News


స్టార్టప్‌.. రౌండప్‌...

Wednesday 25th December 2019
sakshi-specials_main1577269204.png-30432

యూఎస్‌, చైనా తర్వాత అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ భారత్‌లోనే ఉంది. దేశంలో దాదాపు 50వేల స్టార్టప్స్‌ ఉన్నాయి. వీటిలో పది శాతం వరకు ఫండింగ్‌ పొందాయి. యువ జనాభా అధికంగా ఉన్న భారత్‌లో స్టార్టప్‌ బూమ్‌ మరింతగా ఉండాల్సిఉందని, కానీ కొన్ని సవాళ్ల కారణంగా జోరందుకోలేకపోతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ స్టార్టప్‌ రంగంలో 2019 తీసుకువచ్చిన మార్పులు, చేర్పులు చాలా ఉన్నాయి. బడా డీల్స్‌ నుంచి భారీ ఫండ్‌రైజింగ్‌ల దాకా ఈ ఏడాది స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌కు సంబంధిచిన కీలకాంశాలు నెలల వారీగా ఇలా ఉన్నాయి....

1. జనవరి:- అమెజాన్‌, ఫ్లిప్‌కార​‍్టకు వ్యతిరేకంగా దేశీయ కిరాణా వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. దీంతో ప్రభుత్వం ఈకామర్స్‌కు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ నిబంధనల ప్రకారం తమకు వాటాలున్న కంపెనీల ఉత్పత్తులను తమ సొంత ప్లాట్‌ఫామ్స్‌పై అమ్మకుండా బడా ఈకామ్‌సైట్లను నియంత్రించడం జరిగింది.
2. ఫిబ్రవరి:- అంకితి బోస్‌కు చెందిన జిలింగో స్టార్టప్‌ 100 కోట్ల డాలర్ల రెవెన్యూను సాధించింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉన్నా, సంస్థ ప్రధాన లక్ష్యిత మార్కెట్‌ ఇండియానే!
3. మార్చి:- ఇండియా, దక్షిణాసియా మార్కెట్లోకి  రూ. 1400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ఓయో వ్యవస్థాపకుడు రితేశ్‌ అగర్వాల్‌ ప్రకటించారు. సాఫ్ట్‌బ్యాంక్‌ దన్నుతో రితేశ్‌ ఈప్రకటన చేసినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
4. ఏప్రిల్‌:- గూగుల్‌ ఇండియాలో ఎనిమిదేళ్ల అనుభవం ఉన్న రాజన్‌ ఆనందన్‌ సికోయాలోకి మారారు. అనంతరం సికోయా నుంచి సర్జ్‌ కార్యక్రమాన్ని ప్రకటించి దాదాపు 40 సంస్థలకు ఫండ్‌ రైజింగ్‌ సాయం చేశారు.
5. మే:- నెట్‌యాప్‌, జిన్నోవ్‌ నివేదిక ప్రకారం బీ2బీ స్టార్టప్స్‌పై ఇన్వెస్టర్లు, వీసీ ఫండ్స్‌ మక్కువ చూపుతున్నట్లు తెలిసింది. 
6. జూన్‌:- అంతరిక్షయానానికి సంబంధిచిన బెల్లాట్రిక్స్‌ ఏరోస్పేస్‌ స్టార్టప్‌ దాదాపు 30 లక్షల డాలర్ల ఫండ్‌ రైజింగ్‌ జరిపింది. ఈ స్టార్టప్‌లో దీపికా పడుకోన్‌ కూడా ఇన్వెస్టర్‌ కావడం విశేషం. 
7. జూలై:- దేశీయ స్టార్టప్‌ల్లో చాలా వరకు యూఎస్‌ నమూనాలను కాపీ కొడతాయని, అమెజాన్‌ను చూసి ఫ్లిప్‌కార్ట్‌, ఉబెర్‌ను చూసి ఓలా, పోస్ట్‌మేట్స్‌ను చూసి స్విగ్గీ వచ్చాయని విమర్శకులు చెబుతుంటారు. అయితే హెల్త్‌, అగ్రి, ఏఐ రంగాల్లో ఇండియా నుంచి కొత్త నమూనాలు వస్తున్నాయని ఈ నెల విడుదలైన గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. ఇందులో భారత్‌కు 52 ర్యాంకు వచ్చింది. 2015లో భారత్‌ 81వ స్థానంలో ఉంది. 
8. ఆగస్టు:- వ్యాపారనుకూల వాతావరణ కల్పనలో భాగంగా డీపీఐఐటీ స్టార్టప్స్‌ను 30 శాతం పన్ను పరిధి నుంచి మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 
9 సెప్టెంబర్‌:- ఈ ఏడాది తొలి 8 నెలల్లో దేశీయ స్టార్టప్స్‌ పీఈ- వీసీ ఫండింగ్‌ ద్వారా 3600 కోట్ల డాలర్లు సమీకరించినట్లు ఈవై నివేదిక తెలిపింది. 
10. అక్టోబర్‌:-  ప్రపంచ ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌లో భారత్‌కు 63వ స్థానం దక్కింది. 21 యూనికార్న్స్‌ ఆరంభమయ్యాయి.
11. నవంబర్‌:- దేశీయ స్టార్టప్స్‌లో 2.5 లక్షల డాలర్లు పెట్టుబడిగా పెడతామని వాట్సాప్‌ వెల్లడించింది. కంపెనీ ప్లా్‌ట్‌ఫామ్‌ను ఉపయోగించే సంస్థలు దేశంలో 10 లక్షలున్నాయని, వీటికి ఎఫ్‌బీ యాడ్‌ క్రెడిట్స్‌ రూపంలో ఒక్కోదానికి 500 డాలర్ల సాయం అందిస్తామని తెలిపింది. 
12. డిసెంబర్‌:- రూ.10వేల కోట్ల కార్పస్‌ను మరింత పెంచుకోవాలని డీపీఐఐటీ యోచిస్తోంది. విదేశీ మార్కెట్లలో యాక్సెస్‌ కోసం దేశీయ స్టార్టప్స్‌కు సాయం చేసే ఒక కార్యక్రమాన్ని టీ హబ్‌ ఆరంభించింది. 

