Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Credit Growth will be down for present financial year
బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థ

భారతీయ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్, లాభాల విషయంలో ఆశించిన వృద్ధి నమోదవుతుందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థ తెలిపింది. అయితే అనుకున్న మేరకు డిపాజిట్లు రావని, దాంతో రుణ వృద్ధి తగ్గుతుందని సంస్థ అంచనా వేసింది.ఆసియా-పసిఫిక్ 2క్యూ 2024 బ్యాంకింగ్ అప్‌డేట్‌ కార్యక్రమంలో ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ నికితా ఆనంద్ మాట్లాడారు. ‘గతేడాదిలో 16 శాతం వృద్ధి నమోదుచేసిన రిటైల్ డిపాజిట్లు  ఈ ఏడాది 14 శాతానికి పరిమితం కానున్నాయి.  ప్రతి బ్యాంకులో రుణం-డిపాజిట్ల నిష్పత్తిలో తేడా ఉండనుంది. లోన్‌వృద్ధి డిప్లాజిట్ల కంటే 2-3 శాతం ఎక్కువగా ఉండనుంది. ఈ ఏడాదిలో బ్యాంకులు తమ రుణ వృద్ధిని తగ్గించి, డిపాజిట్ల పెంపునకు కృషి చేయాలి. అలా చేయకపోతే బ్యాంకులు నిధులు పొందడానికి కొంత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది’ అని చెప్పారు. సాధారణంగా రుణ వృద్ధిలో ప్రైవేట్ రంగ బ్యాంకులు 17-18 శాతం వృద్ధి నమోదుచేస్తాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సరాసరి 12-14 శాతం మేరకు రుణ వృద్ధి ఉంటుంది.

Azim Premji family will invest more money into AI investment tools
ఏఐ టూల్స్‌ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ

సాఫ్ట్‌వేర్ దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం వివిధ విభాగాల్లో దాదాపు రూ.83వేలకోట్లు(10 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడి పెట్టింది. తాజాగా ప్రేమ్‌జీఇన్వెస్ట్ ఆఫీస్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల్లో పెట్టుబడులను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సంస్థతో సంబంధం ఉన్న సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు మీడియాకు తెలియజేశారు.ప్రైవేట్ ఈక్విటీ రంగంలో ఏఐ సాధనాలను ఉపయోగించిన మొట్టమొదటి అతిపెద్ద భారతీయ అసెట్ మేనేజ్‌మెంట్‌ సంస్థగా ప్రేమ్‌జీఇన్వెస్ట్‌ నిలిచింది. కంపెనీ ప్రస్తుతం ఏఐ క్వాంట్ మోడల్‌పై పని చేస్తోందని మేనేజింగ్ పార్ట్‌నర్‌, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ టీకే కురియన్ తెలిపారు. అధికరాబడుల కోసం ఏఐటూల్స్‌ను వినియోగిస్తూ ఆయా కంపెనీల్లో తన పెట్టుబడులను సైతం పెంచుకోవాలనుకుంటుందని ఆయన చెప్పారు.బ్లాక్‌రాక్ ఇంక్., సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడి సంస్థలు మార్కెట్‌లోని డేటా స్ట్రీమ్‌లను విశ్లేషించడానికి ఏఐపై ఆధారపడుతున్నాయి. దాంతోపాటు ఈ రంగంలో మరింత పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాయి. అందులో భాగంగానే ప్రేమ్‌జీఇన్వెస్ట్ మూడేళ్ల క్రితం ఏఐ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. దానికోసం ఏఐ ఇంజినీర్లను నియమించుకుంది. అదే సమయంలో ఏఐ ఇన్వెస్ట్‌మెంట్‌ టూల్స్‌ తయారుచేసే సంస్థలకు మద్దతుగా నిలవడం మొదలుపెట్టినట్లు తెలిసింది.ఇదీ చదవండి: నిమిషానికి 500 గంటల కంటెంట్‌ అప్‌లోడ్‌.. యూట్యూబ్‌ ప్రస్థానం ఇదే..ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ కంపెనీల్లో   పెట్టుబడి అవకాశాలను గుర్తించడానికి 600 పారామీటర్లను విశ్లేషించేందుకు ఏఐ సహాయం చేస్తోందని కురియన్‌ అన్నారు. ఈ కసరత్తు వల్ల తోటివారి కంటే ముందంజలో ఉండేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. కోహెసిటీ ఇంక్‌-డేటా మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ, లండన్‌లోని ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ-హోలిస్టిక్ ఏఐ, ఇకిగాయ్‌, ఫిక్సిస్‌ వంటి ప్రముఖ కంపెనీలకు ప్రేమ్‌జీఇన్వెస్ట్‌ సేవలందిస్తోందని తెలిసింది. దేశంలో అధికంగా పోగవుతున్న కోర్టు కేసులను వేగంగా పరిష్కరించడానికి ఉపయోగపడే ఏఐను అభివృద్ధి చేసేందుకు సంస్థ సహకరిస్తుందని కురియన్‌ అన్నారు. 

