News


అనిశ్చితిలో సురక్షిత పెట్టుబడుల కోసం..

Monday 14th October 2019
personal-finance_main1571022405.png-28860

  • అనిశ్చితిలో సురక్షిత పెట్టుబడుల కోసం..
  • మిరే అసెట్‌ లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌
  • డి.జయంత్‌కుమార్‌, థర్డ్‌ పార్టీ ప్రొడక్ట్స్‌ హెడ్‌, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌

అంతర్జాతీయంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య పోరు, భౌగోళిక రాజకీయ అంశాలకుతోడు, దేశీయంగా ఆర్థిక వృద్ధి నిదానించడం వంటి అంశాల కారణంగా స్టాక్‌ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారికి లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ కాస్త సురక్షితమైనవి. ఎందుకంటే ఇవి స్థిరమైనవే కాకుండా, మార్కెట్లు కుదుటపడిన వెంటనే వేగంగా రికవరీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఆర్‌బీఐ ఇటీవలే రేపో రేట్లను తగ్గించడం, అవసరమైతే వృద్ధి క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు తదుపరి రేట్ల కోతకు సానుకూలంగా ఉండడం దీన్నే సూచిస్తోంది. కునుక మూడేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఏ మాత్రం వేచి చూడాల్సిన పని లేదు. వెంటనే ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభించొచ్చు. కార్పొరేట్‌ పన్ను తగ్గించడం వల్ల చాలా వరకు లార్జ్‌క్యాప్‌ కంపెనీలు గణనీయంగా లాభపడనున్నాయి. దీని తాలూకూ ప్రభావం వాటి లాభాలు, షేరు ధరల్లో ప్రతిఫలించనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కొంత రిస్క్‌ తీసుకోగలిగిన వారు, సరైన రాబడులను ఆకాంక్షించే వారు లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. 

చారిత్రకంగా చూస్తే ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇతర ఏ పెట్టుబడి విభాగంతో చూసినా కానీ దీర్ఘకాలంలో మంచి పనితీరు చూపించాయి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించి మెరుగైన రాబడులను ఇవ్వడం ద్వారా చాలా మంది ఇన్వెస్టర్లకు సంపదను తెచ్చిపెట్టాయి. అలా సంపద సమకూర్చిన ఫండ్స్‌లో మిరే అస్సెట్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ ముందుంది. మిరే అస్సెట్‌ ఓపెన్‌ ఎండెడ్‌ లార్జ్‌క్యాప్‌ పథకం. మార్కెట్‌ విలువ పరంగా టాప్‌ 100 కంపెనీలను లార్జ్‌క్యాప్‌ కంపెనీలుగా పేర్కొంటారు. మిరే అస్సెట్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 80 శాతానికి పైగా అధిక నాణ్యతతో కూడిన లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌​చేస్తుంది. మరో 20 శాతం పెట్టుబడులను అధిక వృద్ధి అవకాశాలు కలిగిన మిడ్‌క్యాప్‌, ‍స్మాల్‌ క్యాప్‌ కంపెనీలకు కేటాయిస్తుంది. లార్జ్‌క్యాప్‌ కంపెనీలు ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని, వృద్ధిని ఇస్తాయి. స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ కంపెనీలు వృద్ధితోపాటు, బెంచ్‌ మార్క్‌తో పోలిస్తే అధిక రాబడులు సమకూర్చుకునేందుకు సాయపడతాయి.  

రాబడులు...
మిరే అస్సెట్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఆగస్ట్‌ చివరి నాటికి రూ.13,946 కోట్లుగా ఉన్నాయి. ఈ పథకానికి మంచి రాబడుల చరిత్ర ఉంది. ఐదేళ్ల కాలంలో 11.58 శాతం చొప్పున వార్షికంగా రాబడులను ఇచ్చింది. అదే బెంచ్‌ మార్క్‌ నిఫ్టీ 100 టీఆర్‌ఐ పెరుగుదల గత ఐదేళ్ల కాలంలో వార్షికంగా 9.96 శాతంగానే ఉంది. మిరే అస్సెట్‌ లార్జ్‌క్యాప్‌ పథకంలో ప్రతీ నెలా రూ.5,000 చొప్పున పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేసి ఉంటే, 2019 సెప్టెంబర్‌ చివరికి రూ.12.57 లక్షల సంపద సమకూరేది. ఇందులో పెట్టుబడి రూ.6 లక్షలు కాగా, మిగిలినదంతా రాబడి. నాణ్యమైన వ్యాపారం, మంచి క్యాష్‌ ఫ్లో, స్థిరమైన లాభాలు కలిగిన లార్జ్‌క్యాప్‌ కంపెనీలు తమ పోర్ట్‌ఫోలియోలో ఉండాలని భావించే ఇన్వెస్టర్లు.. మిరే అస్సెట్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడాన్ని పరిశీలించొచ్చు. ఇందులో కనీసం ఏకమొత్తంగా రూ.5,000 ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. లేదా కనీసం ప్రతీ నెలా రూ.1,000 చొప్పున సిప్‌ను ప్రారంభించేందుకు వీలుంది. ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారికి, స్థిరమైన రాబడులు ఆశించే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. 



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 14th October 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే కొన్ని ప్రధాన కంపెనీలు ఇన్ఫోసిస్‌:- క్యూ2 ఫలితాలను శుక్రవారం ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలకు తగ్గట్లుగానే ఉన్నాయి. క్యూ2లో నికర లాభం 2.2శాతం క్షీణించి రూ. 4,019 కోట్లుగా, ఆదాయం 3.8శాతం పెరిగి రూ.22,629 కోట్లుగా నమోదయ్యాయి. అవెన్యూ సూపర్‌ మార్ట్‌:- క్యూ2లో నికరలాభం 47.5శాతం వృద్ధి చెంది రూ.322.63 కోట్లను నమోదు చేసింది. ఆదాయం 22.26 శాతం వృద్ధిని సాధించి

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్స్‌

Monday 14th October 2019

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌    కొనచ్చు బ్రోకరేజ​ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ.1,223 టార్గెట్‌ ధర: రూ.1,530 ఎందుకంటే:- ఈ ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. నికర లాభం అంచనాలను మించగా, మొండిబకాయిలు అంచనాలను మించి పెరిగిపోయాయి. రూ.740 కోట్ల మేర కేటాయింపులు జరిపినప్పటికీ, నికర లాభం 52 శాతం వృద్ధితో రూ.1,400 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 2,910 కోట్లకు చేరింది. నికర వడ్డీ

Most from this category