STOCKS

News


బంగారంలో బుల్‌రన్‌!

Thursday 8th August 2019
personal-finance_main1565257884.png-27643

2013 గరిష్ఠాలను దాటే ఛాన్స్‌
దేశీయంగా రూ.40వేలకు అవకాశం
కమోడిటీల్లో బంగారం నూతన బుల్‌ సైకిల్‌లోకి ప్రవేశించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఆరేళ్ల తర్వాత పసిడి 1400 డాలర్లపైకి చేరింది. ఈ స్థాయికి పైన 1450, 1475, 1500, 1520 డాలర్ల వరకు క్రమానుగత ర్యాలీకి ఛాన్సులున్నాయి. సుదీర్ఘ కన్సాలిడేషన్‌ తర్వాత బంగారంలో బుల్స్‌ పరుగులు ఆరంభమయ్యాయని, ఇవి ఇప్పట్లో ఆగవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి కీలక బ్రేకవుట్‌ సాధించిందని, ఇదే ఊపులో 1450- 1550 డాలర్ల నిరోధాన్ని దాటితే 2000 డాలర్లను చేరుతుందని ట్రెండ్స్‌జర్నల్‌ ప్రతినిధి జెరాల్డ్‌ సెలెంటె అభిప్రాయపడ్డారు. 2013లో పసిడి ఔన్సు ధర 1696 డాలర్లను చేరి పీక్‌అవుట్‌ అయింది. ఆ తర్వాత ఇంతవరకు గోల్డ్‌లో మంచి ర్యాలీ కనిపించలేదు. ఇటీవల కాలంలో ట్రేడ్‌వార్‌ కారణంగా పసిడిలో పెట్టుబడులు పెరిగాయి. ఈ వాణిజ్యయుద్ధం నానాటికీ ముదిరిపోతున్న సూచనల కారణంగా పసిడిలో పెట్టుబడులు అంతకంతకూ పెరిగి బుల్‌ర్యాలీకి దారితీస్తున్నాయి. ఆగస్టు చివరకు గోల్డ్‌ ఔన్సు ధర 1500 డాలర్లపైనే కొనసాగుతుందని ఎక్కువమంది అభిప్రాయం.


రేట్‌కట్‌, ట్రేడ్‌వార్‌..
పసిడిలో ఇంతటి ర్యాలీకి ప్రధాన కారణం ట్రేడ్‌వార్‌ కాగా, ప్రపంచబ్యాంకులు చేపడుతున్న రేట్‌కట్‌ ధోరణి కూడా బంగారం ధర పెరుగుదలకు మరొక ప్రధాన కారణమవుతోంది. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడం, వృద్ది మందగమన సంకేతాలతో ఎక్కువమంది ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిసాధనాలవైపు చూస్తున్నారు. ముఖ్యంగా ట్రేడ్‌వార్‌ ముదిరి కరెన్సీవార్‌గా మారుతుందన్న భయాలతో ఇటీవల కాలంలో పలు దేశాల ఈక్విటీలు భారీ పతనాలు నమోదు చేశాయి. దీనివల్ల పెట్టుబడిదారులకు ప్రస్తుతం ఏకైక పెట్టుబడిలక్ష్యస్థానంగా బంగారం మారిందని కమోడిటీ నిపుణుల విశ్లేషణ. ముఖ్యంగా వారం రోజులుగా చైనా కరెన్సీ న్యూనీకరణ చేయడం, ట్రంప్‌ కొత్త సుంకాల హెచ్చరికలు చేయడం వంటివి బంగారంపై పాజిటివ్‌ సెంటిమెంట్‌ను మరింత పెంచాయి. బంగారం ఈటీఎఫ్‌లకు డిమాండ్‌ పెరగడం దేశీయంగా పసిడికి కలిసివచ్చింది. అంతర్జాతీయంగా 2016 తర్వాత తొలిసారి యూఎస్‌ట్రెజరీ బాండ్‌ ఈల్డ్డ్స్‌ 2 శాతం దిగువకు చేరాయి. ఇతర అంతర్జాతీయ బాండ్‌ ఈల్డ్డ్స్‌ సైతం నేల చూపులు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఈక్విటీలు బాగాలేక, ఇటు డెట్‌ మార్కెట్‌ బాగాలేకపోవడంతో ఇన్వెస్టర్లకు ఏకైక ఉత్తమ సాధనంగా పసిడి నిలుస్తోంది. ముఖ్యంగా మార్కెట్లో కొత్తగా వచ్చేమదుపరులు ఈక్విటీలు, డెట్‌సాధనాలను కాదని బంగారంపై మొగ్గు చూపుతున్నారు. యూరప్‌ కేంద్రబ్యాంకు త్వరలో క్వాంటిటేటివ్‌ఈజింగ్‌(ఉద్దీపనలు) ప్రకటించనుంది. ఇదే జరిగితే మందగమన భయాలు మరింత పెరిగి ఈక్విటీల నుంచి పసిడిలోకి మరిన్ని కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.  
భారత్‌ మార్కెట్లో అదే జోరు