Stock Market Rally On Today Opening
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 22,497కు చేరింది. సెన్సెక్స్‌ 298 పాయింట్లు దిగజారి 74,021 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 106.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 88.2 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.67 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 1.02 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 2 శాతం ఎగబాకింది.ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలు ఉండనున్నాయి. దాంతోపాటు బుధవారం వడ్డీరేట్లపై  వెల్లడయ్యే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎంపిక చేసిన షేర్లు, రంగాల్లో కదలికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మే 1న సెలవు కావడంతో, మార్కెట్లు ఈవారం 4 రోజులే పనిచేయనున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Banks will remain closed on THESE days in May 2024
బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో 12 రోజులు బంద్‌!

Bank Holidays in May 2024: బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన సమచారం ఇది. మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి.దేశవ్యాప్తంగా బ్యాంకులకు మే నెలలో మొత్తం 12 రోజులు సెలవులు ఉండగా వీటిలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతోపాటు పండుగలు, ప్రత్యేక సందర్భాలు కలిసి ఉన్నాయి. ఇవి రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు ఏదో ఒక పని కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. ఆన్‌లైన్ లో ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా కొన్ని పనులు బ్యాంకులకు వెళ్లి చేయాల్సి ఉంటుంది. అటువంటివారి కోసం బ్యాంకు సెలవుల సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం.మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..మే 1: మహారాష్ట్ర దినోత్సవం/ మే డే (కార్మిక దినోత్సవం) మే 5: ఆదివారం.మే 8: రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకుల బంద్మే 10: బసవ జయంతి/ అక్షయ తృతీయమే 11: రెండో శనివారంమే 12: ఆదివారం.మే 16: సిక్కిం రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవుమే 19: ఆదివారం.మే 20: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా బేలాపూర్, ముంబైలో బ్యాంకుల  మూతమే 23: బుద్ధ పూర్ణిమ మే 25: నాలుగో శనివారం. మే 26: ఆదివారం.

Ankur Jain Married To Ex WWE Star Erika Hammond
మాజీ రెజ్లర్‌ను పెళ్లాడిన టెక్ సీఈఓ అంకుర్ జైన్.. ఫోటోలు

భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త, బిలినీయర్ 'అంకుర్ జైన్' గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. భారతీయ మూలాలున్న ఈయన బిల్ట్ రివార్డ్స్ సీఈఓగా ఉన్నారు. ఇటీవల ఈయన మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ 'ఎరికా హమ్మండ్‌'ను వివాహం చేసుకుని ఓ ఇంటివారయ్యారు.అంకుర్ జైన్, ఎరికా హమ్మండ్‌ ఏప్రిల్ 26న ఈజిప్ట్‌లోని పిరమిడ్స్ ఎదురుగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు.. పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.పెళ్లి కొంత భిన్నంగా ఉండాలనే ఆలోచనతోనే వారు దక్షిణాఫ్రికాలోని సఫారీ సందర్శనలో మొదలు పెట్టి ఈజిప్ట్‌లో పెళ్లి వేడుకలను ముగించారు. న్యూయార్క్ సిటీకి చెందిన భారత సంతతి బిలియనీర్ అంకుర్ జైన్ రంబుల్ బాక్సింగ్ జిమ్‌కి వెళ్లే సమయంలో.. ఎరికా హమ్మండ్‌, అంకుర్‌కు ఫిజికల్ ట్రైనర్‌గా వ్యవహరించారు. ఈ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.ఎవరీ ఎరికా హమ్మండ్?ఎరికా హమ్మండ్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్. ఆమె రెజ్లింగ్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఫిట్‌నెస్ కోచ్‌గా మారింది. ఈ సమయంలోనే బిలినీయర్ 'అంకుర్ జైన్'ను కలుసుకున్నారు. ఈమె స్ట్రాంగ్ అనే యాప్‌ కూడా స్టార్ట్ చేశారు.    View this post on Instagram           A post shared by Ankur Jain (@ankurjain)

