Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Sundar Pichai Completes 20 Years At Google And Insta Post Viral
గూగుల్‌లో 20 ఏళ్ళు.. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్

గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) 'సుందర్ పిచాయ్' టెక్ దిగ్గజంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఏప్రిల్ 26 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.''2004 ఏప్రిల్ 26 గూగుల్ కంపెనీలో నా మొదటి రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు వచ్చాయి. టెక్నాలజీ మాత్రమే కాకుండా.. మా ఉత్పత్తులను ఉపయోగించే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ అద్భుతమైన కంపెనీలో పని చేయడం వల్ల చాలా థ్రిల్ పొందాను. సంస్థలో పనిచేస్తున్నందుకు ఇప్పటికీ నన్ను నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను'' అంటూ సుందర్ పిచాయ్ పోస్ట్ చేశారు. సుందర్ పిచాయ్ చేసిన ఈ పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. ఇప్పటికే 1,42,999 కంటే ఎక్కువ లైక్స్ పొందిన ఈ పోస్ట్ మీద నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. చాలామంది సుందర్ పిచాయ్ విజయాన్ని గొప్పగా అభినందించారు.  సుందర్ పిచాయ్ 2004లో గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ హెడ్‌గా చేరాడు. ఆ తరువాత దినదినాభివృద్ధి చెందుతూ ఆ కంపెనీకి సీఈఓగా ఎదిగారు. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన పిచాయ్‌ నేడు భారతదేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగారంటే దాని వెనుక ఉన్న ఆయన కృషి అనన్య సామాన్యమనే చెప్పాలి.    View this post on Instagram           A post shared by Sundar Pichai (@sundarpichai)

Buffett real estate firm to pay 250 million usd to settle lawsuits
రూ.20 వేల కోట్ల సెటిల్మెంట్‌కు వారెన్ బఫ్ఫెట్‌

వారెన్ బఫ్ఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్వే యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ కంపెనీ ‘హోమ్‌ సర్వీసెస్ ఆఫ్ అమెరికా’ అమెరికా దేశవ్యాప్తంగా వ్యాజ్యాలను పరిష్కరించుకునేందుకు 250 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.20 వేల కోట్లు) చెల్లించడానికి అంగీకరించింది.రియల్‌ బ్రోకరేజీలు తమ నుంచి అధికంగా బ్రోకర్‌ కమీషన్లు వసూలు చేశాయంటూ అమెరికాలోని గృహ యజమానులు ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రతిపాదిత సెటిల్‌మెంట్ ద్వారా తమ 51 బ్రాండ్‌లు, దాదాపు 70,000 రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, 300 ఫ్రాంఛైజీలకు ఈ వ్యాజ్యాల నుంచి విముక్తి లభిస్తుందని హోమ్‌ సర్వీసెస్ ఆఫ్ అమెరికా తెలిపింది.కెల్లర్ విలియమ్స్ రియాల్టీ, రీ/మ్యాక్స్, కంపాస్, ఎనీవేర్ రియల్ ఎస్టేట్‌తో సహా అనేక ఇతర పెద్ద బ్రోకరేజ్ సంస్థలు ఇదివరకే సెటిల్మెంట్‌కు సిద్ధమైన నేపథ్యంలో  ‘హోమ్‌ సర్వీసెస్ ఆఫ్ అమెరికా’ కంపెనీ కూడా సెటిల్మెంట్‌ సిద్ధమైంది. గత నెలలో, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ 418 మిలియన్ డాలర్లు చెల్లించడానికి అంగీకరించింది.

Pasteurized milk safe from bird flu fda
బర్డ్‌ఫ్లూ భయం లేదు.. అలా చేసిన పాలు సేఫ్‌!