దేశీయ ఫ్యూచర్‌ మార్కెట్లో అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 37800స్థాయిని చేరింది. ఇదే సమయంలో ముంబై మార్కెట్లో భౌతిక బంగారం పదిగ్రాముల ధర రూ. 36850 వద్ద ఉంది. ఇదే జోరు కొనసాగితే ఏడాది చివరకు పదిగ్రాముల బంగారం ధర రూ.40వేలను చేరవచ్చని కమోడిటీ నిపుణుల అంచనా. అయితే ఫిజికల్‌మార్కెట్లో స్మగ్లింగ్‌ బంగారం కారణంగా రేట్లపై నెగిటివ్‌ ప్రభావం పడుతోంది. ఏవిఎలాగున్నా, పండుగ సీజన్‌ సమయానికి డిమాండ్‌ పెరుగుతుందని, అందువల్ల బంగారంలో దేశీయంగా కూడా బుల్‌రన్‌ ఉంటుందని కమోట్రెండ్జ్‌ రిసెర్చ్‌ డైరెక్టర్‌ జ్ఞానశేఖర్‌ త్యాగరాజన్‌ చెప్పారు. ట్రేడ్‌ ఉద్రిక్తతలు, మందగమన భయాలు, సురక్షితమన్న నమ్మకం కారణంగా బులియన్‌లోకి నిధులు వస్తాయని, అందువల్ల బంగారం, వెండి ధరల్లో మరింత వృద్ధి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆగస్టు చివరకే ఎంసీఎక్స్‌ ఫ్యూచర్స్‌ 38000- 39000 రూపాయలను చేరవచ్చన్నారు. ఇప్పటికే తాజా ఆర్థిక సంవత్సరంలో బంగారం మంచి రాబడులు ఇచ్చిన పెట్టుబడి సాధనంగా నిలిచింది. 2019-20లో పసిడి దాదాపు 17 శాతం రిటర్న్స్‌ అందించింది. ఇప్పటల్లో ఈక్విటీలు కోలుకునే అవకాశాలు కనిపించనందున బంగారం ధరలో కరెక‌్షన్‌ ఉండదని, తప్పక రూ.40వేలను తాకుతుందని మనీలిసియస్‌ డైరెక్టర్‌ ప్రకాశ్‌ గుప్తా చెప్పారు. You may be interested

‘సూపర్‌ రిచ్‌’ ట్యాక్స్‌ నుంచి ఎఫ్‌పీఐలకు మినహాయింపు?

Thursday 8th August 2019

ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అధిక సంపన్నులపై సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌ను విధించడంతో దేశియ ఈక్విటీ మార్కెట్ల నుంచి పెద్ద మొత్తంలో విదేశి నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగింది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ విదేశి నిధుల ఔట్‌ ఫ్లో ను తగ్గించడానికి చర్యలను చేపట్టనుంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐ) అధిక సర్‌చార్జి నుంచి మినహాయించడం, మూడేళ్లు దాటిన హొల్డింగ్స్‌పై దీర్ఘకాల మూలధన లాభాలపై(ఎల్‌టీసీజీ) విధించే ట్యాక్స్‌

బ్యాంకు నిఫ్టీ 513 పాయింట్ల రికవరీ

Thursday 8th August 2019

బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్ గురువారం ట్రేడింగ్‌లో తిరిగి 28000 స్థాయిని అందుకుంది. నేడు ఈ ఇండెక్స్‌ 27,840.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా జరిగిన అమ్మకాల్లో ఒక దశలో ఇండెక్స్‌ 171 పాయింట్లను కోల్పోయి 27,531.05 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం నుంచి మార్కెట్లో మొదలైన కొనుగోళ్లతో ఇండెక్స్‌ కనిష్టస్థాయిల నుంచి రివకరి అయ్యింది. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌,

Most from this category