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 12% వృద్ధితో రూ.4,850 కోట్లు, తెలంగాణలో 11% వృద్ధితో రూ.6,236 కోట్లు నమోదయ్యాయి. అయితే దేశంలోనే అత్యధిక జీఎస్‌టీ వసూళ్లు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో వసూళ్లు 13 శాతం వృద్ధితో రూ.37,671 కోట్లకు ఎగశాయి.  గత ఆర్థిక సంవత్సరంలో నుంచి (అంకెలు రూ. లక్షల కోట్లలో) ఏప్రిల్‌ 2023    1.87 మే                1.57 జూన్‌             1.61 జూలై             1.60 ఆగస్టు           1.59 సెపె్టంబర్‌     1.63 అక్టోబర్‌         1.72 నవంబర్‌       1.67 డిసెంబర్‌       1.64 జనవరి 2024    1.74 ఫిబ్రవరి             1.68 మార్చి              1.78     ఏప్రిల్‌               2.102017జూలైలో తాజా పరోక్ష పన్ను వ్యవస్థ జీఎస్‌టీ ప్రారంభమైన తర్వాత 2024 ఏప్రిల్, 2023 ఏప్రిల్, 2024 మార్చి, 2024 జనవరి, 2023 అక్టోబర్‌ ఇప్పటి వరకూ  టాప్‌–5 జీఎస్‌టీ నెలవారీ వసూళ్లను  నమోదుచేశాయి. 

Lok sabha elections 2024: Auto mobile sales growth flat in April due to high base effect, elections
ఏప్రిల్‌లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే

న్యూఢిల్లీ: దేశవాప్తంగా ఏప్రిల్‌లో వాహన విక్రయాలు అంతంత మాత్రంగా సాగాయి. 2024–25 తొలి నెలలో మొత్తం 3.38 లక్షల ఆటో మొబైల్‌ అమ్మకాలు జరిగాయి. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 3.32 లక్షల యూనిట్లతో పోలిస్తే 1.77% మాత్రమే అధికంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిమాండ్‌ తగ్గడం, అంతకు ముందు రెండేళ్ల అధిక బేస్‌ ప్రభావం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.  ⇒ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఏప్రిల్‌లో 168,089 కార్లు విక్రయించింది. గత ఏడాది ఇదేనెలలో అమ్మకాలు 1,60,529 కార్లతో పోల్చితే 5% వృద్ధిని నమోదు చేసింది.  ⇒ హ్యుందాయ్‌ గతేడాది ఏప్రిల్‌లో మొత్తం 58,201 వాహనాలను విక్రయించగా, ఈ సంఖ్య 9.5% పెరిగి 63,701 యూనిట్లకి చేరింది. ⇒ టాటా మోటార్స్‌ వాహన విక్రయాలు 11.5% వృద్ధి సాధించాయి. ఏప్రిల్‌లో 77,521 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇవి ఏడాది ఏప్రిల్‌లో 69,599 యూనిట్లుగా ఉన్నాయి.

GST collections soared to a new peak of Rs 2.10 lakh crore in April
గరిష్ఠాలను చేరిన జీఎస్టీ వసూళ్లు.. 2017 నుంచి ఇదే టాప్‌!

భారతదేశ జీఎస్టీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా వసూళ్లు నమోదయ్యాయి. ఏప్రిల్‌ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ కలెక్షన్లు రూ.2.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు అత్యధికంగా 2023 ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ఏడాది ప్రాతిపదికన ఈ వసూళ్లలో 12.4 శాతం వృద్ధి నమోదైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.2024 మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.78 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నెలవారీగా 13.4 శాతం వృద్ధిచెంది ఏప్రిల్‌లో అత్యధికంగా జీఎస్టీ రూ.2.10 లక్షలకోట్లకు చేరింది. రిఫండ్‌లను లెక్కించిన తర్వాత ఏప్రిల్ 2024లో నికర జీఎస్టీ ఆదాయం రూ.1.92 లక్షల కోట్లుగా ఉంటుంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 17.1% వృద్ధి నమోదైంది.2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం నెలకు సగటున రూ.1.8 లక్షల కోట్లకు చేరుతుందని సీబీడీటీ కస్టమ్స్ ఛైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2022-23లో నెలవారీగా సగటు జీఎస్టీ వసూళ్లు రూ.1.51 లక్షల కోట్లుగా నమోదైంది. 2023-24లో సగటును రూ.1.68 లక్షల కోట్లకు చేరింది. 2017 జులైలో జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చాక ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌నెలలో అత్యధిక వసూళ్లు రికార్డవుతున్నాయి.👉 #GST revenue collection for April 2024 highest ever at Rs 2.10 lakh crore👉 #GST collections breach landmark milestone of ₹2 lakh crore 👉 Gross Revenue Records 12.4% y-o-y growth👉 Net Revenue (after refunds) stood at ₹1.92 lakh crore; 17.1% y-o-y growthRead more… pic.twitter.com/Ci7CE7h35o— Ministry of Finance (@FinMinIndia) May 1, 2024

gold price today rate down may 1
త్వరలో అక్షయ తృతీయ.. బంగారంపై భారీ శుభవార్త!

త్వరలో అక్షయ తృతీయ రాబోతోంది. ఈ క్రమంలో పసిడి ప్రియులకు ఆనందం కలిగించే వార్త ఇది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. పసిడి ధరలు ఈరోజు (మే 1) ఏకంగా రూ.1260 మేర తగ్గాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖపట్నంలతో పాటు  వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.65,550 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.1090 తగ్గి రూ. 71,510 లకు తగ్గింది.ఇతర నగరాల్లో..దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.65,700 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.1090 తగ్గి రూ.71,660 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.1000 క్షీణించి రూ.65,550 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 తగ్గి రూ.71,510 వద్దకు దిగొచ్చింది.చెన్నైలో అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.1150 తగ్గి రూ.71,510 ల​కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.1260 తగ్గి రూ.72,380గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 క్షీణించి రూ.65,550 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 తగ్గి రూ.71,510 లకు తగ్గింది.

Google Flutter Dart Python Teams terminated from real estate and finance Dept
గూగుల్‌లో మళ్లీ లే ఆఫ్స్‌.. ఎందుకో తెలుసా..

టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ ఫ్లట్టర్, డార్ట్, పైథాన్ టీమ్‌ల నుంచి ఉద్యోగులను తొలగించినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. త్వరలో సంస్థ యాన్యువల్‌ డెవలపర్ కాన్ఫరెన్స్‌ జరుగనున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఉద్యోగాలు కోల్పోయినవారు తమ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో ఈ అంశాన్ని వైరల్‌ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఎంతమందికి లేఆఫ్స్‌ ప్రకటించారో మాత్రం స్పష్టం కాలేదు.ఈ సందర్భంగా గూగుల్‌ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ఉద్యోగాలు కోల్పోయినవారు కంపెనీలోని ఇతర విభాగాల్లో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కంపెనీ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో తొలగింపు ప్రక్రియ అమలుచేసింది. కంపెనీ ఫైనాన్స్‌ విభాగంలో పనిచేసిన ఉద్యోగులను ట్రెజరీ, వ్యాపార సేవలు, ఆదాయ నగదు కార్యకలాపాల్లో పనిచేసేందుకు అనుమతిస్తున్నారు’ అని చెప్పారు.గూగుల్ ఫైనాన్స్ చీఫ్ రూత్ పోరాట్ లేఆఫ్స్‌కు సంబంధించి ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో స్పందిస్తూ.. కంపెనీ నిర్మాణంలో భాగంగా బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్ వంటి ప్రదేశాల్లో గూగుల్ ‘గ్రోత్ హబ్‌లను’ నిర్మిస్తుందని చెప్పారు. రాబోయే అవకాశాల కోసం సిద్ధంగా ఉండాలన్నారు.ఇదీ చదవండి: మీపేరుపై ఎన్ని సిమ్‌కార్డులున్నాయో తెలుసుకోండిలా..జనవరిలోనూ వందల మంది ఉద్యోగులను ఇంజినీరింగ్‌, హార్డ్‌వేర్‌, అసిస్టెంట్‌ బృందాల్లో గూగుల్‌ తొలగించింది. కృత్రిమ మేధ(ఏఐ) సామర్థ్యాలను పెంచుకోవడంపై కంపెనీ దృష్టి సారిస్తుండడంతో ఇలా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుందని తెలిసింది.

Abhibus give discount for voters to increasing vote percentage
ఓటర్లకు బస్‌ టికెట్‌లో రాయితీ.. ఎంతంటే..

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదిత శాతం పెంచాలని ఎన్నికలసంఘం ప్రచారం చేస్తోంది. అందులో భాగంగా ప్రముఖ కంపెనీలు ఓటు శాతం పెంచేలా తమ కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌ బస్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘అభిబస్‌’ ఓటు వేసేందుకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.ఈమేరకు సంస్థ సీఈఓ లెనిన్‌ కోడూరు, సీఓఓ రోహిత్‌ శర్మ మాట్లాడారు. ‘తెలుగు రాష్ట్రాల్లో మే 11 నుంచి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఓటు వేసేందుకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ABHIVOTE కూపన్‌ కోడ్‌ ఉపయోగించి టికెట్‌ ధరలో కనీసం 20 శాతం నుంచి గరిష్ఠంగా రూ.250 వరకు రాయితీ పొందొచ్చు. దీంతోపాటు రూ.100 క్యాష్‌బ్యాక్‌ కూడా పొందే వీలుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: మీపేరుపై ఎన్ని సిమ్‌కార్డులున్నాయో తెలుసుకోండిలా..ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ గతంలో ఓటర్లకు ఆఫర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిసారి ఓటు వేయబోయే యువ ఓటర్లకు దేశీయ, ఇంటర్నేషనల్‌ సర్వీసుల టికెట్‌ ధరలపై 19 శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పింది.

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 65.70 75.20

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement