Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

OTT subscription rate reduced to 50 percentage of BSNL
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను సగానికి తగ్గించిన ప్రభుత్వ సంస్థ

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉన్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. దాదాపు చాలా టెలికాం కంపెనీలు ప్రత్యేకంగా ఓటీటీ సేవలందిస్తున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ఓటీటీని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తమ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్లకు అందించే సినిమాప్లస్‌ ఓటీటీ ప్యాకేజీ ప్రారంభ ధరను సంస్థ తగ్గించింది.ఈ ప్రారంభ ప్యాక్‌ ధర గతంలో నెలకు రూ.99గా ఉండేది. దాన్ని రూ.49కు తగ్గిస్తూ కంపెనీ ఇటీవల ప్రకటించింది. ఇందులో లయన్స్‌గేట్‌, షెమరూమీ, హంగామా, ఎపిక్‌ ఆన్‌ ఓటీటీల్లోని కంటెంట్‌ను వీక్షించవచ్చు. దీంతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో రెండు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెలకు రూ.199 సబ్‌స్క్రిప్షన్‌తో జీ5, సోనీలివ్‌, యప్‌టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్‌తో కూడిన ఫుల్‌ ప్యాక్ ఓటీటీ ప్యాకేజీ అందిస్తోంది.ఇదీ చదవండి:  టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలునెలకు రూ.249 చెల్లిస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీమియం ప్లాన్‌కు అప్‌గ్రేడ్‌ కావచ్చని సంస్థ తెలిపింది. ఇందులో జీ5, సోనీ లివ్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌, యప్‌టీవీ, లయన్స్‌గేట్‌, షెమరూమీ, హంగామా, వంటి ఓటీటీలను ఫ్రీగా చేసేయొచ్చు. 

Today Gold and Silver Price 30 April 2024
బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఉలుకూ.. పలుకూ లేకుండా అన్నట్లు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66550 (22 క్యారెట్స్), రూ.72600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 300 నుంచి రూ. 330 వరకు తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66700 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 72750 రూపాయల వద్దే ఉంది. నిన్న రూ.300, రూ.330 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు ఏ మాత్రం పెరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి.దేశంలోని ఇతర నగరాలలో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 67400 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 73530 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం రూ. 100 తగ్గింది. కాబట్టి ఈ రోజు (ఏప్రిల్ 30) ఒక కేజీ వెండి ధర 83900 రూపాయల వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేదు.

10,000 freshers to be hired during this year, says HCLTech CEO Vijayakumar
టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలు

టెక్‌ కంపెనీలు జనరేటివ్‌ ఏఐపై దూకుడుగా పనిచేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో వీటిలో అపార అవకాశాలున్నట్లు గుర్తించి ఆదిశగా ముందుకుసాగుతున్నాయి. తాజాగా జనరేటివ్‌ ఏఐలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సీఈఓ విజయ్‌ కుమార్‌ తెలిపారు. మార్చి త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.కృత్రిమమేధ రంగంలో కంపెనీ చాలా మందికి శిక్షణ ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికే సుమారు 25,000 మందికి శిక్షణ ఇవ్వగా, మరో 50,000 మందికి ఈ ఏడాదిలో ట్రెయినింగ్‌ పూర్తి చేస్తామన్నారు. గడిచిన త్రైమాసికంలో కొత్తగా 2700 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపారు. 2024-25లో పరిస్థితులను బట్టి నియామకాలుంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగిగే కనీసం 10,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామన్నారు. భవిష్యత్తులో ఏదైనా మార్పులు ఏదురైతే నియామకాల సంఖ్యలోనూ తేడాలుండవచ్చని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఏఐ టూల్స్‌ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థకంపనీ మార్చి త్రైమాసికంలో ఆదాయ వృద్ధి రేటు 5.4%గా నమోదైంది. టెక్‌ కంపెనీలకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలపై క్లౌడ్‌, జనరేటివ్‌ఏఐ ప్రాజెక్టులు పెరుగుతాయని విజయ్‌ అంచనా వేశారు. అయితే ఆర్థిక సేవల విభాగంలో మాత్రం కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చన్నారు. రానున్న రోజుల్లో జనరేటివ్‌ ఏఐ ఆధారిత సైబర్‌ భద్రత, డేటా, క్లౌడ్‌ ఇమిగ్రేషన్‌, ప్రైవేటు ఏఐ స్టాక్‌ల నిర్మాణం తదితర విభాగాల్లో ఆర్డర్లు పెరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

