News


సాక్షి బిజినెస్‌ క్విజ్‌ - 16... ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినం

Sunday 17th June 2018
sakshi-specials_main1529248315.png-17468

1. దశాబ్దాలుగా బాల కార్మికులు నుంచి వాళ్ల బాల్యం దోచుకొని వాళ్ల మానసిక, ఆర్ధిక ఎదుగుదలకు అడ్డుగోడ కడుతున్నారు. చైల్డ్ లేబర్ అంటే ఏమిటి?
ఎ) పిల్లలను అనైతికంగా పనిలో పెట్టుకొని వారి సంభావ్యత, గౌరవం, ఆనందం కు ముప్పు కలిగించడం
బి) బాలల హక్కులను కాలరాచి పిల్లలకు శారీరక , మానసికంగా హాని కలిగే పనిలొ నియమించడం
సి) పిల్లలను దొంగలించి అక్రమ రవాణా చేయడం, బానిసలుగా చేసి పని చేయించుకోవడం
డి) పైవన్నీ
 
2. అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐ.ఎల్ఓ.) 2002 నుంచి జూన్ 12 ని ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినం గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా, ఏ రంగంలో 60% మందికి పైగా బాల కార్మికులున్నారు?
ఎ) వ్యవసాయం
బి) ఇటుక బట్టిలు
సి) బాణసంచా, బీడీ
డి) టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ పరిశ్రమ
 
3. ఈ క్రింది వాటిలో ఏ దేశంలో అరటి తోటల సాగు, ఉత్పత్తి, ఎగుమతి వర్తకం లో అత్యథికంగా బాల కార్మికులు పని చేస్తున్నారు?
ఎ) ఈక్వెడార్
బి) నికరాగువా
సి) ఫిలిప్పీన్స్
డి) పైవన్నీ
 
4. భారతదేశంలో 15 లక్షల మంది పిల్లలు ఏ పరిశ్రమలో నిర్బంధిత పరిస్థితుల్లో పని చేస్తున్నారు?
ఎ) తివాచీలు
బి) ఇటుక బట్టిలు
సి) క్వారీ రాళ్ళు
డి) పైవన్నీ
 
5. ఏ దేశపు 1400 కోట్ల వెనిల్లా వర్తకం కోసం వెనిల్లా పంట పొలాల్లో 20 వేలకు పైగా బాల కార్మికులను ఉపయోస్తున్నారు?
ఎ) మడగాస్కర్
బి) బొలివియా
సి) కార్బ్రియన్ ద్వీపాలు
డి) నైరోబీ
 
6. ఏ దేశపు పామ్ ఆయిల్ పంట, ఉత్పత్తి వంటి వాటి కొరకు బాల కార్మికులు ఉపాధి కల్గి ఉన్నారు?
ఎ) టోంగా
బి) బంగ్లాదేశ్
సి) మలేషియా
డి) ఉగాండా
 
7. దిగువనీయబడిన ఏ క్షేత్రంలో 14 ఏళ్లలోపు పిల్లలు ఉపాధి పొందవచ్చని ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించింది?
ఎ) వ్యవసాయం
బి) ఫ్యామిలీ బిజినెస్ మరియు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ
సి) సర్కస్ మరియు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ
డి) రెస్టారెంట్లు, హోటల్స్, హాస్పిటల్స్
 
8. భారతదేశ బాల కార్మికుల చట్టాల ప్రకారం, 'యుక్తవయసు' యొక్క నిర్వచనం ఏమిటి?
ఎ) 12 నుంచి 16 సంవత్సరాల మధ్య పిల్లలు
బి) 14 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలు
సి) 12 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలు
డి) 14 నుంచి 21 సంవత్సరాల మధ్య పిల్లలు
 
9. భారత కార్మిక చట్టాల ప్రకారం యుక్తవయస్కులకు ఏ రంగంలో ఉపాధి కలిపించడం నేరం?
ఎ) బాణసంచా
బి) అన్ని ప్రమాదకర పరిశ్రమలు లేదా హెజార్డర్స్ ఇండస్త్రీ
సి) కెమికల్స్
డి) సిగరెట్, బీడీ పరిశ్రమ
 
10. దిగువ వాటిలో ఏ నాలుగు రాష్ట్రాలలో భారతదేశములో కెల్లా అత్యధికంగా బాల కార్మికులున్నారు?
ఎ) ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా, బీహార్, గుజరాత్
బి) బీహార్, మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా
సి) ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్
డి) ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్
 
