News


ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ అమర్‌

Tuesday 6th August 2019
personal-finance_main1565072267.png-27568

జీవిత బీమా రంగంలోని అగ్రగామి సంస్థ ఎల్‌ఐసీ నాన్‌ లింక్డ్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని ‘జీవన్‌ అమర్‌’ పేరుతో తీసుకొచ్చింది. ఆఫ్‌లైన్‌లో లభించే ఈ ప్లాన్‌లో రెండు రకాల మరణ పరిహార ప్రయోజనాల్లో నచ్చిన దానిని ఎంచుకోవచ్చని సంస్థ తెలిపింది. పాలసీ కాల వ్యవధి వరకు ఒకటే సమ్‌ అష్యూర్డ్‌ (లెవల్‌ సమ్‌ అష్యూర్డ్‌) ఒకటి అయితే, సమ్‌ అష్యూర్డ్‌ (బీమా) నిర్ణీత కాలానికోసారి పెరుగుతూ వెళ్లేది రెండో ఆప్షన్‌. రెండో ఆప్షన్‌లో ఆరో ఏట నుంచి ఆ తర్వాత పదేళ్ల వరకు ఏటా 10 శాతం చొప్పున సమ్‌ అష్యూరెన్స్‌ రెట్టింపు అయ్యే వరకు పెరుగుతూ వెళుతుంది. 18-65 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఎవరైనా ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులే. గరిష్టంగా 80 ఏళ్ల వయసు నాటి వరకు పాలసీ కాల వ్యవధిని ఎంచుకోవచ్చు. పాలసీని కనీసం పదేళ్లకు, గరిష్టంగా 40 ఏళ్ల కాలానికి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కనీసం రూ.25 లక్షలు, ఆపై మొత్తానికి బీమా తీసుకోవచ్చు. చౌక ప్రీమియానికే లభించే టర్మ్‌ పాలసీగా దీన్ని ఎల్‌ఐసీ అభివర్ణించింది. 



You may be interested

జమ్మూ కశ్మీర్‌ ప్రజల జీవనాన్ని మార్చేస్తుంది

Tuesday 6th August 2019

రాష్ట్రాభివృద్ధికి బాటలు కేంద్రం నిర్ణయాలను కొనియాడిన పారిశ్రామిక వర్గాలు న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం... ఆ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన జీవనాన్ని కల్పిస్తుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ రాష్ట్రంలో పెట్టుబడులకు వీలు కల్పించి, అభివృద్ధికి బాటలు వేస్తుందని అభిప్రాయం ‍వ్యక్తం చేశాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఈ విషయమై ట్వీట్లతో తమ స్పందన తెలియజేశారు.  ఆర్టికల్‌ 370ని ఉపసంహరణ జమ్మూ

రుణాలపై రేట్ల సమీక్షకు బ్యాంకర్లు అంగీకారం

Tuesday 6th August 2019

రుణాలపై రేట్ల సమీక్షకు బ్యాంకర్లు అంగీకారం న్యూఢిల్లీ: ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను రుణ గ్రహీతలకు బ్యాంకులు పూర్తి స్థాయిలో అందించని పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంకర్లతో సోమవారం చర్చించారు. రుణ రేట్లను సమీక్షించేందుకు బ్యంకర్లు అంగీకారం తెలిపారు. గత డిసెంబర్‌ నుంచి ఆర్‌బీఐ ఇప్పటి వరకు 75 బేసిస్‌ పాయింట్ల మేర రుణ రేట్లను తగ్గించినప్పుటికీ, ఆ స్థాయిలో రుణాలపై రేట్లు తగ్గని విషయం

Most from this category