News


 సాక్షి బిజినెస్‌ క్విజ్‌  11 

Saturday 12th May 2018
sakshi-specials_main1526129833.png-16416

1. జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) కంపెనీ స్థాపకులు ఎవరు?
ఎ) జాక్ వెల్ష్
బి) జాన్ ఎఫ్ వెల్ష్
సి) డా.విల్లీస్ విట్నె
డి) థామస్ అల్వా ఎడిసన్

2. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీని ఏ పేరుతో స్ధాపించారు?
ఎ) జెర్మన్ ఎలెక్ట్రిక్ కంపెనీ
బి) గ్రేట్ ఈస్టర్న్ కంపెనీ
సి) ఎడిసన్ ఎలక్ట్రిక్ లైట్ కంపెనీ
డి) థామ్సన్ హూస్టన్ ఎలక్ట్రిక్ కంపెనీ

3. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ‘డోజోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్’లో ఏ సంవత్సరం చేరింది?
ఎ) 1986
బి) 1972
సి) 1896
డి) 1876

4. క్రింది వానిలో ఏ మీడియా సంస్థ ఒకప్పడు జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీకి చెందినది? 
ఎ) ఎ.బి.సి నెట్‌వర్క్
బి) ఎన్.బి.సి నెట్‌వర్క్
సి) ఫాక్స్ నెట్‌వర్క్
డి) సి.బి.ఎస్ నెట్‌వర్క్

5. తమకు చెందిన టీవీ నెట్‌వర్క్‌లో 100 శాతం యాజమాన్య హక్కు ఏ కంపెనీకి 2013లో జనరల్ ఎలక్ట్రిక్  విక్రయించింది?
ఎ) న్యూస్ కార్పొరేషన్
బి) టైమ్‌ వార్నర్
సి) కంకాస్ట్
డి) వెరిజాన్ 

6. బిజినెస్ న్యూస్ అందించే వ్యూహంతో అమెరికా కేబుల్ విజన్ భాగస్వామ్యంతో, జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ 1989లో ఏ టీవీ  నెట్‌వర్క్‌ను ప్రారంభించింది?
ఎ) ఫైనాన్షియల్ న్యూస్ నెట్‌వర్క్
బి) సి.ఎస్.బి.సి
సి) బిజినెస్ న్యూస్ నెట్‌వర్క్
డి) బ్లూమ్‌బర్గ్ టెలివిజన్

7. తమ గృహోపకరణాల వ్యాపారం ఏ సంస్థకు జనరల్ ఎలక్ట్రిక్ అమ్మేసింది?
ఎ) ఎలక్ట్రోలక్స్
బి) హయర్
సి) ఐఎఫ్‌బీ
డి) ఎల్‌జీ

8. రైల్వే సూపర్వైజర్ కుమారుడైనా జాక్ వెల్ష్ తన 45వ ఏట జీఈ కంపెనీ చరిత్రలోనే అతి చిన్న వయసులో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఈయన అధికారిక పూర్తి పేరు ఏంటి?
ఎ) జాన్ ఫ్రాన్సిస్ వెల్ష్ జూనియర్
బి) జాన్ ఫ్రాన్సిస్ వెల్ష్
సి) జాక్ ఫ్రాన్సిస్ వెల్ష్-1
డి) జాక్ ఫ్రాన్సిస్ వెల్ష్-2

9. ఈ క్రింది వాటిలో ఏ సిద్ధాంతం లేదా విధానం ప్రసిద్ధిగాంచడానికి, ప్రాచుర్యం అవ్వడానికి ఘనత జాక్ వెల్ష్‌కు దక్కుతుంది?
ఎ)  లీన్
బి) టోటల్ క్వాలిటీ మేనేజ్‌మెంట్
సి) ఐఎస్ఓ:9001
డి) సిక్స్ సిగ్మా 

10. క్రింది వాటిలో ఏవి జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఉత్పత్తి చేసింది?
ఎ) ఇస్త్రీ పెట్టె, కుట్టు మిషన్, రేడియో, టెలివిజన్
బి) బల్బులు, సీలింగ్ ఫ్యాన్, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, మైక్రోఅవెన్
సి) ఎంఆర్ఐ స్కానింగ్ మెషిన్, ఎలక్ట్రిక్ బస్సులు, మెరైన్ షిప్ ఇంజిన్లు, రైలింజన్లు, విమానాల ఇంజన్లు
డి) పైవన్నీ

11. అతని ఆత్మ కథ తమ పత్రిక కోసం రాయమని ఏ పత్రికా సంస్థ జాక్ వెల్ష్‌కు 71 లక్షల డాలర్లు చెల్లించింది?
ఎ) ఫోర్బ్స్ మ్యాగజిన్
బి) వాల్ స్ట్రీట్ జర్నల్
సి) ఫార్ట్యూన్ మ్యాగజిన్
డి) టైమ్ మ్యాగజిన్

12. ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డు (1998 లో స్థాపించిన నాటి నుంచి 2016 వరకు)కు సంబంధించిన బ్యాకెండ్ ప్రాసెస్‌ను జీఈ క్యాపిటల్ నిర్వహించింది?
ఎ) స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు
బి) అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డు
సి) హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డు
డి) సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు
 
సమాధానాలు:  1డి   2సి   3సి   4బి   5సి  6బి  7బి   8ఎ    9డి   10డి  11సి  12ఎ   

సునీల్ ధవళ
సీఈఓ,ద థర్డ్ అంపైర్ మీడియా
ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ 

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 10

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 9

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 8

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 7

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 6

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 5

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 4

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 3

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 2You may be interested

క్రికెట్‌ పోటీ నేర్పే మార్కెట్‌ పాఠాలు

Saturday 12th May 2018

ఐపీఎల్‌ నుంచి ఏం నేర్చుకోవచ్చు?   వేసవి వచ్చిందంటే చాలు దేశమంతా ఐపీఎల్‌ మానియా ఆవహిస్తుంది... 20 ఓవర్ల హంగామా కోసం క్రికెట్‌ ప్రియులు టీవీలకు అతుక్కుపోతారు.. ఒక  విజయం సంతోష పెడుతుంది.. ఒక ఓటమి బాధిస్తుంది.. ఒక మ్యాచ్‌ ఉత్కంఠ రేపుతుంది.. ఒక మ్యాచ్‌ చప్పగా సాగుతుంది.. మొత్తం మీద మాత్రం మనసంతా నిండిపోతుంది.. మరి ఇంత ప్రభావం చూపే ఈ పోటీని.. ఇందులో వ్యూహాలను మార్కెట్‌కు అన్వయిస్తే ఎలా ఉంటుంది?...   ఈ ఏడాది

బీజేపీ గెలిస్తే 10900కు నిఫ్టీ!

Saturday 12th May 2018

కర్నాటక ఎన్నికల్లో ఓడితే మరోమారు కరెక‌్షన్‌ పోల్‌లో పలువురు నిపుణుల అంచనా  ప్రస్తుతం నిఫ్టీ 10800 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఇకమీదట సూచీల పయనాన్ని శనివారం జరిగే కర్నాటక ఎన్నికలు ప్రభావితం చేయనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడితే నిఫ్టీ 10900 పాయింట్లను చేరవచ్చని, ఇంకా మాట్లాడితే మరో ఆల్‌టైమ్‌ హైని చేరుకోవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు, మార్కెట్‌ కదలికలపై మనీకంట్రోల్‌ నిర్వహించిన ఒక సర్వేలో 11

Most from this category