 You may be interested

2019: ఈ షేర్లు జీరోలు

Wednesday 25th December 2019

కుప్పకూలిన అడాగ్‌ కౌంటర్లు యస్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌ బోర్లా జాబితాలో జెట్‌ ఎయిర్‌వేస్‌, మన్‌పసంద్‌ నిజానికి ఈ ఏడాది దేశీయంగా ఓవైపు పలు సానుకూల వార్తలు వెలువడగా.. మరోపక్క అంతర్జాతీయ స్థాయిలో ప్రతికూల పవనాలూ వీచాయి. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు పలుమార్లు హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అవుతూ వచ్చాయి. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం నెలకొనడం, ప్రభుత్వ సంస్కరణలు, రిజర్వ్‌ బ్యాంక్‌ రేట్ల కోతలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు తదితర సానుకూల

కొత్త ఏడాదిలో కొనదగ్గ బ్లూచిప్స్‌

Wednesday 25th December 2019

టెలికంలో భారతీ ఎయిర్‌టెల్‌ డైవర్సిఫైడ్‌ విభాగంలో ఆర్‌ఐఎల్‌ ఐసీఐసీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌ భేష్‌ ఈ ఏడాది ప్రారంభంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ప్రారంభమైనప్పటికీ తదుపరి ఊపందుకున్నాయి. మధ్యలో తిరిగి భారీ ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరికి నిలదొక్కుకుని ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఎఫ్‌ఫీఐలపై ట్యాక్స్‌ సర్‌చార్జ్‌, దేశ జీడీపీ మందగమనం, ద్రవ్యలోటు వంటి అంశాలు దేశీయంగా సెంటిమెంటును బలహీనపరచగా.. రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల తగ్గింపు, ఎఫ్‌ఫీఐల ట్యాక్స్‌ సర్‌చార్జ్‌పై కేంద్రం వెనకడుగు,  కార్పొరేట్‌

Most from this category