జంతువుల్లో ప్రాణాంతకమైన బర్డ్‌ఫ్లూ వైరస్‌ అమెరికాలో మనిషికి సోకడం భయాందోళన కలిగిస్తోంది. వైరస్‌ ఆనవాళ్లు మనుషులు తాగే ఆవు పాలలో కనిపించడంతో అందరూ భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు కీలక విషయం చెప్పారు.యూఎస్‌ స్టోర్లలో విక్రయిస్తున్న పాలు బర్డ్ ఫ్లూ నుండి సురక్షితమైనవని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది. ఎందుకంటే ఈ పాలను పాశ్చరైజేషన్ చేస్తారని, పాశ్చరైజేషన్ వ్యాధిని ప్రభావవంతంగా చంపుతుందని పేర్కొన్నారు.అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్‌ఫ్లుయంజా (HPAI) వ్యాప్తి దేశవ్యాప్తంగా పాడి పశువుల మందల ద్వారా వ్యాపించింది. తేలికపాటి లక్షణాలతో ఒక వ్యక్తికి సోకింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని పాల విక్రయ సంస్థల నుంచి నమూనాలను ఎఫ్‌డీఏ పరీక్షించింది. ఇందులో ప్రతి ఐదు శాంపిల్స్‌లో ఒక దాంట్లో వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయని ఎఫ్‌డీఏ పేర్కొంది.అయితే పాశ్చరైజేషన్ ప్రక్రియ కారణంగా వైరస్ పాల ద్వారా ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం లేదని ఎఫ్‌డీఏ ప్రకటించింది. దీనిపై మరిన్ని పరీక్షలు అవసరమని పేర్కొంది. హెచ్‌పీఏఐని నిష్క్రియం చేయడంలో పాశ్చరైజేషన్ ప్రభావవంతంగా ఉంటుందిని ప్రాథమిక ఫలితాల్లో గుర్తించినట్లు ఎఫ్‌డీఏ వెల్లడించింది. ఇంతకుముందు బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు పచ్చి పాలలో కనుగొనడంతో ఆరోగ్య అధికారులు పచ్చి పాలను తాగొద్దని సూచించారు.

Indian Forex Reserves Decreased By 640 Billion Dollars
భారీగా తగ్గుతున్న ఫారెక్స్‌ నిల్వలు.. కారణం..

దేశంలో విదేశీ మారకం నిల్వలు(ఫారెక్స్‌) క్రమంగా పడిపోతున్నాయి. ఈమేరకు భారతీయ రిజర్వు బ్యాంక్‌ తన వారాంతపు సమీక్షలో కీలక అంశాలను ప్రస్తావించింది. వరుసగా రెండోవారం ఈ నెల 19తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్‌ రిజర్వులు 2.82 బిలియన్‌ డాలర్లు కరిగిపోయి 640.334 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్లు తెలిపింది.అంతకుముందు వారంలో ఈ నిలువలు 5.401 బిలియన్‌ డాలర్లు తరిగిపోయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 2021లో రికార్డు స్థాయిలో 642.453 బిలియన్‌ డాలర్లకు చేరుకున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఈ గరిష్ఠ స్థాయిని అధిగమించాయి. మరోవైపు పసిడి రిజర్వులు పెరుగుతున్నాయి. తాజాగా 1.01 బిలియన్‌ డాలర్లమేర బంగారు రిజర్వులు పెరిగి 56.808 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఇదీ చదవండి: ఒకసారి ఛార్జ్‌చేస్తే 516 కి.మీ వెళ్లేలా కొత్త ఈవీపడిపోతున్న రూపాయిఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ప్రధానంగా అంతర్జాతీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్‌ నెలకొనడంతో గత కొన్ని నెలలుగా రూపాయి విలువ క్రమంగా పతనమవుతోంది. దీంతో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 3.793 బిలియన్‌ డాలర్లు తరిగిపోయి 560.86 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయని ఆర్‌బీఐ తెలిపింది. డాలర్‌తోపాటు యూరో, పౌండ్‌, యెన్‌ కరెన్సీలు ఒత్తిడిని ఎదుర్కొనడం వల్ల విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తులు తరిగిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

BMW i5 Electric Sedan Equipped With An 83.9 kWh And Delivers 516 Kilometers
ఒకసారి ఛార్జ్‌చేస్తే 516 కి.మీ వెళ్లేలా కొత్త ఈవీ

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత విపణిలో కొత్త ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేసింది. బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ ఐ5 మోడల్‌ను తాజాగా తన వినియోగదారులకు పరిచయం చేసింది. సెడాన్‌ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన కార్లలో తొలి ఎలక్ట్రిక్‌ మోడల్‌ ఇదేనని కంపెనీ వర్గాలు తెలిపాయి.సింగిల్‌ ఛార్జింగ్‌తో 516 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారు ధర రూ.1.20 కోట్లుగా నిర్ణయించినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. కేవలం 3.8 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెప్పింది. ఇది గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని తెలిసింది. 83.9కిలోవాల్‌ హవర్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ కారు కేవలం అరగంటలోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్‌ అవనుంది.