Alakh Pandey Urges Indian Students At Harvard, Stanford
విద్యార్థుల్లారా.. రండి మాతృ దేశానికి సేవ చేయండి.. ఫిజిక్స్‌ వాలా పిలుపు

అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్ధుల్లారా.. మీరెక్కడున్నా దేశానికి తిరిగి వచ్చేయండి. దేశ సేవ చేయండి. దేశ అభివృద్దిలో పాలు పంచుకోండి అంటూ ప్రముఖ ఎడ్యుటెక్‌ ఫిజిక్స్‌ వాల వ్యవస్థాపకుడు, సీఈఓ అలఖ్ పాండే పిలుపునిచ్చారు.యూఎస్‌లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు దేశ సేవ చేయాలని అలఖ్‌ పాండే కోరారు. తిరిగి రాలేని వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేశ పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అలఖ్‌ పాండే ఇటీవల హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీల్లో ప్రసంగించేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ క్యాంపస్‌లలో భారతీయ విద్యార్ధులతో దిగిన ఫోటోల్ని, అనుభవాల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  అవును, మన దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఏ దేశం పరిపూర్ణంగా లేదు. కానీ  యువత దేశాన్ని మార్చుకునే అవకాశం ఉందని అన్నారు.      View this post on Instagram           A post shared by Physics Wallah (PW) (@physicswallah)

Users Report Telegram Outage for Second Time in Last 24 Hours
మోరాయించిన ప్రముఖ యాప్‌.. మీమ్స్‌ వైరల్‌!

ప్రముఖ సోషల్‌ మీడియా మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ టెలిగ్రామ్‌ సేవలు గడిచిన 24 గంటల్లో పలుసార్లు నిలిచిపోయాయి. యూజర్లు టెలిగ్రామ్‌లో మెసేజ్‌లు పంపడం, డౌన్‌లోడ్‌, లాగిన్‌ చేసేపుడు ఇబ్బందులకు గురైనట్లు ఫిర్యాదు చేశారు.దాదాపు 6700 మందికిపై టెలిగ్రామ్‌ పని చేయడం లేదని ఫిర్యాదులు చేసినట్లుగా డౌన్‌డిటెక్టర్‌ డేటా ద్వారా తెలిసింది. మొత్త ఫిర్యాదు చేసిన వారిలో 49 శాతం మంది మెసేజ్‌లు పంపించడంతో ఇబ్బందులు ఎదురైనట్లు చెప్పారు. 31 శాతం మంది యాప్‌ పనిచేయలేదని, 21 శాతం మంది లాగిన్‌ సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు.Twitter users to telegram users right now#telegramdown pic.twitter.com/X4gP9hYn1R— Dr.Duet🇵🇸 (@Drduet56) April 26, 2024ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, లక్నో, పాట్నా, జైపుర్, అహ్మదాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందినట్లు తెలిసింది.అయితే ఇప్పటివరకు టెలిగ్రామ్‌ ఈ సమస్యపై స్పందించలేదు. ఇలా ప్రముఖ యాప్‌లో సమస్య ఎదురైందనే వార్త క్షణాల్లో వైరల్‌ అవ్వడంతో వాటికి సంబంధించి ట్విటర్‌లో చాలా మీమ్స్‌ చక్కర్లు కొట్టాయి.telegram users rn#telegramDownpic.twitter.com/wz7KYfLwIS— F. 🇵🇸🚩 (@aaatankwaadi) April 26, 2024

