News


డెట్‌ కంటే ఎక్కువ రాబడులు రావాలంటే

Monday 3rd June 2019
personal-finance_main1559541554.png-26055

డెట్‌ విభాగం కంటే కొంచెం అధిక రాబడులు ఆశించేవారు, ఈక్విటీల్లోనూ కొంత మేర ఇన్వె‍స్ట్‌ చేసుకోవాలన్న తలంపుతో ఉన్న వారు హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ అన్నవి ఒకానొక హైబ్రిడ్‌ రకం ఫండ్స్‌. ఇవి డెట్‌, ఈక్విటీతోపాటు ఆర్బిట్రేజ్‌ అపార్చునిటీల్లో పెట్టుబడుల కలయికగా ఉంటాయి. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే ఇవి కొంచెం మెరుగైన రాబడులను ఇవ్వగలవు. ఈక్విటీ, ఈక్విటీ ఆర్బిట్రేజ్‌ అవకాశాలపై ఈక్విటీ సేవింగ్స్‌ పథకాలు కనీసం 65 శాతం పెట్టుబడులు పెడతాయి. దీంతో వీటిని ఈక్విటీ పథకాలుగానే ఆదాయపన్ను చట్టం పరిగణిస్తుంది. దీంతో డివిడెండ్‌, ఏడాది దాటిన తర్వాత మూలధన లాభంపై 10 శాతం పన్ను భారం పడుతుంది. మోస్తరు రిస్క్‌ తీసుకునే సామర్థ్యం ఉన్నవారు, అదే సమయంలో కనీసం ఐదేళ్ల పాటు అయినా తమ పెట్టుబడులను కొనసాగించే వెసులువాటు ఉండే వారు హెచ్‌డీఎఫ్‌సీ సేవింగ్స్‌ ఫండ్‌ తరహా పథకాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 

రాబడులు
ప్రస్తుతం ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ విభాగంలో 22 పథకాలు ఉండగా, అన్నింటికీ ఐదేళ్లకు పైగా పనితీరు ట్రాక్‌ రికార్డు ఉంది. ఈ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్‌ మంచి పనితీరు కలిగిన వాటిల్లో ఒకటి. 2015 డిసెంబర్‌ నెల వరకు హెచ్‌ఢీఎప్‌సీ మల్టిపుల్‌ ఈల్డ్‌ ఫండ్‌ పేరుతో కొనసాగగా ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ సేవింగ్స్‌ పథకంగా మారింది. ఈ పథకంలో దీర్ఘకాల రాబడులను పరిశీలించినట్టయితే ఐదేళ్ల కాలంలో వార్షికంగా 10.7 శాతం రాబడులను ఇచ్చింది. ఇదే కాలంలో ఈక్విటీ సేవింగ్స్‌ విభాగం సగటు రాబడులు 6.9 శాతంగానే ఉన్నాయి. ఇక మూడేళ్ల కాలంలో సగటు వార్షిక రాబడులు 4.6 శాతం కాగా, ఈ విభాగం రాబడులు 4.2 శాతంగా ఉన్నాయి. పదేళ్ల కాలంలోనూ ఈ పథకం సగటు వార్షిక రాబడులు 9.86 శాతంగా ఉన్నాయి. ఇదే కాలంలో ఈ విభాగం రాబడులు 8.32 శాతంగా ఉండడం గమనార్హం. అన్ని కాలాల్లోనూ ఈ విభాగం కంటే హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ సేవింగ్స్‌ పథకం మెరుగ్గానే రాబడులు ఇచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

పోర్ట్‌ఫోలియో
డెట్‌ పేపర్లలో పెట్టుబడులు, హెడ్జింగ్‌ పొజిషన్ల కారణంగా ఈ పథకం అస్థిరతలను అధిగమించగలదు. ఈ పథకం ఈక్విటీలకు 15-40 శాతం మధ్యలో కేటాయింపులు చేస్తుంటుంది. కొంచెం అధిక రాబడులకు ఇది వీలు కల్పిస్తుంది. ఇక డెట్‌ విభాగానికి 10-35 శాతం మధ్య నిధులను కేటాయిస్తుంది. ఇంత మేర స్థిరమైన రాబడులకు వీలుంటుంది. ఇక ఆర్బిట్రేజ్‌ అవకాశాల కోసం మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకం 25 శాతం నుంచి 75 శాతం వరకు పెట్టుబడులను కేటాయిస్తుంటుంది. ఆర్బిట్రేజ్‌ అవకాశాలంటే... భిన్న మార్కెట్‌ విభాగాల మధ్య ఒకే స్టాక్‌కు సంబంధించి ధరల పరంగా వ్యత్యాసాన్ని అవకాశంగా తీసుకుని లాభాలు గడించడం. క్యాష్‌, ఫ్యూచర్స్‌ మార్కెట్ల మధ్య వ్యత్యాసాల ద్వారా లబ్ది పొందుతుంది. ప్రస్తుతానికి ఆర్బిట్రేజ్‌లో 31 శాతం నిధులను, ఈక్విటీలకు 38 శాతం కేటాయింపులు చేసి ఉంది. ఈక్విటీల్లో మల్టీక్యాప్‌ విధానంలో స్టాక్స్‌ను ఎంచుకుంటుంది. డెట్‌ విభాగంలో ఏఏఏ, ఏఏ, ఏ రేటెడ్‌ కార్పొరేట్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంది. You may be interested

వైద్య బీమా పాలసీ... అంతేనా?

Monday 3rd June 2019

ప్రతీ ఇద్దరిలో ఒకరు సంతోషంగా లేని పరిస్థితి పాలసీలోని ఫీచర్ల పట్ల అసంతృప్తి పెద్ద వయసు వారిలో ఇది మరీ ఎక్కువ క్లెయిమ్‌ల విషయంలోనూ అభ్యంతరాలు సర్వేలో వెల్లడైన ఆసక్తికర అంశాలు వైద్య బీమా ప్రాధాన్యాన్ని నేడు ఎంతో మంది అర్థం చేసుకుంటున్నారు. వైద్య సేవల వ్యయాలు బడ్జెట్‌ను చిన్నాభిన్నం చేస్తున్న రోజులు కావడంతో ఆర్జించే వారిలో ఎక్కువ మంది వైద్య బీమా వైపు మొగ్గు చూపుతున్నారు. దీని పట్ల ఇటీవలి కాలంలో అవగాహన కూడా విస్తృతం

కరెంటు బిల్లుపై సోలార్‌ అస్త్రం!

Monday 3rd June 2019

 కిలోవాట్‌ యూనిట్‌పై ఏటా రూ.10,000 ఆదా  ప్రస్తుతం మూడు విధానాల్లో అందుబాటులో సోలార్‌ కేంద్రంతో పాటు రాష్ట్రాలను బట్టి రకరకాల సబ్సిడీలు సూర్యరశ్మి బాగా ఉండే ప్రాంతంలో అయితేనే లాభం ఒకో రాష్ట్రంలో ఒకో తీరున ప్రభుత్వ నిబంధనలు అన్ని తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి (సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం) కరెంటు బిల్లు వందల్లో ఉండటం ఒకప్పటి మాట. ఎండలు పెరిగి... ఇంట్లో రెండు మూడు ఏసీల వాడకం మొదలయ్యాక కనీస బిల్లు నెలకు ఏడెనిమిది వేలకు తగ్గటం

Most from this category