Maruti Suzuki Net profit rises to Rs 3,878 crores in Q4 results
మారుతీ రికార్డుల స్పీడ్‌

న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంతోపాటు పూర్తి ఏడాదికి ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 48 శాతం జంప్‌చేసి రూ. 3,878 కోట్లను తాకింది. ఇది రికార్డుకాగా.. ఇందుకు జోరందుకున్న ఎస్‌యూవీ అమ్మకాలు, తగ్గిన కమోడిటీ ధరలు, వ్యయ నియంత్రణలు సహకరించాయి.అంతక్రితం ఏడాది(2022–23) క్యూ4లో కేవలం రూ. 2,624 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా షేరుకి రూ. 125 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 30,822 కోట్ల నుంచి రూ. 36,697 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 13 శాతం అధికంగా 5,84,031 వాహనాలు విక్రయించింది. వీటిలో దేశీయంగా 5,05,291 యూనిట్లు విక్రయిస్తే.. 22% అధికంగా 78,740 వాహనాలు ఎగుమతి చేసింది.    టాప్‌ ఎక్స్‌పోర్టర్‌మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మారుతీ వాహన విక్రయాలు సరికొత్త రికార్డును నెలకొల్పుతూ 20 లక్షల యూనిట్లను అధిగమించాయి. దాదాపు 9 శాతం వృద్ధితో 21,35,323 యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటిలో దేశీ విక్రయాలు 18,52,256కాగా.. 2,83,067 వాహనాలను ఎగుమతి చేసింది. తద్వారా మొత్తం ప్యాసింజర్‌ వాహన దేశీ ఎగుమతుల్లో 42 శాతం వాటాను ఆక్రమించింది. వెరసి వరుసగా మూడో ఏడాదిలోనూ టాప్‌ ఎక్స్‌పోర్టర్‌గా నిలిచింది. ఇక 2023–24లో నికర లాభం 64 శాతం దూసుకెళ్లి రూ. 13,209 కోట్లను అధిగమించింది. నికర అమ్మకాలు 20 శాతం వృద్ధితో రూ. 1,34,938 కోట్లకు చేరగా.. 2022–23లో ఇవి రూ. 1,12,501 కోట్లుగా నమోదయ్యాయి. క్యూ4 సహా పూర్తిఏడాదికి లాభాలు, అమ్మ కాలలో సరికొత్త రికార్డులు సాధించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది ఎలక్ట్రిక్‌ వాహనాలుప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఎలక్ట్రిక్‌ వాహనాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. తొలిగా వీటిని యూరోపియన్‌ దేశాలకు ఎగుమతి చేయనున్నాం.–ఆర్‌సీ భార్గవ, మారుతీ చైర్మన్‌లాభాల స్వీకరణతో మారుతీ షేరు బీఎస్‌ఈలో 1.7 శాతం నీరసించి రూ. 12,687 వద్ద ముగిసింది.

Famous Companies Founded Year From Instagram To Apple
ఈ ప్రముఖ కంపెనీలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో తెలుసా?

Famous Companies Founded Year From Instagram To Apple
ఈ ప్రముఖ కంపెనీలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో తెలుసా?