Railways Plans To Roll Out Vande Metro Trials To Begin In July 2024
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్‌డేట్‌

సెమీ-హై స్పీడ్ వందే భారత్ రైళ్ల భారీ విజయం తర్వాత ఇండియన్‌ రైల్వే దేశంలోని మొదటి వందే మెట్రోను ప్రారంభించాలని యోచిస్తోందని, ఇంట్రా-సిటీ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌ను మార్చేందుకు ప్రణాళికలు వేస్తోందని ప్రాజెక్ట్‌తో సంబంధం ఉన్న ఒక సీనియర్ అధికారి తెలిపారు."2024 జూలై నుండి వందే మెట్రో ట్రయల్ రన్ ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. తద్వారా దీని సేవలను వీలైనంత త్వరగా ప్రజలకు అందించవచ్చు" అని ఆ అధికారి చెప్పినట్లుగా ఎన్‌డీటీవీ పేర్కొంది. క్షణాల్లో వేగాన్ని అందుకునేలా, తక్కువ సమయంలో ఎక్కువ స్టాప్‌లను కవర్ చేసేలా ఆధునిక టెక్నాలజీతో పాటు మరిన్ని ఫీచర్లు ఈ ట్రైన్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది.రైల్వే వర్గాల ప్రకారం, ఇది ఒక ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. దీనిలో నాలుగు కోచ్‌లు ఒక యూనిట్‌గా ఉంటాయి. ప్రాథమికంగా కనీసం 12 కోచ్‌లు ఒక వందే మెట్రోలో ఉంటాయి. తర్వాత డిమాండ్‌కు అనుగుణంగా కోచ్‌లను 16 వరకు పెంచుతారు.

Today Gold and Silver Price 28 April 2024
స్థిరంగా బంగారం, వెండి.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?

ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఉలుకూ.. పలుకూ లేకుండా అన్నట్లు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66850 (22 క్యారెట్స్), రూ.72930 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 200 నుంచి రూ. 200 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 67000 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 73080 రూపాయల వద్దే ఉంది. నిన్న రూ.200, రూ.220 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు ఏ మాత్రం పెరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి.దేశంలోని ఇతర నగరాలలో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 67700 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 72760 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా ఈ రోజు ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు (ఏప్రిల్ 28) ఒక కేజీ వెండి ధర 84000 రూపాయల వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేదు.

Elon Musk Heads To China In A Surprise Visit
భారత పర్యటన రద్దు.. అకస్మాత్తుగా చైనాలో ప్రత్యక్షమైన మస్క్‌

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా సీఈఓ ఎలోన్‌ మస్క్‌ చైనాలో ప్రత్యక్షమయ్యారు. గత కొంత కాలంగా మస్క్‌ సారథ్యంలోని టెస్లా భారత్‌లో మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనుందని, ఇందుకోసం మస్క్‌ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.కేంద్రం సైతం మస్క్‌ ఏప్రిల్‌ నెల 21, 22 తేదీలలో వస్తున్నారంటూ సూచనప్రాయంగా తెలిపింది. కానీ పలు అన్వేక కారణాల వల్ల భేటీ రద్దయింది.  అయితే ఈ నేపథ్యంలో టెస్లా సీఈఓ తన ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ (ఎఫ్‌ఎస్‌డీ)కార్లలోని సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేసేందుకు,ఎఫ్‌ఎస్‌డీ అల్గారిథమ్‌లకు శిక్షణ ఇవ్వడానికి దేశంలో సేకరించిన డేటాను విదేశాలకు బదిలీ చేసేందుకు  కావాల్సిన అనుమతులను పొందేందుకు బీజింగ్‌లోని చైనా అధికారులతో భేటీ కానున్నారు.మరోవైపు ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లపై ఎక్స్‌లో చర్చ మొదలైంది.దీనిపై మస్క్‌ స్పందిస్తూ అతి త్వరలో డ్రాగన్‌ కంట్రీలో ఎఫ్‌ఎస్‌డీ కార్లు అందుబాటులోకి రానుందని తెలిపారు.   

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 65.70 75.20

Egg & Chicken Price

Title Price Quantity
Egg 100.00 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement