News


వినసొంపైన సోఫా!

Saturday 8th December 2018
personal-finance_main1544242375.png-22761

సాక్షి, హైదరాబాద్‌: సోఫాలంటే మనకు తెలిసింది కూర్చోవటానికి, పడుకోవటానికి పనికొచ్చేవే. కానీ, మార్కెట్లో ఆధునికమైన, విలాసవంతమైన సోఫాలు కూడా లభ్యమవుతున్నాయి.ముఖ్యంగా ఇటాలియన్‌ రకాల సోఫాలకు ఆదరణ పెరుగుతోంది. 
– ఆధునిక ఫర్నీచర్‌ను నగరవాసులు అక్కున చేర్చుకుంటున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈ సోఫాల్లో లైట్లు వెలుగుతాయి. స్పీకర్లుంటాయి. దీంతో చక్కని సంగీతాన్ని వినొచ్చు. సెల్‌ఫోన్లను చార్జింగ్‌ కూడా పెట్టుకోవచ్చు. చిన్న బార్‌ కౌంటర్‌ కూడా ఉంటుంది. మీట నొక్కితే చాలు సోఫా వెనక భాగమంతా వెనక్కి వెళుతుంది. మన అవసరాలకు తగ్గట్టుగా వీటిని ఎంచుకోవచ్చు. అవసరమైతే ఒక్కొక్కటిగా తీసుకోవచ్చు విడివిడిగా కొనుక్కోవచ్చు కూడా.
– ఉన్నత వర్ణాలు, ఐటీ నిపుణులతో బాటు ఇతర నగరాల్లో నివసించేవారంతా ఇటాలియన్‌ సోఫాలను విశేషంగా ఆదరిస్తున్నారు. ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసుకుంటున్నారు. మాడ్యులర్, రిక్లయినర్, సీక్రెట్‌ వంటి రకాలకు చక్కటి ఆదరణ వస్తుంది.
==========
పేమ్యాట్రిక్స్‌లో సక్సీడ్‌ పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్‌: ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రాపర్టీల అద్దె నిర్వహణ స్టార్టప్‌ పేమ్యాట్రిక్స్‌ రూ.70 లక్షల నిధులను సమీకరించింది. సక్సీడ్‌ వెంచర్‌ పార్టనర్స్‌ ఈ పెట్టుబడులు పెట్టిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పేమ్యాట్రిక్స్‌ అద్దెదారుల ప్రొఫైల్స్, డిజిటల్‌ పేమెంట్స్, అగ్రిమెంట్స్, అద్దె డిపాజిట్లకు రుణం, బీమా వంటి సేవలందిస్తుంది. 2016 ఏప్రిల్‌లో ప్రారంభమైన పేమ్యాట్రిక్స్‌లో ప్రస్తుతం దేశంలోని 18 నగరాల నుంచి సుమారు 13 వేలకు పైగా అద్దెదారులు, యజమానులు నమోదయ్యారు. ఏటా అద్దె లావాదేవీల టర్నోవర సుమారు రూ.22 కోట్ల వరకుంటుంది.

 You may be interested

అధిక ధర కావాలంటే?

Saturday 8th December 2018

సాక్షి, హైదరాబాద్‌: మనం కొన్న స్థలానికి లేదా ఇంటికి భవిష్యత్తులో మంచి ధర రావాలంటే? అభివృద్ది చెందడానికి ఆస్కారమున్న ప్రాంతాన్ని.. పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు వంటి సౌకర్యాలకు చేరువలో ప్రాపర్టీ ఉండేలా చూసుకోవాలి. సొంతింటి విషయానికొస్తే మనకేం కావాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉండాలి. చూడటానికి ఇల్లు ఎలా ఉంది? అందులోని సదుపాయాలు, చుట్టుపక్కల ప్రాంతం మౌలిక వసతులు ఉన్నంత మాత్రానే మంచి ఇల్లు అని అనుకోలేం. వీటితో పాటూ

చిన్న ఫ్లాట్లకే ఆదరణ

Saturday 8th December 2018

సాక్షి, హైదరాబాద్‌: రెరా, జీఎస్‌టీ, ఎన్నికల వాతావరణం.. ఇవేవీ కావు ఫ్లాట్ల అమ్మకాలు జరగట్లేదని చెప్పడానికి! సరైన ప్రాంతంలో చిన్న సైజు ఫ్లాట్లను కడితే ప్రతికూల పరిస్థితుల్లోనూ విక్రయాలు జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కొనుగోలుదారుల ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేసి, చిన్న ఫ్లాట్లను కడితే.. గిరాకీకి ఢోకా ఉండదు. హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం ఎక్కువగా ఆధారపడేది ఐటీ ఉద్యోగుల మీదనే. కానీ, నగరంలోని ఐటీ కంపెనీల్లో పనిచేసే 70 శాతం

Most from this category