95 Percent Women Said That They Are Unaware Of Existing Govt Financial Schemes - Sakshi
95 శాతం మహిళలకు అవి తెలియదట!

భారత్‌లో మహిళలకు అప్పుపుట్టడం కష్టంగా మారిందని, అందుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ తాజా నివేదిక విడుదలైంది. అప్పు కోసం చూస్తున్న మహిళల్లో దాదాపు 47 శాతం మందికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నట్లు యూకేకు చెందిన బిజినెస్ ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్ టైడ్ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది.టైడ్ ఇండియా నివేదించిన తన మొదటి భారత్ ఉమెన్ యాస్పిరేషన్ ఇండెక్స్ (బీడబ్ల్యూఏఐ) కోసం టైర్-2 పట్టణాల నుంచి 18-55 ఏళ్ల వయసు ఉన్న 1,200 మందిపై సర్వే చేశారు. ఇందులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆర్థిక పథకాలు, తమ వ్యాపారానికి ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాల గురించి వారికి తెలియదని 95 శాతం మంది మహిళలు చెప్పారు. అయితే 52 శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక రుణాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఇద్దరిలో ఒకరికి ఆర్థికపరమైన అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. కానీ 47 శాతం మందికి మాత్రం అప్పుపుట్టడం కష్టంగా మారుతుందని నివేదించింది.సర్వేలో భాగంగా 80 శాతం మంది మహిళలు డిజిటల్ అక్షరాస్యత అవసరమని గుర్తించారు. 51 శాతం మంది తమ వ్యాపారం కోసం డిజిటల్ సాధనాలను యాక్సెస్ చేయడంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నారని నివేదిక ఎత్తి చూపింది. 31 శాతం మంది మహిళలకు అదే వ్యాపారంలో ఉన్న ఇతర మహిళలతో పోటీ ఏర్పడుతోందని తెలిసింది. ఇదీ చదవండి: ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీటైడ్, గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆలివర్ ప్రిల్ మాట్లాడుతూ..‘మహిళా వ్యాపారవేత్తలకు అప్పు పుట్టుకపోవడానికి ప్రధాన కారణం..వారు మహిళలు కావడమే. దాంతోపాటు వారు ఉంటున్న ప్రాంతం కూడా అవరోధంగా మారుతోంది. ముఖ్యంగా టైర్-2 పట్టణాలు, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరమైన అవగాహన లేకపోవడం, సరైన మార్గదర్శకత్వం కరవవడంతో అప్పులు రావడం లేదు’ అన్నారు.

The Top Stock Holdings Of Central Home Minister AmithShah
అమిత్‌షా ఏయే కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేశారో తెలుసా..

గుజరాత్ గాంధీనగర్ నుంచి పోటీలో ఉన్న అమిత్ షా ఇటీవల ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించారు. అయితే అందులో మంత్రి పెట్టుబడుల వివరాలను పేర్కొన్నారు. స్టాక్‌మార్కెట్‌లోని చాలా కంపెనీల్లో ఆయన ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలిసింది.  అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం అమిత్ షా మెుత్తం పెట్టుబడుల విలువ రూ.17.46 కోట్లుగా ఉంది. ఆయాన భార్య సోనాల్ షా 80 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయటంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విలువ రూ.20 కోట్లని తెలిసింది. అమిత్‌షాతోపాటు ఆయన భార్య సోనాల్‌షా ప్రధానం పెట్టుబడి పెట్టిన కంపెనీల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.అమిత్‌షా పెట్టుబడుల్లో కొన్ని..హిందుస్థాన్ యూనిలీవర్ రూ.1.4 కోట్లుఎంఆర్‌ఎఫ్ రూ.1.3 కోట్లుకోల్‌గేట్-పామోలివ్ (ఇండియా) రూ.1.1 కోట్లుప్రాక్టర్ & గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్ రూ.0.96 కోట్లు ఏబీబీ ఇండియా రూ.0.7 కోట్లుసోనాల్‌షా పెట్టుబడుల్లో కొన్ని..కెనరా బ్యాంక్‌లో అమిత్ షా దాదాపు రూ.7.25 లక్షల విలువైన షేర్లను హోల్డ్ చేస్తున్నారు. ఆయన భార్య సోనాల్ షా రూ.3 కోట్ల విలువైన షేర్లు కలిగి ఉన్నారు.కరూర్‌వైశ్యా బ్యాంక్‌లో రూ.1.9 కోట్లకుపైగా పెట్టుబడులు ఉన్నాయి.గుజరాత్‌ ఫ్లోరో కెమికల్స్‌ కంపెనీలో రూ.1.8 కోట్ల పెట్టుబడి పెట్టారు.లక్ష్మి మిషన్‌ వర్క్స్‌లో రూ.1.8 కోట్లు విలువైన షేర్లు ఉన్నాయి.భారతీఎయిర్‌టెల్‌ కంపెనీలో రూ.1.3 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు.ఇదీ చదవండి: ప్రయాణికులు అభ్యర్థించకపోయినా డబ్బు రీఫండ్‌!అమిత్ షా పోర్ట్‌ఫోలియోలో ఐటీసీ, వీఐపీ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, గ్రైండ్‌వెల్ నార్టన్, కమిన్స్ ఇండియా, నెరోలాక్ పెయింట్స్ వంటి కంపెనీలున్నాయి. హోం మంత్రి బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లోని స్టాక్‌లకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది.

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 65.70 75.20

Egg & Chicken Price

Title Price Quantity
Egg 100.00 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement