News


పోస్టాఫీస్‌ డిపాజిట్లకు పెరుగుతున్న డిమాండ్‌

Thursday 12th September 2019
personal-finance_main1568273513.png-28334

ఇటీవల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పోస్టాఫీస్‌ డిపాజిట్లు, ప్రభుత్వబాండ్ల వైపు మళ్లిస్తున్నారు. బ్యాంకుల  పిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లు 7శాతానికి దిగువకు చేరుకోవడం ఇందుకు కారణమవుతోంది. రానున్న రోజుల్లో వడ్డీరేట్లు మరింత తగ్గవచ్చనే అంచనాలతో పెట్టుబడిదారులు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలకు బదులుగా ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. అగ్ర బ్యాంకులు తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేట్లపై సరాసరి అరశాతం నుంచి 1శాతం మేర కోత విధించడంతో 6.5-7.1 శాతానికి పరిమితయ్యాయి. ఇదేకాలంలో పోస్టాఫీస్‌ డిపాజిట్లు, ప్రభుత్వబాండ్లపై 7.5-7.75 శాతం వడ్డీ వస్తోంది.  

అధిక భద్రతతో పోస్టాఫీసు డిపాజిట్లు,  ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే 1శాతం నుంచి 1.5 శాతం అధికంగా సంపాదించగల సామర్థ్యం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్లు బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు స్వస్తి చెప్పడమే కాకుండా బ్యాంక్ డిపాజిట్ల మెచ్యూరిటీ తరువాత, వచ్చిన ఆదాయాన్ని ​కూడా పోస్టాఫీస్‌ డిపాజిట్లు, ప్రభుత్వబాండ్ల వైపు తరలిస్తున్నారు. ఆర్‌బీ ఈ ఏడాది ప్రారంభం నుంచి రెపో రేటుపై 110 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. ఆర్‌బీఐ ఈ చర్యతో బ్యాంకులను తమ లెండింగ్‌, బారోయింగ్‌ రేట్లను తగ్గించుకునేందుకు ప్రేరేపిస్తుందని జీఈపీ క్యాపిటల్‌ హెడ్‌ రూపేష్‌ బన్సాలీ అభిప్రాయపడ్డారు. 

ఎస్‌బీఐ ఏడాది కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై 6.5శాతం వడ్డీరేటును, మూడు, ఐదేళ్ల కాలపరిమితి కలిగిన వడ్డీరేట్లపై  6.25శాతం మాత్రమే వడ్డీరేటును చెల్లిస్తుంది. మరోవైపు ప్రభుత్వం బాండ్లు ఏడేళ్ల కాలవ్యవధిపై 7.75శాతం వడ్డీరేటు లభిస్తోంది. 5ఏళ్ల కాలపరిమితి కలిగిన పోస్టాఫీస్‌ డిపాజిట్‌ 7.7శాతం వడ్డీరేటును చెల్లిస్తుంది. అలాగే ఏడాది నుంచి మూడేళ్ల కాలవ్యవధి కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లపై 6.9శాతం వడ్డీని చెల్లిస్తుంది. 

గతేడాది కాలం నుంచి ఈక్విటీ మార్కెట్లు తగినంత ఆదాయాలను ఇవ్వకపోవడంతో ఇన్వెస్టర్లు భద్రతతో స్థిరమైన ఆదాయాలుగా భావించే బ్యాంకులు, ప్రభుత్వ బాండ్లు, పోస్టాఫీసులు డిపాజిట్లు వైపు మొగ్గుచూపుతున్నారు. స్థిరమైన ఆదాయం, భద్రతతో పాటు ఆదాయం పన్ను మినహాయింపు పొందాలనుకునేవారికి సంప్రాదాయబద్దమైన పోస్టాఫీస్‌ డిపాజిట్లు, ప్రభుత్వబాండ్లు ఉత్తమమని జేఎస్‌ ఫైనాన్సియల్‌ అడ్వెజర్స్‌ సీఎఫ్‌పీ జితేంద్ర సలహానిస్తున్నారు. You may be interested

సిమెంట్‌, రియల్‌ ఎస్టేట్‌లో ఈ స్టాకులు బెటర్‌!

Thursday 12th September 2019

-ఐటీలో సాఫ్ట్‌వేర్‌ స్టాక్స్‌పై జాగ్రత్త.. -సిమెంట్‌, మెటల్‌ షేర్లు మంచి ప్రదర్శనను చేయగలవు: దీపాన్‌ మెహతా స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ షేర్లు మరి కొన్ని సెషన్‌ల వరకు అద్భుతమైన ప్రదర్శనను చేస్తాయని ఎలిక్సిర్ ఈక్విటీస్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ దీపాన్ మెహతా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యులోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్ల ర్యాలీ కొనసాగుతుంది.. గత కొన్ని సెషన్‌లను గమనిస్తే స్మాల్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ స్టాకులలో కొనుగోలు పెరిగాయి. అధిక స్థాయిల

స్థిరంగా పసిడి ధర

Thursday 12th September 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ద ఉద్రికత్తలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడం, నేడు యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ సమావేశం జరుగున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం పసిడి స్థిరమైన ట్రేడింగ్‌కు కారణమవుతున్నాయి. అలాగే డాలర్‌ ఇండెక్స్‌ ఆరువారాల గరిష్టం వద్ద కదలాడుతుండటం సైతం  పసిడి ర్యాలీకి అడ్డంకిగా మారింది. నేడు ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర

Most from this category