11. బాల కార్మికులు ఎక్కువగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవి?
ఎ) ఎరిట్రియా, సోమాలియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో,
బి) మయన్మార్, సూడాన్, జింబాబ్వే, బురుండి
సి) ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, యెమెన్, నైజీరియా
డి) పైవన్నీ
 
12. దిగువ కంపెనీల్లో ఏవి తమ ఉత్పత్తుల తయారీ ప్రక్రియలో బాల కార్మికులను నియమించాయని ఆరోపణలు ఎదురొన్నాయి?
ఎ) గ్యాప్, హెచ్ & ఎం, విక్టోరియా సీక్రెట్
బి) వాల్మార్ట్, డిస్నీ, ఫర్ ఎవ్వర్ 21
సి) ఫిలిప్ మోరిస్
డి) పైవన్నీ
 
13. నెస్లే, ఏరో, క్రాఫ్ట్ ఫుడ్స్, హెర్షీ'స్ - ఈ చాక్లేట్ తయారీ కంపెనీలు బాల కార్మికులను ఏ ప్రదేసంలో ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి?
ఎ) చాక్లెట్ ఫ్యాక్టరీలలో
బి) చేతితో చేసే చాక్లేట్ల లఘు పరిశ్రమలో
సి) చాక్లెట్ ముడి పదార్థమైన కోకా పండే పొలాలలో
డి) చాక్లెట్లను రుచి చూసే ప్రక్రియ కొరకు లేదా చాక్లెట్ టేస్టర్
 
14. ఎన్ జి ఓ ల, భారత లేబర్ డిపార్టుమెంటు తనిఖీల బారి నుంచి తప్పించుకోడానికి దిగువ ఏ పరిశ్రమలు బాల కార్మికులను వారి ఇళ్ళల్లోనే పని చేయిస్తున్నాయి?
ఎ) బీడీ
బి) బాణసంచా, అగ్గి పెట్టెలు
సి) వెదురు బుట్ట నేత
డి) పైవన్నీ
 
సమాధానాలు: 1డి 2 3డి 4డి 5 6సి 7బి 8బి 9బి 10సి 11డి 12డి 13సి 14డి
 
సునీల్ ధవళ
సీఈఓ,ద థర్డ్ అంపైర్ మీడియా
ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 14

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 13

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 12

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 11

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 10

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 9

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 8

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 7

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 6

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 5

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 4

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 3

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 2You may be interested

‘రైట్స్‌’ ఐపీఓ... 10 ముఖ్యాంశాలు

Sunday 17th June 2018

ప్రభుత్వరంగ సంస్థ రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనమిక్‌ సర్వీసెస్‌ (రైట్స్‌)  ఐపీఓ ఈ నెల 20న ప్రారంభమవుతుంది. రూ.10 చొప్పున ముఖవిలువతో రూ.180-185 మధ్య షేరు ధరను నిర్ణయించారు. రూ.466.2 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా కంపెనీ ఈ ఐపీఓను ఆరంభిస్తోంది. ఆఫర్‌ 22వ తేదీన ముగుస్తుంది.  రైట్స్‌ పూర్తిస్థాయి ప్రభుత్వరంగసంస్థ. భారతీయ రైల్వే దీనిని 1974లో స్థాపించింది. ట్రాన్స్‌పోర్ట్‌ కన్సల్టెన్సీ, ఇంజనీరింగ్‌ రంగంలో పేరుప్రఖ్యాతులు సంపాదించింది. ఇతర

 ఈవారం మార్కెట్‌కు ఈ అంశాలు కీలకం

Sunday 17th June 2018

మళ్లీ అంతర్జాతీయ వాణిజ్య ఘర్షణలు షురూ అయ్యాయి. మరోవైపు అమెరికా-ఉత్తర కొరియా అణ్వస్త్రాల నిర్మూలన ఒప్పందంపై సంతకాలు చేయడం మార్కెట్‌కు ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే చైనా ఎగుమతులపై అమెరికా భారీ టారిఫ్‌లు ప్రకటించడంతో ఈ ఉత్సాహం కాస్త నీరుగారింది. ఫెడ్‌ నిర్ణయం తరువాత వర్ధమాన మార్కెట్లు పెద్దగా స్పందించలేదు. దలాల్‌ స్ట్రీట్‌లో బుల్లిష్‌ ట్రేడర్లు కూడా సంయమనం పాటించారు. ఈ నేపథ్యంలో ఈవారం ఇన్వెస్టర్లను ఈ ఏడు అంశాలు ప్రభావితం చేసే

Most from this category