Stock Market Rally On Today Opening
గ్రీన్‌లో ఓపెన్‌ అయిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 22,670కు చేరింది. సెన్సెక్స్‌ 57 పాయింట్లు దిగజారి 74,751 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.6 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 88 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.32 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.35 శాతం ఎగబాకింది.అంచనాలకు మించి క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటనతో బ్యాంకులు, ఫైనాన్స్‌ రంగాల షేర్లలో భారీ కొనుగోళ్లు నెలకొన్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు కలిసొచ్చాయి. క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం, ఇరాన్‌–ఇజ్రాయెల్‌ ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత వంటి అంశాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మే 1న సెలవు కావడంతో, మార్కెట్లు ఈవారం 4 రోజులే పనిచేయనున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

IVMA announced that Krishna Ella chairman of Bharat Biotech will be the new president
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డా.కృష్ణ ఎల్లా ఎంపిక

కోవాక్సిన్‌ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా ఇండియన్‌ వ్యాక్సిన్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐవీఎంఏ) అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగనున్నారు.ఈ పదవిలో ఇప్పటి వరకు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ అదార్‌ పూనావాలా ఉన్నారు. ఐవీఎంఏ ఉపాధ్యక్షురాలిగా బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల, కోశాధికారిగా భారత్‌ బయోటెక్‌ సీఎఫ్‌ఓ టి.శ్రీనివాస్‌లను ఎన్నుకున్నారు. ఐవీఎంఏ డైరెక్టర్‌ జనరల్‌గా డాక్టర్‌ హర్షవర్థన్‌ కొనసాగుతారు.ఇదీ చదవండి: ఏఐ టూల్స్‌ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థఅందరికీ అవసరమయ్యే టీకాలు అందించడమే ఐవీఎంఏ ప్రధాన లక్ష్యమని డాక్టర్‌ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ ప్రమాణాలకు అనుగుణంగా దేశంలో టీకాల తయారీ సంస్థలు సిద్ధం కావాలన్నారు. ఆఫ్రికా వంటి దేశాలకు టీకా అవసరాలు అధిమన్నారు. టీకా తయారీలో వస్తున్న అంకుర సంస్థలకు సరైన ప్రోత్సాహకాలు అందించాలన్నారు.

Admits Covishield Can Cause Rare Side Effect Says AstraZeneca
కోవిషీల్డ్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా

కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన సమయంలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం 'ఆస్ట్రాజెనెకా' (AstraZeneca) కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందించింది. అయితే ఆ వ్యాక్సిన్ దుష్ప్రభావానికి కారణమవుతుందని ఇటీవల అంగీకరించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆస్ట్రాజెనెకా అందించిన కోవిషీల్డ్ కొన్ని సందర్భాల్లో బ్లాట్ క్లాట్స్, తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్‌కు దారితీసే అవకాశం ఉందని వ్యాక్సిన్ తయారీదారు వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాచే ఉత్పత్తి చేసింది. దీనిని దేశంలో విస్తృతంగా ఉపయోగించారు.ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అనేక సందర్భాల్లో మరణానికి లేదా తీవ్ర గాయాలకు కారణమైందని 51 మంది బాధితులు 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని కోరుతూ యూకే హైకోర్టులో ఇప్పటికే ఫిటిషన్ వేశారు. జామీ స్కాట్ 2021 ఏప్రిల్‌లో న్యాయపోరాటం ప్రారంభించారు. ఆ తరువాత చాలామంది దీనిపై కేసులు వేయడం మొదలుపెట్టారు.ప్రారంభంలో ఆస్ట్రాజెనెకా కంపెనీ క్లెయిమ్‌లను వ్యతిరేకించింది. అయితే ఇటీవల కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో.. TTS (థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్) రక్తం గడ్డకట్టడం, బ్లడ్ ప్లేట్‌లెట్ కౌంట్‌ తక్కువవుతుందని అంగీకరించింది.

Tesla Partnering With Baidu For Self Driving Cars
మస్క్‌కు లైన్‌ క్లియర్‌?..చైనాలో టెస్లా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు..

తన సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల మ్యాపింగ్‌, నావిగేషన్ ఫంక్షన్ల కోసం చైనా అతిపెద్ద సెర్చింజిన్‌ బైదూతో ప్రముఖ ఈవీ దిగ్గజం టెస్లా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో చైనాలో టెస్లా లేటెస్ట్‌ డ్రైవింగ్ ఫీచర్‌లను పరిచయం చేయడానికి కీలకమైన అడ్డంకిని తొలగించుకోబోతుందని తెలుస్తోంది.  ఫలితంగా టెస్లా స్టాక్‌ ధర 10 శాతానికి పైగా పెరిగింది.బైదూ అందించే టాప్‌ లేన్ లెవల్ నావిగేషన్, మ్యాపింగ్ ఆధారంగా టెస్లా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల సేవలను అందుబాటులోకి తెచ్చే సౌలభ్యం కలగనుందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  కాగా, టెస్లా ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్ వ్యవస్థ ఇప్పటి వరకు చైనాలో అందుబాటులో లేదు. దీన్ని అక్కడ ప్రవేశపెట్టేలా చైనా ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో చైనా కస్టమర్లకు సంబంధించిన డేటాను దేశం వెలుపలికి తీసుకెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో చైనా వెలుపలికి డేటాను బదిలీ చేసే అంశంపై కూడా మస్క్‌ ప్రభుత్వంతో చర్చించారు.  

Ola Cabs Ceo Hemant Bakshi Quits In Three Months
చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్‌ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు

ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ఓలా క్యాబ్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే ఆ సంస్థ సీఈఓ పదవికి హేమంత్ బక్షి రాజీనామా చేసినట్లు సమాచారం.  దీంతో పాటు సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఓలా క్యాబ్స్‌ దాదాపు 200 మంది ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయిఐపీఓకి ఓలా ఓలా క్యాబ్స్‌ ఐపీఓ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్స్‌తో ఓలా క్యాబ్స్‌ ఇటీవలే చర్చలు నిర్వహించింది. మరో రెండు మూడు నెలల్లో సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్‌ ఇప్పటికే ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది.ఈ తరుణంలో సీఈఓ రాజీనామా, ఉద్యోగుల తొలగింపు అంశం ఓలా క్యాబ్స్‌ చర్చాంశనీయంగా మారింది. కాగా, ఓలా క్యాబ్స్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 

Credit Cards Use Pay For Utility Bills Banks Extra 1 Percent Charges From May 1st
మారిన క్రెడిట్‌ కార్డ్‌ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..

క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.ఇటీవల ఎస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లు మే 1 నుంచి తమ క్రెడిట్‌ కార్డ్‌ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రసిటీ బిల్‌, వాటర్‌ బిల్‌, గ్యాస్‌ బిల్‌ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.దీంతో మీరు ఎస్‌బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి నెలవారీ కరెంట్‌ బిల్లు రూ.1500 చెల్లిస్తుంటే అదనంగా రూ.15 చెల్లించాల్సి ఉంటుంది.అయితే, వినియోగదారులు ఎస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై రూ.15,000, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై రూ. 20,000 ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. లిమిట్‌ దాటితే పైన పేర్కొన్న వన్‌ (ఒకశాతం) పర్సెంట్‌ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 18 శాతం జీఎస్టీని సైతం చెల్లించాల్సి ఉంటుంది.    

stock market rally today Closing
భారీగా పుంజుకున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 215 పాయింట్లు లాభపడి 22,635 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 941 పాయింట్లు ఎగబాకి 74,671 వద్దకు చేరింది.సెన్సెక్స్‌ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మారుతీసుజుకీ కంపెనీ షేర్లు నష్టాల్లో జారుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం రూ.3,408.88 కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.4,356.83 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 65.70 75.20

Egg & Chicken Price

Title Price Quantity
Egg 100.00 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement